
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘ఆసస్’ తాజాగా ‘జెన్‌ఫోన్ 5జెడ్’ అనే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ మార్కెట్‌లో ఆవిష్కరించింది. ఇది మూడు వేరియంట్లలో లభ్యంకానుంది. 6 జీబీ ర్యామ్/ 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.29,999గా, 6 జీబీ ర్యామ్/ 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.32,999గా, 8 జీబీ ర్యామ్/ 256 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.36,999గా ఉంది. జెన్‌ఫోన్ 5జెడ్ స్మార్ట్‌ఫోన్స్ జూలై 9 నుంచి కేవలం ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు మెమరీ, 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ స్క్రీన్, 19:9 డిస్‌ప్లే, 12 ఎంపీ+ 8 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్ (ఆండ్రాయిడ్ పి అప్‌డేట్ అస్యూరెన్స్), ఫేస్ ఆన్‌లాక్, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి పలు ఫీచర్లు ఉన్నాయని వివరించింది. కాగా కంపెనీ నుంచి నాచ్ డిస్‌ప్లేతో వస్తున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే.