యాపిల్ కు మరో షాకిచ్చిన చైనా | Apple ordered to suspend iPhone 6 sales in Beijing | Sakshi
Sakshi News home page

యాపిల్ కు మరో షాకిచ్చిన చైనా

Published Sat, Jun 18 2016 1:40 PM | Last Updated on Tue, Nov 6 2018 8:51 PM

యాపిల్ కు మరో షాకిచ్చిన చైనా - Sakshi

యాపిల్ కు మరో షాకిచ్చిన చైనా

బీజింగ్ : చైనాలో ఐఫోన్ తయారీదారి యాపిల్ ఇంక్ కు కోలుకోలేని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గతంలో ఐఫోన్ ట్రేడ్ మార్క్ కేసుపై యాపిల్ కు వ్యతిరేకంగా తీర్పు రావడంతో పాటు.. తాజాగా ఐఫోన్-6 సిరీస్ అమ్మకాలను తమ దేశ రాజధాని బీజింగ్ లో చేపట్టదంటూ చైనీస్ రెగ్యులేటరీ సీరియస్ గా ఆదేశించింది. తమ దేశ కంపెనీ స్మార్ట్ ఫోన్ల మాదిరిగానే ఐఫోన్-6 సిరీస్ ఉండటం గుర్తించిన రెగ్యులేటర్ ఈ ఆదేశాలు జారీచేసింది. తక్షణమే అమ్మకాలను నిలిపివేయాలని ఆదేశించింది. యాపిల్ కు రెండో అతిపెద్ద గ్లోబల్ మార్కెట్ గా చైనాలో ఇటీవలే ఐట్యూన్స్ మూవీ సర్వీసులు నిలిపివేశారు. అదేవిధంగా చైనాలోని లోకల్ బ్రాండ్లు షియోమి, హ్యువాయ్ ల నుంచి యాపిల్ కంపెనీ గట్టి పోటీని ఎదుర్కొంటూ మార్కెట్ షేరును కాపాడుకోవడంలో తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

బీజింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ట్రిబ్యునల్ ఈ ఆదేశాలను జారీచేసింది. చిన్న చైనీస్ బ్రాండ్ షెన్జెన్ బైలీ 100సీ మోడల్ ను ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్ ఫోన్లు పోలీ ఉన్నాయని ట్రిబ్యూనల్ పేర్కొంది. ఈ నిషేధ ఆర్డర్ ను యాపిల్ కు మేలోనే ట్రిబ్యునల్ జారీచేసింది. కానీ ఈ వార్త చైనీస్ ప్రెస్ కు ఈ వారంలోనే అందింది.  తాజా ఆదేశాలతో యాపిల్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్టు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ పై బీజింగ్ కోర్టు స్టే విధించిందని యాపిల్ చెబుతోంది. చైనాలో ఐఫోన్ 6, 6 ప్లస్ అమ్మకాలు చేపడుతున్నామని పేర్కొంది. తన ఐబుక్స్, ఐట్యూన్స్ మూవీ సర్వీసులను యాపిల్ ఏప్రిల్ లో నిలిపివేసింది. చైనీస్ రెగ్యులేటర్స్ ఆదేశాల మేరకు ఈ సేవలను బంద్ చేసింది. త్వరలోనే ఈ సేవలు చైనాలో పునరుద్ధరించాలని కంపెనీ ఆశిస్తోంది.    

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement