ఐఫోన్ 8.. మరో ఆసక్తికర ఫోటో
ఐఫోన్ 8.. మరో ఆసక్తికర ఫోటో
Published Fri, Aug 18 2017 7:54 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM
ఆపిల్ ఐఫోన్8.. తన 10 వార్షికోత్సవం సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా మార్కెట్‌లోకి విడుదల కాబోతున్న స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల గురించి టెక్ వర్గాలు, ఐఫోన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓ వైపు నుంచి ఐఫోన్ 8 పై వస్తున్న లీకేజీలు అన్నీ ఇన్నీ కావు. రోజుకో వార్త ఐఫోన్ ఫ్యాన్స్‌లో ఆసక్తి పెంపొందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌తో వస్తుందంటూ ఆ సంస్థ ప్రతినిధి గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫోన్‌కు పవర్ అందించే వైర్‌లెస్ ఛార్జింగ్ మెకానిజానికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. చైనాలోని మోస్ట్ పాపులర్ మీడియా సైట్ వైబో ఈ ఫోటోలను విడుదల చేసింది..
డివైజ్ గ్లాస్ వెనుకాల ఈ వైర్‌లెస్ ఛార్జర్ కాంపొనెంట్ ఉంటుందట. ఇది డివైజ్‌కు, తన ప్లాట్‌ఫామ్‌కు మధ్య ప్రేరక శక్తిని బదిలీచేస్తుందని తెలుస్తోంది. మార్కెట్‌లోకి రాబోతున్న ఐఫోన్ 8తో పాటు అప్‌గ్రేడ్ కాబోతున్న ఐఫోన్ 7కు, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు కూడా వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉండబోతుందట. ఈ ఏడాది రాబోతున్న ఐఫోన్‌లన్నింటికీ వైర్‌లెస్ ఛార్జింగ్ సామర్థ్యాలను ఆపిల్ కల్పిస్తుందని కూడా వెల్లడవుతోంది. సెప్టెంబర్‌లో జరుగబోయే స్పెషల్ ఈవెంట్‌లో ఆపిల్, తన ఐఫోన్ 8ను ప్రవేశపెట్టబోతుంది. దాంతో పాటు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ స్మార్ట్‌ఫోన్లు కూడా లాంచ్ కాబోతున్నాయి.
Advertisement
Advertisement