Best Selling Smartphone
-
రూ. 749కే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ (1), డిస్కౌంట్ ఎంతంటే?
సాక్షి, ముంబై: బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన నథింగ్ ఫోన్ (1) ఇపుడు డిస్కౌంట్ ధరలో కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. కంపెనీ నథింగ్ ఫోన్ (2) లాంచింగ్‌కు సిద్ధమవుతున్న తరుణంలో నథింగ్ ఫోన్ (1) ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో బాగా సేల్ అవుతున్న నథింగ్ ఫోన్ వన్ ఇపుడు రూ. 39,250 తగ్గింపు తర్వాత కేవలం రూ.749కే అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 8,000 తగ్గింపు తర్వాత రూ. 31,999గా లిస్ట్ అయింది. దీనితో పాటు హెచ్డీఎఫ్సీ ఈఎంఐ లావాదేవీలపై రూ. 1,250 తగ్గింపు లభిస్తోంది. దీనికి అదనంగా, పాత స్మార్ట్‌ఫోన్‌కు బదులుగా రూ. 30,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. ఈ ఆఫర్లన్నీ వర్తించిన తరువాత నథింగ్ ఫోన్ (1)ను రూ. 749కే కొనుగోలు చేయవచ్చు. కార్ల్ పీ నేతృత్వంలోని యూకే ఆధారిత టెక్ కంపెనీ నథింగ్ ఫోన్ సిరీస్‌లో నథింగ్ ఫోన్ (2) ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌నులాంచ్ చేయనుంది. ప్రీమియం స్పెసిఫికేషన్స్‌తో గేమ్-ఛేంజర్‌గా ఉంటుందనే అంచనాల మధ్య జూలైలో లాంచ్కానుంది. నథింగ్ ఫోన్ (1) స్పెసిఫికేషన్లు 6.55-అంగుళాల OLED డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణ, 120Hz రిఫ్రెష్ రేట్ ఆండ్రాయిడ్ ఆధారిత నథింగ్ OS Qualcomm Snapdragon 778G+ చిప్సెట్ 12 జీబీ ర్యామ్,చ 256 జీబీ స్టోరేజ్ 50 ఎంపీ డ్యుయల్‌రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 4,500 mAh బ్యాటరీ -
ఆపిల్‌కు గుడ్‌న్యూస్ : ఆ ఫోన్ దంచికొట్టింది
టెక్ దిగ్గజం ఆపిల్‌కు గుడ్‌న్యూస్ వెలువడింది. ఈ వారంలో ప్రకటించిన త్రైమాసికపు ఫలితాల్లో ఐఫోన్ ఎక్స్ బెస్టింగ్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ ఎక్స్ విక్రయాల్లో ఎలా ఉంటుందో అని మార్కెట్ విశ్లేషకులు, కంపెనీ పలు సందేహ పడింది. కానీ వారందరి సందేహాలను బద్దలు కొడుతూ.. 2018 తొలి క్వార్టర్లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ఐఫోన్ ఎక్స్ నిలిచినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ త్రైమాసికంలో 16 మిలియన్ యూనిట్ల ఐఫోన్ ఎక్స్‌లను రవాణా చేసినట్టు సీనెట్ రిపోర్టులు పేర్కొన్నాయి. ఐఫోన్ ఎక్స్‌తో పాటు లాంచ్ చేసిన ఐఫోన్ 8 కేవలం 12.5 మిలియన్ యూనిట్లు మాత్రమే రవాణా జరుగగా.. ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 8.3 మిలియన్ యూనిట్లు రవాణా జరిగింది. ఆపిల్ ప్రకటించిన ఈ ఫలితాలు వాల్‌స్ట్రీట్ అంచనాలను కూడా బీట్ చేశాయి. అయితే భారత మార్కెట్లో మాత్రం ఆపిల్ మార్కెట్ షేరు తగ్గింది. 2018 తొలి క్వార్టర్లో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్ కంపెనీ ఆధిపత్యంలో నిలిచినట్టు రెండు మార్కెట్ రీసెర్చ్ రిపోర్టులు పేర్కొన్నాయి. అదనంగా సీబీఐ(పూర్తిగా నిర్మించిన యూనిట్లు)పై దిగుమతి డ్యూటీలను పెంచడం, భారత్‌లో ఐఫోన్ ధరలపై ప్రభావం పడింది. భారత మార్కెట్లో తన ఉత్పత్తిని పెంచుకోవడం కోసం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడం కోసం ఆపిల్, ప్రభుత్వంతో చర్చించింది. కాగ, గత క్వార్టర్లో ఐఫోన్ ఎక్స్, ఐఫోన్8, 8 ప్లస్ లాంచ్‌తో ఆపిల్ టాప్‌లో నిలిచింది. కానీ కంపెనీ నుంచి భారత్‌కు సరుకు రవాణా 74 శాతం తగ్గింది. -
బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్ 6ఎస్’
లండన్: యాపిల్ ‘ఐఫోన్ 6ఎస్’ తాజాగా 2016 ఏడాదికిగానూ అంతర్జాతీయంగా బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు నమోదు చేసింది. ఐఫోన్ 6ఎస్ విక్రయాలు గతేడాది 6 కోట్ల యూనిట్లుగా నమోదైనట్లు సమాచారం. ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఐహెచ్ఎస్ మార్కిట్ ఈ విషయం తెలిపింది. దీని ప్రకారం... ఐఫోన్ 6ఎస్ తర్వాతి స్థానాన్ని ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్‌లు ఆక్రమించాయి. ఇక శామ్సంగ్ గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఎస్7 స్మార్ట్‌ఫోన్స్ ఐదు, తొమ్మిదవ ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే శామ్సంగ్ కంపెనీ టాప్–10లో ఐదు ర్యాంకులను సొంతం చేసుకుంది. దీనికి గెలాక్సీ జే సిరీస్ స్మార్ట్ఫోన్లు బాగా దోహదపడ్డాయి. టాప్–10 జాబితాలో చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ ఒప్పొ కూడా స్థానం దక్కించుకుంది. దీని ‘ఏ53’ స్మార్ట్‌ఫోన్ 7వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.