ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన బ్రాండ్స్ తో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా కొత్త కొత్త అప్ డేట్స్ తో ముందుకు వస్తుంది. నివేదికల ప్రకారం,యాపిల్ సంస్థ తన కొత్త యాపిల్ ఐప్యాడ్ కు వైర్‌లెస్ ఛార్జింగ్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ పై వర్క్ చేస్తుండగా..,వచ్చే ఏడాది నాటికి ఈ టాబ్లెట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఐప్యాడ్ ప్రో మోడళ్లకు అల్యూమినియం ఎన్‌క్లోజర్ ఉంది. కానీ టెక్ దిగ్గజం మాషబుల్ వివరాల ప్రకారం..వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కోసం అల్యుమినియ ఎన్‌క్లోజర్ బదులు గ్లాస్ ఎన్‌క్లోజర్ ను అమర్చనుంది. ఐప్యాడ్ ప్రో కోసం ఆపిల్ మాగ్‌సేఫ్ పరీక్షిస్తుంది. ప్రతీ ఐఫోన్12 ఛార్జింగ్ కాయిల్స్ చుట్టూ మ్యాగ్నెట్స్ ఉంటాయి.ఇది ఫోన్‌కి మాగ్‌సేఫ్ ఛార్జర్ వినియోగించేందుకు ఉపయోగపడుతుంది.
నార్మాల్గా పెట్టే ఛార్జింగ్ కంటే వైర్లెస్గా టాబ్లెట్ కు ఛార్జింగ్ పెట్టే సమయం ఎక్కువగా ఉంది. అందుకే వైర్ లెస్ ఛార్జింగ్ తో పాటూ కేబుల్ సాయంతో ఛార్జింగ్ పెట్టుకునేలా థండర్‌బోల్ట్ పోర్ట్‌ను చేర్చాలని యోచిస్తోంది.ఐపాడ్ ప్రో వెనుక భాగం నుంచి ఐఫోన్ లేదా ఎయిర్ పాడ్‌లు ఛార్జింగ్ పెట్టుకునేలా వెసలు బాటు కల్పించాలని యాపిల్ ప్రతినిధులు భావిస్తున్నారు.
చదవండి : Apple updates : ఆపిల్ అప్‌డేట్స్ వచ్చేస్తున్నాయ్ !
Comments
Please login to add a commentAdd a comment