సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సామగ్రి ఉత్పత్తి సంస్థ అపర్ణా ఎంటర్‌ప్రైజెస్ యూపీవీసీ బ్రాండ్ అపర్ణా వెన్‌స్టర్ తాజాగా మార్కెట్లోకి పక్కకు జరిపే (స్లైడింగ్), మడతపెట్టే (ఫోల్డింగ్) యూపీవీసీ తలుపులను ప్రవేశపెట్టింది. స్లైడ్, ఫోల్డింగ్ కారణంగా 90 శాతం వరకు గాలి, కాంతి ఇంట్లోకి ప్రవేశిస్తాయని కంపెనీ తెలిపింది.
‘‘అదనపు బలాన్ని అందించేందుకు మల్టీ చాంబర్ సెక్షన్స్, వర్షపు నీటి ప్రవాహం కోసం రెయిన్ ట్రాక్, మృదువైన కదలికల కోసం నైలాన్ రోలర్లు ఏర్పాటు వంటివి వీటి ప్రత్యేకతలను యూపీవీసీ విభాగం సీఈఓ మహేశ్ చౌదరి తెలిపారు. వీటికి చెదలు, తుప్పు పట్టవని, అన్ని రకాల రంగులు, సైజ్‌లలో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. నెలకు 3 లక్షల చ.అ. యూపీవీసీ తలుపులు, కిటికీలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటివరకు 14 లక్షల యూపీవీసీ ఉత్పత్తులను సరఫరా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment