బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్‌ 6ఎస్‌’ | Apple's older iPhone 6s was the bestselling smartphone in 2016 | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్‌ 6ఎస్‌’

Published Fri, Mar 24 2017 12:25 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్‌ 6ఎస్‌’ - Sakshi

బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా ‘ఐఫోన్‌ 6ఎస్‌’

లండన్‌: యాపిల్‌ ‘ఐఫోన్‌ 6ఎస్‌’ తాజాగా 2016 ఏడాదికిగానూ అంతర్జాతీయంగా బెస్ట్‌ సెల్లింగ్‌ స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు నమోదు చేసింది. ఐఫోన్‌ 6ఎస్‌ విక్రయాలు గతేడాది 6 కోట్ల యూనిట్లుగా నమోదైనట్లు సమాచారం. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఈ విషయం తెలిపింది.  దీని ప్రకారం... ఐఫోన్‌ 6ఎస్‌ తర్వాతి స్థానాన్ని ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్, ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌లు ఆక్రమించాయి.

ఇక శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎస్‌7 ఎడ్జ్, ఎస్‌7 స్మార్ట్‌ఫోన్స్‌ ఐదు, తొమ్మిదవ ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయితే శామ్‌సంగ్‌ కంపెనీ టాప్‌–10లో ఐదు ర్యాంకులను సొంతం చేసుకుంది. దీనికి గెలాక్సీ జే సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లు బాగా దోహదపడ్డాయి. టాప్‌–10 జాబితాలో చైనా మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ ఒప్పొ కూడా స్థానం దక్కించుకుంది. దీని ‘ఏ53’ స్మార్ట్‌ఫోన్‌ 7వ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement