ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పాక్‌లో ఉన్న చైనా ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. కాగా, ఈ ఘటనలో చైనా ఇంజినీర్లు చనిపోయినట్టు.. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు సమాచారం. ఇక, దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను వారు మట్టుబెట్టారు.
వివరాల ప్రకారం.. బలూచిస్తాన్‌లోని గ్వాదర్ వద్ద చైనాకు చెందిన ఇంజినీర్ల వాహనాలపై ఉగ్రదాడి జరిగింది. స్థానికంగా ఉన్న ఫకీర్ కాలనీ వంతెనపైకి చైనా ఇంజినీర్లకు చెందిన ఏడు వాహనాలు చేరుకోగానే రెబల్స్ కాల్పులు జరిపారు. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ పేరిట ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక, ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక చైనా ఇంజినీర్లు చనిపోయినట్టు తెలుస్తోంది. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
7 vehicles of Chinese engineers came under intense attack in Gwadar, #Balochistan
— Eternal Optimist (@etoptimist) August 13, 2023
According to local media, several Chinese engineers have been killed.
This is an earlier video of Baloch fighters warning #China https://t.co/BhC5NZu1E0 pic.twitter.com/UKuG4itS1R
చైనా అలర్ట్..
మరోవైపు.. చైనా భద్రతా సిబ్బంది ఎదురు దాడిలో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందారు. ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ స్వాతంత్ర్య దినోత్సవం ముందురోజు(ఆగస్టు 14)న ఉగ్రవాదుల దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దాడితో పాక్‌లో ఉన్న చైనా దౌత్యకార్యాలయం అప్రమత్తమైపోయింది. పాక్‌లోని బలూచిస్తాన్, సింధ్ ప్రావిన్స్‌ల్లోని చైనీయులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండిపోవాలని సూచించింది. కాగా, ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో చైనీయులపై దాడులు ఎక్కువయ్యాయి. గ్వాదర్ పోర్టుపై చైనా పెత్తనం చేయడంతో స్థానికులు కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు జరగడం గమనార్హం.
ఇది కూడా చదవండి: దేవాలయంపై దాడి.. గోడలపై ఖలిస్థానీల నినాదాలు..
Comments
Please login to add a commentAdd a comment