Asus
-
వరల్ఢ్లోనే తొలి ఫోల్డ్ ల్యాపీ, ప్రీబుకింగ్‌పై అదిరిపోయే ఆఫర్
సాక్షి, ముంబై: ఇండియాలో ల్యాప్‌టాప్ సిరీస్‌లతో ఆకట్టుకుంటున్న ఆసుస్ తాజాగా ఫోల్డబుల్ ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. హై బ్రిడ్ ల్యాపీలతో యూజర్లను ఎట్రాక్ట్ చేస్తున్న ఆసుస్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ఓలెడ్’ ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే తొలి ఫోల్డింగ్ ల్యాప్‌టాప్ అని చెబుతున్న కంపెనీ దీని ధరను రూ. 3,29, 990గా నిర్ణయించింది. ల్యాప్‌టాప్ కోసం ప్రీబుకింగ్స్‌ను కూడా షురూ చేసింది. ప్రీ-బుకింగ్ ఆఫర్ ప్రీ-బుకింగ్ చేసిన వారికి ఏకంగా 55 వేల వరకు తగ్గింపును అందిస్తోంది. ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి ఈ ల్యాప్‌టాప్ రూ.2,84,290 కే లభిస్తుంది. అక్టోబర్ 14 నుంచి నవంబర్ 9 వరకు ప్రీ బుకింగ్‌కు అవకాశం ఉంది. జెన్‌బుక్ 17 ఫోల్డ్ నవంబర్ 10న విడుదల కానుంది ఆసుస్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌తో ఇతర రీటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా 4.8 అంగుళాల స్క్రీన్‌ను వర్చువల్ కీ బోర్డు, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సాధారణ కీ బోర్డు ద్వారా యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా ట్యాబ్, డిస్ప్లేలా వాడుకోవచ్చు. ఈ కొత్త లాపీలో ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ట్యాబ్లెట్, రీడర్, ఎక్స్టెండెడ్ అనే ఐదు స్క్రీన్ మోడ్స్ ఉండటం మరో విశేషం. అంతేకాదు మల్టీ స్క్రీన్ ఫీచర్‌తో డిస్ప్లేని ఒకేసారి మూడు స్క్రీన్లుగా వాడుకోవచ్చు. కేవలం నలుపు రంగులో మాత్రమే వచ్చిన ఈ ల్యాపీలో 500 జీబీ ఎస్ఎస్డీ ఎక్స్టర్నల్ స్టోరేజ్ ఉచితం. 65W AC ఫాస్ట్ ఛార్జర్ మద్దతుతో 75 WHrs బ్యాటరీ సగటు వినియోగం 10 గంటలు. ఆసుస్ జెన్ 17 ఫోల్డ్ ల్యాపీ స్పెసిఫికేషన్స్ 17.3 అంగుళాల థండర్‌బోల్ట్ 4k డిస్ప్లే 12.5 అంగుళాల ఫోల్డ్ స్క్రీన్ 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ7 ప్రాసెసర్ ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్ కార్డ్ 5 ఎంపీ ఏఐ కెమెరా డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో నాలుగు స్పీకర్స్ నాలుగు యూఎస్బీ-సీ పోర్ట్ -
ల్యాప్‌టాప్‌లపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్
సాక్షి, ముంబై: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్ ప్రకటించింది. జూన్ 11నుంచి మొదలైన ఈ సేల్ 17వ తేదీవరకు కొనసాగనుంది. తాజాగా ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ 2022 సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ ఆన్లైన్ వినియోగదారుల కోసం డీల్‌లు, డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భాగంగా ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లతో సహా ఎలక్ట్రానిక్స్‌పై డిస్కౌంట్స్ ప్రకటించింది. ప్రధానంగా లెనోవా, ఆసుస్, హెచ్‌పీ, షావోమీ, ఎంఎస్ఐ ఏసర్ లాంటి ప్రముఖ బ్రాండ్ల ల్యాప్టాప్స్ తగ్గింపు ధరలలో అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తక్షణ తగ్గింపు. అలాగే పేటీఎం Paytm వాలెట్ , యూపీఐ లావాదేవీలపై 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. వినియోగదారులు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా పొందవచ్చు. ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఆసుస్ వివో బుక్ కే15 ఓఎల్ఈడీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం రూ. 52,990కే లభ్యం. ఎంఆర్పీ ధర రూ.78,990. అంటే సుమారు 32 శాతం తగ్గింపు. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపు, రూ. 18,100 దాకా ఎక్స్ఛేంజ్ ఆఫర్ లెనోవా థింక్‌బుక్ 13ఎస్ ఫ్లిప్‌కార్ట్ ఎండ్ ఆఫ్ సీజన్ సేల్‌లో భారీ తగ్గింపు లభిస్తున్న వాటిల్లో ఇది కూడా ఒకటి. 51 శాతం డిస్కౌంట్‌తో లెనోవా థింక్‌బుక్ 13ఎస్ ను కేవలం 54,990 రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. దీనికి ఎంఆర్పీ ధర రూ. 1,12,608. దీనికి 10 శాతం తగ్గింపు, ఎక్స్చేంజ్ ఆఫర్ అదనం. రెడ్‌మీబుక్ ప్రో ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 28శాతం డిస్కౌంట్‌తో రూ. 42,990 ధరకే లభిస్తోంది రెడ్‌మీబుక్ ప్రో. దీని ఎంఆర్పీ ధర రూ. 59,990. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. ఎంఎస్ఐ మోడ్రన్ 14 ఈ ల్యాప్‌టాప్‌ను రూ. 43,990 అందిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై 10 శాతం తగ్గింపును 18,100 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభ్యం. -
హాట్ కేకుల్లా డెస్క్ టాప్ సేల్స్!! భారత్‌లో కింగ్ మేకర్ ఎవరంటే!
కోవిడ్ కారణంగా నిర్వహిస్తున్న ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రమ్‌హోమ్ తో దేశంలో పర్సనల్ కంప్యూటర్లు (పీసీ-డెస్క్‌టాప్),ల్యాప్‌ట్యాప్‌ల వినియోగం బాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన క్యూ4 ఫలితాల్లో దేశీయంగా పర్సనల్ కంప్యూటర్లు 14.8 మిలియన్ యూనిట్ల షిప్ మెంట్ జరిగినట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) తెలిపింది. 1.3 మిలియన్ యూనిట్ల షిప్‌మెంట్‌తో హెచ్‌పీ సంస్థ మార్కెట్లో కింగ్ మేకర్‌గా నిలిచింది. ►2020నుంచి హెచ్‌పీ భారత్‌లో 58.7శాతం వృద్ధితో 31.5శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా..2021లో వాణిజ్య విభాగంలో హెచ్‌పీ మార్కెట్ వాటా 57.5శాతం నుంచి 60.1శాతానికి వృద్ధి చెందింది. వినియోగం విభాగాల్లో 30శాతం నుంచి 32.9శాతానికి పెరిగింది. ►క్యూ4లో వరుసగా రెండో త్రైమాసికంలో 1మిలియన్ యూనిట్లకు పైగా షిప్పింగ్ చేస్తూ 23.6శాతం షేర్‌తో డెల్ దేశీయ మార్కెట్లో రెండో స్థానంలో నిలించింది. ఐటీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్ నుండి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో డెల్ 38శాతం వాటాతో ఎంటర్ప్రైజ్ విభాగంలో ముందుంది. ►మరో టెక్ సంస్థ లెనోవో పీసీ సెగ్మెంట్లో 22.8శాతం వృద్ధిని సాధించింది. 24.7శాతం వాటాతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎస్ఎంఈ) విభాగం నుండి డిమాండ్ పెరగడంతో లెనోవో..,హెచ్‌పీ కంటే మందంజతో రెండవ స్థానంలో ఉంది. ►ఏసర్ 8.2శాతం, ఆసుస్ 5.9శాతం మార్కెట్ వాటాతో నాలుగు, ఐదవ స్థానాల్ని సంపాదించుకున్నాయి. డెస్క్‌టాప్ విభాగంగాలో ఏసర్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంది. ఇది 25.8శాతం మార్కెట్ వాటా ఉంది. ►ఆసుస్ సంవత్సరానికి 36.1శాతం వృద్ధి చెందింది. ఈ సందర్భంగా ఐడీసీ ఇండియా సీనియర్ మార్కెట్ అనలిస్ట్ (పీసీ డివైజెస్) భరత్ షెనాయ్ మాట్లాడుతూ వరుసగా రెండో సంవత్సరం సైతం విద్యార్ధులకు ఆన్లైన్ క్లాసుల్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను ఉపయోగిస్తున్నారు. వారిలో కొంతమంది విద్యార్ధులు మాత్రం పెద్దస్క్రీన్, వాడుకలో సౌలభ్యం వంటి ఇతర ప్రయోజనాల కారణంగా పర్సనల్ కంప్యూటర్లను వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన ల్యాప్టాప్స్ ఏవంటే..!
కరోనా రాకతో స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ కంపెనీలకు కాసుల వర్షం కురిసింది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులతో పలు ల్యాప్‌ట్యాప్ కంపెనీలు గణనీయమైన అమ్మకాలను చూశాయి. దేశవ్యాప్తంగా జూలై నుంచి సెప్టెంబర్(క్యూ 3) త్రైమాసికంలో పర్సనల్ కంప్యూటర్ షిప్మెంట్లు బలమైన వృద్ధిని సాధించాయి. మూడు నెలల్లో సుమారు 4.5 మిలియన్ల యూనిట్లను పలు ల్యాప్‌టాప్ కంపెనీలు షిప్పింగ్ చేసినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే 30 శాతం అధికంగా వృద్ధిని సాధించాయి. ►ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం... ఈ ఏడాది క్యూ3లో భారత్‌లో ఎక్కువగా అమ్ముడైన ల్యాప్‌టాప్‌లో హెచ్‌పీ 28.5 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌లో దాదాపు 1.3 మిలియన్ల యూనిట్ల కొనుగోలు జరిగినట్లు తెలుస్తోంది. హెచ్‌పీ సుమారు 31.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. ►డెల్ టెక్నాలజీస్ రెండో స్థానంలో నిలిచింది. పర్సనల్ కంప్యూటర్ కేటగిరీలో క్యూ3లో 23.8 శాతం వాటాను డెల్ సొంతం చేసుకుంది.లెనోవోను అధిగమించి 45 శాతం వృద్దిను డెల్ సాధించింది. ►2021 క్యూ3లో లెనోవో మొత్తంగా 18.6 శాతం వాటాతో మూడవ స్థానాన్ని కొనసాగించింది. గత సంవత్సరంతో పోలిస్తే లెనోవో ల్యాప్టాప్స్ షిప్మెంట్లు 11.5 శాతం వృద్ధి చెందాయి. ►ఏసర్ 8.6 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంలో నిలవగా....గత సంవత్సరం ఎగుమతులలో పోలిస్తే 16.7 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రికార్డు స్థాయిలో దాదాపు 3.8 లక్షల యూనిట్లకు చేరుకుంది. ►మరో వైపు ఆసుస్ ఈ ఏడాది క్యూ3లో 8.5 శాతం మార్కెట్ వాటాతో ఐదవ స్థానంలో ఉండగా... భారత్‌లో మొదటిసారిగా 3 లక్షల పర్సనల్ కంప్యూటర్లను షిప్పింగ్ చేసింది. ►యాపిల్ లాంట్ దిగ్గజ కంపెనీ కూడా ఈ ఏడాది క్యూ3లో సుమారు 12 శాతం మేర వాటాను దక్కించుకున్నాయి. ►సరఫరా, లాజిస్టికల్ సవాళ్లు పలు కంపెనీలకు వేధిస్తున్నప్పటికీ ఆయా కంపెనీలు ఈ త్రైమాసికంలో గణనీయంగానే వృద్ధిని సాధించాయి. పర్సనల్ కంప్యూటర్స్‌లో నోట్‌బుక్ ల్యాప్‌టాప్ సుమారు 80 శాతం మేర కొనుగోలు జరిగాయి. డెస్క్‌టాప్ కంప్యూటర్లు 16.5 శాతంగా నిలిచాయి. -
అదిరిపోయే ఆఫర్, రూ.60 వేల భారీ డిస్కౌంట్‌తో బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్
మనేదేశంలో ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ దుమ్మురేపుతున్నాయి. ఆన్లైన్ వేదికగా జరిగే ఈ అమ్మకాల్లో తమకు నచ్చిన ప్రాడక్ట్‌లను తక్కువ ధరకే సొంతం చేసుకునేందుకు వినియోగదారులు స్మార్ట్ ఫోన్లకు అతుక్కుపోయారు. అయితే కొనుగోలు దారుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఆ రెండు ఈ కామర్స్ కంపెనీలు బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లను రూ.10,000 లోపే అందిస్తున్నాయి. ఇప్పుడు హై కాన్ఫిగర్ బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్‌లను తక్కువ ధరకే అమ్మేందుకు అమెజాన్ సిద్ధమైంది.ప్రముఖ గేమింగ్ ల్యాప్‌ట్యాప్ 'ఆసుస్ డాష్ ఎఫ్15' ధర రూ. 1,39,900 మార్కెట్లో విడుదలైంది.ఈ థమకా సేల్‌లో ల్యాప్ ట్యాప్‌ను రూ.60వేల డిస్కౌంట్‌తో రూ.79,990కే సొంతం చేసుకోవచ్చని అమెజాన్ ప్రకటించింది. అంతేకాదు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఈ ల్యాప్ ట్యాప్ ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఐ5 11 జనరేషన్ వేరియంట్ ల్యాప్ ధర రూ.69,990కే సొంతం చేసుకోవచ్చని వెల్లడించింది. ఆసుస్ టీయూఎఫ్ డాష్ ఎఫ్15 స్పెసిఫికేషన్లు ♦ 15.6 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే 144హెచ్‌జెడ్ హై రిఫ్రెష్ రేట్ ♦ 11 జనరేషన్, కోర్ ఐ7చిప్ సెట్ ♦ 16 జీబీ డీడీఆర్4 ర్యామ్ 512జీబీ ఎన్వీఎంఈ పీసీఐఆ 3.0 ఎస్ఎస్డీ ♦ బ్లూటూత్ వీ5.2 అండ్ వైఫై 6 కనెక్టివిటీ ♦ త్రీ యూఎస్బీ టైప్ ఏ (3.2జనరేషన్1) పోర్ట్ ♦ థండర్ బోల్ట్ 4 పోర్ట్, హెచ్డీఎంఐ 2.0 పోర్ట్ ♦ ఆర్జే 45 అండ్ 3.5ఎం ఎం హెడ్ ఫోన్ జాక్ చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్13తో కళ్లకు ట్రీట్మెంట్ -
Asus Chromebook: మార్కెట్లో బాహుబలి ల్యాప్ ట్యాప్
ఖరీదైన ల్యాప్‌ట్యాప్ లను చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా అవి పగిలే పోయే అవకాశం ఉంది. కానీ తాజాగా మార్కెట్లో విడుదలైన ఆసుస్ బాహుబలి ల్యాప్ ట్యాప్ మాత్రం కింద పడినా పగలదు.ఇందుకోసం ప్రత్యేకమైన ఎక్విప్ మెంట్‌ను యాడ్ చేసినట్లు ఆసుస్ ప్రతినిధులు తెలిపారు. తైవాన్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం ఆసుస్ తన ప్రాడక్ట్‌ల విడుదలతో ఇండియన్ మార్కెట్లో సందడి చేస్తోంది. ఈ ఏడాది జులై నెలలో ఆసుస్ క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214, క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523, క్రోమ్‌బుక్ సీ223 విడుదలతో హాట్ టాపిగ్గా మారింది. అయితే తాజాగా కింద పడినా డ్యామేజీ అవ్వకుండా ఉండేలా క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1 (Asus Chromebook Detachable CZ1)ను విడుదల చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1 స్పెసిఫికేషన్స్ 500 గ్రాముల బురువు ఉండే ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ సీజెడ్1.. ఇంట్లో వినియోగించే డెస్క్, లేదంటే డైనింగ్ టేబుల్ పై నుంచి కింద పడినా పగలదు. పైగా కింద పడినా ప్రొటెక్ట్ చేసేలా నాలుగు వైపుల రబ్బర్ ట్రిమ్‌తో వస్తుందని ఆసుస్ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు గూగుల్ అస్టిస్టెంట్ వాయిస్ రికగ్నయిజేషన్ తో వినియోగదారుల్ని అలసరిస్తుండగా..1920x1200 పిక్సెల్స్,10.1 ఫుల్ హెచ్డీ, ఎల్సీడీ డబ్ల్యూయూఎక్స్‌జీఏ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, 16:10 యాస్పెక్ట్ రేషియో,100 శాతం ఎస్ఆర్జీబీ, 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ పాటు క్రోమ్ ఓఎస్‌తో వస్తోంది. మీడియాటెక్ కంపానియో 500 (ఎంటీ8183) ప్రాసెసర్, ఆర్మ్ మాలి-జీ72 ఎంపీ3 జీపీయూ చిప్సెట్ తో వస్తుండగా 4జీబీ ర్యామ్, 128 జీబీ ఈఎంఎంసీ స్టోరేజీ చేసుకోవచ్చు. యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5ఎంఎం జాక్, 1.5ఎంఎం కీట్రావెల్ కీబోర్డు తో పాటు టైపింగ్‌కు అనువుగా ఉండేలా ఎర్గో లిఫ్ట్ డిజైన్‌తో ఆకర్షిస్తుంది. 8 మెగాపిక్సెళ్ల రేర్ కెమెరా , 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 15 సెకన్ల పాటు చార్జింగ్ చేస్తే 45 నిమిషాల పాటు వినియోగించుకోవచ్చు. 27డబ్ల్యూహెచ్ఆర్ బ్యాటరీతో వస్తున్నఈ క్రోమ్‌బుక్‌ను 11 గంటల వరకు నిర్విరామంగా వినియోగించుకునేలా బ్యాటరీ సదుపాయం ఉన్నట్లు ఆసుస్ తెలిపింది. ఆసుస్ క్రోమ్‌బుక్ డిటాచబుల్ అడ్జెస్ట్ మెంట్ కోసం స్టాండ్ తో వస్తుండగా..ఈ మోడల్ ధర ఎంతో తెలియాల్సి ఉంది. చదవండి : ఆపిల్ లాంచ్ చేయబోయే కొత్త ప్రాడక్ట్స్ ఇవే?! -
అతి తక్కువ ధరకే క్రోమ్‌బుక్ ల్యాప్టాప్స్..!
తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్ కొత్తగా క్రోమ్‌బుక్ ల్యాప్‌టాప్ మోడళ్లను భారత మార్కెట్లోకి రిలీజ్ చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214, క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523, క్రోమ్‌బుక్ సీ223 ల్యాప్‌టాప్ మోడళ్లను ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో ఆసుస్ కంపెనీ ప్రారంభించింది. ఈ ల్యాప్‌టాప్ మోడళ్లు గూగుల్‌కు చెందిన క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్(Chrome OS)తో పనిచేయనున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని ఆసుస్ కొత్తగా క్రోమ్‌బుక్‌లను మార్కెట్లోకి లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. యుఎస్, ఇతర ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చిన తరువాత మొదటిసారిగా భారత మార్కెట్లోకి ఆసుస్ రిలీజ్ చేసింది. ఆసుస్ క్రోమ్‌బుక్ సీ423, క్రోమ్‌బుక్ సీ523 టచ్, నాన్-టచ్ డిస్ప్లే ఎంపికలతో రానున్నాయి. ఆసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214 ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ423 నాన్ టచ్ మోడల్ ధర రూ.19,999. టచ్ మోడల్ ధర రూ. 23,999. ఆసుస్ క్రోమ్ బుక్ సీ523 నాన్ టచ్ మోడల్ ధర రూ.20,999, టచ్ మోడల్ ధర రూ. 24,999. ఆసుస్ క్రోమ్‌బుక్ సీ223 అతి తక్కువ ధర రూ. 17,999గా నిర్ణయించింది. ఈ ల్యాప్‌టాప్ క్రోమ్ బుక్ మోడళ్లు జూలై 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఆసుస్ క్రోమ్‌బుక్ ఫ్లిప్ సీ214 ఫీచర్లు 11.6 అంగుళాల ఆంటీగ్లేర్ టచ్ డిస్ప్లే డ్యూయల్ కోర్ ఇంటెల్ సెలెరాన్ ఎన్ 4020 ప్రాసెసర్ ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ 600 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 50Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్‌బుక్ సీ423 ఫీచర్లు 14 అంగుళాల టచ్ డిస్ప్లే(ఆప్షనల్) ఇంటెల్ హెచ్డి గ్రాఫిక్స్ 500 ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 ప్రాసెసర్ 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్‌బుక్ సీ523 ఫీచర్లు 15.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఇంటెల్ సెలెరాన్ ఎన్ 3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంటెల్ హెచ్డీ గ్రాఫిక్స్ 500 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ ఆసుస్ క్రోమ్‌బుక్ సీ223 ఫీచర్లు 11.6 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఇంటెల్ సెలెరాన్ ఎన్3350 డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఇంటెట్ హెచ్డీ గ్రాఫిక్స్ 500 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ 38Whr బ్యాటరీ -
ప్రపంచంలో తొలి 20 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్ మొబైల్
ప్రపంచంలో ఇప్పటి వరకు అత్యధిక ర్యామ్ గల స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన కంపెనీలు అసుస్, లెనోవో. ఈ రెండు కంపెనీలు మొబైల్ లో అత్యధికంగా 18 జీబీ ర్యామ్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు అంతకు మించి ర్యామ్ తో జడ్‌టీఈ కంపెనీ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో 20జీబీ ర్యామ్ తీసుకొస్తున్నట్లు సమాచారం. చైనా కంపెనీ జడ్‌టీఈ దీని గురుంచి ఎటువంటి అధికారిక సమాచారం బయటకి వెల్లడించలేదు. ఆ సంస్థలో పనిచేసే ఎగ్జిక్యూటివ్ లలో ఒకరు ఆన్ లైన్ లో దీని గురుంచి లీక్ చేశారు. 20జీబీ ర్యామ్ ఫోన్ తీసుకురావడం ద్వారా జడ్‌టీఈ కంపెనీ తన ప్రత్యర్థి కంపెనీలకు దక్షిణాసియా మార్కెట్లో పోటీ ఇవ్వాలని చూస్తుంది. ఈ సంవత్సరం చివరి వరకు అండర్-డిస్ ప్లే సెల్ఫీ కెమెరా ఫోన్లను తీసుకొని రావాలని కూడా చూస్తున్నట్లు తెలుస్తుంది. జడ్‌టీఈ డైరెక్టర్లలో ఒకరైన లూ క్వియాన్ హావో వీబోలో కంపెనీ 20జీబీ ర్యామ్ ఫోన్ ను టీజ్ చేశారు. వచ్చే ఏడాది 1 టీబీ స్టోరేజీతో ఫోన్లు తీసుకొనిరావచ్చు అని ఎగ్జిక్యూటివ్ సూచించారు. ఖచ్చితమైన లాంఛ్ వివరాలు లేనప్పటికి భవిష్యత్తులో 20జీబీ ర్యామ్ ఫోన్ ను తీసుకురావచ్చని తెలుస్తుంది. అలాగే, అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరా కోసం పనిచేస్తున్న పెద్ద కంపెనీల్లో జడ్‌టీఈ ఒకటి. చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్ విడుదల -
ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ విడుదల
తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్ ఉపకరణాల తయారీ కంపెనీ ఆసుస్.. ప్రపంచంలోనే తొలి కన్వర్టబుల్ గేమింగ్ ల్యాప్‌టాప్ ‘ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13’ను అభివృద్ధి చేసింది. దీంతో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడిన జిఫిరస్ సిరీస్‌లో మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌లను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. 13 అంగుళాలతో ఏఎండీ రైజెన్ 5900హెచ్ఎస్, 5900హెచ్ఎక్స్ ప్రాసెసర్లతో కూడిన ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13 ల్యాప్‌టాప్ వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్ఓజీ జెఫిరస్ డ్యూయో 15 ఎస్ఈ, జీ14, జీ15 మూడు కొత్త శ్రేణి ల్యాప్‌టాప్‌ల ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతాయని పేర్కొంది. ఆసుస్ ఆర్ఓజీ ఫ్లో ఎక్స్ 13 విండోస్ 10 ల్యాప్‌టాప్ మీ రోజువారీ అవసరాల కోసం 13.4 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఈ ల్యాప్‌టాప్‌లో ఏఎమ్ డీ ఆక్టా కోర్ రైజెన్ 9 5900 హెచ్ఎస్ ప్రాసెసర్ ఉంది, దీనితో పాటు 16 జిబి ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డి స్టోరేజ్ ఉంది. గ్రాఫిక్స్ కార్డ్ విషయానికొస్తే, ఇందులో ఎన్విడియా జిఫోర్స్ ఆర్టిఎక్స్ 1650 గ్రాఫిక్స్ కార్డ్ ఉంది. ఇది 1.3 కిలోల బరువు ఉంటుంది. దీని ధర భారతదేశంలో 1,19,990 రూపాయలు. చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
రూ. 25 వేలకే టచ్‌స్క్రీన్ ల్యాప్‌టాప్
అసుస్ డిటాచబుల్ సీఎం3 క్రోమ్‌బుక్‌ను కంపెనీ అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. ఇందులో క్రోమ్ఓఎస్ ఉంటుంది. లెనోవో క్రోమ్‌బుక్ కు పోటీగా ఇది ఆసుస్ క్రోమ్‌బుక్‌ను తీసుకొచ్చింది. దీని స్పెసిఫికేషన్లు కూడా అందులో ఉన్న మాదిరగానే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది. మిగతా దేశాల్లో ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో తెలియదు. ఇది ల్యాప్‌టాప్, టచ్ ట్యాబ్లెట్ లాగా మల్టీ టాస్క్ పని చేస్తుంది. అసుస్ క్రోమ్‌బుక్ ఫీచర్లు ఇందులో 10.5 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లేను ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 16:10గా ఉంది. ఆక్టాకోర్ 2 గిగాహెర్ట్జ్ మీడియాటెక్ 8183 ప్రాసెసర్‌పై ఈ ల్యాప్‌టాప్ పనిచేస్తుంది. 4 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు ఈఎంఎంసీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. ఇందులో డిటాచబుల్ కీబోర్డును తీసుకొచ్చారు. అంటే ఈ కీబోర్డును తీసేసి టచ్ ట్యాబ్లెట్‌లాగా కూడాపనిచేస్తుంది. ఇందులో వెనకవైపు 8 ఎంపీ కెమెరా, ముందువైపు 2 ఎంపీ ఉన్నాయి. ఇందులో 3.5 ఎంఎం ఆడియోజాక్, యూఎస్బీ టైప్-సీ పోర్టును కూడా అందించారు. ఇందులో 27Whr బ్యాటరీని తీసుకొచ్చారు. 45వాట్ ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.79 సెంటీమీటర్లుగానూ, బరువు 510 గ్రాములుగానూ ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 349.99 డాలర్లుగా(సుమారు రూ.25,500) ఉంది. 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.369.99 డాలర్లుగా(సుమారు రూ.27,000)గా ఉంది. మినరల్ గ్రే కలర్ ఆప్షన్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. చదవండి: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పై భారీ ఆఫర్ -
ప్రీమియం ఫీచర్లతో ఆసస్ ల్యాప్టాప్స్: ధర ఎంతంటే?
సాక్షి, హైదరాబాద్: టెక్నాలజీ రంగ కంపెనీ తైవాన్‌కు చెందిన ఆసస్ జెన్‌బుక్ శ్రేణిలో డ్యువో 14, ప్రో డ్యువో 15 ఓఎల్ఈడీ మోడళ్లను భారత్‌లో ప్రవేశపెట్టింది. డ్యూయల్ డిస్ప్లే వీటి ప్రత్యేకత. డ్యూయల్ స్క్రీన్ టెక్నాలజీతో, ప్రీమియం అనుభవంతో ప్రొఫెషనల్ వినియోగదారుల వర్క్‌ను మరింత సులభం చేస్తుందని కంపెనీ తెలిపింది. జెన్‌బుక్ ప్రో డ్యువో 15 ఓఎల్ఈడీకి 15.6 అంగుళాల 4కే యూహెచ్డీ నానోఎడ్జ్ టచ్ డిస్ప్లే, స్టైలస్ సపోర్ట్‌తో సెకండరీ 14.1 అంగుళాల స్క్రీన్‌ప్యాడ్ పొందుపరిచారు. 32జీబీ ర్యామ్, 1టీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ (ఎస్ఎస్డీ), ఇంటెల్ కోర్ ఐ 9 ప్రాసెసర్‌తో వస్తున్న దీని ధర రూ.2,39,990. (ఆరేళ్లలో కోటి స్మార్ట్ఫోన్లు) జెన్‌బుక్ డ్యువో 14 మోడల్‌కు 14 అంగుళాల ఎల్ఈడీ బ్యాక్‌లైట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 12.65 అంగుళాల స్క్రీన్‌ప్యాడ్ ఏర్పాటు ఉంది. 2 జీబీ ర్యామ్‌తో ఎన్విడియా జిఫోర్స్ ఎంఎక్స్ 450 గ్రాఫిక్స్ కార్డ్ కూడా లభ్యం. విండోస్ 10 హోమ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఇవి పనిచేస్తాయి. ధర రూ.99,990. లభ్యత : జెన్‌బుక్ డ్యువో 14 కొనుగోలుకు అందుబాటులో ఉండగా, ప్రో డుయో 15 వచ్చే నెలలో అందుబాటులోకి రానుంది. -
అరచేతిలో ఇమిడే ప్రొజెక్టర్
టీవీ రిమోట్ గురుంచి జరిగే గొడలు మనం ప్రతి ఇంట్లో చూస్తూనే ఉంటాం. నచ్చిన ప్రోగ్రామ్‌ను చూసేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా పోటీ పడుతూ ఉంటారు. అయితే స్మార్ట్ఫోన్లు వచ్చాక ఈ గొడవ తీరిందని కొందరు అంటారు గానీ, పెద్ద టీవీపై సినిమా వీడియోలు చూసేందుకు, ఆరు అంగుకాల మొబైల్ స్క్రీన్‌పై చూసేందుకు చాలా తేడా ఉంది. అయితే... గదికో టెలివిజన్ పెట్టుకోవాలా? అని అడగకండి. ఎంచక్కా పైన ఫాటోలో ఉన్న 'జెన్‌బీమ్ లట్టె' పోర్టబుల్ ప్రాజెక్టర్‌ను తెచ్చేసుకుంటే సరిపోతుందని అంటోంది తైవాన్ స్మార్ట్ ఫోన్ కంపెనీ అసుస్.(చదవండి: ఇక టెలివిజనూ.. వైర్లెస్) అరచేతిలో ఇమిడిపోయేంత సైజు మాత్రమే ఉండే ఈ ప్రొజెక్టర్ తో గోడపై 120 అంగుళాల సైజున్న బొమ్మ చూడవచ్చు. పిక్చర్ క్వాలిటీ 720 పిక్సెల్ వరకూ ఉంటుంది. ఇంటి లోపల, బయట కూడా యూట్యూబ్ వీడియోలు, వీడియో గేమ్స్ ఆడేందుకు అనువైంది ఈ జెన్‌బీమ్ లట్టె. అవసరమైతే కిక్స్టాండ్పై లేదా ట్రైపాడ్‌పై కూడా ఏర్పాటు చేసుకుని నచ్చిన సినిమాను ఎంచక్కా చూసేయవచ్చు. ప్రొజెక్టర్ ద్వారా వచ్చే వెలుగు ఓ మోస్తరుగా (300 లూమెన్స్) ఉంటుంది. గదిలో కిటికీలన్నీ మూసుకుని, లైట్లు ఆర్పేసుకుంటే బొమ్మ స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ చెబుతోంది. ఆడియో కోసం ఇందులోనే పది వాట్ల స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. సినిమాలు, వీడియోలు, సంగీతం కోసం వేర్వేరుగా ఆడియో సెట్టింగ్స్ ఉన్నాయి. 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ డివైస్‌ను ఏకధాటిగా 3 గంటల పాటు వాడొచ్చు. ఈ ఏడాది కన్స్యూమర్ ఎలక్రానిక్స్, టెక్నాలజీ షో (సీఈఎస్ 2021)లో తొలిసారి ప్రదర్శించిన 'జెన్‌బీమ్ లట్టె' ధర తేలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే. -
ఫ్లిప్‌కార్ట్: మొబైల్స్ పై భారీ డిస్కౌంట్స్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 పేరిట కొత్త సేల్ ని తీసుకొచ్చింది. నేటి నుండి(డిసెంబర్ 18) నుండి డిసెంబర్ 22 వరకు ఈ సేల్ కొనసాగనున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్పీకర్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్స్‌పై భారీ డిస్కౌంట్స్ అందిస్తుంది. సేల్ లో భాగంగా 10 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్(రూ.1,500 వరకు) ఇవ్వడానికి ఫ్లిప్‌కార్ట్ ఎస్బిఐ కార్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం ఈ సేల్ లో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమమైన డీల్స్ మీకోసం మేము అందిస్తున్నాం.(చదవండి: పదకొండు వేలకే రెడ్మీ 9 పవర్) పోకో ఎక్స్ 3 మొబైల్ 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 4,000 రూపాయల ధర తగ్గింపుతో 15,999 రూపాయలకు లభిస్తుంది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ఆర్ మొబైల్ 3జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 8,900 రూపాయల ధర తగ్గింపుతో 38,999 రూపాయలకు లభిస్తుంది. ఐఫోన్ 11 ప్రో మొబైల్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ 26,600 రూపాయల ధర తగ్గింపుతో 38,999 రూపాయలకు లభిస్తుంది. ఎల్జీ జీ 8 ఎక్స్ మొబైల్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 44,000 రూపాయల ధర తగ్గింపుతో 25,990 రూపాయలకు లభిస్తుంది. ఆసుస్ రోగ్ ఫోన్ 3 మొబైల్ 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 11,000 రూపాయల ధర తగ్గింపుతో 44,999 రూపాయలకు లభిస్తుంది. ఎల్జీ వెల్వెట్ డ్యూయల్ స్క్రీన్ మొబైల్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 15,000 రూపాయల ధర తగ్గింపుతో 39,990 రూపాయలకు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ 2020 సేల్ లో భాగంగా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై ఉత్తమ ఆఫర్లు ప్రకటించింది. ఆపిల్ యొక్క హోమ్‌పాడ్ స్మార్ట్ స్పీకర్ ఈ సేల్ లో భాగంగా 16,900(ఎంఆర్పి రూ.19,900)కే లభిస్తుంది. హోమ్‌పాడ్ ఎయిర్‌ప్లే 2కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఆసుస్ సన్నని, తేలికపాటి వివోబుక్ 14 ల్యాప్‌టాప్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.40,990(ఎంఆర్పి రూ.54,990)కి లభిస్తుంది. ల్యాప్‌టాప్ ఏఎండీ యొక్క రైజెన్ 5 క్వాడ్-కోర్ సిపియుతో పనిచేస్తుంది. ఇది 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డితో వస్తుంది. మీరు పెద్ద స్క్రీన్ టీవీని కొనాలని భావిస్తుంట శామ్సంగ్ 55-అంగుళాల స్మార్ట్ ఎల్ఈడీ టీవీ(యుఎ 55 టియు 8000 కెఎక్స్ఎక్స్ఎల్) సేల్ లో రూ.62,590(ఎంఆర్పి రూ .86,900)కి లభిస్తుంది. ఎస్బిఐ కార్డుదారులు 10 శాతం(రూ.1,500 వరకు) అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు. మీరు కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఎంఎస్ఐ జీఎఫ్ 63 గేమింగ్ ల్యాప్‌టాప్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా రూ.54,990 (ఎంఆర్పి రూ.94,990)కి లభిస్తుంది. ల్యాప్‌టాప్ 9వ తరం ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. దీనిలో 8 జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్డి ఉన్నాయి. గ్రాఫిక్స్ కోసం, ఎన్విడియా జిఫోర్స్ జీటీఎక్స్ 1650 కార్డ్ ఉంది. -
ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్
ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కొత్తగా మొబైల్స్ బొనాంజా సేల్ ని తీసుకొచ్చింది. ఈ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ ద్వారా కొనుగోలుదారుల కోసం ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న కొన్ని స్మార్ట్ఫోన్లను ఉత్తమ ధరకు అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ డిసెంబర్ 7 నుండి డిసెంబర్ 10 వరకు కొనసాగుతుంది. ఈ మూడు రోజుల్లో షియోమి, రియల్మీ, ఆసుస్, శామ్సంగ్, పోకో, ఒప్పో, ఆపిల్ మరియు ఇతర ప్రముఖ పేర్ల బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై బెస్ట్ డీల్స్ ని తీసుకొచ్చింది. దీంతోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల ద్వారా ఫోన్లు కొనుగోలు చేస్తే రూ.1,750 తగ్గింపు లభించనుంది.(చదవండి: టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే!) ఫ్లిప్‌కార్ట్‌లో బొనాంజా సేల్ సందర్బంగా షియోమీ మీ 10టీ, శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 4, ఆసుస్ రాగ్ ఫోన్ 3, మోటో రాజర్(4జీ వెర్షన్) వంటి స్మార్ట్ ఫోన్లపై భారీ తగ్గింపును అందించననున్నారు. షియోమి మీ 10టీ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా డేస్ సేల్ సందర్భంగా రూ.35,999(అసలు ధర రూ.39,999)కి లభిస్తుంది. అలాగే, ఆసుస్ రోగ్ ఫోన్ 3 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ 44,999 రూపాయలకు లభిస్తుంది. రెడ్మీ 9ఐ 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999 నుంచే ప్రారంభం కానుంది. రియల్ మీ నార్జో 20 ప్రోపై కూడా రూ.1,000 తగ్గింపును అందించారు. దీంతో ఈ ఫోన్ ధర రూ.13,999 నుంచి ప్రారంభం కానుంది. ఒప్పో ఏ31 ధర కూడా రూ.10,990కు తగ్గింది. ఇక మోటో జీ9 ధర రూ.9,999 నుంచి ప్రారంభం కానుంది. ఐఫోన్ ఎస్ఈ 64 జీబీ వేరియంట్ ధర రూ.32,999 నుంచి ప్రారంభం కానుంది. శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 41 రూ.15,499(అసలు ధర రూ.19,999)కి లభిస్తుంది. కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్‌తో పాటు ఎక్స్ఛేంజ్ మరియు ఇఎంఐ ఆఫర్లను కూడా పొందవచ్చు. -
ఆసస్ ‘ఆర్ఓజీ ఫోన్ 2 ఇండియా ఎడిషన్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ’ఆసస్’ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొచ్చింది. ‘ఆర్ఓజీ ఫోన్ 2 ఇండియా ఎడిషన్’ పేరుతో తన ఫ్లాగ్షిప్ ఫోన్లో సెకండ్ ఎడిషన్‌ను సోమవారం విడుదలచేసింది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ అధునాత ఫోన్ ధర రూ. 37,999గా నిర్ణయించింది. ఈనెల 30వ తేదీ నుంచి వినియోగదారులకు ఫోన్ అందుబాటులో ఉండనుంది. కాగా త్వరలోనే 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఫోన్ విడుదలకానుందని, దీని ధర రూ. 59,999 ఉండనుందని ప్రకటించింది. -
ఆసుస్ సూపర్ గేమింగ్ ఫోన్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆసుస్ కంపెనీ సూపర్ గేమింగ్ ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. నెక్స్ట్-జెన్ గేమింగ్-ఫోకస్‌గా రోగ్ ఫోన్‌ను సోమవారం ఆవిష్కరించింది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ , 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ స్క్రీన్ స్నాప్‌డ్రాగన్ 855 ప్లస్ సాక్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, బీఫీ బ్యాటరీ, గేమ్ కూలింగ్, డ్యూయల్ వైబ్రేషన్ మోటార్లు ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. రోగ్-2లో ప్రాసెసర్ 15 శాతం వేగవంతమైన గ్రాఫిక్స్ పనితీరును అందిస్తుందని కంపెనీ తెలిపింది. రెండు వేరియంట్లలో 18 వాట్స్, 30వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ బ్యాటరీని అమర్చింది. బిగ్ బిలియన్ డేస్ అమ్మకంలో భాగంగా ఈ హ్యాండ్సెట్ దేశంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకానికి లభ్యం కానుంది. ఆసుస్ రోగ్ ఫోన్ -2 ఫీచర్లు 6.59-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 9.0పై 2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ 48+13 ఎంపీ రియర్ కెమెరా 24 ఎంపీ సెల్పీ కెమెరా 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ధరలు 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ .37,999 12జీబీ ర్యామ్ /512 జీబీ స్టోరేజ్ వేరియంట్, రూ. 59,999 -
ఆసుస్ నుంచి రెండు కొత్త ఫోన్లు
తైవాన్ టెక్ దిగ్గజం ఆసుస్ డిసెంబర్ 11న రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లోకి తెచ్చిన ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్1 కి కొనసాగింపుగా జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్2ను నాచ్ డిజైన్‌తో తీసుకురానుంది. ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ద్వారా డిసెంబర్ 11న మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ చేయనుంది. దీనితోపాటే సర్ప్రైజ్ లాంచ్‌గా జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2ని కూడా రిలీజ్ చేయనుంది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎమ్2 ఫీచర్లు 6.3 ఇంచ్‌ల డిస్ప్లే 2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12+5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు 13 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : దాదాపు రూ.19,100 జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2 ఫీచర్లు 6.3 ఇంచ్‌ల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : దాదాపు రూ. 13,800 -
మార్కెట్లోకి ఆసస్ ‘జెన్‌ఫోన్ 5జెడ్’
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘ఆసస్’ తాజాగా ‘జెన్‌ఫోన్ 5జెడ్’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇది మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. 6 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.29,999గా, 6 జీబీ ర్యామ్/ 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.32,999గా, 8 జీబీ ర్యామ్/ 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.36,999గా ఉంది. జెన్‌ఫోన్ 5జెడ్ స్మార్ట్‌ఫోన్స్ జూలై 9 నుంచి కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు మెమరీ, 6.2 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్, 19:9 డిస్ప్లే, 12 ఎంపీ+ 8 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్ (ఆండ్రాయిడ్ పి అప్డేట్ అస్యూరెన్స్), ఫేస్ ఆన్‌లాక్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని వివరించింది. కాగా కంపెనీ నుంచి నాచ్ డిస్ప్లేతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. -
ఆసుస్ జెన్‌ఫోన్: ఫ్లిప్‌కార్ట్, వోడాఫోన్ కిల్లర్ డీల్స్
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి, మోటరోలా లాంటి దిగ్గజ కంపెనీలకు షాకిచ్చేలా ఆసుస్ కంపెనీ సోమవారం లాంచ్ చేసిన తాజా స్మార్ట్‌ఫోన్‌పై వోడాఫోన్ నెట్వర్క్ ద్వారా బంపర్ ఆఫర్లు అందిస్తోంది. అలాగే ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న కిలర్స్ డీల్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. జెన్ ఫోన్ మాక్స్ ప్రో ఎం 1 3జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ రూ. 10,999 ధరలో, 4జీబీ ర్యామ్/64 జీబీ రూ. 12,999గాను నిర్ణయించింది. డీప్ సీ బ్లాక్, గ్రే రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. మాక్స్ బాక్స్ పేరుతో మరో అదనపు బహుమతి కూడా ఉంది. స్పీకర్ సౌండ్ ఈ డివైస్ రెండు రెట్లు పెంచుతుందని కంపెనీ వెల్లడించింది. వోడాఫోన్ కిల్లర్ డీల్: వోడాఫోన్ భాగస్వామ్యంతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 3200 రూపాయల దాకా అదనపు డేటా ప్రయోజనాలను ప్రకటించింది. రూ. 199 ప్రీపెయిడ్ ప్యాకేజీలు వాడే వోడాఫోన్ యూజర్లకు అదనంగా 10జీబీ డేటా ఒక సంవత్సరం మొత్తం ఫ్రీ. రూ. 499 ప్యాకేజీలపై వోడాఫోన్ రెండు సంవత్సరాలపాటు10జీబీ అదనపు డేటా ఉచితం. మ 6జీబీ వెర్షన్: 6 జీబీ వెర్షన్‌ను కూడా త్వరలోనే లాంచ్ చేయనున్నట్టు కూడా కంపెనీ చెప్పింది.ముఖ్యంగా ఫ్రంట్ అండ్ రియర్ కెమెరాలను 16ఎంపీకి అప్‌గ్రేడ్ చేసి, ధరలో రూ.14999 గా ఉంటుంది. ఇది కూడా ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్‌లో మే 3వ తేదీనుంచి విక్రయానికి లభ్యం. ఫ్లిప్‌కార్ట్ కిల్లర్ డీల్: కేవలం రూ.49లకే కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ అందిస్తోంది. హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, స్క్రీన్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్ ఏదైనా సంవత్సరం పాటు ఫ్రీ సర్వీసు. అంతేకాదు ఏదైనా మరమ్మతు చేయాల్సి వస్తే.. వినియోగదారుని ఇంటినుంచే ఫోన్ పికప్ చేసుకుని రిపేర్ చేస్తామని ప్రకటించింది.. ఒక వేళ 10రోజుల్లో ఫోన్ రిపేర్ సాధ్యం కాకపోతే ఫోన్‌ను రీప్లేస్ చేస్తామని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ప్రకటించారు. ఇంకా నో ఇఎంఐ కాస్ట్ సౌకర్యంతో పాటు సెలెక్ట్ మోడల్స్‌పై 1000 రూపాయల ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తోంది. జెన్‌ఫోన్ మాక్స్ ప్రొ ఎం1 ఫీచర్లు 5.99 స్క్రీన్ ఫుల్ వ్యూ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఓరియో 8.1 13 + 5 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమీకి బ్యాడ్ న్యూస్: ఆసుస్ కొత్త స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుంటున్న షావోమికి బ్యాడ్ న్యూస్. ఈ చైనాకంపెనీకి షాకిచ్చేలా తైవాన్ కంపెనీ ఆసుస్ సిద్ధమవుతోంది. మిడ్‌రేంజ్ లో మోటరోలా జీ సిరీస్‌కు, షావోమీ రెడ్ మీ సిరీస్ దీటుగా సరికొత్త మొబైల్ నులాంచ్ నేడు (సోమవారం) లాంచ్ చేసింది. రెడ్మినోట్ ప్రొ కంటే 30 నిమిషాల వేగంగా తమ 5000ఎంఏహెచ్ బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఆసుస్ సీఈవో జెర్రీ షేన్ ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేశారు. హయ్యస్ట్ ఆడియో క్వాలిటీఈ సార్ట్‌ఫోన్ ప్రత్యేకత అని ఆయన చెప్పారు. 5.99 అంగుళాల(18.9 ఆస్పెక్ట్ రేషియో) డిస్ప్లే, డ్యుయల్ రియర్ కెమెరా, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ అండ్ ఫేషియల్ అన్‌లాక్, 2 టెర్రాబైట్స్వరకు మొమరీని విస్తరించుకునే అవకాశం తదితర ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేక భాగస్వామ్యం ద్వారా 3జీబీ/32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ రెండు వెర్షన్లలో ప్రవేశపెట్టింది. జెన్‌ఫోన్ మాక్స్ ప్రొ ఎం1 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెడ్ మి నోట్ 5 ప్రొ లో ఉన్న క్వాల్కం స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్‌నే అమర్చింది. జెన్‌ఫోన్ మాక్స్ ప్రొ ఎం1 ఫీచర్లు 5.99 స్క్రీన్ ఫుల్ వ్యూ డిస్ప్లే ఆండ్రాయిడ్ఓరియో 13 + 5 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: ఇక ధరల విషయానికి వస్తే జెన్‌ఫోన్ మాక్స్ ప్రో 4జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 10,999, 3జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధరను రూ. 12,999గా నిర్ణయించింది. -
ఆసుస్‌తో ఫ్లిప్‌కార్ట్ : కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్, తైవనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు ఆసుస్ అధికారిక భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాయి. ఈ భాగస్వామ్యంలో ఫ్లిప్‌కార్ట్ ద్వారా లేటెస్ట్, గ్రేటెస్ట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయాలని ఆసుస్ నిర్ణయించింది. 2020 నాటికి అన్ని స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో 25 శాతం తానే పొందాలని ఫ్లిప్‌కార్ట్ కూడా నిర్ణయం తీసుకుంది. దీంతో స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పరుచుకుని తమ బ్రాండ్‌ను పెంచుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఓ టెక్ దిగ్గజంతో తాము ఎక్స్‌క్లూజివ్ పార్టనర్షిప్ ఏర్పరుచుకోనున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి ఈ వారం మొదట్లోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన సందర్భంగానే భారత్‌లో 100 మిలియన్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను యాడ్ చేసుకోవాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో భారత కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని మేకిన్ ఇండియా ప్రొగ్రామ్‌లో భాగంగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయాలనుకుంటున్నట్టు ఆసుస్ సీఈవో జెర్రీ షేన్ తెలిపారు. ఏప్రిల్ 23న ఆసుస్ జెన్‌ఫోన్ 4 మ్యాక్స్ ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయబోతోన్నట్టు తెలిపారు. దీన్ని ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్‌స్ట్రీమ్ చేస్తూ లాంచ్ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ డివైజ్‌ను ఆసుస్ గతేడాది ఆగస్టులోనే రివీల్ చేసింది. కొన్ని కొన్ని మార్కెట్లలోనే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం భారత మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ఆసుస్ ప్రకటించనప్పటికీ, రూ.15వేల నుంచి రూ.20వేల మధ్యలో ఈ ఫోన్ ధర ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ ఫోన్‌కు 5.5 అంగుళాల ఎల్సీడీ ఐపీఎస్ డిస్ప్లే, 2.5డీ గ్లాస్, స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండనున్నట్టు సమాచారం. -
ఆసుస్ ఫోన్లకు జియో ఫుట్‌బాల్ ఆఫర్
ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో, మొబైల్ హ్యాండ్సెట్ తయారీదారి ఆసుస్ జతకట్టాయి. ఈ భాగస్వామ్యంలో కొత్త ఆసుస్ జెన్‌ఫోన్ ఫోన్లపై జియో తన ఫుట్‌బాల్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ కింద జెన్‌ఫోన్ మోడల్స్‌పై రూ.2,200 క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు తెలిపింది. జెన్‌ఫోన్ మోడల్స్ కొనుగోలు చేసిన కస్టమర్లు, జియోసిమ్‌ను తమ డివైజ్‌లో వేసుకుని యాక్టివేట్ చేసుకుంటే, కొత్త జియో ఫుట్‌బాల్ ఆఫర్‌కు యూజర్లు అర్హులవుతారు. జియో ఫుట్‌బాల్ ఆఫర్ కింద ఎంపికచేసిన జెన్‌ఫోన్ మోడల్స్‌లో... ఆసుస్ జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5, జెన్‌ఫోన్ 3 5.2, జెన్‌ఫోన్ 3 5.5, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.2, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్5.5, జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, జెన్‌ఫోన్ 4 సెల్ఫీ లైట్, జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రొ, జెన్‌ఫోన్ ఏఆర్, జెన్‌ఫోన్ డీలక్స్, జెన్‌ఫోన్ గో 4.5 ఎల్టీఈ, జెన్‌ఫోన్ గో 5.0 ఎల్టీఈ, జెన్‌ఫోన్ గో 5.5 ఎల్టీఈ, జెన్‌ఫోన్ లైవ్, జెన్‌ఫోన్ లైవ్(డబ్ల్యూడబ్ల్యూ), జెన్‌ఫోన్ మ్యాక్స్, జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ ఆల్ట్రా, జెన్‌ఫోన్ జూమ్ ఎస్‌లు ఉన్నాయి. ఈ ఫోన్లపై జియో తన ఫుట్‌బాల్ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ ఆఫర్ కొత్త, పాత జియో యూజర్లందరికీ అందుబాటులో ఉండనుంది. ఒకవేళ ఇప్పటికే జియో యూజర్ అయి ఉంటే, కొత్త జియోఫోన్‌లో ఆ పాత సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. జియో అందిస్తున్న రూ.2,200 క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు ఓచర్ల రూపంలో పొందనున్నారు. మైజియో యాప్‌లో ఇవి క్రెడిట్ అవుతాయి. తర్వాత వీటిని రీఛార్జ్ చేసుకునే సమయంలో రిడీమ్ చేసుకోవచ్చు. అయితే జియో ఫుట్‌బాల్ ఆఫర్ పొందాలంటే యూజర్లు రూ.198 లేదా రూ.299 ప్లాన్‌తో తప్పనిసరిగా రీఛార్జ్ చేయించుకోవాలి. ఈ క్యాష్‌బ్యాక్ ఓచర్లను 2022 మే 31 వరకు వాడుకోవచ్చు. -
ఆ ఏడు స్మార్ట్ఫోన్లపై ధర తగ్గింపు
ఆసుస్ ఇండియా జెన్‌ఫోన్ సిరీస్‌లో ఏడు స్మార్ట్ఫోన్లపై శాశ్వతంగా ధర తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. జెన్‌ఫోన్ 3(5.2), జెన్‌ఫోన్ 3(5.5), జెన్‌ఫోన్ మ్యాక్స్, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్(5.2), జెన్‌ఫోన్ 3 మ్యాక్స్(5.5), జెన్‌ఫోన్ గో(5.0), జెన్‌ఫోన్ గో(5.5)లపై ధర తగ్గింపు వర్తిస్తున్నట్టు పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుస్ ఆన్లైన్, ఆఫ్‌లైన్ పార్టనర్ల వద్ద ఈ కొత్త ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆసుస్ ఇండియా ప్రకటన అనంతరం, జెన్‌ఫోన్ 3(జడ్ఈ552కేఎల్) ధర రూ.16,999 నుంచి రూ.14,999కు తగ్గింది. జెన్‌ఫోన్ 3 మ్యాక్స్(జడ్సీ520టీఎల్) అంతకముందు రూ.9999కు లభ్యమవుతుండగా.. ప్రస్తుతం రూ.8,499కే అందుబాటులోకి వచ్చింది. ఆసుస్ జెన్‌ఫోన్ (జడ్ఈ520కేఎల్) స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ ధర తగ్గింపుతో రూ.11,999కే అందుబాటు జెన్‌ఫోన్ 3 మ్యాక్స్(జడ్సీ553కేఎల్) ధర రూ.12,999 నుంచి రూ.9,999కు తగ్గింది. జెన్‌ఫోన్ మ్యాక్స్(జడ్సీ550కేఎల్) ధర రూ.7,499కే అందుబాటు ఇతర బడ్జెట్ ఆసుస్ జెన్‌ఫోన్ గో సిరీస్ స్మార్ట్ఫోన్లపై కూడా ధర తగ్గింది. జెన్‌ఫోన్ గో 5.0 స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,999 నుంచి రూ.6,499కి తగ్గింది జెన్‌ఫోన్ గో 5.5 స్మార్ట్‌ఫోన్‌ను రూ.6,999కే విక్రయించనున్నట్టు పేర్కొంది దేశీయ కస్టమర్లను ఆకట్టుకోవడంలో జెన్ఫోన్లు చాలా విజయవంతమైనవి అని, భవిష్యత్తులో కూడా మరింత మంది కస్టమర్లను ఆకట్టుకుంటాయని ఆకాంక్షిస్తున్నామని ఆసుస్ ఇండియా సౌతాషియా అండ్ కంట్రీ మేనేజర్, రీజనల్ హెడ్ పీటర్ ఛాంగ్ చెప్పారు. ఈ కొత్త ఏడాదిలో తమ వ్యూహం రెండు పిల్లర్లపై ఉందని, ఒకటి మంచి టెక్నాలజీ అందించడం కాగ, రెండోది ధరతో ఆకట్టుకోవడమని ఆయన పేర్కొన్నారు. -
భారత్‌లోకి జెన్‌ఫోన్ 4 సిరీస్ స్మార్ట్ఫోన్లు
తైవాన్‌కు చెందిన కంప్యూటర్, ఫోన్ హార్డ్‌వేర్ కంపెనీ ఆసుస్, జెన్‌ఫోన్ 4 సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత్‌లోకి తీసుకొస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఆహ్వానాలను కూడా కంపెనీ పంపుతోంది. సెప్టెంబర్ 14న జరుగబోయే ఈవెంట్లో వీటిని లాంచ్చేయనున్నట్టు తెలుస్తోంది. జెన్‌ఫోన్ 4 సిరీస్ కింద ఆరు స్మార్ట్ఫోన్లను ఆసుస్ గత నెలలోనే తైవాన్‌లో ఆవిష్కరించింది. అవి జెన్‌ఫోన్ 4 ప్రొ, జెన్‌ఫోన్ 4, జెన్‌ఫోన్ 4 సెల్ఫీ, జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రొ, జెన్‌ఫోన్ 4 మ్యాక్స్, జెన్‌ఫోన్ 4 మ్యాక్స్ ప్రొలు. అయితే వచ్చే వారంలో నిర్వహించబోతున్న ఈవెంట్లో ఏ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేస్తుందో ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మొత్తం ఆరు స్మార్ట్‌ఫోన్లలు జెన్‌ఫోన్ 4, జెన్‌ఫోన్ 4 ప్రొ రెండు ఫ్లాగ్షిప్ డివైజ్‌లు. జెన్‌ఫోన్ 4 సెల్ఫీ, జెన్‌ఫోన్ 4 సెల్ఫీ ప్రొ మధ్యతరహా ఫోన్లు. అదేవిధంగా జెన్‌ఫోన్ 4 మ్యాక్స్, జెన్‌ఫోన్ 4 మ్యాక్స్ ప్రొలు పెద్ద బ్యాటరీ కలిగిన డివైజ్‌లు. వీటి ఫీచర్ల విషయానికొస్తే.. జెన్‌ఫోన్ 4, జెన్‌ఫోన్ 4 ప్రొలు కొన్ని హార్డ్‌వేర్ అంశాలకు మినహా మిగతావన్నీ సమానంగా ఉన్నాయి. జెన్‌ఫోన్ 4 ప్రొ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీతో పాటు 6జీబీ ర్యామ్‌ను, 128జీబీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. జెన్‌ఫోన్ 4 రెండు వేరియంట్లలో మార్కెట్లోకి వచ్చింది. స్నాప్‌డ్రాగన్ 630ఎస్ఓసీ, స్నాప్‌డ్రాగన్ 660 ఎస్ఓసీతో 6జీబీ ర్యామ్‌ను, 64జీబీ స్టోరేజ్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఫోటోగ్రఫీని తీసుకుంటే, డ్యూయల్ కెమెరా లెన్స్‌లో వెనుకవైపు 12ఎంపీ, 8ఎంపీ సెన్సార్స్‌తో జెన్‌ఫోన్ 4 ను కంపెనీ లాంచ్చేసింది. ప్రొ వేరియంట్ వెనుకవైపు 16ఎంపీ, 12ఎంపీ సెన్సార్లను కలిగి ఉంది. ఈ రెండు స్మార్ట్ఫోన్లకు 8మెగాపిక్సల్తోనే సెల్ఫీ కెమెరా. ఇక జెన్‌ఫోన్ 4 మ్యాక్స్, జెన్‌ఫోన్ 4 మ్యాక్స్ ప్రొ స్మార్ట్ఫోన్లకు 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యముంది. సెల్ఫీ సెంట్రిక్తో వచ్చిన జెన్‌ఫోన్ 4 సెల్ఫీ, సెల్ఫీ ప్రొ స్మార్ట్ఫోన్లు 20ఎంపీ, 24ఎంపీ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉన్నాయి. -
ఆసుస్ కొత్త ఫోన్, ఫోటోగ్రఫీ స్పెషల్
తైవనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఆసుస్ గురువారం ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఫోటోగ్రఫీ లవర్స్ కోసం డ్యూయల్ కెమెరా సెటప్‌తో 'జెన్‌ఫోన్ జూమ్ ఎస్' పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ హ్యాండ్సెట్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. దీని ధర 26,999 రూపాయలు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు వెనుకవైపు 12 ఎంపీ డ్యూయల్ కెమెరా, ఫ్రంట్ వైపు 13 ఎంపీ కెమెరా ఉన్నాయి.. 2.3ఎక్స్ ఆప్టికల్, 12ఎక్స్ డిజిటల్ జూమ్‌ను ఇది కలిగి ఉంది. తక్కువ వెలుతురులో ఫోటోగ్రఫీ కోసం 'ఆసుస్ సూపర్పిక్సెల్ కెమెరా' ఫీచర్‌తో ఇది మార్కెట్లోకి వచ్చింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఆసుస్ ఇండియా కొత్త జెన్‌ఫోన్ జూమ్ ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తూ... ఫోటోగ్రఫీపై అభిరుచి కలిగిన ఔత్సాహికులకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఆసుస్ ఇండియా సిస్టమ్ బిజినెస్ గ్రూప్, దక్షిణాసియా, దేశీయ అధినేత పీటర్ ఛాంగ్ చెప్పారు. ఈ ఫోన్ అత్యధికంగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యముంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే, రెండు రోజుల పాటు పనిచేయనుంది. రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌ను ఇది సపోర్టు చేస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625తో ఇది రూపొందింది. ఈ ఫోన్ మిగతా ఫీచర్లు... 5.50 అంగుళాల డిస్ప్లే 2 గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 4జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆండ్రాయిడ్ 6.0 4కే లో వీడియోలు షూట్ చేసుకునే సదుపాయం -
అసుస్ స్మార్ట్‌ఫోన్స్: విత్ డబుల్ సెల్ఫీ కెమెరా
స్మార్ట్‌ఫోన్ మేకర్ అసుస్ రెండు స్మార్ట్‌ఫోన్ లను త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. జెన్‌ఫోన్ 4 సెల్ఫీ, జెన్‌ఫోన్ 4 సెల్పీ ప్రొ పేరుతో రెండు సెల్ఫీ మోడల్స్‌ను ఈ నెల 17న విడుదల చేయనుంది. అదీ రెండు సెల్పీ కెమెరాలతో ఈ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. సెల్పీ వెర్షన్లో 20,8 మెగాపిక్సెల్ కెమెరాలతో, సెల్ఫీ ప్రో వెర్షన్లో 24ఎంపీ, 5 ఎంపీ సెల్పీ కెమెరాలు విత్ ఫ్లాష్ తో రూపొందించడం ప్రధాన ఆకర్షణకానుంది. ఇంకా డ్యుయల్ సిమ్ స్లాట్‌తో పాటు ఒక స్పెషల్ మైక్రో ఎస్డీ స్లాట్ ఉండనున్నాయి. ఇక ధరల విషయానికి వస్తే జెన్ ఫోన్ 4 సెల్ఫీ ధర సుమారుగా రూ.22,500లుగాను, హై ఎండ్ మోడల్ జెన్ ఫోన్ 4 సెల్పీ ప్రొ సుమారు రూ. 30,000 గాను ఉంటుందని అంచనా. జెన్‌ఫోన్ 4 సెల్పీ ప్రొ ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16 ఎంపీ బ్యాక్ కెమెరా 24 మెగాపిక్సెల్ +5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ వీవోఎల్టీఈ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ దాదాపు ఇవే ఫీచర్లను జెన్ ఫోన్ 4 సెల్పీలో కూడా పొందుపరచింది. -
జియో ప్రైమ్ యూజర్లకు మరో బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో తన ప్రైమ్ ఖాతాదారులకు మరో బంపర్ ఆఫర్ అందిస్తోంది. ముఖ్యంగా దేశీయంగా ఆసుస్ ఫోన్లను కొత్తగా కొన్న యూజర్లకు శుభవార్త. రిలయన్స్ జియో తో భాగస్వామ్యంతో, ఆసుస్ ఎడిషనల్ డేలా పేరుతో ఒక పథకాన్ని అందిస్తోంది. తాజా ప్లాన్ ప్రకారం 10 రీఛార్జ్ లపై నెలకు 10జీబీ అదనపు డేటాను పొందవచ్చు. జూన్ 16, 2017,లేదా ఆ తరువాత అసుస్ స్మార్ట్ఫోన్లను కొన్న వారికి ఈ ఆఫర్ వర్తించనుంది. వీరికి 10 నెలల పాటు నెలకు 10 జీబీ జియో 4జీ డేటా, మొత్తం 100 జీబీ డేటా ఉచితంగా ఆఫర్ చేస్తోంది. మూడు కేటగిరీలుగా ఈ ఉచిత డేటాను ఆఫర్ చేస్తోంది. అయితే ఆసుస్ స్మార్ట్‌ఫోన్‌లో జియో సిమ్‌ను అసుస్ ఫోన్లో వేసి రూ.309 ఆపైన ప్యాక్‌ను రీచార్జి చేసుకుంటే చాలు. ఈ ఆఫర్ కింద వస్తున్న వినియోగదారులకు జియోలో రూ .309 లేదా అంతకంటే ఎక్కువ రీచార్జ్ వచ్చే రోజుకు 1జీబీ డేటాతోపాటుగా నెలకు 10 జీబీ డేటా లభించనుంది. క్రెడిట్ పొందడానికి రీఛార్జి తరువాత వినియోగదారులకు 48 గంటలు వేచి చేయాలి. పది నెలలకు అంటే.. మార్చి 31, 2018 వరకు గరిష్టంగా 10 రీచార్జిలకు ఈ ఆఫర్‌ను వాడుకోవచ్చన్నమాట. ఆసుస్ జెన్‌ఫోన్ జూమ్, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 (5.2), జెన్‌ఫోన్ 3 (5.5) ఫోన్లను వాడే వారికి నెలకు 10 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 100 జీబీ జియో 4జీ డేటా ఉచితంగా లభిస్తున్నది. అదేవిధంగా జెన్‌ఫోన్ 2, జెన్‌ఫోన్ 2 లేజర్, జెన్‌ఫోన్ 2 లేజర్ 5.5, జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.2, జెన్‌ఫోన్ 3 మ్యాక్స్ 5.5 ఫోన్లను వాడుతున్న యూజర్లకు నెలకు 5జీబీ డేటా చొప్పున 10 నెలలకు 50 జీబీ డేటా లభిస్తుంది. ఇక జెన్‌ఫోన్ సెల్ఫీ, జెన్‌ఫోన్ మ్యాక్స్, జెన్‌ఫోన్ లైవ్, జెన్‌ఫోన్ గో 4.5 ఎల్టీఈ, జెన్‌ఫోన్ గో 5.0 ఎల్టీఈ, జెన్‌ఫోన్ గో 5.5 ఎల్టీఈ ఫోన్లను వాడుతున్న వారికి నెలకు 3 జీబీ డేటా చొప్పున 10 నెలలకు 30 జీబీ డేటా ఉచితం. మై జియో యాప్‌లో అనువర్తనాన్ని డౌన్లోడ్ చేసి ఈ దశలను పాటించాలి. యాప్ ఓపెన్ చేసి నా వోచర్లు -> వీక్షణ రసీదును -> నా నంబర్ రీఛార్జ్ -> రీఛార్జ్ నిర్ధారించండి -> రీఛార్జ్ సక్సెస్ నోటిఫికేషన్ వస్తుంది. అయితే జియో జతకట్టిన కంపెనీల్లో ఆసుస్ మొదటి కాదు. ఇంతకుముం్దు షియామి, జియోనీ కంపెనీ ఫోన్లలో కూడా జియో ఉచిత డేటాను ప్రకటించింది. మరోవైపు జూన్ నెలలో రిలయన్స్ జీయో 4 జి మొబైల్ స్పీడ్ చార్టులో టాప్‌లోఉందని ట్రాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అదిరిపోయే ఫీచర్స్‌తో 'జెన్‌ఫోన్ ఏఆర్'
'జెన్‌ఫోన్ ఏఆర్' పేరుతో మొబైల్ సంస్థ అసుస్ ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. గూగుల్ టాంగో / డేడ్రీమ్ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై ఇటీవల ఫేస్బుక్, ట్విట్వర్ ద్వారా ఒక టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన తేదీ ఇప్పటికీ తెలియకపోయినా త్వరలోనే మార్కెట్ లో దీన్ని ప్రవేశపెట్టబోతోందని తెలుస్తోంది. వినియోగదారులు వీఆర్ కంటెంట్‌ను ఆస్వాదించేలా జెన్ యుఐ వీఆర్ 360 దీని అదనపు ప్రత్యేకతగా ఉండనుందనే అంచనాలు నెలకొన్నాయి. వర్చువల్ రియాల్టీ, అగ్మెంటెడ్ రియాల్టీ ఫీచర్లు గూగుల్ డే డ్రీమ్, టాంగో ప్లాట్ ఫాం సపోర్ట్‌తో లాంచ్ కానున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. అయితే అదరగొట్టే స్పెషల్ఫీచర్స్ తో లాంచ కానున్న ఆ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే. అసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ ఫీచర్లు 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ సూపర్ అమోలెడ్ డిస్ప్లే 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ 2.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 23 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం -
లైవ్ బ్యూటిఫికేషన్ టెక్నాలజీతో ఆసుస్ కొత్తఫోన్
తైవనీస్ హ్యాండ్ సెట్ల తయారీదారి ఆసుస్ ఓ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. జెన్ ఫోన్ లైవ్(జెడ్‌బి501కేఎల్) పేరుతో ఈ ఫోన్ ను లాంచ్ చేసింది. గత ఫిబ్రవరిలోనే దీన్ని ఆవిష్కరించగా.. ప్రస్తుతం ఇది మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ ధర 9,999 రూపాయలు. నేటి నుంచే ఈ స్మార్ట్ ఫోన్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ రీటైలర్స్ లో విక్రయానికి వస్తోంది. ఆసుస్ జెన్ ఫోన్ లైవ్ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ప్రత్యేక ఆకర్షణ, లైవ్ స్ట్రీమింగ్ బ్యూటిఫికేషన్ టెక్నాలజీ. ప్రపంచంలోనే తొలి లైవ్ స్ట్రీమింగ్ బ్యూటిఫికేషన్ టెక్నాలజీతో ఇది మార్కెట్లోకి వచ్చింది. బ్యూటీలైవ్ యాప్ ను ఇది కలిగి ఉంది. సోషల్ మీడియా సైట్లలో లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చేటప్పుడు ఈ బ్యూటీలైవ్ యాప్ ఎంతో సహకరిస్తోంది. వాయిస్ క్వాలిటీ స్పష్టంగా ఉండటానికి డ్యూయల్ ఎంఈఎంలను, మంచి ఆడియో కోసం కొత్త 5-మెగ్నెంట్ స్పీకర్ ను ఇది అందిస్తోంది. ఆసుస్ జెన్ ఫోన్ లైవ్(జెడ్‌బి501కేఎల్) ఫీచర్లెలా ఉన్నాయో ఓ సారి చూద్దాం... ఆండ్రాయిడ్ మార్ష్ మాలో ఆధారితంగా జెన్ యూఐ 3.5తో ఇది రన్ అవుతోంది 5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే 2.5డీ కర్వ్డ్ గ్లాస్ క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్ 16జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13 ఎంపీ పిక్సెల్ మాస్టర్ రియర్ కెమెరా విత్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ 1.4 మైక్రోన్ పిక్సెల్ సెన్సార్ డ్యూయల్ సిమ్(నానో+మైక్రో) 4జీ వాయిస్ ఓవర్ ఎల్టీఈ 2650ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆసుస్ కొత్త ట్యాంగో 3డీ స్మార్ట్ ఫోన్
లాస్ వెగాస్ :. తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ ఆసుస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ప్రఖ్యాత సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 3డీ ట్యాంగో టెక్నాలజీ ఆధారిత జెన్ ఫోన్ ఏఆర్ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్ ను బుధవారం విడుదల చేసింది. వినియోగదారులకు అగ్ మెంటెడ్ ,వర్చువల్ రియాలిటీ అనుభవాన్ని అందించనుంది. ఇండోర్ మ్యాపింగ్, అగ్ మెంటెడ్ రియాలిటీ టాంగో కంప్యూటింగ్ ప్లాట్ ఫాం లో ఇది రెండవ మొబైల్. ట్యాంగో టెక్నాలజీ ఆధారిత మొదటి డివైస్ ను గత ఏడాది చైనా సంస్థ లెనోవో ఫ్యాబ్ 2 లాంచ్ చేసింది. మన చుట్టూ ఉన్న పరిసరాలను 3డీ స్కానింగ్ చేయగలగడం ఈ ఫోన్ ప్రత్యేకత. అయితే ధర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు జెన్ ఫోన్ ఏఆర్ ఫీచర్స్: ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 5.7- అంగుళాల సూపర్ అమోల్డ్ స్క్రీన్ క్వాల్కం స్నాప్ డ్రాగన్ 821 ప్రాసెసర్, 8జీబీర్యామ్ 23 ఎంపీ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ లాస్ వెగాస్ లో నిర్వహించిన కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ షో సీఈఎస్-2017లో దీన్ని ఆవిష్కరించింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికంలో దీన్ని అందుబాటులోకి తేనున్నట్టు అసుస్ ఛైర్మన్ జానీ షిస్ తెలిపారు. టాంగో, గూగుల్ డే డ్రీమ్ ఆధారిత మొబైల్ ను లాంచ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. స్మార్ట్ ఫోన్ రంగంలో ఇది మరో సంచలనమని మార్కెటింగ్ చీఫ్ ఎరిక్ హెర్మాన్ సన్ చెప్పారు. మరోవైపు డజన్ల కొద్దీ ట్యాంగో ఆధారిత యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు గూగుల్ ప్రాజెక్ట్ ట్యాంగో లీడర్ జానీ లీ వెల్లడించారు. -
ఎసూస్ నుంచి కొత్త 4జీ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన టెక్నాలజీ దిగ్గజ కంపెనీ ‘ఎసూస్’ తాజాగా ‘జెన్‌ఫోన్ గో 4.5’ అనే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.6,999గా ఉంది. ఆండ్రాయిడ్ మార్‡్షమాలో 6.0 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో జెన్‌యూఐ ఇంటర్ఫేస్, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ వివరించింది. -
ఆసెస్ ఫోన్.. తక్కువ ధరకే 4జీ
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఆసుస్ మరో కొత్త ఫోన్‌ను మంగళవారం విడుదల చేసింది. ఆసుస్ జెన్‌ఫోన్ గో ధర రూ.6,999గా సంస్థ ప్రకటించింది. 4జీ టెక్నాలజీ కలిగిన ఈ ఫోన్ ఆన్లైన్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉందని తెలిపింది. ప్రత్యేకతలు - 8 మెగాపిక్సెల్స్ వెనుక కెమెరా - 2 మెగాపిక్సెల్స్ ముందు కెమెరా - 4.5 అంగుళాల తాకే తెర - 8 జీబీ ఇంటర్నల్ మెమొరి - 1 జీబీ ర్యామ్ -
ఆసుస్ 'అద్భుతమైన దీపావళి' ఆఫర్స్
ముంబై: బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్ఫోన్లను ఆఫర్ చేస్తున్న ఆసుస్ దీపావళి బంపర్ ఆఫర్ ప్రకటించింది. జెన్ ఫోన్ 3 స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు పై వందశాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను అందిస్తోంది. 2016 అక్టోబర్ 18 నుంచి 22 వరకు అందుబాటులో ఉన్న తైవాన్ మొబైల్ మేకర్ ఆసుస్ 'ఇన్క్రెడిబుల్ దీపావళి' ఆఫర్లో 100 అదృష్టవంతులైన వినియోగదారులకు ఈ అవకాశాన్ని కల్పిస్తోంది. అలాగే మరో 100 మంది ఆసుస్ జోన్ పవర్ ను గెల్చుకునే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది. ఈ ఆఫర్ ను గెల్చుకోవాలంటే ఆసుస్ ఆథరైజ్డ్ పార్టనర్ షోరూంలలో జెన్ ఫోన్ 3 (ZE520KL ZE552KL) మోడల్ ఫోన్లు కొనుగోలు చేయాలి. అనంతరం కంపెనీకి చెందిన అధికారిక మైక్రోసైట్ లో లక్కీ డ్రా అనే ఆప్షన్ లో రిజిస్టర్ కావాలి. ఇన్ వోయిస్ నెంబరు, కొనుగోలు చేసిన స్థలం, డీలరు పేరు, తేదీ, ప్రొడక్ట్ సీరియల్ నెం. తదితర వివరాలను కచ్చితంగా పేర్కొనాలి. లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసిన ఆయా విజేతలకు వారి ఈమెయిల్ అడ్రస్ కు ముందుగా తెలియ చేస్తామని పేర్కొంది. గిఫ్ట్ వోచర్ కానీ, జెన్ పవర్ గానీ రిజిస్టర్ చేసుకున్న చిరునామాకు పంపిస్తామని తెలిపింది. ఈ ప్రక్రియ నవంబరు 20 కల్లా పూర్తి చేస్తామని, వారం రోజుల్లోగా ఇవి కస్టమర్ నమోదుచేసిన చిరునామాకు డెలివరీ చేయబడతాయని తెలిపింది. ఇలా రిజస్టర్ చేసుకోవడానికి నవంబరు 4వ తేదీ ఆఖరు తేదీ అని కంపెనీ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ తమిళనాడు వాసులకు వర్తించదని స్పష్టం చేసింది. నోట్‌బుక్ కొనుగోలుచేసిన వారికి 11వేల రూపాయ ఇతర బహుమతులు, గేమర్స్ కోసం రూ.10,600 గిఫ్ట్ లను అందించనుంది. దీంతో పాటుగా అన్ని ప్రధాన ఉత్పత్తులపై జీరో ఇంట్రెస్ట్ ఈఎంఐ లాంటి ఇతర ఆఫర్లను, బహుమతులను అందిస్తోంది. మరిన్ని వివరాలకోసం ఆసుస్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు. -
ఆసుస్ జెన్‌ఫోన్ కొత్త సెల్ఫీ స్మార్ట్ ఫోన్
న్యూఢిల్లీ: తైవాన్ కు చెందిన టెక్నాలజీ దిగ్గజం ఆసుస్ కొత్త స్మార్ట్ ఫోన్ ను బుధవారం లాంచ్ చేసింది. జెన్ఫోన్సె ల్ఫీ స్మార్ట్ పోన్ కొత్త వెర్షన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. దీనిధరను రూ 12.999 గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం ఇది అమెజాన్ లో అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ నుంచి ఇతర రిటైల్ కేంద్రాల నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపింది.. మైక్రో ఫోటోగ్రఫీని తమ లేటెస్ట్ డివైస్ సపోర్టు చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ అప్ డేటెడ్ స్మార్ట్ ఫోన్ లోని 88 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్ ద్వారా సెల్ఫీ పనోరమ ను సృష్టించుకోవచ్చని,6సీఎం పైగా ఉన్న వస్తువులను కాప్చర్ చేయొచ్చని తెలిపింది. స్టన్నింగ్ డైమండ్ కట్ డిజైన్ తో వస్తున్న ఈ ఫోన్ తో అద్భుతమైన సెల్ఫీ ఫోటోలను తీసుకోచ్చని కంపెనీసౌత్ ఆసియా హెడ్ పీటర్ చాంగ్ తెలిపారు. ఆసుస్ జెన్‌ఫోన్ సెల్ఫీ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు 5.5 ఇంచెస్ స్ర్కీన్, 615 క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ ప్రాసెసర్ 3 జీబీ రామ్, 16జీబీ మొమరీ, 128జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ 13 ఎంపీ రియర్ కెమెరా 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఆటో లేజర్ ఫోకస్, డ్యుయల్ కలర్ రియల్ టోన్ ఫ్లాష్ 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆసుస్ ఫ్యామిలీలోకి జంట ఫోన్లు
