chinese person
-
కునుకు తీస్తే ఉద్యోగం నుంచి తీసేస్తారా? రూ.41 లక్షలు కట్టండి!
ఎప్పుడైనా మనిషికి అలసట కలిగిందంటే నిద్ర వచ్చేస్తుంది. కొంతమంది ఉద్యోగం చేసే సమయంలో కూడా నిద్రపోతారు. అలాంటి వారిని కంపెనీలు మందలిస్తాయి. అయితే చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం ఉద్యోగిని జాబ్ నుంచి తీసేసింది.ఒక్కసారి పనిలో నిద్రపోవడం వల్ల కంపెనీ జాబ్ నుంచి తొలగించడం.. ఏ మాత్రం సమంజసం కాదని భావించిన ఉద్యోగి, ఆ కంపెనీపై దావా వేశారు. ఏకంగా రూ. 3,50,000 యువాన్స్ (రూ. 41.6 లక్షలు) అందుకున్నాడు.జాంగ్ సుమారు 20 సంవత్సరాలకు పైగా జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైక్సింగ్‌లోని ఒక కెమికల్ కంపెనీలో డిపార్ట్మెంట్ మేనేజర్‌గా పనిచేశారు. అయితే ఒకరోజు పని అర్ధరాత్రి వరకు పొడిగించారు. దీంతో కొంత అలసట కారణంగా.. నిద్రపోయాడు. ఇది మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది.కంపెనీలో నిద్రపోయాడనే కారణంగా హెచ్ఆర్ డిపార్ట్మెంట్.. జీరో టాలరెన్స్ డిసిప్లిన్ విధానాన్ని జాంగ్ ఉల్లంఘించారని ఉద్యోగంలో నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది. తనను జాబ్ నుంచి తీసేయడం అన్యాయమని.. కంపెనీకి వ్యతిరేకంగా చట్టపరమైన చర్య తీసుకోవాలని జాంగ్ నిర్ణయించుకున్నాడు. అనుకున్న విధంగానే కోర్టును ఆశ్రయించారు.ఉద్యోగంలో నిద్రపోవడం అదే మొదటిసారి, అంతే కాకుండా.. నేను నిద్రపోవడం వల్ల కంపెనీకి తీవ్రమైన నష్టం జరగలేదు అని కోర్టులో వెల్లడించారు. 20 ఏళ్ళు జాంగ్ కంపెనీకి అందించిన సేవ, ఆయన పొందిన ప్రమోషన్స్, జీతాల పెరుగుదల వంటి వాటిని పరిశీలించిన కోర్టు అతని అనుకూలంగా తీర్పునిస్తూ.. పరిహారంగా రూ. 41.6 లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. -
104 రోజుల డ్యూటీ.. ఒక్క రోజే లీవు!
బీజింగ్: ఏకంగా 104 రోజులపాటు డ్యూటీ చేసిన చైనా వాసి, మధ్యలో ఒక్కటంటే ఒక్క రోజే సెలవు తీసుకున్నాడు. ఆపై, తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆయన కుటుంబానికి పరిహారంగా రూ.48 లక్షలు చెల్లించాలంటూ సంస్థ యజమానిని కోర్టు ఆదేశించింది. జెఝియాంగ్ ప్రావిన్స్‌లోని జౌషాన్ ప్రాంతానికి చెందిన ఎబావో (30) వృత్తిరీత్యా పెయింటర్. గతేడాది ఓ కంపెనీతో ఆయన కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. ఆ మేరకు ఫిబ్రవరి నుంచి మే వరకు ఎక్కడా విరామం లేకుండా పనిచేశాడు. మధ్యలో ఏప్రిల్ 6వ తేదీన మాత్రమే సెలవు తీసుకున్నాడు. మే 25వ తేదీ నుంచి ఎబావో ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. మే 28వ తేదీ నుంచి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ జూన్ ఒకటో తేదీన మృతి చెందాడు. కుటుంబసభ్యులు పరిహారం కోసం కోర్టును ఆశ్రయించారు. రోజుకు గరిష్టంగా 8 గంటల చొప్పున వారానికి 44 గంటలు మాత్రమే పనిచేయాల్సి ఉండగా అంతకంటే ఎక్కువ పనిచేయించడం నిబంధనలకు విరుద్ధమని కోర్టు పేర్కొంది. ఇందుకుగాను రూ.47.46 లక్షలు, ఎబావో కుటుంబానికి మానసిక వేదన కలిగించినందుకు అదనంగా మరో రూ.1.17 లక్షలివ్వాలని కంపెనీని ఆదేశించింది. -
బిహార్ జైలులో చైనీయుడి మృతి
పాట్నా:బిహార్‌లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ సరైనా పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించాడు. జూన్6వ తేదీన బ్రహ్మపురలోని లక్ష్మీచౌక్ వద్ద తిరుగుతుండగా సరైన వీసా పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫారనర్స్ యాక్ట్ కింద లీపై కేసు నమోదు చేశారు. అరెస్టు సమయంలో లీ వద్ద చైనా మ్యాపు, మొబైల్ ఫోన్, చైనా, నేపాల్, ఇండియా కరెన్సీలు దొరికాయి. అరెస్టు తర్వాత లీని ముజఫర్‌పూర్ జైలుకు తరలించారు. జూన్7న జైలులో లీ ఆత్మహత్యాయత్నం చేశాడు.తన కళ్లద్దాలను పగులగొట్టి గాజుతో శరీరాన్ని గాయపరుచుకున్నాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారకస్థిలో జైలు గదిలోని బాత్రూమ్లో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లీని ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లీ మంగళవారం(జూన్11) మరణించాడని పోలీసులు తెలిపారు. -
ఇండో-టిబెట్ సరిహద్దులో చైనా పౌరుడు అరెస్ట్
హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో కలకలం చెలరేగింది. ఇక్కడి ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో స్థానిక పోలీసులు ఒక చైనా పౌరుడిని అరెస్టు చేశారు. ఆ చైనా పౌరుడితో ఒక భారతీయ మహిళ కూడా ఉండటంతో ఆమెను కూడా కిన్నౌర్ పోలీసులు అరెస్టు చేశారు.మీడియాకు అందిన సమాచారం ఈ ఘటన కిన్నౌర్ జిల్లా సుమ్డో పోలీసు చెక్ పోస్ట్ దగ్గర చోటుచేసుకుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ లేకుండా ఆ చైనా పౌరుడు పోలీసులకు తారసపడ్డాడు. అతనితో పాటు ఉన్న మహిళ అతని భార్య అని, ఆమె మహారాష్ట్రకు చెందినదని పోలీసులు తెలిపారు. ఆ యువకుడిని 35 ఏళ్ల గుయో యుడాంగ్గా గుర్తించారు. అతను మహారాష్ట్రకు చెందిన ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి దగ్గరా వీసాతో సహా వారి వివాహ పత్రాలు ఉన్నాయి.అయితే కిన్నౌర్ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడానికి వారికి అంతర్జాతీయ ఇన్నర్ లైన్ అనుమతి లేదు. ఇన్నర్ లైన్ పర్మిట్ ఉల్లంఘనపై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కిన్నౌర్ పోలీస్ డీఎస్పీ నవీన్ జల్తా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, అందుకే దీనిపై పెద్దగా ఏమీ చెప్పలేమని డీఎస్పీ తెలిపారు. -
పాకిస్తాన్లో దారుణం.. చైనీయులపై కాల్పులు..
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్‌లో ఉన్న చైనా ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. కాగా, ఈ ఘటనలో చైనా ఇంజినీర్లు చనిపోయినట్టు.. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు సమాచారం. ఇక, దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను వారు మట్టుబెట్టారు. వివరాల ప్రకారం.. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ వద్ద చైనాకు చెందిన ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రదాడి జరిగింది. స్థానికంగా ఉన్న ఫకీర్ కాలనీ వంతెనపైకి చైనా ఇంజినీర్లకు చెందిన ఏడు వాహనాలు చేరుకోగానే రెబల్స్ కాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక చైనా ఇంజినీర్లు చనిపోయినట్టు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. 7 vehicles of Chinese engineers came under intense attack in Gwadar, #Balochistan According to local media, several Chinese engineers have been killed. This is an earlier video of Baloch fighters warning #China https://t.co/BhC5NZu1E0 pic.twitter.com/UKuG4itS1R — Eternal Optimist (@etoptimist) August 13, 2023 చైనా అలర్ట్.. మరోవైపు.. చైనా భద్రతా సిబ్బంది ఎదురు దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం ముందురోజు(ఆగస్టు 14)న ఉగ్రవాదుల దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడితో పాక్‌లో ఉన్న చైనా దౌత్యకార్యాలయం అప్రమత్తమైపోయింది. పాక్‌లోని బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్‌ల్లోని చైనీయులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించింది. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో చైనీయులపై దాడులు ఎక్కువయ్యాయి. గ్వాదర్ పోర్టుపై చైనా పెత్తనం చేయడంతో స్థానికులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరగడం గమనార్హం. ఇది కూడా చదవండి: దేవాలయంపై దాడి.. గోడలపై ఖలిస్థానీల నినాదాలు.. -
పాక్‌లోని చైనీయులకు బులెట్ ప్రూఫ్ కార్లు.. ‘ఇమ్రాన్’ కాల్పులే కారణమా?
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో టెర్రరిస్టు దాడులు పెరిగిపోతుండటంపై ఆందోళన పడుతోంది చైనా. చైనా-పాకిస్థాన్ సంయుక్తంగా చేపట్టిన ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)లో పని చేస్తున్న తమ దేశీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సీపెక్ ప్రాజెక్టులో పని చేస్తున్న చైనీయుల కోసం బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఇటీవల కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఘటనతో చైనా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో వివిధ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా కార్మికులకు భద్రత కల్పించటం డ్రాగన్‌కు తలనొప్పిగా మారింది. ప్రాజెక్టుల వద్ద భద్రత బలగాలు, దర్యాప్తు దళాలను బలోపేతం చేసేందుకు అంగీకరించినట్లు సీపెక్‌కు చెందిన 11వ జాయింట్ కోఆపరేషన్ కమిటీ(జేసీసీ) తెలిపింది. ‘ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా ఉద్యోగులు బయటకి పనుల కోసం వెళ్లేందుకు బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని నిర్ణయించారు.’అని వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవలే చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్‌లో పని చేస్తున్న తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. బులెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించాలని నిర్ణయించటం చైనా ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నట్లయిందని పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు -
పాకిస్తాన్లో చైనీయులే టార్గెట్‌గా కాల్పులు.. డ్రాగన్ వార్నింగ్ తప్పదా?
దాయాది దేశం పాకిస్తాన్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆసుప్రతిలోకి చొరబడిన ఆగంతకుడు విచక్షణరహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదంలో ఒక చైనాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. కరాచీ నగరంలోని డెంటల్ క్లినిక్‌లోని ఆంగతకుడు రోగిలా నటిస్తూ ప్రవేశించాడు. అనంతరం, గన్‌తో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ప్రమాదంలో చైనాకు చెందిన ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఇద్దరు(ఓ మహిళ) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రోనిల్‌డి రైమండ్ చావ్, మార్గ్రేడ్ మరియు రిచర్డ్లుగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై సింధ్ ముఖ్యమంత్రి మురాద్ అలీ షా స్పందించారు. కాల్పుల ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కాల్పులు జరిపిన వ్యక్తి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో చైనీయులపై దాడులు ఎక్కువయయ్యాయి. కాగా, ఏప్రిల్‌లో కరాచీ యూనివర్సిటీలో బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దళ సభ్యురాలు తనను తాను పేల్చివేసుకున్న ఘటనలో నలుగురు చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చైనీయులు ఉన్నారు. ఇక, ఈ దాడి తామే చేశామంటూ.. బెలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది. దీంతో, పాక్తిసాన్కు వార్నింగ్ ఇచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని హెచ్చరించింది. #Karachi: Firing on Dental Clinic in Saddar area, One #Chinese Citizen killed while 2 others including a woman have got injured. pic.twitter.com/eEqsRISDTS — Drakshaan Baloch (@IsmailBaloch88) September 28, 2022 -
చైనా పౌరుల ప్రతి కదలికపై గట్టి నిఘా! ఎక్కడికి వెళ్లినా..చెప్పాల్సిందే!
increasing attacks targeting Chinese citizens in Pakistan: పాకిస్తాన్‌లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్ పోలీసులకు తెలియజేయలాని కోరినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విదేశీయుల భద్రత కోసం ఇస్లామాబాద్ పోలీసుల ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ ఫారిన్ సెక్యూరిటీ సెల్ పనితీరును సమీక్షించేందుకే నిర్ణయించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇస్లామాబాద్‌లో సుమారు వెయ్యి మంది చైనా పౌరులు ఉన్నారు. అంతేకాదు వీళ్లంతా వివిధ కంపెనీలు, వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 36 ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని సర్వే తెలిపింది. బహుళ మిలియన్ డాలర్ల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టులకు సంబంధించిన చైనీయులకు పారామెలటరీ దళాలు, భద్రతా దళాలు రక్షణ కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు. పోలీసు స్టేషన్ల ఎస్హెచ్ఓలు, సెక్యూరిటీ డివిజన్ లేదా పెట్రోలింగ్ యూనిట్ సుమారు వెయ్యి మందికి పైగా చైనా పౌరుల కదలిక సమయంలో భద్రత కల్పించాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. వారి కదలికల వివరాలను సేకరించే బాధ్యత కూడా ఎస్హెచ్ఓలకు అప్పగించామని అధికారులు తెలిపారు. చైనా పౌరుల నివాసాలతో పాటు వారి ఇళ్లకు వెళ్లే మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సేఫ్ సిటీ పోలీస్ ఫెసిలిటేషన్లో ఒక డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ అధికారులు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదీగాక ఈ ఏడాది ఏప్రిల్ 26న కరాచీ యూనివర్సిటీలోని కన్ఫ్యూషియస్ ఇన్స్టిట్యూట్ షటిల్ వ్యాన్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ)కి చెందిన మహిళ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ముగ్గురు చైనా టీచర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. పైగా వేర్పాటువాద పాకిస్తాన్‌లోని బులిచిస్తాన్ ప్రావిన్స్‌లో స్థానికులు చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: అదానీని ఆపండి...మళ్లీ శ్రీలంకలో మొదలైన నిరసన సెగ) -
మారణహోమం: పాక్‌లో ప్రతీకార దాడులు
పాకిస్థాన్‌లో చైనీయులపై ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ తీర నగరం గ్వాడర్‌లో భారీ ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మృత్యువాత పడినట్లు, ముగ్గురు గాయపడినట్లు సమాచారం. ఈస్ట్ బే రోడ్డులో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో చైనీయులతో వెళ్తున్న ఓ కారుపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఆత్మాహుతి దాడిని పాకిస్థాన్ ప్రభుత్వం ఖండించింది. ఘటన సమాచారం అందుకోగానే క్షతగాతత్రులను ఆస్పత్రులకు తరలించినట్లు బెలూచిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే ది బెలూచిస్థాన్ పోస్ట్ మాత్రం మరోలా కథనం ప్రచురించింది. పేలుడులో తొమ్మిది మంది చైనా ప్రజలు మృత్యువాతపడ్డట్లు కథనం వెలువరించింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్(CPEC) రోడ్డు నిర్మాణ ప్రాంతం వద్ద వెళ్తున్న చైనా సైట్ ఇంజినీర్లపై దాడి జరిగిందని, తొమ్మిది మంది మృతి చెందారని కథనంలో పేర్కొంది. ఈ కథనంపై స్పష్టత రావాల్సి ఉంది. Strongly condemn suicide attack on Chinese nationals Vehicle in #Gwadar. 2 children died who were playing nearby & one Chinese sustained minor injuries. 3 persons injured including driver Police & CTD teams are on the crime scene. Investiga launched. Innocent Children,Afsos — Liaquat Shahwani (@LiaquatShahwani) August 20, 2021 బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్డుకుంటామని ఎప్పటి నుంచో చెప్తోంది కూడా. చైనాలో మైనారిటీ వర్గం ఉయిగుర్ల ఉచకోత ఘటనలకు ప్రతీకారంగానే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. పోయిన నెలలో ఖైబర్-ఫంక్తువా ప్రోవిన్స్ వద్ద చైనా వర్కర్లతో వెళ్తున్న ఓ బస్సుపై ఆత్మాహుతి దాడి జరగ్గా.. 9మంది చైనీయులు, మరో నలుగురు పాక్ పౌరులు మృత్యువాత పడ్డారు. అయితే బస్సు గ్యాస్ లీకేజీ వల్లే ప్రమాదం జరిగిందని పాక్ ప్రకటించగా.. చైనా మాత్రం అది ఆత్మాహుతి దాడేనని వాదించింది. ఈ తరుణంలో పాక్ ప్రభుత్వం ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది కూడా. చదవండి: ముగ్గురు పిల్లలు ముద్దు!!-చైనా -
‘అసలు’కు ముందే ‘కొసరు’ దొరికింది!
సాక్షి, హైదరాబాద్: ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రాడ్‌లో నగర యువతి నుంచి రూ.2.5 లక్షలు గుంజిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు వర్చువల్ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆమె డబ్బులు అసలు ఏ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్లాయో తెలుసుకోవడానికి సమయం పట్టే నేపథ్యంలో ఈ విధానాన్ని అనుసరించారు. ఫలితంగా సదరు యాప్‌కు అనుసంధానించి ఉన్న మరో రెండు బ్యాంకు ఖాతాలు దొరికాయి. వీటి ఆధారంగానే గత వారం శ్రీనివాసరావు, విజయ్‌కృష్ణ పట్టుబడ్డారు. వాట్సాప్ లింకుల ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో భారీ స్కామ్‌లకు తెరలేపిన మాల్008 యాప్ వెనుకా చైనీయులే ఉన్నారు. వీరు అనేక మందికి ఎర వేసి డమ్మీ కంపెనీలు రిజస్టర్ చేయించి, వాటి ఆధారంగా కరెంట్ ఖాతాలు తెరిపించారు. క్యూఆర్ కోడ్స్ రూపంలో వసూలు ► ఈ యాప్‌లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైన వారి నుంచి డబ్బును క్యూఆర్ కోడ్స్ రూపంలో సేకరిస్తున్నారు. యాప్‌లోకి ప్రవేశించి ఇన్వెస్ట్ అనే అంశాన్ని ఎంచుకుంటే ఆ ఇన్వెస్టర్‌కు ఓ క్యూఆర్ కోడ్ వస్తుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా ఇన్వెస్ట్ చేయిస్తున్నారు. ► దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో డమ్మీ కంపెనీలు, కరెంట్ ఖాతాలు సిద్ధం చేసుకున్న చైనీయులు ఒక కస్టమర్ నుంచి డబ్బు గుంజేందుకు ఒక్కోసారి ఒక్కో బ్యాంకు ఖాతాను వాడుతున్నారు. ఈ కేసులో ఫిర్యాదు చేసిన బాధితురాలి నుంచి డబ్బు దాదాపు 10 ఖాతాల్లోకి వెళ్లింది. ►ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన అధికారులు తొలుత ఆయా బ్యాంకులపై దృష్టి పెట్టారు. వాటికి లేఖ రాయడం ద్వారా డబ్బు వెళ్లిన కరెంట్ ఖాతాల వివరాలు సంగ్రహించాలని భావించారు. ►అయితే ఇది కొంత కాలయాపనతో కూడిన వ్యవహారం కావడంతో ఈలోపు మరికొందరు మోసపోవచ్చని భావించారు. దీంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు తొలిసారిగా వర్చువల్ డెకాయ్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. ఐడీ ఆధారంగా ఖాతాల వివరాలు.. ►సైబర్ క్రైమ్ ఠాణాలో పని చేసే ఓ కానిస్టేబుల్ బాధిత మహిళ నుంచి మాల్008కు సంబంధించిన లింకు షేర్ చేసుకున్నారు. అందులో తానే స్వయంగా రెండు దఫాల్లో రూ.600 చొప్పున ఇన్వెస్ట్ చేశారు. ►ఆ సమయంలో వచి్చన క్యూఆర్ కోడ్స్‌లో సదరు బ్యాంకు ఖాతాకు సంబంధించిన ఓ ఐడీ ఉంటుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌నకు సంబంధించిన దీనిని సంగ్రహించిన అధికారులు దాని అధికారులను సంప్రదించి లింకై ఉన్న ఖాతాల వివరాలు తెలుసుకున్నారు. ►ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్, విజయ్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్ని ంచగా రూ.15 వేల ప్రతిఫలానికి తమ ఖాతాలు చైనీయులకు ఇచి్చనట్లు అంగీకరించడంతో ఈ కేసులో నిందితులుగా మారి అరెస్టు అయ్యారు. ►బాధిత యువతి డబ్బు వెళ్లిన బ్యాంకు ఖాతాల వివరాలు అందించాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు ఆయా విభాగాలకు లేఖలు రాశారు. ఆవి అందిన తర్వాత వాటిని తెరిచిన వారినీ అరెస్టు చేయాలని నిర్ణయించారు. -
‘సైకిల్ స్కామ్’ వెనుకా చైనీయులే!
♦ స్కీమ్–1 ప్రకారం రూ.300 పెట్టుబడి పెడితే 90 రోజుల్లో రూ.1350 ♦ స్కీమ్–2 ప్రకారం రూ.3,000 ఇన్వెస్ట్ చేస్తే మూడు నెలల్లో రూ.13,500 ♦ స్కీమ్–3లో రూ.15,000 పెడితే 90 రోజుల్లో రూ.67,500.. ఇలా ఆర్జించవచ్చంటూ సైకిల్ స్కీమ్ పేరుతో స్కామ్‌కు పాల్పడిన ‘షేర్డ్ బీకే’ వ్యవహారం వెనుకా చైనీయులే ఉన్నట్లు తేలింది. ఇప్పటికే ఈ తరహా కేసులో సైబరాబాద్ పోలీసులు ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి చేతిలో నగరానికి చెందిన పది మంది దాదాపు రూ.10 లక్షల వరకు మోసపోయారని తేలింది. దీంతో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం ఆ ముగ్గురినీ పీటీ వారెంట్‌పై అరెస్టు చేశారు. తదుపరి విచారణ కోసం కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. సాక్షి, హైదరాబాద్ : హర్యానాలోని గుర్గావ్కు చెందిన ఉదయ్ ప్రతాప్, రాజేష్‌శర్మ, ఢిల్లీవాసి నితీష్ కుమార్ కోఠారి ఈ కేసుల్లో ప్రధాన పాత్రధారులుగా ఉన్నారు. ఉదయ్ ప్రతాప్ ఐదేళ్ల క్రితం చైనాకు చెందిన టాప్–1 మోబీ టెక్నాలజీ అనే సంస్థలో పని చేశాడు. అప్పట్లో ఇతడికి చైనాకు చెందిన పెంగ్ గువాయి అలియాస్ జావీతో పరిచయమైంది. ఇతడితో పాటు నితీష్ కుమార్ కొఠారీ, రాజేష్ శర్మను ఆ చైనీయుడు మోబి సెంట్రిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు అధీకృత వ్యక్తులుగా చేశాడు. తమ వద్ద ఎవరైనా పెట్టుబడి పెడితే ఆ మొత్తంతో సైకిల్ కొంటామని, ప్రతిరోజూ దాన్ని అద్దెకు తిప్పగా వచ్చిన మొత్తం ఇన్వెస్టర్‌కే ఇచ్చేస్తామంటూ వీళ్లు ప్రచారం చేసుకున్నారు. ఈ షేర్డ్ బైక్ యాప్‌లకు చెందిన లింకుల్ని వాట్సాప్ ద్వారా సర్క్యులేట్ చేశారు. ముందుగా తక్కువ మొత్తం పెట్టుబడి పెట్టిన వారికి లాభాలు చూపించి వారిని పూర్తిగా నమ్మించేవాళ్లు. ఆ మొత్తం కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేసేవాళ్లు కాదు. కేవలం వారి పేర్లతో రూపొందించిన వర్చువల్ అకౌంట్స్‌లోనే జమ చేసినట్లు చూపించేవాళ్లు. నిర్ణీత సమయం తర్వాత ఆ మొత్తం బ్యాంకు ఖాతాకు వచ్చి విత్‌డ్రా చేసుకునే అవకాశం వస్తుందని నమ్మించి భారీ మొత్తం డిపాజిట్ చేయించుకుని మోసం చేస్తూ పోయారు. దీని కోసం హైదరాబాద్, బెంగళూరు, కాన్పూర్, పుణేల్లోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌లో ఏడు డమ్మీ కంపెనీలు రిజిస్టర్ చేశారు. ఈ వ్యవహారంలో పెంగు గువాయితో పాటు మరో చైనీయుడు జాంగ్ హంగ్వాయి కీలకంగా వ్యవహరించాడు. ఈ ఏడాది జనవరి 20న పెంగు చైనాకు వెళ్లాడు. ఈ నేరగాళ్లు వేల మంది నుంచి రూ.కోట్లలో వసూలు చేశారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో ఉదయ్, నితీష్, రాజేష్‌లను అరెస్టు చేశారు. వీరి బారినపడిన వాళ్లు నగరంలోనూ ఉండటంతో ఇక్కడి పోలీసులూ దర్యాప్తు చేశారు. ఇన్స్పెక్టర్ బి.రమేష్ చేపట్టిన దర్యాప్తు నేపథ్యంలో తమకు వాంటెడ్‌గా ఉన్న వ్యక్తులు సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్లు తేలింది. దీంతో నాంపల్లి కోర్టు నుంచి పీటీ వారెంట్ తీసుకున్న సిటీ పోలీసులు గురువారం ఈ ముగ్గురినీ అరెస్టు చేశారు. ఇప్పటికే కలర్ ప్రిడెక్షన్ గేమ్, లోన్ యాప్స్ వ్యవహారాల్లో చైనీయులు పాత్ర ఉన్నట్లు స్పష్టమైంది. ఆయా కేసుల్లో ఐదుగురు చైనా జాతీయులు అరెస్టు కాగా.. పది మందికి పైగా పరారీలో ఉన్నారు. ఇప్పుడు తాజాగా షేర్డ్ బీకే స్కామ్ వెనుకా చైనీయుల పాత్రపై స్పష్టత వచ్చింది. పోలీసులకు పూర్తి ఆధారాలు చిక్కకూడదనే ఉద్దేశంతో ఈ నేరగాళ్లు అటు గూగుల్ ప్లేస్టోర్ ఇటు యాపిల్ స్టోర్ ఇలా ఏ ప్లాట్‌ఫామ్‌ను ఆశ్రయించకుండా కేవలం లింకుల్ని సోషల్ మీడియాలో విస్తరిస్తూ తమ పని చేసుకుపోయినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. చదవండి: చలసాని శ్రీనివాస్ కుమార్తె ఆత్మహత్య -
ఎట్టకేలకు ఒప్పుకున్నాడు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో భారీ బెట్టింగ్‌కు పాల్పడిన కలర్ ప్రిడెక్షన్ యాప్ కేసులో ప్రధాన నిందితుడైన చైనా జాతీయుడు యాన్ హూ ఎట్టకేలకు అసలు విషయం అంగీకరించాడు. ఇప్పటివరకు తనకు ఏమీ తెలియదని, తాత్కాలిక ప్రాతిపదికపై వచ్చి ఇరుక్కుపోయానని చెప్పుకొచ్చాడు. తాజాగా ఇతడిని న్యాయస్థానం అనుమతితో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్(ఈడీ) అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ కామర్స్ ముసుగులో ఆన్లైన్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నానని, అందుకోసమే ఢిల్లీలో మకాం పెట్టానని ఒప్పుకున్నాడు. కలర్ ప్రిడెక్షన్ కేసుకు సంబంధించిన యాన్ హూతోపాటు ఢిల్లీవాసులు అంకిత్, ధీరజ్‌లను హైద రాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆగస్టు 13న అరెస్టు చేసిన విషయం విదితమే. లోతుగా దర్యాప్తు చేసిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బీజింగ్ టుమారో పవర్ సంస్థకు చెందిన డమ్మీ కంపెనీల్లో ఒక దాని బ్యాంకు ఖాతాను ఇతడే నిర్వహిస్తున్నాడని, ఆ మేరకు బ్యాంకు ఖాతాదారుడి నుంచి ఆథరైజేషన్ కూడా తీసుకున్నాడని గుర్తించారు. యాన్ హూ ఫోన్ లోని చాటింగ్స్ ద్వారా అతడి పాత్రను నిర్ధారించారు. ఆ ఫోన్లోని వాట్సాప్‌లో డాకీ పే పేరుతో ఉన్న గ్రూప్ చాటింగ్స్‌లో యాన్ హూ ఆర్థిక లావాదేవీలు ఉండటంపై ఆధారాలు సేకరించారు. కలర్ ప్రిడెక్షన్‌పై సిటీసైబర్ క్రైమ్ ఠాణాలో రెండు, ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్లో ఒక కేసు నమోదయ్యాయి. రూ.9 లక్షలు నష్టపోయిన తలాబ్‌కట్టవాసి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్‌నగర్ ఠాణాలో మరో కేసు నమోదైంది. సైబర్‌క్రైమ్ పోలీసులిచ్చిన సమాచారం మేరకు ఈడీ మనీల్యాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు కోర్టు అనుమతితో యాన్ హూను కస్టడీలోకి తీసుకున్నారు. ఈలోపు బెట్టింగ్ వ్యవహారంలో అతడి పాత్రపై కీలక ఆధారాలు సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. ఈడీ కస్టడీలో ఉన్న యాన్ హూ ఎదుట వీటిని పెట్టి ప్రశ్నించారు. దీంతో అతడు అసలు విషయం బయటపెట్టక తప్పలేదు. అయితే తాను చైనాలోని సూత్రధారుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారమే పని చేశానంటూ చెప్పుకొచ్చాడు. వారు చెప్పినట్లే చేసేవాడినని, చెప్పిన ఖాతాల్లోకి డబ్బు బదిలీ చేస్తుండేవాడినని చెప్పాడు. కలర్ ప్రిడెక్షన్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురినీ ఈడీ అధికారులు మనీల్యాండరింగ్ కోణంలో విచారిస్తున్నారు. -
'వీరి ప్రేమ ముందు ఏ వైరస్ నిలబడలేదు'
బీజింగ్ : ప్రస్తుతం కోవిడ్-19 ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ చైనా దేశంలో ఇప్పటివరకు 1500 మంది పైగా వైరస్ బారిన పడి చనిపోగా, 65వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇలాంటి సమయంలో చైనాకు చెందిన 87 ఏళ్ల వ్యక్తి కోవిడ్ వైరస్ సోకిన తన భార్యకు సపర్యలు చేస్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఆ వృద్దుడు కూడా కోవిడ్ వైరస్ బారిన పడ్డాడు. వివరాలు.. కోవిడ్ వైరస్ బారిన పడినవారికి చైనా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి చికిత్సనందిస్తుంది. అయితే అందులోనే వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్న 87 ఏళ్ల వృద్ధుడు పక్క వార్డులో ఉన్న తన భార్య దగ్గరకెళ్లి ఒక చేత్తో సెలైన్ బాటిల్ పట్టుకొని మరో చేత్తో ఆహారం, నీళ్లు అందించాడు. తర్వాత ఆమె పక్కనే కూర్చుని కంటికి రెప్పలా చూసుకున్నాడు.(ఆరోగ్య శత్రువు కోవిడ్–19) ఇదంతా వీడియో తీసిన పీపుల్స్ డైలీ చైనా అనే సంస్థ తన ట్విటర్లో షేర్ చేసింది. 'మీ ప్రేమను చూస్తుంటే మాకు ముచ్చటేస్తుంది. 87 ఏళ్ల వ్యక్తి తన భార్య దగ్గరకెళ్లి ఆమెను జాగ్రత్తగా చూసుకోవడం ఆనందం కలిగించింది. కోవిడ్ లాంటి వైరస్లు ఎన్ని వచ్చినా వీరి ప్రేమను విడదీయలేవు. మీరిద్దరూ త్వరగా కోలుకోవాలని మేము కోరుకుంటున్నాం' అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. వీడియో చూసిన వారంతా 87 ఏళ్ల వ్యక్తి తన భార్యపై చూపిస్తున్న ప్రేమకు ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు. (కరోనా వైరస్: ఇదే చివరిసారి కలుసుకోవడం!) (కోవిడ్-19 ఎఫెక్ట్: ఓ కంపెనీ ఏం చేస్తోందంటే) I’ll love you forever, every single day of forever: An 87-yr-old man diagnosed with #COVID19 held an infusion bottle to visit his wife, also a #COVID19 patient, from the ward next door and patiently gave her water and food. Hope you recover soon! pic.twitter.com/LXH1AxINsU — People's Daily, China (@PDChina) February 12, 2020 -
చైనా దేశీయుడికి ఎన్నికల ఇక్కట్లు
పాములపాడు, న్యూస్‌లైన్: ఎన్నికల కోడ్‌తో చైనా దేశస్తుడు జిచెంగ్ కర్నూలు జిల్లాలో ఇబ్బందికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంలో రూ.3.50 లక్షల నగదు లభించడంతో సీజ్‌చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తరువాత ఆయన వివరాలు చెప్పడంతో వదిలేశారు. చైనాకు చెందిన జిచెంగ్ 15రోజుల కిందట మనదేశం వచ్చారు. ఆన్లైన్లో పరిచయమైన కర్నూలు వాసి జుల్ఫికర్ అలీ ఆహ్వానం మేరకు బుధవారం ఇన్నోవాలో స్నేహితులతో కలిసి వైఎస్ఆర్ స్మృతివనం సందర్శించేందుకు బయల్దేరారు. భానకచర్ల వద్ద పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా రూ.3.50 లక్షల నగదు లభించింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఆ నగదును సీజ్‌చేశారు. జిచెంగ్ పాస్‌పోర్టు, వీసా వివరాలను సీఐ రవిబాబు.. ఎస్పీ రఘురామిరెడ్డికి ఫ్యాక్స్ ద్వారా తెలిపారు. పూర్తి వివరాలుండడంతో అతడిని వదిలేశారు. జిచెంగ్ ఢిల్లీలో మార్బుల్స్ వ్యాపారం చేస్తున్నారని, మే నెల వరకు మన దేశంలో ఉండేందుకు వీసా ఉందని పోలీసులు తెలిపారు.