హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్ జిల్లాలో కలకలం చెలరేగింది. ఇక్కడి ఇండో-టిబెట్ సరిహద్దుకు సమీపంలో స్థానిక పోలీసులు ఒక చైనా పౌరుడిని అరెస్టు చేశారు. ఆ చైనా పౌరుడితో ఒక భారతీయ మహిళ కూడా ఉండటంతో ఆమెను కూడా కిన్నౌర్ పోలీసులు అరెస్టు చేశారు.
మీడియాకు అందిన సమాచారం ఈ ఘటన కిన్నౌర్ జిల్లా సుమ్డో పోలీసు చెక్ పోస్ట్ దగ్గర చోటుచేసుకుంది. ఇన్నర్ లైన్ పర్మిట్ లేకుండా ఆ చైనా పౌరుడు పోలీసులకు తారసపడ్డాడు. అతనితో పాటు ఉన్న మహిళ అతని భార్య అని, ఆమె మహారాష్ట్రకు చెందినదని పోలీసులు తెలిపారు. ఆ యువకుడిని 35 ఏళ్ల గుయో యుడాంగ్‌గా గుర్తించారు. అతను మహారాష్ట్రకు చెందిన ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి దగ్గరా వీసాతో సహా వారి వివాహ పత్రాలు ఉన్నాయి.
అయితే కిన్నౌర్ సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడానికి వారికి అంతర్జాతీయ ఇన్నర్ లైన్ అనుమతి లేదు. ఇన్నర్ లైన్ పర్మిట్ ఉల్లంఘనపై పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కిన్నౌర్ పోలీస్ డీఎస్పీ నవీన్ జల్తా ఈ విషయాన్ని ధృవీకరించారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశమని, అందుకే దీనిపై పెద్దగా ఏమీ చెప్పలేమని డీఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment