దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు.. | Zomato CEO Deepinder Goyal Buys Rs 9 Crore Bentley Continental GT W12 | Sakshi
Sakshi News home page

దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..

Published Mon, Nov 25 2024 2:34 PM | Last Updated on Mon, Nov 25 2024 3:21 PM

Zomato CEO Deepinder Goyal Buys Rs 9 Crore Bentley Continental GT W12

జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్.. ఎట్టకేలకు మరో ఖరీదైన 'బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్' కొనుగోలు చేశారు. దీని ధర రూ.9 కోట్లు. ఈ కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్ల జాబితాలో ఒకటిగా ఉన్న ఈ బెంట్లీ కాంటినెంటల్ జీటీ డబ్ల్యు12 ముల్లినర్ కారును చాలా తక్కువ మంచి మాత్రమే కొనుగోలు చేశారు. ఈ జాబితాలో నటుడు రణబీర్ కపూర్ ఉన్నారు. ఇది 22 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది.

ఈ కారులోని 6 లీటర్ డబ్ల్యు 12 ఇంజిన్ 650 Bhp పవర్, 900 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ కారులో వాహన వినియోగదారులకు అవసరమైన దాదాపు అన్ని ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి.

ఇదీ చదవండి: జస్ట్‌ నిద్రపోయాడంతేగా.. ఉద్యోగిని తీసేసిన కంపెనీకి రూ.41 లక్షల ఫైన్‌

దీపిందర్ గోయల్ గ్యారేజిలో ఇప్పటికే రూ. 6 కోట్ల విలువైన బెంట్లీ కారును కలిగి ఉన్నారు. ఇది కాకుండా.. ఆస్టన్ మార్టిన్ డీబీ12, ఫెరారీ రోమా, పోర్స్చే 911 టర్బో ఎస్, పోర్స్చే 911 కారెరా ఎస్, లంబోర్ఘిని ఉరుస్, బీఎండబ్ల్యూ ఎం8 కాంపిటీషన్ వంటి కార్లు గోయల్ గ్యారేజిలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement