సెల్పీ కొట్టు.. ఐఫోన్‌ పట్టు | Airtel Gives Chance To Win Iphone | Sakshi
Sakshi News home page

సెల్పీ కొట్టు.. ఐఫోన్‌ పట్టు

May 4 2018 2:59 PM | Updated on May 4 2018 3:05 PM

Airtel Gives Chance To Win Iphone - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌లు మరి ఇంతగా అభివృద్ధి చెందక ముందు ఫోటో దిగాలంటే...ఒకటి మన దగ్గరైనా కెమెరా ఉండాలి లేదంటే ఫోటో స్టూడియోకైనా వెళ్లాలి. మరి ఇప్పుడో...ఈ పరిస్థితి పూర్తిగా మారింది. స్మార్ట్‌ ఫోన్‌లలో ఫ్రంట్‌ కెమరా అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరు ఓ కెమెరామాన్‌ అయ్యారు. ఒక నివేదిక ప్రకారం ప్రతిరోజు కొన్నిలక్షల మంది సెల్ఫీల కోసం దాదాపు ఏడు నిమిషాల సమయం కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఇలాంటి వారందరికి ఒక శుభవార్త... సెల్పీలు తీసుకోవడంలో మీకు మంచి ప్రావీణ్యం ఉన్నట్లయితే ఆపిల్‌ ఐ ఫోన్‌ను ఉచితంగా పొందవచ్చు. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా సోషల్‌ మీడియా వేదికగా ‘టీ20ఆన్‌ఎయిర్‌టెల్‌4జీ’ పోటీని నిర్వహిస్తుంది. అయితే ఈ అవకాశం కేవలం ఎయిర్‌టెల్‌ సబ్‌స్ర్కైబర్లకు మాత్రమే వర్తిస్తుంది.

ఇందుకు మీరు చేయాల్సిందల్లా...
1. ఎయిర్‌టెల్‌ 4జీ సిమ్‌ను తీసుకోవాలి.
2. తర్వాత ఆ సిమ్‌కార్డ్‌ కనిపించేలా పట్టుకొని ఒక సెల్ఫీ దిగాలి.
3. అనంతరం ఆ సెల్ఫీని సోషల్‌ మీడియా చానల్స్‌ అయిన ట్విటర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో టీ20ఆన్‌ఎయిర్‌టెల్‌4జీ హాష్‌టాగ్‌లో పోస్టు చేయాలి.
4. ఎయిర్‌టెల్‌ ఇండియాను, మరో ముగ్గురు స్నేహితులను కూడా టాగ్‌ చేసి వారిని కూడా ఇదే విధంగా చేయమని చెప్పండి.

వచ్చిన ఎంట్రీలలో నుంచి కంపెనీ ఏడుగురు విజేతలను ఎంపిక చేస్తుంది. వారిలో రోజుకు ఒక విజేతకు ఆపిల్‌ ఐఫోన్‌ 8ను అందించనుంది. విజేతలకు సంబంధించిన వివరాలను ఎయిర్‌టెల్‌ తన అధికారిక వెబ్‌పేజీలో ప్రకటించనుంది. విజేతలను ప్రకటించిన అనంతరం వారు 24 గంటలలోపే స్పందించి, తమ వివరాలను అందించాలి. అలా చేయని పక్షంలో డ్రాలో ఎంపికైన తరువాతి వ్యక్తికి ఐ ఫోన్‌8ను గెలుచుకునే అవకాశం కల్పించనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement