Zen Mobile
-
షావోమీకి బ్యాడ్ న్యూస్: ఆసుస్ కొత్త స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు విపరీతంగా ఆకట్టుకుంటున్న షావోమికి బ్యాడ్ న్యూస్. ఈ చైనాకంపెనీకి షాకిచ్చేలా తైవాన్ కంపెనీ ఆసుస్ సిద్ధమవుతోంది. మిడ్‌రేంజ్ లో మోటరోలా జీ సిరీస్‌కు, షావోమీ రెడ్ మీ సిరీస్ దీటుగా సరికొత్త మొబైల్ నులాంచ్ నేడు (సోమవారం) లాంచ్ చేసింది. రెడ్మినోట్ ప్రొ కంటే 30 నిమిషాల వేగంగా తమ 5000ఎంఏహెచ్ బ్యాటరీ చార్జ్ అవుతుందని కంపెనీ ప్రకటించింది. ఆసుస్ సీఈవో జెర్రీ షేన్ ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేశారు. హయ్యస్ట్ ఆడియో క్వాలిటీఈ సార్ట్‌ఫోన్ ప్రత్యేకత అని ఆయన చెప్పారు. 5.99 అంగుళాల(18.9 ఆస్పెక్ట్ రేషియో) డిస్ప్లే, డ్యుయల్ రియర్ కెమెరా, ఫింగర్ ప్రింట్ అన్‌లాక్ అండ్ ఫేషియల్ అన్‌లాక్, 2 టెర్రాబైట్స్వరకు మొమరీని విస్తరించుకునే అవకాశం తదితర ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. ఫ్లిప్‌కార్ట్‌తో ప్రత్యేక భాగస్వామ్యం ద్వారా 3జీబీ/32 జీబీ స్టోరేజ్, 4జీబీ ర్యామ్/64 జీబీ స్టోరేజ్ రెండు వెర్షన్లలో ప్రవేశపెట్టింది. జెన్‌ఫోన్ మాక్స్ ప్రొ ఎం1 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెడ్ మి నోట్ 5 ప్రొ లో ఉన్న క్వాల్కం స్నాప్ డ్రాగన్ 636 ఆక్టాకోర్ ప్రాసెసర్‌నే అమర్చింది. జెన్‌ఫోన్ మాక్స్ ప్రొ ఎం1 ఫీచర్లు 5.99 స్క్రీన్ ఫుల్ వ్యూ డిస్ప్లే ఆండ్రాయిడ్ఓరియో 13 + 5 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: ఇక ధరల విషయానికి వస్తే జెన్‌ఫోన్ మాక్స్ ప్రో 4జీబీ ర్యామ్/32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ. 10,999, 3జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధరను రూ. 12,999గా నిర్ణయించింది. -
'అడ్మైర్ స్టార్' మొబైల్ ధర తక్కువేనట!
న్యూఢిల్లీ : దేశీయ మొబైల్ తయారీదారి జెన్ మొబైల్స్ సరసమైన ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం లాంచ్ చేసింది. "అడ్మైర్ స్టార్" పేరుతో ఆవిష్కరించిన ఈ ఫోన్ ధర రూ.3,290గా కంపెనీ నిర్ణయించింది. జెన్ మొబైల్స్ నుంచి వచ్చిన ఈ కొత్త ఎడిషన్‌ను ధరకు అనువైన రీతిలో ఫీచర్లను ఆఫర్ చేసినట్టు విశ్వసిస్తున్నామని కంపెనీ సీఈవో సంజయ్ కలిరోనా తెలిపారు. ఎమర్జెన్సీ సమయంలో ముందుగా సూచించిన ఐదు నెంబర్లకు యూజర్ల లొకేషన్ వివరాలను పంపించేందుకు వీలుగా ఎస్ఓఎస్ ఫీచర్‌ను అందుబాటులో ఉంచినట్టు కంపెనీ పేర్కొంది. జెన్ యాప్ క్లౌడ్, లైవ్ స్ట్రీమింగ్ అప్లికేషన్ నెక్స్జెన్టీవీ, వీడియో ప్లేయర్ ఉలివ్ వంటి వాటిని ఈ ఫోన్లో ప్రీలోడెడ్‌గా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. జెన్ మొబైల్ అడ్మైర్ స్టార్ ఫీచర్లు.. 4.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ డిస్ప్లే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ ఎస్ఓఎస్ ఫీచర్ 512 ఎంబీ ర్యామ్ 8 జీబీ ఇంటర్నెల్ మెమరీ 32 జీబీ విస్తరణ మెమెరీ 5 ఎంపీ రియర్ కెమెరా 1.3 ఎంపీ ఫ్రంట్ కెమెరా 2000ఎంఏహెచ్ బ్యాటరీ -
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్ల ఫోన్ లాంచ్!
దేశీయ మొబైల్ కంపెనీ జెన్ మొబైల్, తన కొత్త స్మార్ట్‌ఫోన్ సినీమ్యాక్స్ 3ను సోమవారం లాంచ్ చేసింది. గతేడాది ఆవిష్కరించిన సినీమ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ విజయంతో సినీమ్యాక్స్ 3 ఫోన్‌ను జెన్ మొబైల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.5.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ప్లేతో రూపొందించిన ఈ ఫోన్ ధర రూ.5,499లుగా కంపెనీ ప్రకటించింది. బ్లాక్ కలర్లో ఈ ఫోన్ లభ్యంకానుంది. రూ.499ల విలువ కల్గిన స్క్రీన్ గార్డు ఉచితంగా ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు పొందవచ్చు. వివిధ రకాల స్మార్ట్ ఫీచర్లలో సరసమైన ధరలో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టామని జెన్ మొబైల్ సీఈవో సంజయ్ కాలిరోనా తెలిపారు. గేమ్స్, నెక్స్జెన్టీవీ-లైవ్ టీవీ స్ట్రీమింగ్ అప్లికేషన్, ఉలివ్ వీడియో వంటి మల్టీమీడియా ఆఫర్స్ అన్నింటినీ ప్రీ-లోడెడ్‌గా ఈ ఫోన్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. 700లకు పైగా సర్వీసు సెంటర్లలో యూజర్లు యాక్సస్ పొందేలా జెన్ కేర్ యాప్‌ను ఈ డివైజ్‌లో అందించారు. 2900ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్, 30 గంటల టాక్ టైమ్ వరకు పనిచేస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు... 5.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ప్లే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నెల్ మెమరీ 32జీబీ విస్తరణ మెమరీ ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ డ్యుయల్ సిమ్ 5ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3.2ఎంపీ ముందు కెమెరా