512జీబీ స్టోరేజ్‌తో ఐఫోన్ 8
ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్‌లో జరుగబోతున్న ఈవెంట్‌పై ఆపిల్ ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ చేయకుండా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆగస్టు మరికొన్ని రోజుల్లో ముగుస్తుండటంతో ఆపిల్ నిర్వహించబోయే ఈవెంట్‌పై టెక్ వర్గాల్లో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఆపిల్ తన సంప్రదాయాన్ని కొనసాగిస్తుందని, సెప్టెంబర్ తొలి లేదా రెండో వారంలో నిర్వహించబోయే ఈవెంట్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఐఫోన్ 8ను లాంచ్‌చేస్తుందని టెక్ వర్గాలు నుంచి అంచనాలు వెలువడుతున్నాయి.. ఐఫోన్ 8తో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్లు కూడా ఐఫోన్ అభిమానుల ముందుకు వస్తాయని పేర్కొంటున్నాయి. మరోవైపు ఐఫోన్ 8పై వస్తున్న అంచనాలు కూడా అన్నీ ఇన్నీ కావు. తాజాగా విడుదలైన లీకేజీలో ఐఫోన్ 8 గురించి మరింత సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ ఓలెడ్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 12న లాంచ్ చేస్తారని, మూడు స్టోరేజ్ ఆప్షన్లలో ఇది మార్కెట్లలోకి వస్తుందని తెలుస్తోంది.
చైనీస్ టిప్‌స్టర్ గీక్‌బార్ ప్రకారం ఐఫోన్ 8 స్మార్ట్‌ఫోన్ 64జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లను కలిగి ఉంటుందని తెలిసింది. బేస్ వేరియంట్ స్టోరేజ్ గతేడాది లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ కంటే రెండింతలు ఎక్కువ. 64జీబీ, 256జీబీ చిప్స్ తోషిబా, శాన్‌డిస్క్ కు చెందినవి కాగ, 512జీబీ చిప్స్ శాంసంగ్, హైనిక్స్‌వి అయి ఉంటాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబర్ 12నే ఆపిల్ ఐఫోన్ 8 ఈవెంట్‌ను నిర్వహించబోతుందని మ్యాక్4ఎవర్ రిపోర్టు చెప్పింది. అదేవారంలో మూడు ఫోన్లు ప్రీ-ఆర్డర్లకు వస్తాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వస్తాయట. ఇవన్నీ నిజమైతే మరికొన్ని రోజుల్లోనే ఐఫోన్ 8 మన ముందుకు రాబోతుందన్నమాట.