పాట్నా:బిహార్‌లోని ఓ జైలులో ఆత్మహత్యాయత్నం చేసిన చైనీయుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. చైనాలోని షాండాంగ్ ప్రావిన్సుకు చెందిన లీ జియాకీ సరైనా పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించాడు.
జూన్6వ తేదీన బ్రహ్మపురలోని లక్ష్మీచౌక్ వద్ద తిరుగుతుండగా సరైన వీసా పత్రాలు లేకపోవడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఫారనర్స్ యాక్ట్ కింద లీపై కేసు నమోదు చేశారు.
అరెస్టు సమయంలో లీ వద్ద చైనా మ్యాపు, మొబైల్ ఫోన్, చైనా, నేపాల్, ఇండియా కరెన్సీలు దొరికాయి. అరెస్టు తర్వాత లీని ముజఫర్‌పూర్ జైలుకు తరలించారు. జూన్7న జైలులో లీ ఆత్మహత్యాయత్నం చేశాడు.
తన కళ్లద్దాలను పగులగొట్టి గాజుతో శరీరాన్ని గాయపరుచుకున్నాడు. తీవ్ర రక్త స్రావంతో అపస్మారకస్థిలో జైలు గదిలోని బాత్‌రూమ్‌లో పడి ఉన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు లీని ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లీ మంగళవారం(జూన్11) మరణించాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment