Rs 5
-
రూ. ఐదుకే భోజనం అభినందనీయం
మెదక్‌జోన్: రూ. 5కే అన్నం పెట్టడం అభినందనీయమని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ధర్మాకారి రామచందర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ధర్మకారి(కటికె) శ్రీనివాస్ తన తండ్రి జ్ఞాపకార్థం ఏరియా ఆస్పత్రిలో రూ. 5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రూ. 5 కే బోజనం పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి రోజు భోజన వసతి కల్పించేందుకుముందుకు వచ్చిన శ్రీనివాస్ ఆదర్శవంతుడన్నాడు. ఎంతో మంది నిరుపేదలు ప్రతి రోజు ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారని, వారికి ఈ వసతి కల్పించడం వల్ల నిరుపేదల ఆకలి తీరుతుందన్నారు. తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో స్వర్గస్తులైన తన తండ్రి పేరుతో భోజన వసతి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం నిర్వాహకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి రోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. స్వర్గస్తులైన తన తండ్రి పేరుతో ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ వెంకటేశ్వర్రావు ఏరియా ఆసుపత్రి సూపరెంటెండెంట్ చంద్రశేఖర్, వైద్యులు నవీన్, శివదయాల్, బొజ్జ పవన్ తదితరులు ఉన్నారు. -
నాలుగు రోజుల్లో రూ.5,000 కోట్లు
డెట్ మార్కెట్లోకి ఎఫ్‌పీఐల పెట్టుబడుల వరద అధిక రాబడులే ఆకర్షణీయం న్యూఢిల్లీ: భారతీయ డెట్ మార్కెట్లు విదేశీ పోర్ట్ ఫోలియో (ఎఫ్‌పీఐ) ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కేవలం గత నాలుగు పని దినాల్లో రూ.5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడం దీన్నే సూచిస్తోంది. స్టాక్ విలువలు గరిష్ట స్థాయిల్లో ఉండడంతో ఎఫ్‌పీఐలు ఇదే సమయలో ఈక్విటీల నుంచి రూ.1,500 కోట్లు వెనక్కి తీసేసుకున్నారు. తాజా గణాంకాల ప్రకారం ఎఫ్ -
యూనిక్ 4జీ స్మార్ట్‌ఫోన్.. తక్కువ ధరలో
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సబ్ బ్రాండ్ వైయు టెలివెంచర్స్ నూతన స్మార్ట్‌ఫోన్ ను మంగళవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. బడ్జెట్ ధరలో ఈ డివైస్‌ను మంగళవారం లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ నౌగట్తో 4జీ తో ‘యూ యూ యూనిక్ 2’ ని పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధరను రూ. 5,999 గా కంపెనీ ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో జూలై27నుంచి ప్రత్యేకంగా అందుబాటులో ఉండనుంది. డ్యూయల్ సిమ్, ట్రూకాలర్ ఇంటిగ్రేటెడ్ స్పెషల్ ఫీచర్‌తో ఈ హ్యాండ్ సెట్‌ను అందిస్తోంది. యూ 'యునిక్ 2' 5 అంగుళాల హెచ్డీ స్క్రీన్ 1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0 మీడియా టెక్ మైక్రో 6737 క్వాడ్ కోర్ 1.3 జీహెచ్‌జెడ్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 64 జీబీ ఎక్స్‌పాండబుల్ మొమరీ 13ఎంపీ ప్రైమరీ కెమెరా ప్రాథమిక కెమెరా 4 ఆటో ఫోకస్, మల్టీ షాట్ 5ఎంపీ సెకండరీ కెమెరా ఎఫ్ఎం రేడియో 2500 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఆ సిమ్‌కార్డ్ పనిచేయకపోతే భారీ పెనాల్టీ
న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇంటర్నేషనల్ రోమింగ్ సిమ్ కార్డ్, గ్లోబల్ కార్డ్ ప్రొవైడర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఈమేరకు టెలికాం డిపార్ట్మెంట్ (డాట్)కు కీలక ప్రతిపాదనలు చేసింది.అంతర్జాతీయ సిమ్ కార్డు విఫలమైతే రూ. 5వేల నష్టపరిహారం చెల్లించాలని రికమెండ్ చేసింది. w పెనాల్టీ తోపాటు, కస్టమర్ చెల్లించిన ఫీజును 15రోజుల్లో వారికి చెల్లించాలని ప్రతిపాదించింది. ఖాతాదారుల విదేశీ ప్రయాణాల్లో సర్వీసుల్లో సేవల్లో అంతరాయం కలిగితే ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు ఈ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. అంతేకాదు ఆయా సర్వీసు ప్రొవైడర్ల అనుమతిని రద్దు చేయాలని కూడా సూచించింది. విక్రయించిన మొత్తం అంతర్జాతీయ సిమ్ కార్డులలో 10 శాతం పనిచేయకపోతే అటువంటి కంపెనీల అనుమతి రద్దు చేయవచ్చని కూడా రెగ్యులేటరీ సూచించింది. ఈ మేరకు అంతర్జాతీయ సిమ్ కార్డు విక్రేతలు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రెగ్యులేటర్ సిఫార్సు చేసింది. తద్వారా కస్టమర్ల ఫిర్యాదులను సతర్వమే పరిష్కరించాలని కోరింది. అలాగే డిజిటల్ మోడ్‌లో మాత్రమే అంతర్జాతీయ కాలింగ్ కార్డులను, అంతర్జాతీయ సిమ్ కార్డులను కొనుగోలు చేయాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, ఇ-వాలెట్ ద్వారా ఈ కోనుగోళ్లు చేయాలని కోరింది. మరోవైపు ఈ సమస్యపై చర్చల పిలుపునకు స్పందించని 23 కంపెనీల అనుమతి రద్దు చేయాలని కూడా ట్రాయ్ ఆలోచిస్తోంది. కాగా ఈ కార్డులపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలోఇటీవల రెగ్యులేటర్ నిర్వహించిన ఎస్ఎంస్ ఆధారిత సర్వే లో దాదాపు సగం మంది వినియోగదారుల ఇంటరర్నేషనల్ కార్డు సేవలు అస్సలు పనిచేయకపోవడం లేదా పాక్షికంగా పని చేస్తున్నాయని తేలింది. దీంతో ట్రాయ్ ఇంటర్నేషనల్ రోమింగ్ సిమ్ కార్డ్, గ్లోబల్ కార్డ్ ప్రొవైడర్లతో చర్చలు నిర్వహించింది. -
కార్బన్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్..ధర ఎంత?
న్యూఢిల్లీ: దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కార్బన్ సరికొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. తద్వారా తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించింది. గత వారం బడ్జెట్ ధరలో ఆరా పవర్ 3జీనులాంచ్ చేసిన కార్బన్ ఈ సిరీస్‌లో మరో కొత్త డివైస్‌ను తీసుకొచ్చింది. ఆరా పవర్ 4జీ ప్లస్ పేరుతో శుక్రవారం దీన్ని విడుదల చేసింది. దీని ధర రూ .5,790గా ప్రకటించింది. ఫ్రీ ప్రొటెక్టివ్ కవర్‌తోపాటు గ్రే అండ్ షాంపైన్ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆరా పవర్ 4జీ ప్లస్ స్పెసిఫికేషన్స్ 720x1280 పిక్సెల్ రిసల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం 5 ఇంచెస్ హెచ్ డీ డిస్ప్లే క్వాడ్-కోర్ ప్రాసెసర్ 1జీబీ ర్యామ్ 16 జీబీ ఇంటర్నల్ మొమరీ, 32జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మొమరీ 5 ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ -
కొటక్ మహీంద్రా భారీ ఫండ్ రైజింగ్
ముంబై: దేశీయ ప్రయివేటు రంగ బ్యాంకు కొటక్ మహీంద్రా బ్యాంక్ క్యాపిటల్ ఫండ్ రైజింగ్ ప్రణాళికలను ప్రకటించింది. సుమారు రూ.5500 కోట్ల క్యాపిటల్ నిధులను సమకూర్చుకోన్నట్టు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా బ్యాంక్‌ను, అనుబంధ సంస్థల మరింత పటిష్ట పర్చుకోనున్నట్టు తెలిపింది. 6.2 కోట్ల ఈక్విటీ షేర్ల జారీ ద్వారా సుమారు రూ.5,500 కోట్లను ఆర్జించనుంది. గరిష్టంగా 3.4 శాతం ఈక్విటీ డైల్యూషన్ ద్వారా ఈ నిధులను సేకరించనుంది. ఈ మేరకు బ్యాంక్ బోర్డ్ మీటింగ్ ఒకే చెప్పింది దీంతో ప్రమోటర్ ఉదయ్ వాటా 32.1 శాతం నుంచి 31.2 శాతానికి తగ్గనుంది. దీంతో గురువారం ఇంట్రాడే లో ఈ బ్యాంక్ షేరు లాభాలతో దూసుకుపోయింది. 1.5శాతానికి పైగా లాభపడింది. అయితే ఇటీవల విలేకరుల సమావేశంలో యాక్సిస్ బ్యాంక్/ మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్‌ను కొనుగోలు చేయనున్నట్లు వస్తోన్న వూహాగానాలకు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్ ఉదయ్ కోటక్ చెక్ పెట్టారు. ఆ వార్తలన్నీ కల్పితాలేనని కొట్టిపారేశారు. ఇతర సంస్థల కొనుగోళ్లు/ విలీనాల ద్వారా కాకుండా ఖాతాదారుల సంఖ్యను సొంతంగానే (ఆర్గానిక్) పెంచుకుంటామని ప్రకటించారు. బ్యాంకు వృద్ధి ప్రణాళికలను, వ్యూహాలను వివరించేందుకు మాత్రమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. కాగా మూడో అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ యాక్సిస్ బ్యాంక్ ను కొటక్ మహీంద్రా బ్యాంక్ కొనుగోలు చేయనున్నట్టు వార్తలు మార్కెట్ లో హల్ చల్ చేశాయి. అయితే ఈ వార్తలను యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శిఖా శర్మ కూడా తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. -
నగదు డిపాజిట్లపై ఆర్బీఐ యూటర్న్
-
తాజా నిబంధనలను ఎత్తేసిన ఆర్బీఐ
ముంబై : డిపాజిట్‌దారులకు ఊరట కల్పిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తెలుసుకుంది. రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ తాజాగా తీసుకొచ్చిన నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. ఈ నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ నోటీఫికేషన్ జారీచేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా ఈ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే తగిన ఆధారాలు చూపించాంటూ ఈ నెల 19న ఆర్బీఐ ఓ సర్క్యూలర్ జారీచేసిన సంగతి తెలిసిందే. రూ.5000 కంటే ఎక్కువగా డిపాజిట్ చేసే వారు ఇన్ని రోజులు ఎందుకు డిపాజిట్ చేయలేదో ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో బ్యాంకులకు తెలపాల్సి ఉంటుంది. డిపాజిట్ దారులు చెప్పే సమాధానాలు బ్యాంకు సిబ్బందిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్ తీసుకుంటారు. ప్రస్తుతం ఈ నిబంధన ఎత్తివేతతో కేవైసీ అకౌంట్లలో డిసెంబర్ 30 వరకు ఎంత మొత్తంలోనైనా డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 8న పాత నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఆ నోట్లను డిసెంబర్ 30 వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే గడువు దగ్గర పడుతుండటంతో డిపాజిట్లపై పరిమితులను ఆర్బీఐ తీసుకొచ్చింది. కానీ బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లతో డిపాజిట్ చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆర్బీఐ ఈ కొత్త నిబంధనలు తీసుకురావడమేమిటని దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తాజా నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. -
ఎన్ఎస్ఈఎల్ స్కాంలో ఆస్తుల ఎటాచ్
మనీలాండరింగ్ స్కాంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా(ఎఫ్టీఐఎల్)కు ఈడీ భారీ షాకిచ్చింది. సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఎటాచ్ చేసింది. ఆస్తులు, నగదురూపంలో రూ.1,253 కోట్లను ఎటాచ్ చేసింది. రూ. 5600 కోట్ల ఎన్ఎస్ఈఎల్ (నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్) స్కాం కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో ఎందరో బ్రోకర్లు, ఇన్వెస్టర్లు వందల కోట్లకు ఎఫ్ టీఐఎల్ మోసం చేసిందనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బోగస్ డీల్స్ ద్వారా జిగ్నేష్ రూ. 76 కోట్లు అక్రమంగా వెనకేశాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ కోర్టులో వాదించింది. కాగా నేషనల్ స్పాట్ ఎక్సేంజీలో జరిగిన రూ.5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి గతంలో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇటీవల ఈ స్కాం సూత్రధారి, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ మాజీ ఛైర్మన్ జిగ్నేష్ షాను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
టమాటా.. ఢమాల్
రైతన్న దిగులు కిలో రూ.5కు పడిపోయిన ధర రోడ్డుపాలైన దిగుబడులు నర్సాపూర్: టమాటా ధరలు విపరీతంగా పడిపోవడంతో దిగుబడులు నేలపాలవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో రూ.40 వరకు ఉండగా రెండు రోజుల్లోనే రూ.5కు పడిపోయింది. టమాటాలను మార్కెట్‌కు తీసుకెళ్లినా కొనేవారు లేకపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతూ రోడ్డు పక్కన పారబోస్తున్నారు. పంట పండిస్తే రవాణా చార్జీలు సైతం రావడంలేదని వారు చెబుతున్నారు. నర్సాపూర్ – హైదరాబాద్ మార్గంలోని రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర టమాటలు పారబోశారు. అవి కోతులకు ఆహారంగా మారాయి. హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో ధర లేకపోయినా శుక్రవారం నర్సాపూర్ సంతలో మాత్రం కిలో టమాటాలను ఐదు నుంచి ఏడు రూపాయలకు అమ్మడం గమనార్హం. -
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్ల ఫోన్ లాంచ్!
దేశీయ మొబైల్ కంపెనీ జెన్ మొబైల్, తన కొత్త స్మార్ట్‌ఫోన్ సినీమ్యాక్స్ 3ను సోమవారం లాంచ్ చేసింది. గతేడాది ఆవిష్కరించిన సినీమ్యాక్స్ 2 స్మార్ట్‌ఫోన్ విజయంతో సినీమ్యాక్స్ 3 ఫోన్‌ను జెన్ మొబైల్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.5.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ప్లేతో రూపొందించిన ఈ ఫోన్ ధర రూ.5,499లుగా కంపెనీ ప్రకటించింది. బ్లాక్ కలర్లో ఈ ఫోన్ లభ్యంకానుంది. రూ.499ల విలువ కల్గిన స్క్రీన్ గార్డు ఉచితంగా ఫోన్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు పొందవచ్చు. వివిధ రకాల స్మార్ట్ ఫీచర్లలో సరసమైన ధరలో ఈ ఫోన్‌ను ప్రవేశపెట్టామని జెన్ మొబైల్ సీఈవో సంజయ్ కాలిరోనా తెలిపారు. గేమ్స్, నెక్స్జెన్టీవీ-లైవ్ టీవీ స్ట్రీమింగ్ అప్లికేషన్, ఉలివ్ వీడియో వంటి మల్టీమీడియా ఆఫర్స్ అన్నింటినీ ప్రీ-లోడెడ్‌గా ఈ ఫోన్లో పొందుపరిచినట్టు వెల్లడించారు. 700లకు పైగా సర్వీసు సెంటర్లలో యూజర్లు యాక్సస్ పొందేలా జెన్ కేర్ యాప్‌ను ఈ డివైజ్‌లో అందించారు. 2900ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న ఈ ఫోన్, 30 గంటల టాక్ టైమ్ వరకు పనిచేస్తుందని కంపెనీ హామీ ఇచ్చింది. జెన్ సినీమ్యాక్స్ 3 ప్రత్యేకతలు... 5.5 అంగుళాల ఎఫ్డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ప్లే 1.3 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్ 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నెల్ మెమరీ 32జీబీ విస్తరణ మెమరీ ఆండ్రాయిడ్ 5.1.1 లాలీపాప్ డ్యుయల్ సిమ్ 5ఎంపీ వెనుక కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్ 3.2ఎంపీ ముందు కెమెరా -
ఆ బ్యాంకునూ భారీగా ముంచేసిన బకాయిలు
న్యూఢిల్లీ : దలాల్ స్ట్రీట్ కు భారీ షాకింగ్. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా అతిపెద్ద క్వార్టర్ నష్టం. ఒక్కసారిగా పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఢమాల్ మని పడిపోయింది. బుధవారం ప్రకటించిన మార్చి త్రైమాసిక ఫలితాల్లో రూ.5,370 కోట్ల భారీ నష్టాలను నమోదుచేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.307 నికల లాభాలను చూపించిన పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఈ ఏడాది మార్కెట్ విశ్లేషకులకు షాకిస్తూ భారీ నష్టాల్లో నిలిచింది. ఈ ఏడాది రూ.81కోట్ల లాభాలను నమోదుచేస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావించారు. అయితే వీరి అంచనాలన్నీ తలకిందులయ్యాయి. స్థూల మొండిబకాయిలు ఈ త్రైమాసికంలో 12.9 శాతానికి ఎగబాకడంతో, నష్టాలు వాటిల్లాయని బ్యాంకు ప్రకటించింది. డిసెంబర్ త్రైమాసికంలో ఈ బకాయిలు 8.47శాతంగా ఉన్నాయి. మూడో త్రైమాసికంలో ఉన్న రూ.34,338 కోట్ల మొండిబకాయిలు, ఈ నాలుగో త్రైమాసికంలో రూ.55,818 కోట్లకి ఎగబాకాయి. స్థూల మొండి బకాయిలు త్రైమాసికం త్రైమాసికానికి రూ.21,480 కోట్లు పెరిగాయని బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకూ విడుదలైన అన్ని బ్యాంకుల మొండి బకాయిల కన్నా ఈ బకాయిలే ఎక్కువ. మూడో అతిపెద్ద పబ్లిక్ రంగ బ్యాంకుగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకు నికర నష్టాల దలాల్ స్ట్రీట్ ను షాకుకు గురిచేసింది. పీఎన్బీ ఫలితాల అనంతరం, మొత్తం 18 పబ్లిక్ రంగ బ్యాంకుల్లో తొమ్మిది బ్యాంకుల మార్చి క్వార్టర్ నష్టాలు ఏకంగా రూ.14,808 కోట్లని గణాంకాలు విడుదలయ్యాయి. బ్యాంకులు నమోదుచేస్తున్న ఈ నష్టాలతో పీఎస్ యూ బ్యాంకింగ్ రంగం మార్కెట్లో తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. గత ఐదేళ్ల కాలంలో ఈ నెలలో నిఫ్టీ పీఎస్ యూ బ్యాంకు ఇండెక్స్ 6శాతం మేర పడిపోయింది -
వాట్సాప్‌లో ఐదువేల నోటు హల్చల్!
మెదక్: ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో ఐదువేల రూపాయల నోటు ఇదేనంటూ ఓ ఫొటో హల్చల్ చేస్తోంది. త్వరలో భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఈ నోటును మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు పేర్కొంటూ.. దీనిని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐదువేల నోటు వాట్సాప్ లో విపరీతంగా షేర్ అవుతోంది. గతంలో రూ.500 నోటు రావడమే ప్రజలు గొప్పగా భావించారు. ఆ తరువాత రూ.1,000 నోటు వచ్చి వారిని మరింత ఆశ్చర్యపరిచింది. ఈసారి ఏకంగా రూ.5,000 నోటు వస్తుందని వాట్సాప్‌లో ప్రచారం జరుగడం చర్చనీయాంశంగా మారింది. వాట్సాప్‌లోనే కాదు ఫేస్‌బుక్‌లోనూ ఈ ఐదువేల నోటు ఫొటో హల్చల్ చేస్తోంది. అయితే గతంలో 2014లోనూ ఓసారి ఇలాగే రూ. ఐదువేల నోటు వస్తుందని విపరీతంగా ప్రచారం జరిగింది. దీనిని ఆర్బీఐ అప్పట్లో కొట్టిపారేసింది. ఐదువేల నోటు వస్తుందన్నదని ప్రచారం బూటకమేనని అప్పట్లో స్పష్టం చేసింది. -
భారత్‌కు జపాన్ భారీ సాయం
టోక్యో: భారత్‌కు జపాన్ భారీ సహాయం అందించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. చెన్నై, అహ్మదాబాద్‌లోని మెట్రో ప్రాజెక్టుల కోసం మొత్తం రూ.5,479 కోట్ల సహాయం అందించనున్నట్లు ఆర్దికమంత్రి ఆదివారం తెలిపారు. ఇప్పటికే రెండు దేశాలు ఈ ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు చెప్పారు. చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు(4వ దశ)కు(రూ.1,069 కోట్లు), అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టుకు రూ.4,410 కోట్ల సహాయం చేయనుందని చెప్పారు. భారత్‌లో చేపట్టే పలు ప్రాజెక్టులకు తరుచుగా జపాన్ ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. లోన్ రూపంలో ఇచ్చే ఈ ఆర్థికమొత్తాన్ని భారత్ కాలక్రమంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. -
షీలాకు జరిమానా
న్యూఢిల్లీ: బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తాపై దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణకు హాజరుకాని సీఎం షీలా దీక్షిత్‌కు స్థానిక కోర్టు రూ.ఐదు వేల జరిమానా విధించింది. జనవరి 27న తప్పకుండా కేసు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో ప్రశ్నించేందుకు, క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు ఫిర్యాదుదారు దీక్షిత్ కోర్టుకి రావాలని గతంలోనే ఆదేశించినా ఆమె పట్టించుకోకపోవడంతో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నమ్రితా ఆగర్వాల్ రూ.ఐదు వేల జరిమానాను విధించారు. ఈసారి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని దీక్షిత్ పెట్టుకున్న అభ్యర్థనను మన్నించిన ఆమె తదుపరి విచారణ తేదీ 2014, జనవరి 27న తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితా తయారుచేసే పనిలో నిమగ్నమవడంతో పాటు ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల కోర్టుకు హాజరుకాలేకపోయారని షీలా తరఫు న్యాయవాది అన్నారు. ఇదే కోర్టు నుంచి గతంలో ఆదేశాలు వచ్చినా పట్టించుకోకుండా సీఎం షీలా దీక్షిత్ తెలివి తక్కువదని గుప్తా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఈ కేసులో నిందితుడు కావడంతో కావాలనే తన క్లయింట్‌ను వేధిస్తున్నారని గుప్తా తరఫు న్యాయవాది అజయ్ బుర్మన్ అన్నారు.డిసెంబర్లో జరిగే ఎన్నికల్లో రోహిణి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా గుప్తా కోర్టు ముందు హాజరయ్యారని తెలిపారు. గతేడాది జరిగిన ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో విద్యుత్ కంపెనీలతో లలూచీపడి సహాయం తీసుకున్నానని అభ్యంతరకర పదజాలాన్ని వినియోగించిన గుప్తాపై దీక్షిత్ పరువు నష్టం దావా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.