తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్ల ఫోన్ లాంచ్!
దేశీయ మొబైల్ కంపెనీ జెన్ మొబైల్, తన కొత్త స్మార్ట్ఫోన్ సినీమ్యాక్స్ 3ను సోమవారం లాంచ్ చేసింది. గతేడాది ఆవిష్కరించిన సినీమ్యాక్స్ 2 స్మార్ట్ఫోన్ విజయంతో సినీమ్యాక్స్ 3 ఫోన్ను జెన్ మొబైల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.5.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ప్లేతో రూపొందించిన ఈ ఫోన్ ధర రూ.5,499లుగా కంపెనీ ప్రకటించింది. బ్లాక్ కలర్లో ఈ ఫోన్ లభ్యంకానుంది. రూ.499ల విలువ కల్గిన స్క్రీన్ గార్డు ఉచితంగా ఫోన్ను కొనుగోలు చేసిన వినియోగదారులు పొందవచ్చు. వివిధ రకాల స్మార్ట్ ఫీచర్లలో సరసమైన ధరలో ఈ ఫోన్ను ప్రవేశపెట్టామని జెన్ మొబైల్ సీఈవో సంజయ్ కాలిరోనా తెలిపారు. గేమ్స్, నెక్స్జెన్టీవీ-లైవ్ టీవీ స్ట్రీమింగ్ అప్లికేషన్, ఉలివ్ వీడియో వంటి మల్టీమీడియా ఆఫర్స్ అన్నింటినీ ప్రీ-లోడెడ్గా ఈ ఫోన్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. 700లకు పైగా సర్వీసు సెంటర్లలో యూజర్లు యాక్సస్ పొందేలా జెన్ కేర్ యాప్ను ఈ డివైజ్లో అందించారు. 2900ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్, 30 గంటల టాక్ టైమ్ వరకు పనిచేస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది.
జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు...
5.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ప్లే
1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్
2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నెల్ మెమరీ
32జీబీ విస్తరణ మెమరీ
ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్
డ్యుయల్ సిమ్
5ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
3.2ఎంపీ ముందు కెమెరా