ఎప్పుడైనా మనిషికి అలసట కలిగిందంటే నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ఉద్యోగం చేసే సమయంలో కూడా నిద్రపోతారు. అలాంటి వారిని కంపెనీలు మందలిస్తాయి. అయితే చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసింది.
ఒక్కసారి పనిలో నిద్రపోవడం వల్ల కంపెనీ జాబ్ నుంచి తొలగించడం.. ఏ మాత్రం సమంజసం కాదని భావించిన ఉద్యోగి, ఆ కంపెనీపై దావా వేశారు. ఏకంగా రూ. 3,50,000 యువాన్స్ (రూ. 41.6 లక్షలు) అందుకున్నాడు.
జాంగ్ సుమారు 20 సంవత్సరాలకు పైగా జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైక్సింగ్‌లోని ఒక కెమికల్ కంపెనీలో డిపార్ట్‌మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. అయితే ఒకరోజు పని అర్ధరాత్రి వరకు పొడిగించారు. దీంతో కొంత అలసట కారణంగా.. నిద్రపోయాడు. ఇది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.
కంపెనీలో నిద్రపోయాడనే కారణంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్.. జీరో టాలరెన్స్ డిసిప్లిన్ విధానాన్ని జాంగ్ ఉల్లంఘించారని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తనను జాబ్ నుంచి తీసేయడం అన్యాయమని.. కంపెనీకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్య తీసుకోవాలని జాంగ్ నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే కోర్టును ఆశ్రయించారు.
ఉద్యోగంలో నిద్రపోవడం అదే మొదటిసారి, అంతే కాకుండా.. నేను నిద్రపోవడం వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం జరగలేదు అని కోర్టులో వెల్లడించారు. 20 ఏళ్ళు జాంగ్ కంపెనీకి అందించిన సేవ, ఆయన పొందిన ప్రమోషన్స్, జీతాల పెరుగుదల వంటి వాటిని పరిశీలించిన కోర్టు అతని అనుకూలంగా తీర్పునిస్తూ.. పరిహారంగా రూ. 41.6 లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment