యాపిల్ కంపెనీ 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) కార్యక్రమాన్ని సోమవారం (జూన్ 10) ప్రారంభించనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఈసారి కూడా లేటెస్ట్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. రాబోయే ఉత్పత్తులకు సంబంధించి కొత్త ప్రకటనలను కూడా చేసే అవకాశం ఉంది.
యాపిల్ కంపెనీ నిర్వహించనున్న డబ్ల్యుడబ్ల్యుడీసీ కార్యక్రంలో ఏఐ అప్‌డేట్‌లను, సిరి 2.0 పేరుతో లేటెస్ట్ ఫీచర్స్ పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ సిరి 2.0 మీద ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది. దీంతో కంపెనీ కొత్త ఫీచర్స్ ఆవిష్కరించనున్నట్లు సమాచారం.
యాపిల్ సిరి 2.0 కింద.. బుక్, కెమెరా, కీనోట్, మెయిల్, నోట్స్, ఫోటోస్, రిమైండర్‌లు, సఫారీ, స్టాక్స్, వాయిస్ మెమోస్, సిస్టమ్ సెట్టింగ్స్, ఫ్రీఫార్మ్ అండ్ ఫైల్స్, కాంటాక్ట్ అండ్ మాగ్నిఫైయర్ ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఇవన్నీ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సిరి 2.0 కింద మాత్రమే కాకుండా.. అప్‌డేటెడ్ ఐఓఎస్ 18 అప్లికేషన్‌లకు పరిచయం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment