ఆపిల్ ఐఫోన్ 8 వచ్చేస్తోంది..
శాన్‌ఫ్రాన్సిస్కో : ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవ సందర్భంగా ఆపిల్ ఎంతో గ్రాండ్ నిర్వహించబోతున్న ఈవెంట్ తేదీలు లీకయ్యాయి. సెప్టెంబర్ 12న ఆపిల్ ఈ ఈవెంట్‌ను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది. ఈ ఈవెంట్‌లోనే టెక్ వర్గాలు, ఐఫోన్ ఫ్యాన్స్ ఎప్పడినుంచో ఎదురుచూస్తున్న ఐఫోన్ 8ను ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. మూడు డివైజ్‌లతో ఆపిల్ ఈ ఈవెంట్‌లో మన ముందుకు వస్తుందని, ఒకటి ఐఫోన్ 8 కాగ, మిగతా రెండు ఐఫోన్ 7, 7 ప్లస్ అప్‌డేటెడ్ వెర్షన్ స్మార్ట్ఫోన్లు ఐఫోన్ 7ఎస్, ఐఫోన్ 7ఎస్ ప్లస్ అని వాల్‌స్ట్రీట్ జర్నల్ రిపోర్టు చేసింది.
ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పలు లీక్స్ ప్రకారం ఐఫోన్ 8కు భారీ డిస్‌ప్లేనే ఉండబోతుందని టాక్. అంతేకాక మూడు స్టోరేజ్ ఆప్షన్లలో ఇది లాంచ్ కాబోతుందని, దానిలో అత్యధికంగా 512 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌ను ఇది కలిగి ఉంటుందట. మిగతా రెండు 64జీబీ, 256జీబీ స్టోరేజ్ వేరియంట్లను తెలిసింది. రియర్ డ్యూయల్ కెమెరా సిస్టమ్‌కు దీనికి ప్రత్యేకతగా నిలువబోతుంది. శాంసంగ్ కొత్త గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు గట్టిపోటీగా ఇది మార్కెట్లోకి రాబోతుందని తెలుస్తోంది. అత్యంత ఖరీదైన ఐఫోన్ డివైజ్ కూడా ఇదే కాబోతుందట. దీని ధర 1000 డాలర్ల నుంచి ప్రారంభమవుతుందని ఇప్పటికే పలు రిపోర్టులు పేర్కొన్నాయి. పెప్టెంబర్ 12న లాంచ్ అయ్యే ఈ ఫోన్ సెప్టెంబర్ 22 నుంచి అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.