ఆ 8 ఫోన్లపై రూ.8వేల వరకు క్యాష్‌బ్యాక్
స్మార్ట్ఫోన్లపై ఈ-కామర్స్ కంపెనీలు భలే భలే ఆఫర్లను ప్రకటిస్తూ ఉన్నాయి. కేవలం ఈ-కామర్స్ వెబ్సైట్లు మాత్రమే కాక, టెలికాం ఆపరేటర్లు సైతం మొబైల్ ఫోన్లపై క్యాష్‌బ్యాక్‌లకు తెరలేపాయి. ఈ నేపథ్యంలో ఈ-కామర్స్ వెబ్సైట్లు, మొబైల్ కంపెనీలు అందిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్ల వివరాలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూద్దాం..
ఐఫోన్ ఎక్స్ : పేటీఎంలో రూ.4000 క్యాష్‌బ్యాక్
ఆపిల్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్సే. ఈ ఫోన్ 256జీబీ వేరియంట్‌పై రూ.4000 క్యాష్‌బ్యాక్‌ను పేటీఎం ప్లాట్‌ఫామ్‌పై పొందవచ్చు. రూ.1,01,498గా లిస్టు అయిన ఈ ఫోన్‌ను క్యాష్‌బ్యాక్ అనంతరం రూ.97,498కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా 88,698 రూపాయల 64జీబీ వేరియంట్‌ను కూడా రూ.4000 క్యాష్‌బ్యాక్‌తో రూ.84,698కే వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను పొందడానికి యూజర్లు ప్రోమోకోడ్ ఏ4కే ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
శాంసంగ్ నోట్8 : అమెజాన్‌లో రూ.8000 క్యాష్‌బ్యాక్
అమెజాన్ పే ను వాడుతూ నోట్ 8ను కొనుగోలు చేసిన వారికి రూ.8000 క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. ఫోన్‌ను కస్టమర్‌కి పంపిన తర్వాత 72 గంటల వ్యవధిలో అమెజాన్ పేలో ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని క్రెడిట్ చేస్తారు. జనవరి 10 వరకే ఇది వాలిడ్‌లో ఉంటుంది.
ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ : పేటీఎంపై రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్
2016లో లాంచ్ అయిన ఈ రెండు ఐఫోన్లపైనా రూ.6000 వరకు క్యాష్‌బ్యాక్ లభ్యమవుతోంది. రూ.57,690గా ఉన్న ఐఫోన్ 7, 256జీబీ వేరియంట్ రూ. 51,690కు అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవడానికి ఏ6కే కోడ్‌ను అప్లయ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 32జీబీ వేరియంట్ ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు కూడా రూ.5,500 వరకు క్యాష్‌బ్యాక్ వర్తిస్తుంది. క్యాష్‌బ్యాక్ అనంతరం ఐఫోన్ 7 ప్లస్ రూ.51,604కు దిగొచ్చింది.
మోటో జీ5ఎస్ ప్లస్ : పేటీఎంలో రూ.1,625 క్యాష్‌బ్యాక్
రిటైల్ ధరపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను మోటో జీ5ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై పేటీఎం ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ కింద ఒక్కో యూజర్ మూడు ఆర్డర్లను బుక్ చేసుకోవడానికి ఉంది. ఇది కూడా కేవలం ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే. ఫోన్ షిప్ అయిన 24 గంటల వ్యవధిలో యూజర్ అకౌంట్లోకి ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని జమచేస్తారు.
శాంసంగ్ గెలాక్సీ జే7 మ్యాక్స్ - వొడాఫోన్ ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్
ఇటీవల శాంసంగ్‌తో జతకట్టిన వొడాఫోన్, గెలాక్సీ జే7 మ్యాక్స్ కొత్త, పాత యూజర్లకు రూ.1500 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఎం-పైసా వాలెట్ల ద్వారా ఈ క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ప్రీపెయిడ్, పోస్టు పెయిడ్ కస్టమర్లిందరికీ ఇది అందుబాటులో ఉంటుంది.
వివో వీ7 ప్లస్ : పేటీఎంలో రూ.1,100 క్యాష్‌బ్యాక్
రూ.21,990 ధర కలిగిన ఈ హ్యాండ్‌సెట్‌పై రూ.1100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. క్యాష్‌బ్యాక్ అనంతరం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,890కి దిగొచ్చింది.
10.ఆర్ డీ స్మార్ట్‌ఫోన్ : జియో ద్వారా రూ.1500 క్యాష్‌బ్యాక్
10.ఆర్ డీ స్మార్ట్‌ఫోన్ నిన్నటి నుంచే విక్రయానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై జియో ప్రైమ్ కస్టమర్లకు అమెజాన్‌లో రూ.1500 క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అయితే యూజర్లు కనీసం రూ.199తో రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది.