
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్‌జీ చుట్టేసే టీవీని లాంచ్ చేసింది. మడతపెట్టగలిగే 65 అంగుళాల 4కే సిగ్నేచర్ ఓఎల్‌ఈడీ టీవీని లాంచ్ చేసింది. 2019, జనవరి 8నుంచి 11వరకు లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో భాగంగా ఈ టీవీని ఎల్‌జీ పరిచయం చేసింది. ఈ ఏడాదిలోనే ఈటీవీ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.
రోల్-అప్ మోడల్ కొత్త ఓఎల్‌ఈడీ 65 అంగుళాల (165 సెంటీమీటర్) టీవీ ఆర్ ని ఆవిష్కరించింది. ఈ టీవీని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడంతోపాటు అవసరం లేనపుడు చుట్టుకునే విధంగా 65 అంగుళాల తెరను ఎల్‌జీ రూపొందించింది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్టు తోపాటు 100 వాల్ట్స్ డాల్బీ అట్మాస్ స్పీకర్ డా దీని ప్రత్యేకతగా ఉందని సీనియర్ డైరెక్టర్ డైరెక్టరి టిమ్ అలెస్సీ చెప్పారు. అలాగే తన మొట్టమొదటి సూపర్-హై-డెఫినేషన్ 88 అంగుళాల 8కె ఓఎల్‌ఈడీ టీవీని కూడా ఈ సందర్భంగా తీసుకురావడం విశేషం.
దశాబ్దాల క్రితంనుంచి ఎదురుచూస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని మార్కెటింగ్ ఎల్‌జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వండర్ వాల్ ఓఎల్‌ఈడీ ఆర్ టీవీ పరిచయం సందర్బంగా చెప్పారు. అయితే దీని ధరను ఇంకా రివీల్ చేయలేదు.






Comments
Please login to add a commentAdd a comment