సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి వాటిని వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.
హ్యాకర్లు.. మీ అనుమతి లేకుండానే మొబైల్ హ్యాక్ చేసే అవకాశం ఉంది. మొబైల్ హ్యాక్ చేస్తే.. డేటా మొత్తం చోరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఉత్పత్తులను (మొబైల్స్, ట్యాబ్స్, మ్యాక్స్) ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.
CERT-In యాపిల్ ఉత్పత్తులను ప్రభావితం చేసే రెండు బలహీనతలను గుర్తించింది. అవి ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీ (CVE-2024-44308), క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS). వీటిని వాడుకొని సైబర్ నేరగాళ్లు మీ మొబైల్స్ హ్యక్స్ చేస్తారు.
ఇదీ చదవండి: దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..
18.1.1కి ముందున్న యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. అలాగే 17.7.2కి ముందు యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. 15.1.1కి ముందు వెర్షన్స్ అయిన యాపిల్ మ్యాక్ఓఎస్ సుక్వోయా, 2.1.1కి ముందున్న యాపిల్ విజన్ఓఎస్, 18.1.1కి ముందు ఉన్న యాపిల్ సఫారీ ఉత్పత్తులను హ్యాకర్స్ సులభంగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, సరికొత్త సాఫ్ట్‌వేర్ వెర్షన్లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment