ఒలింపిక్ రన్‌లో పాల్గొన్న కలెక్టర్ ధర్మారెడ్డి, పలువురు అధికారులు
మెదక్‌జోన్ : చదువుతో పాటు ఆటలూ ముఖ్యమేనని కలెక్టర్ ధర్మారెడ్డి అన్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం మెదక్ పట్టణంలో ఒక కిలో మీటర్ పరుగు పోటీలను జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఆయన పరుగు పందెం పోటీలను జెండాఊపి ప్రారంభించారు. ఈ పరుగు స్థానిక గుల్షన్‌క్లబ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ పరుగులో కలెక్టర్‌తోపాటు పలువురు జిల్లాస్థాయి అధికారులు, పీఈటీలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు తూ పిల్లలు చదువుతోపాటు క్రీడలకు సమ యం కేటాయించాలన్నారు. ప్రతిరోజు తను వ్యాయమం చేయనిదే విధులకు హాజరుకానని తెలిపారు. ఈ సందర్భంగా మెదక్ నుంచి స్టేడియంను, అ«థ్లెటిక్ సెంటర్‌ను తరలించకుండా తగుచర్యలు తీసుకోవాలని వ్యాయామ ఉపాధ్యాయులు కలెక్టర్ కోరారు.
ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ రాష్ట్ర క్రీడల అధి కారి దినకర్‌బాబుతో మాట్లాడి ఇక్కడే ఉండేటట్లు చూస్తానని హామీ ఇచ్చారు. ఒలింపిక్ డే రన్–2018 కమిటీ కన్వీనర్ పీడి ఆర్.నాగరాజు మాట్లాడుతూ ఈ రన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ధర్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రన్ ద్వారా క్రీడల పట్ల అందరికి అవగాహన కల్పించడంతోపాటు క్రీడలపై ఉన్న అవకాశాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా కన్వీనర్, పీఈటీల బృందం జిల్లా కలెక్టర్‌కు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ డే రన్ కమిటీ చైర్మన్ వెంకటరమణ, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శి ఎస్.నాగరాజు, శ్రీనివాస్‌రావు, సెక్టోరియల్ అధికారి మధుమోహన్, డీవైఎస్‌ఓ రమేశ్‌బాబు, పలువురు అధికారులు పీడీలు మాధవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, మహిపాల్, రాజేందర్, నరేశ్, జమాల్, గోపాల్‌గౌడ్, రమేష్, సత్యం, కిరణ్, రూపెందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment