మనీలాండరింగ్ స్కాంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా(ఎఫ్టీఐఎల్)కు ఈడీ భారీ షాకిచ్చింది. సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ ఎటాచ్ చేసింది. ఆస్తులు, నగదురూపంలో రూ.1,253 కోట్లను ఎటాచ్ చేసింది. రూ. 5600 కోట్ల ఎన్ఎస్ఈఎల్ (నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్) స్కాం కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ఎన్‌ఎస్‌ఈఎల్ కుంభకోణంలో ఎందరో బ్రోకర్లు, ఇన్వెస్టర్లు వందల కోట్లకు ఎఫ్ టీఐఎల్ మోసం చేసిందనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బోగస్ డీల్స్ ద్వారా జిగ్నేష్ రూ. 76 కోట్లు అక్రమంగా వెనకేశాడని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టొరేట్ కోర్టులో వాదించింది.
కాగా నేషనల్ స్పాట్ ఎక్సేంజీలో జరిగిన రూ.5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి గతంలో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇటీవల ఈ స్కాం సూత్రధారి, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ మాజీ ఛైర్మన్ జిగ్నేష్ షాను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్ఎస్ఈఎల్ స్కాంలో ఆస్తుల ఎటాచ్
Published Fri, Sep 9 2016 8:04 PM | Last Updated on Thu, Sep 27 2018 5:03 PM
Advertisement
Advertisement