టర్కీ : వచ్చే ఏడాది కొత్త ఐఫోన్ మోడల్స్ మూడింటిని లాంచ్ చేయాలని ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త ఐఫోన్లకు ఓలెడ్ స్క్రీన్లను వాడాలని ఆపిల్ నిర్ణయించినట్టు దక్షిణ కొరియా ‘ఎలక్ట్రానిక్ టైమ్స్’ రిపోర్టు చేసింది. దీంతో జపాన్ డిస్‌ప్లే షేర్లు 10 శాతం కిందకి పడిపోయాయి. జపాన్ డిస్‌ప్లే ప్రస్తుతం ఐఫోన్లకు లిక్విడ్ క్రిస్టల్ డిస్‌ప్లే(ఎల్‌సీడీ) స్క్రీన్లను అందించే సప్లయిర్లలో ప్రధానమైనది. ఆపిల్ ఇక తన కొత్త ఐఫోన్లకు ఓలెడ్ డిస్‌ప్లేలను వాడనుందని తెలియడంతో జపాన్ డిస్‌ప్ షేర్లు పతనమయ్యాయి. దీనికి వ్యతిరేకంగా ఎల్‌జీ డిస్‌ప్లే కో పైకి ఎగిసింది.
ప్రస్తుతం ఈ విషయంపై స్పందించడానికి ఆపిల్ దక్షిణ కొరియా కార్యాలయం కానీ, జపాన్ డిస్‌ప్లే కానీ నిరాకరించాయి. జపాన్ డిస్‌ప్లే కూడా ఓలెడ్ ప్యానల్స్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే ప్లాన్‌ను 2019 నుంచి అవలింభించబోతోంది. ఈ కొత్త ప్రొడక్షన్ లైన్‌ను లాంచ్ చేయడం కోసం కొత్త ఇన్వెస్టర్లను సైతం జపాన్ డిస్‌ప్లే వెతుకుతోంది. నిజంగానే ఆపిల్ వచ్చే ఏడాది నుంచి అన్ని మోడల్స్‌కు ఓలెడ్ డిస్‌ప్లేలను వాడితే, అది ఎల్‌జీకి గుడ్‌న్యూస్ కానుంది. దీంతో ఈ కంపెనీ షేర్లు కూడా 5 శాతం పైకి జంప్ చేశాయి. ఓలెడ్ డిస్‌ప్లేల సరఫరా కోసం వనరులను విస్తరించాలని కూడా ఆపిల్ చూస్తున్నట్టు సియోల్‌కు చెందిన సిన్‌యంగ్ విశ్లేషకుడు లీ ఓన్-సిక్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment