iPad Pro
-
Apple MacBook pro : యాపిల్ ఐప్యాడ్ ప్రో అప్ డేట్స్ ఇవే
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన బ్రాండ్స్ తో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా కొత్త కొత్త అప్ డేట్స్ తో ముందుకు వస్తుంది. నివేదికల ప్రకారం,యాపిల్ సంస్థ తన కొత్త యాపిల్ ఐప్యాడ్ కు వైర్లెస్ ఛార్జింగ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ వైర్లెస్ ఛార్జింగ్ పై వర్క్ చేస్తుండగా..,వచ్చే ఏడాది నాటికి ఈ టాబ్లెట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐప్యాడ్ ప్రో మోడళ్లకు అల్యూమినియం ఎన్‌క్లోజర్ ఉంది. కానీ టెక్ దిగ్గజం మాషబుల్ వివరాల ప్రకారం..వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కోసం అల్యుమినియ ఎన్‌క్లోజర్ బదులు గ్లాస్ ఎన్‌క్లోజర్ ను అమర్చనుంది. ఐప్యాడ్ ప్రో కోసం ఆపిల్ మాగ్‌సేఫ్ పరీక్షిస్తుంది. ప్రతీ ఐఫోన్12 ఛార్జింగ్ కాయిల్స్ చుట్టూ మ్యాగ్నెట్స్ ఉంటాయి.ఇది ఫోన్‌కి మాగ్‌సేఫ్ ఛార్జర్ వినియోగించేందుకు ఉపయోగపడుతుంది. నార్మాల్గా పెట్టే ఛార్జింగ్ కంటే వైర్‌లెస్‌గా టాబ్లెట్ కు ఛార్జింగ్ పెట్టే సమయం ఎక్కువగా ఉంది. అందుకే వైర్ లెస్ ఛార్జింగ్ తో పాటూ కేబుల్ సాయంతో ఛార్జింగ్ పెట్టుకునేలా థండర్‌బోల్ట్ పోర్ట్‌ను చేర్చాలని యోచిస్తోంది.ఐపాడ్ ప్రో వెనుక భాగం నుంచి ఐఫోన్ లేదా ఎయిర్ పాడ్లు ఛార్జింగ్ పెట్టుకునేలా వెసలు బాటు కల్పించాలని యాపిల్ ప్రతినిధులు భావిస్తున్నారు. చదవండి : Apple updates : ఆపిల్ అప్డేట్స్ వచ్చేస్తున్నాయ్ ! -
ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ వీక్ : ఐఫోన్లపై బెస్ట్ డీల్స్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ వీక్‌ను ప్రారంభించింది. ఈ వీక్‌లో భాగంగా ఆపిల్ ఉత్పత్తులు ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్బుక్లు, వాచ్‌లపై బెస్ట్ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. డిస్కౌంట్లతో పాటు అదనంగా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపిన వారికి 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్‌లను అందిస్తోంది. బెస్ట్ డీల్స్ ఇవే... ఐఫోన్ ఎక్స్ : ఆపిల్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్ 64జీబీ వేరియంట్ ఒరిజినల్ ధర 89వేల రూపాయలు. అదేవిధంగా 256జీబీ వేరియంట్ ధర రూ.1,02,000. ఈ రెండు స్మార్ట్ఫోన్లపై కొనుగోలుదారులు 8వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అంతేకాక రూ.18వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ : ఐఫోన్ 8(64జీబీ) ధర 64వేల రూపాయల నుంచి 54,999 రూపాయలకు తగ్గింది. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై 9వేల రూపాయల డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. అదేవిధంగా ఐఫోన్ 8 ప్లస్(64జీబీ) ధరను 73వేల రూపాయల నుంచి 66,499 రూపాయలకు ఫ్లిప్‌కార్ట్ తగ్గించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లపై కూడా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై 8వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. అదేవిధంగా 18వేల రూపాయల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ : 59వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 7 ప్లస్(32జీబీ) స్మార్ట్‌ఫోన్ ధరను ఫ్లిప్‌కార్ట్ 56,999 రూపాయలకు తగ్గించింది. ఐఫోన్ 7 ధర కూడా 49వేల రూపాయల నుంచి 42,999 రూపాయలకు తగ్గింది. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ఈఎంఐ లావాదేవీలపై 5వేల రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కొనుగోలుదారులు పొందుతారు. ఎక్స్చేంజ్ ఆఫర్ల కింద ఐఫోన్ 7, 21వేల రూపాయల తగ్గింపుతో లిస్ట్ అయింది. ఇలా ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ ఎస్ఈ, మ్యాక్‌బుక్ ఎయిర్, ఐఫ్యాడ్ ప్రొ, ఆపిల్ వాచ్ సిరీస్ 2లపై డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్‌లను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. -
కొత్తకొత్త ఉత్పత్తులతో ఆపిల్ ఈవెంట్
అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ ఈ నెలలో కొత్త కొత్త ఉత్పత్తులతో వినియోగదారుల ముందుకు రాబోతుంది. ఈ నెల చివర్లో ఆపిల్ ఓ ఈవెంట్ ను నిర్వహించబోతుందని, ఆ ఈవెంట్లో కొత్త ఐప్యాడ్ ప్రొను లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. అంతేకాక 128జీబీ స్టోరేజ్ తో అతిపెద్ద ఐఫోన్ ఎస్ఈ మోడల్ ను, కొత్త ఆపిల్ వాచ్ బ్యాండ్స్ ను ఆవిష్కరించనున్నట్టు టెక్ వర్గాల టాక్. కొత్త ఐప్యాడ్ ప్రొ మోడల్స్ ని ఈ నెలలోనే ఆవిష్కరించబోతుందని రూమర్లు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. 9.7 అంగుళాల, 12.9 అంగుళాల వెర్షన్లను అప్ డేట్ చేసిన ఆపిల్, 10.5 అంగుళాల స్లిమర్ బెజిల్స్ తో ఈ కొత్త ఐప్యాడ్ ప్రొను తీసుకురాబోతుందని టెక్ వెబ్ సైట్ మ్యాక్రూమర్స్.కామ్ రిపోర్టు చేసింది. అయితే ఈ ఐప్యాడ్ ప్రొలో హోమ్ బటన్ ఉండదట. హైయర్-రెజుల్యూషన్ డిస్ ప్లే, క్వాడ్ మైక్రోఫోన్స్ దీనిలో ఉంటాయని తెలుస్తోంది. అప్ డేట్ చేసిన 12.9 అంగుళాల ఐప్యాడ్ ప్రొ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాను, ప్రస్తుతమున్న 9.7 అంగుళాల మోడల్ మాదిరిగా ట్రూ టోన్ డిస్ ప్లేను కలిగి ఉంటుందని టాక్. అదేవిధంగా ఓమోలెడ్ డిస్ ప్లేతో 5.8 అంగుళాల సరికొత్త ఐఫోన్ 8 ను లాంచ్ చేయబోతున్నామని, మరో రెండు డివైజ్ లను తీసుకురాబోతున్నామని ఆపిల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగతా రెండు డివైజ్ లు అప్ డేటడ్ ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ లని తెలుస్తోంది. అయితే ఆపిల్ ప్రకటించిన ఈ ప్రొడక్ట్ లు కూడా ఈ ఈవెంట్లోనే వినియోగదారుల ముందుకు రావొచ్చని కొందరంటున్నారు. ఆపిల్ నిర్వహించే ఆ ఈవెంట్ మార్చి 20 సోమవారం, మార్చి 24 శుక్రవారం మధ్యలో ఉంటుందట.