attaches
-
చింపాంజీలను అటాచ్ చేసిన ఈడీ!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్ల (పొడవాటి తోక గల దక్షిణ అమెరికా కోతులు) ను అటాచ్చేసింది. ఈడీ చింపాంజీలను అటాచ్ చేయడమేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్‌పై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా వీటిని అటాచ్ చేసింది. స్మగ్లర్ ఇంటి నుంచి వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్‌కతాలోని అలిపోర్ జంతుప్రదర్శన శాలలో ఉంచినట్లు కేంద్ర సంస్థ వెల్లడించింది. ఈ చింపాంజీలు సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, జూకి ఒక మంచి ఆదాయ మార్గం అని చెప్పింది. కాగా, కోతులను జంతు శాలలో ఉంచినట్లు తెలిపింది. ఈ విధంగా మనీ లాండరింగ్ చట్టంకింద జంతువులను అటాచ్ చేయడం మొదటి సారి అని ఈడీ పేర్కొంది. స్మగ్లర్ ఆ జంతువులను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. మొత్తం ఏడు జంతువుల విలువ రూ.81 లక్షలు ఉంటుందని, ఒక్కో చింపాంజీ విలువ రూ.25 లక్షలు కాగా.. కోతుల విలువ రూ.1.5 లక్షలుంటుందని వెల్లడించింది. అడవి జంతువులను అక్రమంగా నిర్భంధించాడని స్మగ్లర్ సుప్రదీప్ గుహపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గుహ ‘వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్‌ను నడుపుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు ఈడీ తెలిపింది. -
బ్యాంక్ స్కామ్ : రూ 637 కోట్ల నీరవ్ ఆస్తులు అటాచ్
సాక్షి, న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌కు సంబంధించి బిలియనీర్ జ్యూవెలర్ నీరవ్ మోదీ, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ 637 కోట్ల విలువైన ఆస్తులు, బ్యాంకు ఖాతాలను ఈడీ అటాచ్ చేసింది. భారత్‌తో పాటు పలు దేశాల్లో విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని దర్యాప్తు సంస్ధ అధికారి ఒకరు వెల్లడించారు. న్యూయార్క్‌లో నీరవ్ మోదీకి చెందిన రూ 216 కోట్ల విలువైన రెండు స్ధిరాస్తులను కూడా మనీల్యాండరింగ్ నియంత్రణ చట్టం (పీఎంఎల్ఏ) కింద అటాచ్ చేసినట్టు అధికారులు తెలిపారు. వీటితో పాటు రూ 278 కోట్ల నిల్వలున్న నీరవ్‌కు చెందిన రెండు విదేశీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. రూ 22.69 కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన ఆభరణాలను హాంకాంగ్ నుంచి భారత్‌కు తీసుకువచ్చారు. దక్షిణ ముంబైలో రూ 19.5 కోట్ల విలువైన ఫ్లాట్‌ను అటాచ్ చేశారు. మరోవైపు నీరవ్ మోదీ ఉదంతంతో పాటు పలు కుంభకోణాల్లో ప్రమేయం ఉన్న ఆర్థిక శాఖ కార్యదర్శి హస్ముక్ అథియాను ప్రాసిక్యూట్ చేయాలని సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. నీరవ్ మోదీతో హస్ముక్ అథియా ఇప్పటికీ టచ్‌లో ఉంటూ ఆయనకు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
షారుఖ్ ఖాన్‌కు షాక్: భారీ ఆస్తి గోవిందా?
సాక్షి, ముంబై: బాలీవుడ్ బాద్షా, సీనియర్ హీరో షారుఖ్ ఖాన్‌కు ఆదాయపన్ను శాఖ షాక్ ఇచ్చింది. షారుఖ్ బినామీ ఆస్తికి సంబంధించిన పక్కా ఆధారాల్ని సేకరించిన ఐటీ శాఖ కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఇచ్చిన ఐటీ నోటీసులకు స్పందించడకపోవడంతో షారూఖ్‌కు చెందిన విలాస వంతమైన ఫాం హౌస్‌ను తాత్కాలికంగా ఎటాచ్ చేసింది. మహారాష్ట్ర ఆలీబాగ్‌లోని డెజా వు ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఎటాచ్ చేసింది. ఈ మేరకు బినామి ఆస్తి లావాదేవీల చట్టం (పిబిపిటి) కింద అటాచ్మెంట్ నోటీసు జారీ చేయనుందని బిజినెస్ స్టాండర్డ్ రిపోర్ట్ చేసింది. ఈ పరిణామాన్ని ధృవీకరించిన ఐటీ శాఖ సీనియర్ .. సెక్షన్ 24 ప్రకారం బినామీదారుడు దర్యాప్తు సంస్థ గుర్తిస్తే ఆ వ్యక్తికి లేదా ప్రయోజనకరమైన యజమానికి అటాచ్మెంట్ నోటీసును జారీ చేయవచ్చని తెలిపారు. ఆస్తి అటాచ్మెంట్ నోటీసు జారీ చేసిన 90రోజుల తరువాత సదరు ఆస్తిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని చట్టం పేర్కొందన్నారు. దీనికి సంబంధించి డిసెంబర్లోనే నోటీసులు జారీ చేసినట్టు చెప్పారు. 19,960 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆస్తి విలువ (సర్కిల్ రేటు) సుమారు. రూ. 146.7 మిలియన్లు(15 కోట్లు) అయితే మార్కెట్ ధర దీనికి ఐదు రెట్లు పెరగనుందని మరో ఐటి అధికారి చెప్పారు. ఇందులో బీచ్, స్విమ్మింగ్‌పూల్ తోపాటు, ప్రైవేట్ హెలిప్యాడ్ లాంటి సౌకర్యాలు ఈ ఫాం హౌస్‌లో ఉన్నాయట. కాగా కొన్నేళ్ల కిందట షారుఖ్ సుమారు 20,000 గజాల ఈ భూమిని వ్యవసాయం కోసం చేజిక్కించుకున్నాడు. అయితే దీనిని అందుకోసం ఉపయోగించకుండా.. ఒక ఫామ్‌హౌస్ నిర్మించడంతోపాటు, బంధువుల్ని డైరెక్టర్లుగా నియమించి సర్వాధికారాల్ని తానే కలిగి ఉన్నాడు. దీని మార్కెట్ విలువ సుమారు 100 కోట్ల రూపాయల మేర ఉంటుందని అంచనా వేస్తోంది ఐటీ శాఖ. కింగ్ ఖాన్ నేరం రుజువైతే ఆరు నెలలనుంచి ఏడేళ్ల దాకా శిక్ష, ఆస్తిలో 10 శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ పరిణామంపై షారుఖ్ ఖాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. -
ఎన్ఎస్ఈఎల్ స్కాంలో ఆస్తుల ఎటాచ్
మనీలాండరింగ్ స్కాంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా(ఎఫ్టీఐఎల్)కు ఈడీ భారీ షాకిచ్చింది. సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఎటాచ్ చేసింది. ఆస్తులు, నగదురూపంలో రూ.1,253 కోట్లను ఎటాచ్ చేసింది. రూ. 5600 కోట్ల ఎన్ఎస్ఈఎల్ (నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్) స్కాం కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో ఎందరో బ్రోకర్లు, ఇన్వెస్టర్లు వందల కోట్లకు ఎఫ్ టీఐఎల్ మోసం చేసిందనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బోగస్ డీల్స్ ద్వారా జిగ్నేష్ రూ. 76 కోట్లు అక్రమంగా వెనకేశాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ కోర్టులో వాదించింది. కాగా నేషనల్ స్పాట్ ఎక్సేంజీలో జరిగిన రూ.5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి గతంలో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇటీవల ఈ స్కాం సూత్రధారి, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ మాజీ ఛైర్మన్ జిగ్నేష్ షాను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.