అసుస్‌ స్మార్ట్‌ఫోన్స్‌: విత్‌ డబుల్‌ సెల్ఫీ కెమెరా | Asus Zenfone 4 Selfie, Selfie Pro listing confirms dual front cameras ahead of Aug 17 launch | Sakshi
Sakshi News home page

అసుస్‌ స్మార్ట్‌ఫోన్స్‌: విత్‌ డబుల్‌ సెల్ఫీ కెమెరా

Published Thu, Aug 10 2017 5:40 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

అసుస్‌ స్మార్ట్‌ఫోన్స్‌: విత్‌ డబుల్‌ సెల్ఫీ కెమెరా - Sakshi

అసుస్‌ స్మార్ట్‌ఫోన్స్‌: విత్‌ డబుల్‌ సెల్ఫీ కెమెరా

స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ అసుస్  రెండు  స్మార్ట్‌ఫోన్ లను త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. జెన్ఫోన్ 4  సెల్ఫీ, జెన్‌ఫోన్‌ 4 సెల్పీ ప్రొ పేరుతో రెండు సెల్ఫీ  మోడల్స్‌ను  ఈ నెల 17న విడుద‌ల చేయ‌నుంది.  అదీ రెండు సెల్పీ కెమెరాలతో  ఈ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది.  
 
సెల్పీ వెర్షన్‌లో 20,8  మెగాపిక్సెల్‌  కెమెరాలతో, సెల్ఫీ ప్రో  వెర్షన్‌లో 24ఎంపీ, 5 ఎంపీ సెల్పీ కెమెరాలు విత్‌ ఫ్లాష్‌ తో  రూపొందించడం ప్రధాన ఆకర్షణకానుంది.  ఇంకా డ్యుయల్‌ సిమ్‌ స్లాట్‌తో పాటు ఒక స్పెషల్‌ మైక్రో ఎస్‌డీ స్లాట్‌ ఉండనున్నాయి.  ఇక ధరల విషయానికి వస్తే జెన్ ఫోన్ 4 సెల్ఫీ ధర సుమారుగా రూ.22,500లుగాను,  హై ఎండ్‌ మోడల్‌ జెన్ ఫోన్ 4  సెల్పీ ప్రొ సుమారు రూ. 30,000 గాను ఉంటుందని అంచనా.
 
జెన్ఫోన్ 4  సెల్పీ ప్రొ  ఫీచర్లు
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
1080 x 1920 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 625 ప్రాసెస‌ర్‌
ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌
4 జీబీ ర్యామ్‌
64 జీబీ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌
16 ఎంపీ బ్యాక్ కెమెరా
24 మెగాపిక్సెల్‌ +5 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
4జీ వీవోఎల్‌టీఈ
3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ
దాదాపు ఇవే ఫీచర్లను జెన్ ఫోన్ 4  సెల్పీలో  కూడా పొందుపరచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement