ఆసుస్ స్మార్ట్‌ఫోన్( ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుంటున్న షావోమికి బ్యాడ్ న్యూస్. ఈ చైనాకంపెనీకి షాకిచ్చేలా తైవాన్ కంపెనీ ఆసుస్ సిద్ధమవుతోంది. మిడ్‌రేంజ్ లో మోటరోలా జీ సిరీస్‌కు, షావోమీ రెడ్ మీ సిరీస్ దీటుగా సరికొత్త మొబైల్ నులాంచ్ నేడు (సోమవారం) లాంచ్ చేసింది. రెడ్‌మినోట్ ప్రొ కంటే 30 నిమిషాల వేగంగా తమ 5000ఎంఏహెచ్ బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఆసుస్ సీఈవో జెర్రీ షేన్ ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేశారు. హయ్యస్ట్ ఆడియో క్వాలిటీఈ సార్ట్‌ఫోన్ ప్రత్యేకత అని ఆయన చెప్పారు. 5.99 అంగుళాల(18.9 ఆస్పెక్ట్ రేషియో) డిస్‌ప్లే, డ్యుయల్ రియర్ కెమెరా, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ అండ్ ఫేషియల్ అన్‌లాక్, 2 టెర్రాబైట్స్‌వరకు మొమరీని విస్తరించుకునే అవకాశం తదితర ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేక భాగస్వామ్యం ద్వారా 3జీబీ/32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ రెండు వెర్షన్‌లలో ప్రవేశపెట్టింది. జెన్‌ఫోన్ మాక్స్ ప్రొ ఎం1 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెడ్ మి నోట్ 5 ప్రొ లో ఉన్న క్వాల్కం స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్‌నే అమర్చింది.
జెన్‌ఫోన్ మాక్స్ ప్రొ ఎం1 ఫీచర్లు
5.99 స్క్రీన్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ఓరియో
13 + 5 ఎంపీ రియర్ కెమెరా,
8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర: ఇక ధరల విషయానికి వస్తే జెన్‌ఫోన్ మాక్స్ ప్రో 4జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 10,999, 3జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధరను రూ. 12,999గా నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment