Apple Siri 2.0
-
ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్..?
సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రాబోతున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. ముందుగా మార్చి 2025 వరకు దీన్ని యాపిల్ ఉత్పత్తుల్లో తీసుకురావాలని సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది. కానీ బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం సంస్థ గతంలో అనుకున్న సమయం కంటే ముందుగానే యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది.ఐఓఎస్ 18 సిరీస్‌లో యాపిల్ ఇంటెలిజన్స్ ద్వారా ‘సిరి’లో కొన్ని ఫీచర్లను అప్డేట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా మార్చి 2025 నాటికి ఐఓఎస్ 18.4 వెర్షన్లో సమగ్ర యాపిల్ ఇంటెలిజన్స్ సూట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. కానీ అంతకుముందే ఈ ఫీచర్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిసింది. సంస్థ గతంలో ప్రకటించిన విధంగా ఐఓఎస్ 18 సిరీస్ వర్షన్లను ఎప్పుడు అప్డేట్ చేస్తారో తెలిపారు.అక్టోబర్ 2024: ఐఓఎస్ 18.1 ఏఐ ఫీచర్లు ప్రారంభిస్తారు.డిసెంబర్ 2024: ఐఓఎస్ 18.2తో కొన్ని అదనపు ఫీచర్లు ప్రవేశపెడుతారు.జనవరి 2025: ఐఓఎస్ 18.3తో ‘సిరి’ని మరింత మెరుగుపరుస్తారు.మార్చి 2025: ఐఓఎస్ 18.4తో సమగ్ర యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ప్రవేశపెడుతారు.బ్లూమ్‌బర్గ్ నివేదించిన ప్రకారంగా ముందుగానే యాపిల్ ఇంటిలిజెన్స్ సూట్‌ను ఆవిష్కరిస్తే పైన తెలిపిన ఐఓఎస్ వర్షన్ల విడుదల తేదీల్లో మార్పులుండే అవకాశం ఉంటుంది.ఇదీ చదవండి: కొత్తగా ఉద్యోగంలో చేరారా..? ఇవి తెలుసుకోండి..యాపిల్ ఇంటెలిజన్స్ ‘సిరి’లో గణనీయ మార్పులు చేయబోతున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా సిరి సందర్భోచితంగా వినియోగదారుల అవసరాలు తీర్చనుంది. ఉదాహరణకు మీ స్నేహితుడు మొబైల్లో మీకు తన కొత్త చిరునామాను పంపితే ‘ఈ చిరునామాను తన కాంటాక్ట్ కార్డ్‌కు యాడ్ చేయమని’ చెబితే సిరి ఆ పని పూర్తి చేస్తుంది. సుదీర్ఘ ఈమెయిళ్లు చదవడం సమయంతో కూడుకున్న వ్యవహారం. సిరి సాయంతో దాని సారాంశాన్ని తెలుసుకోవచ్చు. అందుకు అనుగుణంగా రిప్లై ఇవ్వొచ్చు. వీటితోపాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ అధికారికంగా ప్రకటించిన తర్వాతే కంపెనీ అందించే ఫీచర్లపై స్పష్టత వస్తుంది. -
Apple WWDC 2024: సిరి 2.0 వస్తోంది.. కొత్త ఫీచర్స్ ఇవే!
యాపిల్ కంపెనీ 'వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024' (WWDC 2024) కార్యక్రమాన్ని సోమవారం (జూన్ 10) ప్రారంభించనుంది. ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను, టెక్నాలజీలను పరిచయం చేసే యాపిల్ ఈసారి కూడా లేటెస్ట్ ఉత్పత్తులను ఆవిష్కరిస్తుంది. రాబోయే ఉత్పత్తులకు సంబంధించి కొత్త ప్రకటనలను కూడా చేసే అవకాశం ఉంది.యాపిల్ కంపెనీ నిర్వహించనున్న డబ్ల్యుడబ్ల్యుడీసీ కార్యక్రంలో ఏఐ అప్డేట్లను, సిరి 2.0 పేరుతో లేటెస్ట్ ఫీచర్స్ పరిచయం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కంపెనీ సిరి 2.0 మీద ప్రత్యేకంగా ద్రుష్టి సారించింది. దీంతో కంపెనీ కొత్త ఫీచర్స్ ఆవిష్కరించనున్నట్లు సమాచారం.యాపిల్ సిరి 2.0 కింద.. బుక్, కెమెరా, కీనోట్, మెయిల్, నోట్స్, ఫోటోస్, రిమైండర్లు, సఫారీ, స్టాక్స్, వాయిస్ మెమోస్, సిస్టమ్ సెట్టింగ్స్, ఫ్రీఫార్మ్ అండ్ ఫైల్స్, కాంటాక్ట్ అండ్ మాగ్నిఫైయర్ ఫీచర్లను పరిచయం చేస్తుంది. ఇవన్నీ వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సిరి 2.0 కింద మాత్రమే కాకుండా.. అప్డేటెడ్ ఐఓఎస్ 18 అప్లికేషన్లకు పరిచయం చేయనుంది.