సాక్షి, ముంబై: ఇండియాలో ల్యాప్‌టాప్ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్న ఆసుస్ తాజాగా ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. హై బ్రిడ్ ల్యాపీలతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తున్న ఆసుస్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ఓలెడ్’ ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ అని చెబుతున్న కంపెనీ దీని ధరను రూ. 3,29, 990గా నిర్ణయించింది. ల్యాప్‌టాప్ కోసం ప్రీబుకింగ్స్‌ను కూడా షురూ చేసింది.
ప్రీ-బుకింగ్ ఆఫర్
ప్రీ-బుకింగ్ చేసిన వారికి ఏకంగా 55 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ల్యాప్‌టాప్ రూ.2,84,290 కే లభిస్తుంది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ బుకింగ్‌కు అవకాశం ఉంది. జెన్‌బుక్ 17 ఫోల్డ్ నవంబర్ 10న విడుదల కానుంది ఆసుస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో ఇతర రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
ముఖ్యంగా 4.8 అంగుళాల స్క్రీన్‌ను వర్చువల్ కీ బోర్డు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సాధారణ కీ బోర్డు ద్వారా యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ట్యాబ్, డిస్‌ప్లేలా వాడుకోవచ్చు. ఈ కొత్త లాపీలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్‌టెండెడ్ అనే ఐదు స్క్రీన్ మోడ్స్ ఉండటం మరో విశేషం. అంతేకాదు మల్టీ స్క్రీన్ ఫీచర్‌తో డిస్‌ప్లేని ఒకేసారి మూడు స్క్రీన్లుగా వాడుకోవచ్చు. కేవలం నలుపు రంగులో మాత్రమే వచ్చిన ఈ ల్యాపీలో 500 జీబీ ఎస్‌ఎస్‌డీ ఎక్స్‌టర్నల్ స్టోరేజ్ ఉచితం. 65W AC ఫాస్ట్ ఛార్జర్ మద్దతుతో 75 WHrs బ్యాటరీ సగటు వినియోగం 10 గంటలు.
ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ల్యాపీ స్పెసిఫికేషన్స్
17.3 అంగుళాల థండర్‌బోల్ట్ 4k డిస్‌ప్లే
12.5 అంగుళాల ఫోల్డ్ స్క్రీన్
12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్
ఇంటెల్ ఐరిస్ ఎక్స్‌ఈ గ్రాఫిక్ కార్డ్
5 ఎంపీ ఏఐ కెమెరా
డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్స్
నాలుగు యూఎస్‌బీ-సీ పోర్ట్
Comments
Please login to add a commentAdd a comment