అసస్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ | Asus Zenfone Go is a budget smartphone at Rs 5299 in India | Sakshi
Sakshi News home page

అసస్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

Published Tue, Apr 26 2016 12:57 AM | Last Updated on Sun, Sep 3 2017 10:43 PM

అసస్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

అసస్ నుంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్

ధరలు రూ.5,299; రూ.5,699
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ఆసస్ కంపెనీ కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను  సోమవారం మార్కెట్లోకి తెచ్చింది. ఈ జెన్‌ఫోన్ గో 4.5 సెకండ్ జనరేషన్ ఫోన్ ధరలు రూ.5,299, రూ.5.699  అని ఆసస్ పేర్కొంది. 4.5 అంగుళాల డిస్‌ప్లే ఉన్న ఈ 3జీ ఎనేబుల్ స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, అమెజాన్, పేటీఎం, షాప్‌క్లూస్ వంటి ఈ టెయిలర్ల ద్వారానూ,  అసస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్స్‌లోనూ కొనుగోలు చేయవచ్చని వివరించింది. రెండు విభిన్నమైన కెమెరా స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్లను అందిస్తున్నామని పేర్కొంది.

ముందు వైపు 0.3 మెగా పిక్సెల్, వెనక వైపు 5 మెగా పిక్సెల్ కెమెరా ఫీచర్లున్న ఫోన్ ధర రూ.5,299 అని, ముందువైపు 2 మెగా పిక్సెల్, వెనకవైపు 8 మెగా పిక్సెల్ కెమెరా ఫీచర్లున్న ఫోన్ ధర రూ.5,699 అని పేర్కొంది. చౌక ధరలోనే లగ్జరీ ఫీచర్లున్న ఫోన్ ఇదని అసస్ రీజనల్ హెడ్(సౌత్ ఏషియా) పీటర్ చంగ్ చెప్పారు. 6 రంగుల్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుందని, 8 జీబీ మెమెరీ, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement