రూ. ఐదుకే భోజనం అభినందనీయం | Collector Dharma Reddy Priced Five Rupees Meals | Sakshi
Sakshi News home page

రూ. ఐదుకే భోజనం అభినందనీయం

Published Fri, Apr 13 2018 11:13 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM

Collector Dharma Reddy Priced Five Rupees Meals - Sakshi

భోజనం వడ్డిస్తున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి

మెదక్‌జోన్‌: రూ. 5కే అన్నం పెట్టడం అభినందనీయమని కలెక్టర్‌ ధర్మారెడ్డి అన్నారు. గురువారం మెదక్‌ ఏరియా ఆస్పత్రి ఆవరణలో ధర్మాకారి రామచందర్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో  ధర్మకారి(కటికె) శ్రీనివాస్‌ తన తండ్రి జ్ఞాపకార్థం ఏరియా ఆస్పత్రిలో రూ. 5 కే భోజనం అందించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ హాజరయ్యారు.  ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రూ. 5 కే బోజనం పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రతి రోజు భోజన వసతి కల్పించేందుకుముందుకు వచ్చిన  శ్రీనివాస్‌ ఆదర్శవంతుడన్నాడు. ఎంతో మంది నిరుపేదలు ప్రతి రోజు ప్రభుత్వాస్పత్రికి వస్తుంటారని, వారికి ఈ వసతి కల్పించడం వల్ల నిరుపేదల ఆకలి తీరుతుందన్నారు.

తల్లిదండ్రులను పట్టించుకోని ఈ రోజుల్లో స్వర్గస్తులైన తన తండ్రి పేరుతో భోజన వసతి ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం నిర్వాహకుడు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రతి రోజు మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 2 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు.  స్వర్గస్తులైన తన తండ్రి పేరుతో ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తామన్నారు.  కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు ఏరియా ఆసుపత్రి సూపరెంటెండెంట్‌ చంద్రశేఖర్, వైద్యులు నవీన్, శివదయాల్, బొజ్జ పవన్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement