
అదిరిపోయే ఫీచర్స్‌తో 'జెన్‌ఫోన్ ఏఆర్'
'జెన్‌ఫోన్ ఏఆర్' పేరుతో మొబైల్ సంస్థ అసుస్ ఓ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. గూగుల్ టాంగో / డేడ్రీమ్ ఫీచర్స్‌తో స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌పై ఇటీవల ఫేస్‌బుక్, ట్విట్వర్ ద్వారా ఒక టీజర్ ను రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో ఖచ్చితమైన తేదీ ఇప్పటికీ తెలియకపోయినా త్వరలోనే మార్కెట్ లో దీన్ని ప్రవేశపెట్టబోతోందని తెలుస్తోంది. వినియోగదారులు వీఆర్ కంటెంట్‌ను ఆస్వాదించేలా జెన్ యుఐ వీఆర్ 360 దీని అదనపు ప్రత్యేకతగా ఉండనుందనే అంచనాలు నెలకొన్నాయి. వర్చువల్ రియాల్టీ, అగ్‌మెంటెడ్ రియాల్టీ ఫీచర్లు గూగుల్ డే డ్రీమ్, టాంగో ప్లాట్ ఫాం సపోర్ట్‌తో లాంచ్ కానున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కానుంది. అయితే అదరగొట్టే స్పెషల్‌ఫీచర్స్ తో లాంచ కానున్న ఆ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే.
అసుస్ జెన్‌ఫోన్ ఏఆర్ ఫీచర్లు
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్
గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్
2.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్
8 జీబీ ర్యామ్,
256 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్,
23 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా,
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,
3300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం