Folding
-
మడత పెట్టుకునేలా.. ఎలక్ట్రిక్ బైక్‌లు వచ్చేస్తున్నాయ్
-
వరల్ఢ్లోనే తొలి ఫోల్డ్ ల్యాపీ, ప్రీబుకింగ్‌పై అదిరిపోయే ఆఫర్
సాక్షి, ముంబై: ఇండియాలో ల్యాప్‌టాప్ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్న ఆసుస్ తాజాగా ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. హై బ్రిడ్ ల్యాపీలతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తున్న ఆసుస్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ఓలెడ్’ ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ అని చెబుతున్న కంపెనీ దీని ధరను రూ. 3,29, 990గా నిర్ణయించింది. ల్యాప్‌టాప్ కోసం ప్రీబుకింగ్స్‌ను కూడా షురూ చేసింది. ప్రీ-బుకింగ్ ఆఫర్ ప్రీ-బుకింగ్ చేసిన వారికి ఏకంగా 55 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ల్యాప్‌టాప్ రూ.2,84,290 కే లభిస్తుంది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ బుకింగ్‌కు అవకాశం ఉంది. జెన్‌బుక్ 17 ఫోల్డ్ నవంబర్ 10న విడుదల కానుంది ఆసుస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో ఇతర రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 4.8 అంగుళాల స్క్రీన్‌ను వర్చువల్ కీ బోర్డు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సాధారణ కీ బోర్డు ద్వారా యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ట్యాబ్, డిస్ప్లేలా వాడుకోవచ్చు. ఈ కొత్త లాపీలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్టెండెడ్ అనే ఐదు స్క్రీన్ మోడ్స్ ఉండటం మరో విశేషం. అంతేకాదు మల్టీ స్క్రీన్ ఫీచర్‌తో డిస్ప్లేని ఒకేసారి మూడు స్క్రీన్లుగా వాడుకోవచ్చు. కేవలం నలుపు రంగులో మాత్రమే వచ్చిన ఈ ల్యాపీలో 500 జీబీ ఎస్ఎస్డీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉచితం. 65W AC ఫాస్ట్ ఛార్జర్ మద్దతుతో 75 WHrs బ్యాటరీ సగటు వినియోగం 10 గంటలు. ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ల్యాపీ స్పెసిఫికేషన్స్ 17.3 అంగుళాల థండర్‌బోల్ట్ 4k డిస్ప్లే 12.5 అంగుళాల ఫోల్డ్ స్క్రీన్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్ కార్డ్ 5 ఎంపీ ఏఐ కెమెరా డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్స్ నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్ -
అమ్మ బాబోయ్!.. రెండు భుజాలు ఒక్క చోటుకు.. అదెలా సాధ్యం?
యూకేకు చెందిన డ్యానియల్లె అనే మహిళ తనకున్న ప్రత్యేక ‘ప్రతిభ’తో ప్రజలను అవాక్కు చేస్తోంది. ఎముకలు, పుర్రె, పళ్ల ఎదుగుదలపై ప్రభావం చూపే క్లీడోక్రేనియల్ డిస్ప్లేసియా (సీసీడీ) అనే అరుదైన జన్యు సంబంధ పరిస్థితితో పుట్టిన డ్యానియల్లే.. తనకున్న లోపాన్నే అవకాశంగా మార్చుకుంది. సాధారణ శరీరాకృతితో పుట్టిన మనుషులకు సాధ్యంకాని రీతిలో విన్యాసాలు చేసి చూపుతూ అందరి మన్ననలు పొందుతోంది. ఇంతకీ ఆమె చేస్తున్న ఆ విన్యాసాలు ఏమిటో తెలుసా? తన రెండు భుజాలను పరస్పరం తాకేలా చేయడమే! అంటే చేతులను లోపలకు ముడుస్తూ మొండేన్ని నిలువుగా రెండు భాగాలుగా కలిపిందన్నమాట!! ఇదెలా సాధ్యమైందని ఆశ్చర్యపోతున్నారా? తన రెండు భుజాల వద్ద ఎముకలు (కాలర్ బోన్స్) లేకపోవడం వల్లే తాను ఈ ట్రిక్‌ను చేయగలుగుతున్నట్లు డ్యానియల్లే తెలిపింది. ప్రతి 10 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఈ తరహా జన్యు లోపం ఉంటుందని.. అలాంటి అదృష్టం తనకు లభించిందని గర్వంగా చెబుతోంది డ్యానియల్లే. తన ‘ట్రిక్’లను నెటిజన్లకు చూపుతూ వారి మన్ననలు పొందుతోంది. చదవండి: ‘నోరె’ళ్లబెట్టే రికార్డు! 4 మెక్‌డొనాల్డ్స్ చీస్ బర్గర్లను అవలీలగా.. -
వరల్డ్‌లో తొలి, ఏకైక అద్భుత టీవీ: మరి ధర సంగతేంటి?
హైదరాబాద్: ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్జీ ప్రపంచంలోనే తొలి, ఏకైక రోలబుల్ టీవీని లాంచ్ చేసింది. ఎల్జీ సిగ్నేచర్ ఓలెడ్-ఆర్ టీవీతో హైదరాబాద్ మార్కెట్లో అడుగు పెట్టింది. భవిష్యత్తులో డిస్ప్లే టెక్నాలజీలో ఇదొక ముందడుగని లాంచింగ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అంతేకాదు హోమ్ ఎంటర్టైన్మెంట్ విభాగంలో విప్లవాత్మకమైన టీవీ ఇది అని ఎల్జీ ప్రకటించింది. కస్టమర్లకు ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని అందించే డాల్బీతో టెక్నాలజీతో, 42 అంగుళాల నుంచి 97 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో లాంచ్ చేసింది. ఇది లగ్జరీ టీవీ. అవసరం లేనపుడు ఈ టీవీని బాక్స్‌లో మడిచి పెట్టేయొచ్చు అని ఎల్జి ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ గిరీశన్ గోపి చెప్పారు. భారతదేశం అంతటా కనీసం వెయ్యి టీవీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రోలబుల్ టీవీ ప్రత్యేకత అంతర్జాతీయంగా ముఖ్య ఆవిష్కరణల్లో ఇది ఒకటి. ఆన్ చేయగానే వెడల్పాటి సౌండ్ సిస్టమ్ నుంచి 65 అంగుళాల టీవీ వెలుపలికి వస్తుంది. ఆఫ్ చేయగానే దానంతట అదే చుట్టుకుంటూ పెట్టెలోకి వెళ్లిపోతుంది. సెల్ఫ్-లైట్ పిక్సెల్ టెక్నాలజీ కారణంగా ఇలా వీలవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. -
డుగ్గు.. డుగ్గు.. మాబాగా మడతడిపోద్ది! పార్కింగ్ అక్కరలేదోచ్ ..
ICOMA's folding electric motorbike: ఈ ఫొటోలో కనిపిస్తున్నది సరికొత్త ఎలక్ట్రిక్ మోటారుసైకిల్. జపాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్టప్ సంస్థ ‘ఇకోమా’కు చెందిన డిజైనర్లు మరో వాహన తయారీ సంస్థ ‘టాటామెల్’తో కలసి దీనికి రూపకల్పన చేశారు. ఒక మనిషి సునాయాసంగా ప్రయాణించేందుకు వీలుగా తయారు చేసిన ఈ–బైక్, గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో అసలు ప్రత్యేకతేమిటంటే, దీనికోసం ప్రత్యేకంగా పార్కింగ్ స్థలమేదీ అవసరం ఉండదు. దీనిని శుభ్రంగా మడతపెట్టి, ఆఫీసులో టేబుల్ కింద పెట్టేసుకోవచ్చు. మడతపెట్టే వాహనాలు కొన్ని ఇప్పటికే తయారయ్యాయి గాని, అవేవీ ఇంత చక్కగా ఆఫీసు టేబుల్ కింద పట్టేంత సౌలభ్యం కలిగినవి కావు. దీని ధర ఇంకా ప్రకటించలేదు. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! -
అపర్ణా వెన్‌స్టర్ నుంచి కొత్త ఉత్పత్తులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సామగ్రి ఉత్పత్తి సంస్థ అపర్ణా ఎంటర్ప్రైజెస్ యూపీవీసీ బ్రాండ్ అపర్ణా వెన్‌స్టర్ తాజాగా మార్కెట్లోకి పక్కకు జరిపే (స్లైడింగ్), మడతపెట్టే (ఫోల్డింగ్) యూపీవీసీ తలుపులను ప్రవేశపెట్టింది. స్లైడ్, ఫోల్డింగ్ కారణంగా 90 శాతం వరకు గాలి, కాంతి ఇంట్లోకి ప్రవేశిస్తాయని కంపెనీ తెలిపింది. ‘‘అదనపు బలాన్ని అందించేందుకు మల్టీ చాంబర్ సెక్షన్స్, వర్షపు నీటి ప్రవాహం కోసం రెయిన్ ట్రాక్, మృదువైన కదలికల కోసం నైలాన్ రోలర్లు ఏర్పాటు వంటివి వీటి ప్రత్యేకతలను యూపీవీసీ విభాగం సీఈఓ మహేశ్ చౌదరి తెలిపారు. వీటికి చెదలు, తుప్పు పట్టవని, అన్ని రకాల రంగులు, సైజ్‌లలో లభ్యమవుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. నెలకు 3 లక్షల చ.అ. యూపీవీసీ తలుపులు, కిటికీలను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పటివరకు 14 లక్షల యూపీవీసీ ఉత్పత్తులను సరఫరా చేసింది. -
మడతపెట్టే టీవీ ఇదిగో...
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ చుట్టేసే టీవీని లాంచ్ చేసింది. మడతపెట్టగలిగే 65 అంగుళాల 4కే సిగ్నేచర్ ఓఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. 2019, జనవరి 8నుంచి 11వరకు లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో భాగంగా ఈ టీవీని ఎల్జీ పరిచయం చేసింది. ఈ ఏడాదిలోనే ఈటీవీ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. రోల్-అప్ మోడల్ కొత్త ఓఎల్ఈడీ 65 అంగుళాల (165 సెంటీమీటర్) టీవీ ఆర్ ని ఆవిష్కరించింది. ఈ టీవీని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడంతోపాటు అవసరం లేనపుడు చుట్టుకునే విధంగా 65 అంగుళాల తెరను ఎల్జీ రూపొందించింది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్టు తోపాటు 100 వాల్ట్స్ డాల్బీ అట్మాస్ స్పీకర్ డా దీని ప్రత్యేకతగా ఉందని సీనియర్ డైరెక్టర్ డైరెక్టరి టిమ్ అలెస్సీ చెప్పారు. అలాగే తన మొట్టమొదటి సూపర్-హై-డెఫినేషన్ 88 అంగుళాల 8కె ఓఎల్ఈడీ టీవీని కూడా ఈ సందర్భంగా తీసుకురావడం విశేషం. దశాబ్దాల క్రితంనుంచి ఎదురుచూస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని మార్కెటింగ్ ఎల్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వండర్ వాల్ ఓఎల్ఈడీ ఆర్ టీవీ పరిచయం సందర్బంగా చెప్పారు. అయితే దీని ధరను ఇంకా రివీల్ చేయలేదు. -
మడతేసుకునే బ్యాటరీలు వస్తున్నాయి...
మడత పెట్టేయగల టెలివిజన్లను ఈ నెలలోనే చూశాం. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు ఇదే దారి పట్టనున్నాయి. ఎందుకంటే కొలంబియా ఇంజనీరింగ్‌కు చెందిన యువాన్ యాంగ్ అనే శాస్త్రవేత్త ఎటు కావాలంటే అటు వంచగలిగే లిథియం అయాన్ బ్యాటరీలను సిద్ధం చేశారు. మనిషి వెన్నెముక నిర్మాణం స్ఫూర్తిగా తయారైన ఈ కొత్త బ్యాటరీలు తక్కువ స్థలంలోనే ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకోగలవని యాంగ్ అంటున్నారు. వెన్నెముకలోని కీళ్ల మాదిరిగా అవసరాన్ని బట్టి సామర్థ్యం పెంచుకోవచ్చు కూడా అని యాంగ్ తెలిపారు. సంప్రదాయ బ్యాటరీల్లో వాడే ఆనోడ్, సెపరేటర్, క్యాథోడ్/సెపరేటర్లను పొడవైన పట్టీల్లా చేయడం... పొడవైన ఆధారంపై వీటిని వెన్నెముక కీళ్లమాదిరిగా ఏర్పాటుచేయడం ఈ కొత్త బ్యాటరీ ప్రత్యేకతలు. ఈ నిర్మాణం కారణంగా బ్యాటరీలను అడ్డంగా ఒంపేసేందుకు వీలేర్పడింది. విద్యుత్తును నిల్వ చేసుకునే భాగాలు విడివిడిగా ఉండటం వల్ల సామర్థ్యం పెరిగింది. వోల్టేజీ హెచ్చుతగ్గులను తట్టుకోవడమే కాకుండా పలుమార్లు చార్జింగ్, డిస్చార్జింగ్ చేసినా సామర్థ్యం తగ్గలేదని యాంగ్ వివరించారు. -
వింతై వింతింతై ఈ ప్రపంచంలో కుఛ్ కుఛ్ హోతా హై
మడతడిపోతాడంతే! అగ్గిపెట్టెలో ఇమిడే చీరలు మనకు తెలుసు. మరి సూట్‌కేస్‌లో పట్టే సజీవ శరీరాన్ని చూశారా? చాన్సే లేదంటారా? అయితే ఇది చదవండి. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి సూట్‌కేస్‌లో కూడా దూరి తనకు తానే మడతడిపోతాడంతే! ఈ అమెరికన్ కుర్రోడి పేరు జార్జ్ ఇవాన్ లెటోర్ రోబెల్స్. ఎలాగంటే అలా మడతడిపోవడం, చర్మాన్ని ఎలాస్టిక్‌లా సాగదీయడం ఇతగాడి స్పెషాలిటీలు. అంతేకాదు, కీళ్లనూ స్థానభ్రంశం చేయించగలడు. కనుగుడ్లు బయటకు పొడుచుకొచ్చేలా చేసి, మళ్లీ వెనక్కు తీసుకోగలడు. ఇదివరకు ఏ ఉద్యోగం చేసేవాడో గానీ, ఇప్పుడు మాత్రం ఈ ఫీట్లే ఇతగాడికి భేషైన స్వయం ఉపాధిగా మారాయి. ప్రపంచమంతా చుట్టేస్తూ ఈ ఫీట్లను ప్రదర్శిస్తున్నాడు. ఈ ఫీట్లతోనే ‘వరల్డ్స్ స్ట్రెచియస్ట్ మ్యాన్’గా గుర్తింపు పొందాడు. ఇతగాడి చర్మం ఎలాస్టిక్‌లా సాగిపోవడానికి కారణం ‘ఎహ్లర్స్ డాన్లాస్ సిండ్రోమ్’ అని, అది ఇవాన్‌కి పుట్టుకతోనే ఉందని వైద్యులు చెప్తున్నారు. భౌ భౌ... డాంకీ... కుక్క పని కుక్క చేయాలి.. గాడిద పని గాడిద చేయాలంటారు. ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్‌లో ఉండే కాల్, టామ్ దంపతులు జంతుప్రేమికులు. ఇంట్లో కుక్క, నక్క, పిల్లి, తోడేలు వంటి జంతువులను పెంచుకుంటున్నారు. కాల్ 50వ పుట్టిన రోజుకి ఈ గాడిద గిఫ్ట్‌గా వచ్చింది. అప్పుడు దాని వయసు ఎనిమిది నెలలు. గాడిద కన్నా అది కుక్కలాగే ప్రవర్తిస్తుండటంతో దీనికి డాగీ అని పేరుపెట్టారు. ‘డాగీ ఒంటరిగా ఉండడానికి అస్సలు ఇష్టపడదు. రోజూ ఉదయం టామ్‌తో పాటు ఆఫీస్‌కి వెళ్తుంది. టామ్ రాసుకుంటూ ఉంటే అది టీవీలో స్పోర్ట్స్ చూస్తుంది. టెన్నిస్ అంటే చచ్చేంత ఇష్టం. ఇతర జంతువులతో కలివిడిగా ఉంటుంది. ఏ జంతువుతోనైనా ఇట్టే స్నేహం చేస్తుంది. రెండుపూటలా జాగింగ్‌కి వెళ్తుంది. తెలిసిన వాళ్లు ఇంటికొస్తే తోక ఆడించుకుంటూ వాళ్ల చుట్టూ తిరుగుతుంది’ అంటూ డాగీ గురించి మురిపెంగా వర్ణిస్తుంది కాల్. పచ్చనితోటలో పసుప్పచ్చని అడవిపూల పందిరి కింద దీనికి ఒక షెడ్ కట్టి అపురూపంగా చూసుకుంటోంది ఈ జంట. షెడ్ నుంచి నేరుగా ఇంట్లోకి రావడానికి ప్రత్యేకమైన దారి కూడా ఏర్పాటు చేశారు. అయితే డాగీ క్లోజ్‌గా ఉండే గ్రిఫ్ అనే తోడేలుకి డాగీ అంటే చచ్చేంత అసూయట. డాగీని కాల్, టామ్లు ముద్దు చేస్తుంటే మూతి ముప్పై వంకర్లు తిప్పుకుంటుందట. డాగీ రాజభోగానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుంది! గ్రాండ్ బ్యాండ్ ఓల్డ్ ఈజ్ ట్రెండీ. ఏజ్ ఈజ్ ఓన్లీ అ నంబర్. ముదిమి మురిపాన్ని పంచే రెండో బాల్యం అని గ్రహించి ఆడిపాడి చిందులేస్తున్నారు జపాన్‌లో 80 పైబడ్డ బామ్మలు. ‘ఓఆఎ84’ అనే పేరుతో ఓ మ్యూజిక్ బ్యాండ్నీ క్రియేట్ చేసుకున్నారు. ఈ గ్రూప్‌లోని 33 మంది బామ్మల వయసు 84 ప్లస్. ఈ గ్రూప్‌లో అత్యధిక వయసున్న బామ్మ యమాషిరోకి 97 ఏళ్లు. జపాన్ అంతటా ఈ గ్రానీస్కి గ్రాండ్ వెల్కమే. ‘ఏదో చేయాలనే తపన, కొత్తతేదో నేర్చుకోవాలనే ఆరాటం, అనుక్షణం ఆనందం అనుభవిస్తూ దాన్ని ఇతరులకూ పంచాలనే మా తాపత్రయం.. యంగ్స్టర్స్కీ ఆదర్శం’ అంటారు వీళ్లు. బామ్మలు ప్రదర్శనల కోసం ఎక్కడికి వెళ్లినా ముందు జాగ్రత్తగా బ్యాక్‌స్టేజ్‌లో బీపీ మానిటర్స్, డిఫిబ్రిలేటర్స్ (సినిమాల్లో చూసే ఉంటారు.. గుండె ఆగిపోతే షాక్ తో గుండెకు స్పందననిచ్చే పరికరం) వంటివీ రెడీగా పెట్టుకుంటారట. ఈ గ్రానీస్కి జపాన్‌లోని సినిమా స్టార్స్కున్నంత ఫాలోయింగ్ ఉందట. వీళ్లక్కెడకి వెళ్లినా కెమెరాలు ఫాలో అవుతుంటాయట. ‘అందరం కూర్చోని టీ తాగుతూ గాసిప్ మాట్లాడుకోవడమంటే మాకు చాలా ఇష్టం. మా చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్లమో ఇప్పుడూ అలాగే ఉంటున్నాం. ఒక్కరి కోసం అందరం, అందరి కోసం ఒక్కరం.. మేమంతా ఒక్కటి అన్న భావనతో ఉంటాం’ అంటారు బామ్మలు. కొసమెరుపు: ఈ బామ్మల్లా ఉండాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ జన్మలో ట్రై చేసుకోండి. ఒకినవాలో పుట్టండి. అక్కడున్న వాళ్ల ఆయుఃప్రమాణం ప్రపంచంలోనే ఎక్కువ. కీర్తిశేషుడు లాల్ బిహారీ చచ్చిపోయిన వాళ్లపేరు మీద రేషన్ కార్డ్ మంజూరు చేయడం, బతికి ఉన్న వాళ్లు చచ్చిపోయినట్టుగా ఓటర్ కార్డ్ క్యాన్సల్ అవడం మన దేశంలో చల్తా హై! దీనికి లాల్ బిహారీ మంచి ఉదాహరణ.ఎవరీయన? ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేథీ ఆయన సొంతూరు. 1955లో పుట్టాడు. 1975 ప్రభుత్వ లెక్కల్లో చనిపోయాడు. ఎలా?: లాల్ బిహారీ తాతముత్తాతల నాటి పొలం కోసం ఆయన బంధువు ఒకాయన ప్రభుత్వ అధికారులకు లంచిమిచ్చి లాల్‌బిహారీ మరణించినట్టుగా ప్రభుత్వలెక్కల్లో నమోదు చేయించాడు. విషయం తెలిసినప్పటి నుంచి ‘నేను చావలేదు.. బతికే ఉన్నాను మొర్రో’ అంటూ అధికారగణంతో యుద్ధమే చేశాడు. నో సక్సెస్. తర్వాత?: ముల్లును ముల్లుతోనే తీయాలని గ్రహించిన బిహారీ తనకు తాను ఉత్తుత్తి అంత్యక్రియలు జరిపించుకొని అవి రికార్డుల్లో నమోదు చేయించి తన భార్యచేత వితంతు పరిహారానికి దరఖాస్తు చేయించాడు. అంతేకాదు తన పేరు వెనక మృతిక్ (అంటే కీర్తిశేషులు) అని తగిలించుకొని 1989 ఎన్నికలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీకి పోటీగా నిలబడ్డాడు. ఈ పోరాటానికి ఫలితం ‘లాల్ బిహారీ మరణించలేదు.. బతికే ఉన్నాడు’ అంటూ అధికారులు ప్రభుత్వ రికార్డులను మార్చారు.