టమాటా.. ఢమాల్
- రైతన్న దిగులు
- కిలో రూ.5కు పడిపోయిన ధర
- రోడ్డుపాలైన దిగుబడులు
నర్సాపూర్: టమాటా ధరలు విపరీతంగా పడిపోవడంతో దిగుబడులు నేలపాలవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కిలో రూ.40 వరకు ఉండగా రెండు రోజుల్లోనే రూ.5కు పడిపోయింది. టమాటాలను మార్కెట్‌కు తీసుకెళ్లినా కొనేవారు లేకపోవడంతో రైతులు ఆవేదనకు గురవుతూ రోడ్డు పక్కన పారబోస్తున్నారు. పంట పండిస్తే రవాణా చార్జీలు సైతం రావడంలేదని వారు చెబుతున్నారు.
నర్సాపూర్ – హైదరాబాద్ మార్గంలోని రహదారిపై సుమారు రెండు కిలోమీటర్ల మేర టమాటలు పారబోశారు. అవి కోతులకు ఆహారంగా మారాయి. హోల్‌సేల్ కూరగాయల మార్కెట్లో ధర లేకపోయినా శుక్రవారం నర్సాపూర్ సంతలో మాత్రం కిలో టమాటాలను ఐదు నుంచి ఏడు రూపాయలకు అమ్మడం గమనార్హం.