ఆ 8 ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్‌ | 8 cool smartphones available at up to Rs 8,000 cashback | Sakshi

ఆ 8 ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్‌

Jan 6 2018 1:35 PM | Updated on Jan 7 2018 3:15 AM

8 cool smartphones available at up to Rs 8,000 cashback - Sakshi

స్మార్ట్‌ఫోన్లపై ఈ-కామర్స్‌ కంపెనీలు భలే భలే ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి. కేవలం ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు మాత్రమే కాక, టెలికాం ఆపరేటర్లు సైతం మొబైల్‌ ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌లకు తెరలేపాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, మొబైల్‌ కంపెనీలు అందిస్తున్న క్యాష్‌బ్యాక్‌ ఆఫర్ల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

ఐఫోన్‌ ఎక్స్‌ : పేటీఎంలో రూ.4000 క్యాష్‌బ్యాక్‌
ఆపిల్‌ అ‍త్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్సే. ఈ ఫోన్‌ 256జీబీ వేరియంట్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చు. రూ.1,01,498గా లిస్టు అయిన  ఈ ఫోన్‌ను క్యాష్‌బ్యాక్‌ అనంతరం రూ.97,498కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా 88,698 రూపాయల 64జీబీ వేరియంట్‌ను కూడా రూ.4000 క్యాష్‌బ్యాక్‌తో రూ.84,698కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు ప్రోమోకోడ్‌ ఏ4కే ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. 

శాంసంగ్‌ నోట్‌8 : అమెజాన్‌లో రూ.8000 క్యాష్‌బ్యాక్‌
అమెజాన్‌ పే ను వాడుతూ నోట్‌ 8ను కొనుగోలు చేసిన వారికి రూ.8000 క్యాష్‌బ్యాక్‌ అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ను కస్టమర్‌కి పంపిన తర్వాత 72 గంటల వ్యవధిలో అమెజాన్‌ పేలో  ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని క్రెడిట్‌ చేస్తారు. జనవరి 10 వరకే ఇది వాలిడ్‌లో ఉంటుంది.  

ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌ : పేటీఎంపై రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్‌
2016లో లాంచ్‌ అయిన ఈ రెండు  ఐఫోన్లపైనా రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్‌ లభ్యమవుతోంది. రూ.57,690గా ఉన్న ఐఫోన్‌ 7, 256జీబీ వేరియంట్‌ రూ. 51,690కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకోవడానికి ఏ6కే కోడ్‌ను అప్లయ్‌ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 32జీబీ వేరియంట్‌ ఐఫోన్‌ 7 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌కు కూడా రూ.5,500 వరకు క్యాష్‌బ్యాక్‌ వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్‌  అనంతరం ఐఫోన్‌ 7 ప్లస్‌ రూ.51,604కు దిగొచ్చింది. 

మోటో జీ5ఎస్‌ ప్లస్‌ : పేటీఎంలో రూ.1,625 క్యాష్‌బ్యాక్‌
రిటైల్‌ ధరపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను మోటో జీ5ఎస్‌ ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం ఆఫర్‌ చేస్తుంది.  ఈ ఆఫర్‌ కింద ఒక్కో యూజర్‌ మూడు ఆర్డర్లను బుక్‌ చేసుకోవడానికి ఉంది. ఇది కూడా కేవలం ప్రీపెయిడ్‌ కస్టమర్లకు మాత్రమే. ఫోన్‌ షిప్‌ అయిన 24 గంటల వ్యవధిలో యూజర్‌ అకౌంట్‌లోకి ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తాన్ని జమచేస్తారు. 

శాంసంగ్‌ గెలాక్సీ జే7 మ్యాక్స్‌ - వొడాఫోన్‌ ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్‌
ఇటీవల శాంసంగ్‌తో జతకట్టిన వొడాఫోన్‌, గెలాక్సీ జే7 మ్యాక్స్‌ కొత్త, పాత యూజర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ చేస్తుంది. ఎం-పైసా వాలెట్ల ద్వారా ఈ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ప్రీపెయిడ్‌, పోస్టు పెయిడ్‌ కస్టమర్లిందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. 

వివో వీ7 ప్లస్‌ : పేటీఎంలో రూ.1,100 క్యాష్‌బ్యాక్‌
రూ.21,990 ధర కలిగిన ఈ హ్యాండ్‌సెట్‌పై రూ.1100 క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్‌ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.20,890కి దిగొచ్చింది. 

10.ఆర్‌ డీ స్మార్ట్‌ఫోన్‌ : జియో ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్‌
10.ఆర్‌ డీ స్మార్ట్‌ఫోన్‌ నిన్నటి నుంచే విక్రయానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై జియో ప్రైమ్‌ కస్టమర్లకు అమెజాన్‌లో రూ.1500 క్యాష్‌బ్యాక్‌ లభిస్తోంది. అయితే యూజర్లు కనీసం రూ.199తో రీఛార్జ్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement