ఐఫోన్‌పై అమెజాన్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ | Apple iPhone 6 32GB variant selling on Amazon at discount | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌పై అమెజాన్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

Published Mon, Mar 6 2017 12:14 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఐఫోన్‌పై అమెజాన్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ - Sakshi

ఐఫోన్‌పై అమెజాన్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ:  ఆపిల్‌  ఐఫోన్ 6  స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్  డిస్కౌంట్‌ ఆఫర్‌ ఇస్తోంది.  ఐఫోన్ 6  32 జీబీ వేరియంట్‌ ను రూ 28.999లకే  అమెజాన్   విక్రయిస్తోంది.  అమెజాన్  హోం పేజ్‌  ప్రకటన ప్రకారం 32 జీబీ  గ్రే  వేరియంట్‌ ఐ ఫోన్‌ 6   స్పెషల్‌ అమ్మకం   మార్చి 7 తో ముగియనుంది.  కొనుగోలు చేసిన తేదీ నుండి బ్యాటరీలు సహా,  ఇన్‌  బాక్స్  యాక్ససరీస్‌ పై   ఒక సంవత్సరం తయారీదారు వారంటీ కూడా అందిస్తున్నట్టు  తెలిపింది.  అలాగే రూ. 8,550 దాకా  ఎక్సేంజ్‌ (ఎక్సేంజ్‌ చేస్తున్న ఫోన్‌ఆధారంగా) ఆఫర్‌కూడా అందిస్తోంది. మరో వైపు 32 జీబీ   వేరియంట్‌ ఐ ఫోన్‌ 6ను కంపెనీ అధికారికంగా లాంచ్‌ చేయలేదు. థర్డ్‌ పార్టీ రీటైలర్‌ ద్వారా ఇది అందుబాటులోకి వచ్చిన విషయం గమనార్హం.


 

ఐఫోన్ 6  ఫీచర్లు
4.7 ఇంచెస్‌ డిస్‌ ప్లే
సింగిల్‌సిమ్‌
1334 x 750 రిజల్యూషన్‌
1జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌
8ఎంపీ రియర్‌ కెమెరా,విత్‌ ఆటో  ఫోకస్‌,  1.2 ఎంపీ ఫ్రంట్‌  కెమెరా
1810 ఎంఏహెచ్‌ బ్యాటరీ,
కాగా ఐఫోన్ 6 రూ అసలు ధర .30,700 గా ఉంది.  దీంతో ఈఎంఐ ఆప్షన్‌కూడా అందిస్తోంది. మరిన్ని వివరాలకోసం అమెజాన్‌ ఇండియా వెబ్‌సైట్‌ను చెక్‌ చేయగలరు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement