హైదరాబాద్: ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఎల్‌జీ ప్రపంచంలోనే తొలి, ఏకైక రోలబుల్ టీవీని లాంచ్ చేసింది. ఎల్‌జీ సిగ్నేచర్ ఓలెడ్-ఆర్ టీవీతో హైదరాబాద్ మార్కెట్లో అడుగు పెట్టింది. భవిష్యత్తులో డిస్‌ప్లే టెక్నాలజీలో ఇదొక ముందడుగని లాంచింగ్ సందర్భంగా కంపెనీ వెల్లడించింది. అంతేకాదు హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో విప్లవాత్మకమైన టీవీ ఇది అని ఎల్‌జీ ప్రకటించింది.
కస్టమర్‌లకు ఇంట్లోనే థియేటర్ అనుభవాన్ని అందించే డాల్బీతో టెక్నాలజీతో, 42 అంగుళాల నుంచి 97 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో లాంచ్ చేసింది. ఇది లగ్జరీ టీవీ. అవసరం లేనపుడు ఈ టీవీని బాక్స్‌లో మడిచి పెట్టేయొచ్చు అని ఎల్‌జి ఎలక్ట్రానిక్స్ ఇండియా బిజినెస్ హెడ్ గిరీశన్ గోపి చెప్పారు. భారతదేశం అంతటా కనీసం వెయ్యి టీవీలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
రోలబుల్ టీవీ ప్రత్యేకత
అంతర్జాతీయంగా ముఖ్య ఆవిష్కరణల్లో ఇది ఒకటి. ఆన్ చేయగానే వెడల్పాటి సౌండ్ సిస్టమ్ నుంచి 65 అంగుళాల టీవీ వెలుపలికి వస్తుంది. ఆఫ్ చేయగానే దానంతట అదే చుట్టుకుంటూ పెట్టెలోకి వెళ్లిపోతుంది. సెల్ఫ్-లైట్ పిక్సెల్ టెక్నాలజీ కారణంగా ఇలా వీలవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment