
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ’ఆసస్’ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లోకి తీసుకొచ్చింది. ‘ఆర్‌ఓజీ ఫోన్ 2 ఇండియా ఎడిషన్’ పేరుతో తన ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో సెకండ్ ఎడిషన్‌ను సోమవారం విడుదలచేసింది. గేమింగ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ అధునాత ఫోన్ ధర రూ. 37,999గా నిర్ణయించింది. ఈనెల 30వ తేదీ నుంచి వినియోగదారులకు ఫోన్ అందుబాటులో ఉండనుంది. కాగా త్వరలోనే 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ సామర్థ్యం కలిగిన ఫోన్ విడుదలకానుందని, దీని ధర రూ. 59,999 ఉండనుందని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment