ఐఫోన్ 8 ధర లక్షపైనేనా..?
ఆపిల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తన వార్షికోత్సవ ఎడిషన్‌గా ఐఫోన్ 8ను సెప్టెంబర్ 12న లాంచ్ చేయబోతుంది. ఈ లాంచ్ ఈవెంట్‌ను ధృవీకరించిన ఆపిల్, ఆహ్వాన పత్రికలను కూడా పంపుతోంది. మరికొన్ని రోజుల్లో ఈ ఐఫోన్ తన అభిమానుల ముందుకు వస్తున్న సందర్భంగా ధరలు లీకయ్యాయి. కూల్ ఫీచర్లతో కూల్ ధరలో ఐఫోన్ 8 మార్కెట్‌లోకి వస్తుందంటూ తాజాగా రిపోర్టులు పేర్కొన్నాయి. ఐఫోన్ ప్రారంభ ధర 999 డాలర్లు ఉంటుందని, దీనిలో టాప్ ఎండ్ వేరియంట్ ఖరీదు 1199 డాలర్లని రిపోర్టులు తెలిపాయి.
మూడు వేరియంట్లలో ఇది లాంచ్ కాబోతుందని ముందస్తుగానే రిపోర్టులు వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో 64జీబీ వేరియంట్ ధర 999 డాలర్లు, 256జీబీ వెర్షన్ 1099 డాలర్లు, 512జీబీ వేరియంట్ ధర 1199 డాలర్లని సమాచారం. ప్రస్తుతం విడుదలైన ఈ రిపోర్టులే కనుక నిజమైతే, భారత్‌లో ఐఫోన్ 8 ధర లక్షను మించి ఉంటుందని తెలుస్తోంది. గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల ప్రారంభ ధర భారత్‌లో 60వేల రూపాయలు. అంటే ఒక్కో డాలర్ 92 రూపాయల చొప్పున లెక్కించారు. ఈ సారి కూడా ఇదేమాదిరి ధరలను తీసుకుంటే ఐఫోన్ 64జీబీ వేరియంట్ ధర భారత్‌లో 92వేల రూపాయలు, టాప్ వేరియంట్ ధర రూ.1,10,000 పైనే ఉంటుంది. ఆపిల్ ఏడాది ఐఫోన్ 10వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగానే స్పెషల్ ఎడిషన్‌గా ఐఫోన్ 8ను లాంచ్ చేస్తోంది.
ఐఫోన్ 8లో ఉండబోతున్న ఫీచర్లు...
5.8 అంగుళాల డిస్‌ప్లే
ఓలెడ్ స్క్రీన్‌తో ఇది మార్కెట్‌లోకి వస్తుంది. ఈ ఐఫోన్‌లో అతిపెద్ద మార్పు ఇదే.
హైఎండ్ ఆండ్రాయిడ్ ఫోన్లకు ఉన్న మాదిరిగా అత్యంత పలుచనైన బెజెల్స్
3 జీబీ ర్యామ్.. 64, 256, 512 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్లు
మెరుగైన కెమెరాలు, వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్
3డీ ఫేస్ రికగ్నైజేషన్
గతకొన్నేళ్లుగా ఐఫోన్స్‌లో వస్తున్న హోమ్ బటన్ ఇందులో ఉండదు. శాంసంగ్ ఎస్8, గూగుల్ పిక్సల్ మొబైళ్ల తరహాలో వర్చువల్ హోమ్ బటన్ ఉంటుంది.
ఆపిల్ వాచ్, శాంసంగ్ హైఎండ్ మొబైల్స్‌లో ఉండే వైర్‌లెస్ ఛార్జింగ్ సౌకర్యాన్ని ఇందులో అందిస్తున్నారు.
ఐఓఎస్11 ఆపరేటింగ్ సిస్టమ్