increasing attacks targeting Chinese citizens in Pakistan: పాకిస్తాన్‌లోని చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో పౌరులు తమ భద్రతకై వారి కదలికలను ముందుగా ఇస్లామాబాద్ పోలీసులకు తెలియజేయలాని కోరినట్లు అధికారులు తెలిపారు. అంతేకాదు విదేశీయుల భద్రత కోసం ఇస్లామాబాద్ పోలీసుల ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ ఫారిన్ సెక్యూరిటీ సెల్ పనితీరును సమీక్షించేందుకే నిర్ణయించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
ఇస్లామాబాద్‌లో సుమారు వెయ్యి మంది చైనా పౌరులు ఉన్నారు. అంతేకాదు వీళ్లంతా వివిధ కంపెనీలు, వ్యాపారాలకు సంబంధించిన దాదాపు 36 ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని సర్వే తెలిపింది. బహుళ మిలియన్ డాలర్ల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) ప్రాజెక్టులకు సంబంధించిన చైనీయులకు పారామెలటరీ దళాలు, భద్రతా దళాలు రక్షణ కల్పిస్తున్నాయని అధికారులు తెలిపారు.
పోలీసు స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలు, సెక్యూరిటీ డివిజన్ లేదా పెట్రోలింగ్ యూనిట్ సుమారు వెయ్యి మందికి పైగా చైనా పౌరుల కదలిక సమయంలో భద్రత కల్పించాలని సమావేశంలో నిర్ణయించామని చెప్పారు. వారి కదలికల వివరాలను సేకరించే బాధ్యత కూడా ఎస్‌హెచ్‌ఓలకు అప్పగించామని అధికారులు తెలిపారు. చైనా పౌరుల నివాసాలతో పాటు వారి ఇళ్లకు వెళ్లే మార్గాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు సేఫ్ సిటీ పోలీస్ ఫెసిలిటేషన్‌లో ఒక డెస్క్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దేశంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో ఈ అధికారులు ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదీగాక ఈ ఏడాది ఏప్రిల్ 26న కరాచీ యూనివర్సిటీలోని కన్‌ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ షటిల్ వ్యాన్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ)కి చెందిన మహిళ ఆత్మాహుతి బాంబర్ జరిపిన దాడిలో ముగ్గురు చైనా టీచర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. పైగా వేర్పాటువాద పాకిస్తాన్‌లోని బులిచిస్తాన్ ప్రావిన్స్‌లో స్థానికులు చైనా పెట్టుబడులను వ్యతిరేకిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment