OLED display
-
గుడ్ న్యూస్.. అదే జరిగితే ఫోన్ రేట్లు తగ్గడం ఖాయం!
సాధారణంగా స్మార్ట్ ఫోన్ తయారీలో డిస్ప్లే, కొన్ని ప్యానెల్స్ క్వాలిటీ విషయంలో ఫోన్ మేకర్లు కాంప్రమైజ్ అవ్వరు. ఇండియమ్ అనే అరుదైన ఎలిమెంట్‌ను ఇందుకోసం ఉపయోగిస్తుంటారు. ఇది చాలా కాస్ట్లీ వ్యవహారం. అయితే ఇండియమ్ ప్లేస్‌లో మరో మెటీరియల్‌ను తీసుకొస్తే.. తమ భారం తగ్గుతుందని, తద్వారా ఫోన్ల రేట్లు తగ్గించి మార్కెట్ పెంచుకోవాలని దశాబ్ధం పైగా కొన్ని కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ తరుణంలో గుడ్ న్యూస్ చెప్పారు యూకే రీసెర్చర్లు. భూమ్మీద దొరికే తొమ్మిది అరుదైన మూలకాల్లో Indium మూలకం ఒకటి. ఇండియంతో(Indium Tin Oxide రూపంలో) ఓఎల్ఈడీ(organic light-emitting diode) టచ్ స్క్రీన్లను, ఇతర ప్యానెల్స్‌ను తయారు చేస్తుంటారు. మొబైల్స్‌తో పాటు కంప్యూటర్, పీసీలు, టీవీలు, సోలార్ ప్యానెల్స్, ఎల్ఈడీ లైట్స్ తయారీలో సైతం ఈ మూలకాన్ని ఉపయోగిస్తుంటారు. ఇది చాలా చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఫోన్ ధరల విషయంలో కొన్ని కంపెనీలు అస్సలు కాంప్రమైజ్ అవ్వవు. అయితే ఈ మెటీరియల్ ప్లేస్‌లోకి గ్రాఫిన్‌ను గనుక తీసుకొస్తే.. ఫోన్ మేకర్స్‌కి భారీ ఉపశమనం దొరుకుతుందనే ప్రయోగాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో.. యూకేకి చెందిన పేరాగ్రాఫ్ కంపెనీ, లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన పరిశోధనలో ప్రత్యామ్నాయ మెటీరియల్ విషయంలో స్పష్టత వచ్చింది. గ్రాఫిన్‌తో తయారు చేసిన ఓఎల్ఈడీ డిస్ప్లే, ప్యానెల్స్‌ను.. డెమోను విజయవంతంగా చూపించారు పరిశోధకులు. తద్వారా ఇండియమ్‌కు గ్రాఫిన్ సరైన ప్రత్యామ్నాయమనే విషయాన్ని ఇన్నాళ్లకు ప్రపంచానికి చాటి చెప్పారు. ఇండియమ్ ప్యానెల్ వాస్తవానికి ఇండియమ్‌కు ఆల్టర్నేట్ కోసం చాలా కాలంగా పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. కానీ, ఏదీ ఇండియమ్ ఇచ్చినంత అవుట్‌పుట్ ఇవ్వలేకపోయింది. ఈ తరుణంలో గ్రాఫిన్ రీప్లేస్ చేస్తుందన్న వార్త ఫోన్ మేకర్స్‌కు శుభవార్తే అని చెప్పొచ్చు. ఇక Grapheneను వండర్ మెటీరియల్ అని అభివర్ణిస్తుంటారు. ఇండియమ్‌తో పోలిస్తే దీనికి అయ్యే ఖర్చు చాలా చాలా తక్కువ. సింగిల్ లేయర్ కార్బన్ అణువులు, తేనెపట్టులాంటి నిర్మాణంను పోలి ఉండే గ్రాఫిన్‌ను.. భూమ్మీద దొరికే బలమైన మెటీరియల్స్‌లో ఒకటిగా చెప్తుంటారు. కానీ, అవసరానికి అనుగుణంగా ఆకారాన్ని మార్చుకోవచ్చు.. పైగా కాపర్ కంటే మంచి విద్యుత్ వాహకంగా పని చేస్తుంది కూడా. మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ఇప్పటిదాకా గ్రాఫిన్‌ను వాడింది లేదు. కాబట్టి.. తొలి అడుగు పడడానికి కొంచెం టైం పట్టొచ్చు(అన్నీ కుదిరితే 2023 తొలి భాగం అనేది ఒక అంచనా). అదే జరిగితే స్మార్ట్ ఫోన్లు మాత్రమే కాదు.. కంప్యూటర్లు, టీవీల తయారీ ఖర్చు..మార్కెట్లో కొన్ని బ్రాండెడ్ ఫోన్ ధరలు కూడా తగ్గే అవకాశం లేకపోలేదు. చదవండి: జీమెయిల్ మెమెరీ ఫుల్ కాకుండా ఉండాలంటే.. ఇలా చేస్తే సరి -
షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్‌ఈడీ టీవి
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మొబైల్స్ తో పాటు, స్మార్ట్ టీవిల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే రెండు టీవిలను విడుదల చేసిన సంస్థ వచ్చే నెలలో మరో కొత్త ఒఎల్‌ఈడీ డిస్ప్లేతో టీవిని మార్కెట్లోకి తీసుకొనిరావాలని యోచిస్తుంది. చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ వీబోలో మి టీవీ లాంచ్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది. కొత్తగా తీసుకొనిరాబోయే ఈ మోడల్ టీవి గురించి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ ఒక టిప్‌స్టర్ అందించిన వివరాల ప్రకారం.. సంస్థ తర్వాత తరం ఒఎల్‌ఈడీ టీవి కావచ్చునని తెలుస్తుంది. షియోమీ గత ఏడాది జూలైలో ఎంఐ టివి లక్స్ సిరీస్‌ను ఒఎల్‌ఈడీ డిస్ప్లేతో పరిచయం చేసింది. సాదారణంగా షియోమీ దాని ఎంఐ టీవి శ్రేణిలో ఎల్ఇడి ప్యానెల్స్‌ను ఉపయోగిస్తుంది. వీబోలోని ఎంఐ టీవీ జనరల్ మేనేజర్ రెండు వేర్వేరు టీవీ సెట్ల చిత్రాలను పంచుకున్నారు. గత ఏడాది సంస్థ తెచ్చిన ఎంఐ టివి లక్స్ 65 అంగుళాల 4కె ఒఎల్‌ఈడీ టీవి ధర సిఎన్ వై 12.999 (సుమారు రూ.1,48,800)గా ఉంది. కంపెనీ తన కొత్త ఒఎల్‌ఈడీ ఎంఐ టీవిని గత ఏడాది ఆఫర్ చేసిన దానికంటే తక్కువ ధరకు తీసుకొస్తుందా అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. దీని ఎప్పుడు విడుదల చేయనున్నారు అనే దాని గురించి కంపెనీ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. చదవండి: ఎయిర్టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా? -
షావోమి అద్భుత ఆవిష్కారం
సాక్షి, న్యూఢిల్లీ: టెలివిజన్ మార్కెట్లో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్న షావోమి మరో కొత్త ఆవిష్కారానికి తెర తీసింది. ఎడ్జ్-టు-ఎడ్జ్ ట్రాన్స్ పరెంట్ గ్లాస్ డిస్ ప్లేతో, దృశ్యాలు గాలిలో తేలిపోతున్న అనుభూతిని కలిగించేలా అద్భుతమైన ఎంఐ టీవీలను లాంచ్ చేసింది. 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఈ టీవీలను ప్రదర్శించింది. ఎంఐ టీవీ లగ్జరీ ట్రాన్సపరెంట్ ఎడిషన్ టీవీలను 55 అంగుళాల సైజులోమాత్రమే తీసుకొచ్చింది. వర్చువల్, రియల్ను విలీనం చేసి అపూర్వమైన అనుభవాన్ని అందించేలా ఈ టీవీలను డిజైన్ చేసింది. టీవీ మాత్రమే కాకుండా, దీన్ని ఆఫ్ చేసినపుడు ఆర్ట్ పీస్ గా కనిపించే ఎంఐ టీవీ లక్స్ ట్రాన్సపరెంట్ ఎడిషన్ గ్యాలరీలు, మ్యూజియంలు, షాపింగ్ మాల్స్ , థియేటర్లకు కూడా చక్కగా అమరిపోతుందని షావోమి ప్రకటించింది. బ్యాక్ ప్యానెల్‌తో వచ్చే సాంప్రదాయ టీవీల మాదిరిగా కాకుండా, అన్ని ప్రాసెసింగ్ యూనిట్లను దాని బేస్ స్టాండ్‌లో సృజనాత్మకంగా పొందుపర్చడం విశేషం. అందుకే ఈ టీవీని ఆఫ్ చేసిన బోర్డర్, బేస్, తప్ప మిగిలిన సెట్ పూర్తిగా పారదర్శకంగా కనిపిస్తుంది. దీంతో ఈ తరహా టీవీలను భారీగా ఉత్పత్తి చేసిన ప్రపంచంలోనే తొలి సంస్థగా షావోమి ఖ్యాతిని దక్కించుకుంది. ఆగస్టు 16 న చైనాలో ఈ టీవీల అమ్మకాలు ప్రారంభ మైనాయి. 7వేల డాలర్లు..అంటే సుమారు 5,23,982 రూపాయలు. మిగిలిన ఆసియా మార్కెట్లలో ఇవి అందుబాటులోకి వచ్చేది ప్రస్తుతానికి స్పష్టత లేదు. -
మడతపెట్టే టీవీ ఇదిగో...
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ చుట్టేసే టీవీని లాంచ్ చేసింది. మడతపెట్టగలిగే 65 అంగుళాల 4కే సిగ్నేచర్ ఓఎల్ఈడీ టీవీని లాంచ్ చేసింది. 2019, జనవరి 8నుంచి 11వరకు లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో భాగంగా ఈ టీవీని ఎల్జీ పరిచయం చేసింది. ఈ ఏడాదిలోనే ఈటీవీ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. రోల్-అప్ మోడల్ కొత్త ఓఎల్ఈడీ 65 అంగుళాల (165 సెంటీమీటర్) టీవీ ఆర్ ని ఆవిష్కరించింది. ఈ టీవీని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లడంతోపాటు అవసరం లేనపుడు చుట్టుకునే విధంగా 65 అంగుళాల తెరను ఎల్జీ రూపొందించింది. గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్, యాపిల్ ఎయిర్ ప్లే సపోర్టు తోపాటు 100 వాల్ట్స్ డాల్బీ అట్మాస్ స్పీకర్ డా దీని ప్రత్యేకతగా ఉందని సీనియర్ డైరెక్టర్ డైరెక్టరి టిమ్ అలెస్సీ చెప్పారు. అలాగే తన మొట్టమొదటి సూపర్-హై-డెఫినేషన్ 88 అంగుళాల 8కె ఓఎల్ఈడీ టీవీని కూడా ఈ సందర్భంగా తీసుకురావడం విశేషం. దశాబ్దాల క్రితంనుంచి ఎదురుచూస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని మార్కెటింగ్ ఎల్జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వండర్ వాల్ ఓఎల్ఈడీ ఆర్ టీవీ పరిచయం సందర్బంగా చెప్పారు. అయితే దీని ధరను ఇంకా రివీల్ చేయలేదు. -
కొత్త ఐఫోన్ల డిస్ప్లే స్క్రీన్లు ఏంటో తెలుసా?
టర్కీ : వచ్చే ఏడాది కొత్త ఐఫోన్ మోడల్స్ మూడింటిని లాంచ్ చేయాలని ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఐఫోన్లకు ఓలెడ్ స్క్రీన్లను వాడాలని ఆపిల్ నిర్ణయించినట్టు దక్షిణ కొరియా ‘ఎలక్ట్రానిక్ టైమ్స్’ రిపోర్టు చేసింది. దీంతో జపాన్ డిస్ప్లే షేర్లు 10 శాతం కిందకి పడిపోయాయి. జపాన్ డిస్ప్లే ప్రస్తుతం ఐఫోన్లకు లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే(ఎల్సీడీ) స్క్రీన్లను అందించే సప్లయిర్లలో ప్రధానమైనది. ఆపిల్ ఇక తన కొత్త ఐఫోన్లకు ఓలెడ్ డిస్ప్లేలను వాడనుందని తెలియడంతో జపాన్ డిస్ప్ షేర్లు పతనమయ్యాయి. దీనికి వ్యతిరేకంగా ఎల్జీ డిస్ప్లే కో పైకి ఎగిసింది. ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి ఆపిల్ దక్షిణ కొరియా కార్యాలయం కానీ, జపాన్ డిస్ప్లే కానీ నిరాకరించాయి. జపాన్ డిస్ప్లే కూడా ఓలెడ్ ప్యానల్స్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్లాన్‌ను 2019 నుంచి అవలింభించబోతోంది. ఈ కొత్త ప్రొడక్షన్ లైన్‌ను లాంచ్ చేయడం కోసం కొత్త ఇన్వెస్టర్లను సైతం జపాన్ డిస్ప్లే వెతుకుతోంది. నిజంగానే ఆపిల్ వచ్చే ఏడాది నుంచి అన్ని మోడల్స్‌కు ఓలెడ్ డిస్ప్లేలను వాడితే, అది ఎల్జీకి గుడ్‌న్యూస్ కానుంది. దీంతో ఈ కంపెనీ షేర్లు కూడా 5 శాతం పైకి జంప్ చేశాయి. ఓలెడ్ డిస్ప్లేల సరఫరా కోసం వనరులను విస్తరించాలని కూడా ఆపిల్ చూస్తున్నట్టు సియోల్‌కు చెందిన సిన్‌యంగ్ విశ్లేషకుడు లీ ఓన్-సిక్ చెప్పారు. -
శాంసంగ్, ఎల్జీలకు షాకింగ్ న్యూస్
శాన్ఫ్రాన్సిస్కో: డిస్ ప్లే మార్కెట్ లీడర్లు శాంసంగ్, ఎల్జీలకు షాకింగ్ న్యూస్. మొబైల్ దిగ్గజం ఆపిల్ సొంతంగా తన సొంత స్క్రీన్లను తయారు చేసుకుంటోందట. కాలిఫోర్నియా లోని తన ప్రధాన కార్యాలయం సమీపంలో సొంత డివైస్ స్క్రీన్ల డిజైనింగ్, ఉత్పత్తిని రహస్యంగా చేపట్టిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాదు చిన్నమొత్తంగా స్క్రీన్లను రూపొందించి టెస్టింగ్ కూడా నిర్వహిస్తోందట. ఇందుకు ఒక సీక్రెట్ ప్రాజెక్టును రూపొందించిందనీ, ఈ మేరకు ఆపిల్ గణనీయమైన పెట్టుబడులు పెట్టిందని సోమవారం బ్లూంబర్గ్ నివేదించింది. తన సొంత డిస్ప్లే ఉత్పత్తులపై దృష్టిపెట్టిన ఆపిల్ మైక్రోఎల్ఈడీ స్క్రీన్లను డెవలప్ చేస్తోందని నివేదించింది. కాలిఫోర్నియాలోని 62వేల చదరపు అడుగుల తయారీ కేంద్రాన్ని ఇందుకు కేటాయించిందట. ఈ రహస్య ప్రాజెక్ట్ కోడ్ పేరు టీ159 అని, ఐఫోన్,ఆపిల్ వాచ్ స్క్రీన్ టెక్నాలజీ బాధ్యుడు లిన్ యంగ్స్ ఈ ప్రాజెక్టను పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. మైక్రోఎల్ఈడీ స్క్రీన్స్.. ప్రస్తుత ఓఎల్‌ఈడీలతో పోలిస్తే వివిధ కాంతి-ఉద్గారసమ్మేళనాల మిళితంగా పనిచేస్తాయి. అందుకే తమ భవిష్యత్ గాడ్జెట్లు మరింత స్లిమ్‌గా, ప్రకాశవంతంగా, విద్యుత్‌ను తక్కువగా వినియోగించుకునేలా వీటిని రూపొందిస్తోందని చెప్పింది. 2019లో లాంచే చేసే అన్ని ఐఫోన్లకు ఈ డిస్ప్లేలను జోడించనుందని కూడా అంచనా వేసింది. కాగా ఐఫోన్ ఎక్స్ లాంటి కీలక డివైస్‌లకు ఎల్ఈడీ డిస్ప్లేలకు పెట్టింది పేరైన శాంసంగ్ డిస్ప్లే ప్యానెళ్లపైనే ఆధారపడింది. మరోవైపు ఇటీవీల ఓఎల్ఈడీ స్క్రీన్ల సరఫరాపై ఎల్జీతో చర్చలు జరుపుతోందని, త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుందని నివేదికలు వచ్చాయి. మరి తాజా అంచనాలపై ఆపిల్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. -
"రెడ్ మి ప్రో" టీజర్ వచ్చేసింది
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి, కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్న రెడ్ మి ప్రో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఉత్సాహవంతులైన యూజర్ల కోసం షియోమి, రెడ్ మి ప్రో టీజర్ ను విడుదల చేసేసింది. చైనీస్ టెక్ కంపెనీ వైబోలో తన టీజింగ్ ను ప్రారంభించింది. ఓలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్స్ 10-కోర్ ప్రాసెసర్ తో రెడ్ మి ప్రో మార్కెట్లోకి రాబోతున్నట్టు షియోమి హింట్ ఇచ్చింది. జూలై 27న చైనాలో ఈ ఫోన్ లాంచింగ్ కు సిద్ధమైంది. మొదటి టీజర్ లో ఓలెడ్ పింగ్ వంట చేస్తున్న ప్రముఖ చెఫ్ లియు షి షి దృశ్యాలు, దీంతో తర్వాత రాబోతున్న స్మార్ట్ ఫోన్ ఓలెడ్ డిస్ ప్లే అని తెలుస్తోంది. ఈ డిస్ ప్లేతో బ్యాక్ లైట్ లేకుండానే అంకెలను, టైమ్ ను చూసుకునే వీలుంటుందట. అదేవిధంగా రెండో టీజర్ ద్వారా రెడ్ మి ప్రో ప్రాసెసర్, డెకా కోర్ ప్రాసెసర్ అని హింట్ ఇచ్చేసింది. అయితే ఈ టీజర్ లో సైజు, రెసుల్యూషన్ గురించి ఎలాంటి వివరాలను విడుదల చేయలేదు. గత కొంతకాలంగా చక్కర్లు కొట్టిన లీక్ లో ఈ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలోతో రన్ కాబోతుందని సమాచారం. యూనిబాడీ మెటల్ డిజైన్ తో ఇది రాబోతుందట. అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుక వైపు మిస్ అయి, ముందు వైపు ఉంటుందని ముందస్తు లీక్ లు వెల్లడించాయి. బ్లూటూత్, 4జీ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వై-ఫై 802.11ఏసీ, జీపీఎస్ లు లీకేజీలోని రెడ్ మి ప్రో ఫీచర్లు.. మరి ఈ లీక్ లన్నీ నిజమవుతూ రెడ్ మి ప్రో విడుదల అవుతాదో లేదో జూలై 27వరకు వేచి చూడాల్సిందే.