తైవనీస్ మల్టీనేషనల్ కంప్యూటర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఆసుస్ ఫ్యామిలీలోకి మరో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లు వచ్చి చేరాయి. ప్రస్తుత తరం జెన్ ఫోన్ 2 లేజర్, జెన్ ఫోన్ మ్యాక్స్ ల అప్ గ్రేడింగ్ తో, ఆసుస్ రెండు కొత్త జెన్ ఫోన్3 ..వేరియంట్లను మార్కెట్లోకి ఆవిష్కరించింది. జెన్ ఫోన్ 3 లేజర్, జెన్ ఫోన్ 3 మ్యాక్స్ పేర్లతో వీటిని ప్రవేశపెట్టింది. అయితే ఈ ఫోన్లు కేవలం వియత్నాంలో మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ గా ఎప్పుడు తీసుకొస్తామనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు. ఈ రెండు ఫోన్లు ఫ్రంట్ 2.5డీ గ్లాస్ కర్వ్ తో మొత్తం మెటల్ యూనిబాడీతోనే రూపొందించారు. వెనుకవైపు ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కలిగిఉన్నాయి. జెన్ ఫోన్ 3 లేజర్ ధర దాదాపు రూ.17,974లని అంచనా.. జెన్ ఫోన్ 3 మ్యాక్స్ ధర దాదాపు రూ.13,480లని అంచనా.. జెన్ ఫోన్ 3 లేజర్ ఫీచర్లు... 5.5 అంగుళాల డిస్ ప్లే ఆల్ట్రా-ఫాస్ట్ 0.03ఎస్ లేజర్ ఆటో ఫోకస్ 13 మెగా పిక్సెల్ ఫిక్సెల్ మాస్టర్ 3.0 కెమెరా వెనుక కెమెరా ఈఐఎస్ బ్లర్-ఫ్రీ వీడియో రికార్డింగ్ కలర్ కరెక్షన్ సెన్సార్ 0.2 సెకన్లలో సూపర్ ఫాస్ట్ ఫింగర్ ప్రింట్ అన్ లాక్ 4జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నెల్ మెమరీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 7.9ఎంఎం థిక్ నెస్ జెన్ ఫోన్ 3 మ్యాక్స్ ఫీచర్లు.. 5.2 అంగుళాల డిస్ ప్లే 4100 ఎంఏహెచ్ బ్యాటరీ 3జీబీ ర్యామ్ 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ క్విక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ 0.2 సెకన్ల ఫింగర్ ప్రింట్ అన్ లాక్ కంపెనీ ఇటీవలే తైవాన్ లో జెన్ ఫోన్ 3, జెన్ ఫోన్ 3 ఆల్ట్రా ఫోన్లను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
వరుసగా మూడు స్మార్ట్ ఫోన్ల లాంచ్
తైవాన్ : ప్రముఖ మొబైళ్ల తయారీ సంస్థ అసుస్ సోమవారం మూడు మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. జెన్ సిరీస్ లోని జెన్‌ఫోన్ 3, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా పేరుతో మూడు స్మార్ట్ ఫోన్లను తైపీలో లాంచ్ చేసింది. డిఫరెంట్ సైజులు, స్పెసిఫికేషన్స్ తో యూజర్లను ఆకట్టుకునేలా వీటిని రూపొందించింది. మెటల్ బాడీలతో, ఫోన్ వెనకాల ఎంబెడ్ చేసిన ఫింగర్ ప్రింట్ సపోర్ట్ , 8 మెగా పిక్సెల్ సెల్పీ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, డ్యూయల్ సిమ్ లతో ఈ మూడు ఫోన్లూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. జెన్ ఫోన్3 5.5 అంగుళాల తాకే తెర 1080×1920 పిక్సల్స్ రిజల్యూషన్ ధర సుమారు రూ.16,700 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ 4జీబీ ర్యామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 64జీబీ ఇంటర్నల్ మెమొరీ 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గోల్డ్, బ్లూ, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ అందుబాటులో ఉంది. జెన్‌ఫోన్ 3 డీలక్స్ 5.7 ఇంచెస్ స్క్రీన్ 1080×1920 పిక్సల్స్ రిజల్యూషన్ ధర దాదాపుగా రూ.33,500 స్నాప్‌డ్రాగన్ 820 ఎస్ఓసీ ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్ 64జీబీ ఇంటర్నల్ మెమొరీ ఎస్డీ కార్డుతో మెమొరీని 256జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ 23 మెగాపిక్సల్ రేర్ కెమేరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ గోల్డ్, సిల్వర్, యాష్ కలర్స్ లో లభిస్తోంది. జెన్‌ఫోన్ 3 అల్ట్రా 6.8 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే 1920×1080 పిక్సెల్స్ రిజల్యూషన్ ధర దాదాపుగా రూ. 32,200 స్నాప్‌డ్రాగన్ 625 ఎస్ఓసీ ప్రాసెసర్ 64జీబీ ఇంటర్నెల్ మెమొరీ ఎస్డీ కార్డుతో మెమొరీని 128 జీబీ పెంచుకునే సదుపాయం 23 మెగాపిక్సెల్ రియర్ కెమేరా 4600 ఎంఏహెచ్ బ్యాటరీ గోల్డ్, సిల్వర్, పింక్ యాష్ కలర్స్ లో లభిస్తోంది. -
ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్
తైవాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీ ఆసుస్, జెన్ ఫోన్ మ్యాక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను భారత మార్కెట్లోకి ను విడుదల చేసింది. రెండు మెమెరీ ఆప్షన్లు, ఇన్ బిల్డ్ స్టోరేజ్ పెంచుకునేలా, ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 615ఎస్ఓసీ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. 2జీబీ ర్యామ్, 3 జీబీ ర్యామ్ రెండు వేరియంట్లను కంపెనీ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 2జీబీ ర్యామ్ ఫోన్ ధర రూ.9,999గా, 3జీబీ ర్యామ్ ధర రూ.12,999గా కంపెనీ ప్రకటించింది. 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్ ను ఈ వేరియంట్లు కలిగిఉన్నాయి. ఈ కొత్త జెన్ ఫోన్ మ్యాక్స్ వేరియంట్లు ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మాలోతో పనిచేయనున్నాయి. రెండు కలర్లు బ్లూ, ఆరెంజ్ ల్లో ఈ ఫోన్లు లభ్యంకానున్నాయని, 2జీబీ ర్యామ్ వేరియంట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. 3జీబీ ర్యామ్ వేరియంట్ త్వరలోనే అమ్మకానికి వస్తుందన్నారు. క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 401ఎస్ఓసీతో జెన్ ఫోన్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ ను మొదట జనవరిలో మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. అప్పట్లో 16జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ధరను రూ.8,999కి తగ్గించి కంపెనీ ఇప్పటికీ ఒరిజినల్ జెన్ ఫోన్ మ్యాక్స్ ను ఆన్ లైన్ లో అమ్మకాలు చేపడుతోంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ హ్యాండ్ సెట్ నుంచి బ్యాటరీని బయటికి తీయలేం. 5.5 అంగుళాల హెచ్ డీ ఐపీఎస్ టీఈటీ డిస్ ప్లే, 64జీబీ వరకూ విస్తరణ మెమెరీ, డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాస్ తో 13ఎంపీ రేర్ కెమెరా,5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యూయల్ సిమ్, లేజర్ ఆటోఫోకస్ పీచర్ ఈ ఫోన్ లో ఇతర ప్రత్యేకతలు. -
అసస్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్
ధరలు రూ.5,299; రూ.5,699 న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ఆసస్ కంపెనీ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ జెన్‌ఫోన్ గో 4.5 సెకండ్ జనరేషన్ ఫోన్ ధరలు రూ.5,299, రూ.5.699 అని ఆసస్ పేర్కొంది. 4.5 అంగుళాల డిస్ప్లే ఉన్న ఈ 3జీ ఎనేబుల్ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, పేటీఎం, షాప్‌క్లూస్ వంటి ఈ టెయిలర్ల ద్వారానూ, అసస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చని వివరించింది. రెండు విభిన్నమైన కెమెరా స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్లను అందిస్తున్నామని పేర్కొంది. ముందు వైపు 0.3 మెగా పిక్సెల్, వెనక వైపు 5 మెగా పిక్సెల్ కెమెరా ఫీచర్లున్న ఫోన్ ధర రూ.5,299 అని, ముందువైపు 2 మెగా పిక్సెల్, వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా ఫీచర్లున్న ఫోన్ ధర రూ.5,699 అని పేర్కొంది. చౌక ధరలోనే లగ్జరీ ఫీచర్లున్న ఫోన్ ఇదని అసస్ రీజనల్ హెడ్(సౌత్ ఏషియా) పీటర్ చంగ్ చెప్పారు. 6 రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని, 8 జీబీ మెమెరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. -
ఆసుస్ ఫోన్‌పాడ్ 7 @ రూ.12,999
న్యూఢిల్లీ: ఆసుస్ కంపెనీ డ్యుయల్ సిమ్ ట్యాబ్లెట్, ఫోన్‌పాడ్ 7ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ట్యాబ్ ధర రూ.12,999 అని ఆసుస్ రీజనల్ హెడ్ (దక్షిణాసియా, భారత్) పీటర్ చాంగ్ తెలిపారు. హెచ్డీ డిస్ప్లే ఉన్న ఈ ట్యాబ్‌లో 3జీ కాలింగ్, ఆటమ్ జడ్2520 1.2 గిగా హెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 1.2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. జూన్ తర్వాత ఈ ట్యాబ్‌ను ఆండ్రాయిడ్ కిట్క్యాట్కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. 10 శాతం మార్కెట్ వాటా లక్ష్యం ప్రస్తుతం వందగా ఉన్న తమ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌ను రెట్టింపు చేయనున్నామని చాంగ్ వివరించారు. భారత ట్యాబ్లెట్ల మార్కెట్లో ప్రస్తుతం 3-5 శాతంగా ఉన్న తమ వాటాను ఈ ఏడాది చివరికల్లా 10 శాతానికి పెంచుకోవడం తమ లక్ష్యమని తెలిపారు. ఈ లక్ష్య సాధన కోసం కొత్త కొత్త ఉత్పత్తులను అందించనున్నామని, రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించనున్నామని వివరించారు. ఈ కంపెనీ గూగుల్‌కు నెక్సస్ 7 ట్యాబ్లెట్లను అందిస్తోంది. ఫోన్‌పాడ్ బ్రాండ్ కింద సొంత ట్యాబ్‌లను, ట్రాన్స్ఫార్మర్ బుక్ రేంజ్ కింద హైబ్రిడ్ ట్యాబ్‌లను విక్రయిస్తోంది. ఈ రెండు కేటగిరీల కింద ఈ ఏడాది 3-5 ఉత్పత్తులనందించనున్నామని చాంగ్ వివరించారు. అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ ఐడీసీ ప్రకారం 2012లో భారత్‌లో 26.6 లక్షల ట్యాబ్లెట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఈ సంఖ్య 56 శాతం వృద్ధితో 41.4 క్షలకు పెరిగింది. -
వచ్చే ఏడాది ట్యాబ్లెట్ పీసీలకు డిమాండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్యాబ్లెట్ పీసీలతో నోట్‌బుక్ పీసీల అమ్మకాలు పడిపోలేదని ఏసూస్ ఇండి యా తెలిపింది. మార్కెట్ పుంజు కోవడానికి ట్యాబ్లెట్లు దోహదం చేస్తున్నాయ ని ఏసూస్ ఇండియా సిస్టమ్ బిజినెస్ గ్రూప్ సేల్స్ డెరైక్టర్ యునేజ్ ఖురేషి అన్నారు. దేశవ్యాప్తంగా 50-60 లక్షల నోట్‌బుక్, నెట్‌బుక్ పీసీలు అమ్ముడవుతున్నాయి. ఇక ట్యాబ్లెట్ పీసీల సంఖ్య 50 లక్షల దాకా ఉంది. వచ్చే ఏడాది ట్యాబ్లెట్ల మార్కెట్ అనూహ్యంగా ఉండబోతోందని చెప్పారు. నాలుగు రకాల ట్యాబ్లెట్ల విక్రయిస్తున్నామని, త్వరలో మరిన్ని మోడళ్లను ఆవిష్కరిస్తామని చెప్పారు. ఇక్కడి ఖైరతాబాద్‌లోని ఐటీ మాల్లో ఏర్పాటు చేసిన ఏసూ స్ ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్‌ను ప్రారంభించి న అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒకేచోట 10 బ్రాండ్లు ఐటీ మాల్లో సోని, ఇంటెల్, ఏఎండీ, డెల్, తోషిబా, లెనోవో, ఏసూస్, ఏసర్, హెచ్‌పీ, శాంసంగ్ ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు ఏర్పాటయ్యాయి. 11,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.10 కోట్ల వ్యయంతో నెలకొల్పామని ఐటీ మాల్ డెరైక్టర్ మొహమ్మద్ ఉస్మాన్ తెలిపారు.