NSEL scam
-
కో లొకేషన్ స్కాం.. ఆనంద్ సుబ్రమణియం అరెస్ట్
నేషనల్ స్టాక్ ఎక్సేంజీని పట్టి కుదిపేస్తున్న కో లొకేషన్ కుంభకోణం కేసులో కీలక పాత్రధారి ఆనంద్ సుబ్రమణియన్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్ట్ చేసింది. శుక్రవారం ఉదయం సీబీఐ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. దేశంలోనే పెద్ద స్టాక్ ఎక్సేంజీల్లో ఒకటైన ఎన్ఎస్ఈకి ఎండీగా పని చేసిన చిత్రా రామకృష్ణకు సలహాదారుగా ఆనంద్ సుబ్రమణియన్ పని చేశారు. ఈ కాలంలో వీరిద్దరు కీలకమైన సమాచారం నిబంధనలకు విరుద్ధంగా అనైతికంగా లీక్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈమేరకు ఢిల్లీలో కేసు నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి చిత్ర రామకృష్ణను ఇటీవల సీబీఐ అధికారులు ప్రశ్నించగా పలు చిత్రమైన అంశాలు వెలుగు చూశాయి. ఓ అదృశ్య యోగి సూచనల మేరకు తాను ‘అలా’ చేయాల్సి వచ్చిందని చిత్ర రామకృష్ణన్ చెప్పడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. అసలు ఎవరా అదృశ్య యోగి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ తరుణంలో ఆనంద్ సుబ్రమణియన్ అరెస్ట్ అయ్యారు. సీబీఐ విచారణలో ఈ కుంభకోణంలో అదృశ్యంగా వ్యవహరించిన వ్యక్తికి సంబంధించిన కీలక సమాచారం వెల్లడవవచ్చని అంచనా చదవండి:చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..! -
క్రికెట్ బెట్టింగ్ తరహా కుంభకోణం! అయితే ప్లేస్ మారింది
న్యూఢిల్లీ: నేషనల్ స్టాక్ ఎక్సేంజీ (ఎన్ఎస్ఈ)లో కో–లొకేషన్ వివాదానికి సంబంధించి వివిధ దర్యాప్తు బృందాలు ఇందులోని మరిన్ని కొత్త కోణాలపై విచారణ జరుపుతున్నాయి. సర్వర్లు, డేటా అందించడంలో కొంత మంది బ్రోకర్లకు ప్రా«ధా న్యం ఇవ్వడం, ఈ సదుపాయాన్ని దుర్వినియోగం చేయడం వంటి అంశాల్లో ఎవరెలా లబ్ధి పొందినదీ వెలికి తీయడంపై దృష్టి పెడుతున్నాయి. ఇది అచ్చం క్రికెట్ బెట్టింగ్ స్కామ్లాగా పని చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అరసెకను ముందు తెలిసినా.. ‘సాధారణ ఇన్వెస్టరు లేదా బ్రోకర్ తన సాధారణ టెర్మినల్ మీద ట్రేడింగ్ చేయడమంటే.. క్రికెట్ మ్యాచ్ లైవ్ టెలికాస్ట్‌ను టీవీలో లేదా స్టేడియంలో చూసినట్లుగా ఉంటుంది. అయితే, ఫీల్డ్‌లోని ప్రతి ఆటగాడి కదలికలు, వారు ఏం చేయబోతున్నారన్నది మిగతా వారి కన్నా ముందుగానే తెలిసిపోతే ఎలా ఉంటుంది? కాస్త లోతుగా ఆలోచిస్తే ఎవరెలా నష్టపోతున్నారన్నది అర్థమవుతుంది. మార్కెట్ డేటా మిగతావారికన్నా అరసెకను ముందు వచ్చినా ట్రేడర్లు బోలెడంత లబ్ధి పొందుతారు‘ అని ఒక అధికారి పేర్కొన్నారు. కొనసాగుతున్న విచారణ అధిక మొత్తం చెల్లించిన బ్రోకింగ్ సంస్థలకు స్టాక్ ఎక్సేంజీలో సర్వర్లు ఏర్పాటు చేసుకునేందుకు, మిగతా వారితో పోలిస్తే ముందుగా డేటాను పొందే వెసులుబాటు పొందేందుకు ఎన్ఎస్ఈ వివాదాస్పద కో–లొకేషన్ విధానం అమ లు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్ఎస్ఈ మాజీ సీఈవోలు చిత్రా రామకృష్ణ, రవి నారాయణ్ తదితరులపై విచారణ జరుగుతోంది. చిన్న ఇన్వెస్టర్లకూ నష్టమే దీనివల్ల చిన్న ఇన్వెస్టర్లకు పెద్దగా నష్టం లేదనడాన్ని ఆయన కొట్టిపారేశారు. ‘చిన్న ఇన్వెస్టర్లకు పెద్దగా నష్టం వాటిల్లలేదని వాదించడం అర్థరహితం. వారికి షేరుపై రూపాయో లేదా కొన్ని చిల్లర పైసల్లోనో నష్టం వచ్చి ఉండవచ్చు. కానీ రోజూ కొన్ని లక్షలు కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నప్పుడు.. కేవలం కొద్ది మంది బ్రోకర్లు ఏళ్ల తరబడి వందలు, వేల కోట్ల మేర లబ్ధి పొంది ఉంటారు‘ అని ఒక అధికారి వివరించారు. అక్రమ సంపాదన ఇటీవల బైటపడిన కొన్ని అంశాలను బట్టి ఉన్నత స్థానం లోని కొందరు.. ట్రేడింగ్ స్లాట్ల కేటాయింపులో కొంత మందికి ప్రాధాన్యమివ్వడం ద్వారా దశాబ్ద కాలంగా అక్రమంగా భారీ మొత్తం కూడబెట్టుకుని ఉంటారన్న అనుమానాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి 2009–2016 కాలంలో జరిగిన ఆర్థిక లావాదేవీలన్నీ పరిశీలించనున్నట్లు వివరించారు. చదవండి: చిత్ర రామకృష్ణ.. హిమాలయన్ 'యోగి'ల.. అదృశ్య కథ..! -
చిదంబరం అధికార దుర్వినియోగం
ముంబై: నేషనల్ స్పాట్ ఎక్సే్చంజ్ లిమిటెడ్ (ఎన్ఎస్ఈఎల్) స్కామ్ కేసులో 63 మూన్స్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షా తాను బాధితుడినన్న వాదనను లేవనెత్తారు. దేశంలోనే అతిపెద్ద ఈక్విటీ ఎక్సే్చంజ్ ఎన్ఎస్ఈకి లబ్ధి కలిగించాలన్న దురుద్దేశంతో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అధికార దుర్వినియోగానికి పాల్పడి ఎన్ఎస్ఈఎల్ దెబ్బితినేలా వ్యవహరించారని ఆరోపించారు. రూ.10వేల కోట్ల పరిహారం కోరుతూ చిదంబరంతోపాటు కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి కేపీ కృష్ణన్, ఫార్వర్డ్ మార్కెట్స్ కమిషన్ (ఎఫ్ఎంసీ) మాజీ చైర్మన్ రమేష్ అభిషేక్‌లకు ఈ వారంలోనే 63 మూన్స్ లీగల్ నోటీసులను కూడా పంపించింది. ‘‘ఎన్‌ఎస్‌ఈఎల్‌ను అంతం చేయాలన్న దురుద్దేశంతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసు ఇది. ఎక్సేంజ్ విభాగం నుంచి మమ్మల్ని అంతం చేసేందుకు కుట్ర జరిగింది’’ అని జిగ్నేష్ షా మీడియాకు తెలిపారు. ఎన్ఎస్ఈఎల్ దేశంలోనే తొలి కమోడిటీ స్పాట్ ఎక్సేంజ్. జిగ్నేష్ షాకు చెందిన ఫైనాన్షియల్ టెక్నాలజీస్ (63మూన్స్ పూర్వపు పేరు) పూర్తి అనుబంధ కంపెనీ ఇది. అయితే, ఇన్వెస్టర్లు బుక్ చేసుకున్న ఆర్డర్లను గోదాముల నుంచి డెలివరీ చేయకపోవడంతో రూ.5,600 కోట్ల మేర అవకతవకలు 2013 జూలై 31న వెలుగు చూశాయి. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్ఎస్ఈఎల్ నిలిపివేతకు ఆదేశించింది. ఇదే కేసులో షా 2014 మే నెలలో అరెస్ట్ అయ్యారు. దాంతో దాదాపు అరడజను ఎక్సే్చంజ్లపై ఆయన నియంత్రణ కోల్పోవాల్సి వచ్చింది. ‘‘నాటి ఆర్థిక మంత్రి చిదంబరం ఎన్ఎస్ఈఎల్ స్కామ్‌ను ప్రైవేటు కేసుగా పేర్కొన్నారు. కంపెనీ, వాటాదారుల ద్వారా దీన్ని పరిష్కరించాల్సి ఉంటుందని ప్రకటించారు. మరి ఎఫ్ఎంసీ ద్వారా ఎందుకు పరిష్కరించలేదు?’’ అని షా సందేహాలు వ్యక్తం చేశారు. -
ఎన్ఎస్ఈఎల్ స్కాంలో మాజీ సీఎఫ్‌వో అరెస్టు
నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్) కుంభకోణంలో 63మూన్ టెక్నాలజీస్(గతంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్) మాజీ సీఎఫ్‌వో శశిధర్ కొటైన్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. 5600కోట్ల రూపాయల కుంభకోణం కేసులో శుక్రవారం ఆర్థిక నేరాల ప్రత్యేక వింగ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను జనవరి 28వరకు కస్టడీకి తరలించారు. 13వేలమందికి పైగా ఇన్వెస్టర్లను మోసం చేసిన వ్యవహారంలో 2013, జూలైలో కేసు నమోదైంది. అలాగే జిగ్నేష్ షా ఆధ్వర్యంలోని సంస్థను రెగ్యులేటరీ స్వాధీనంలోకి వెళ్లింది. అలాగే సంస్థ కీలక అధికారులకు, పలుడైరెక్టర్లను ఇప్పటికే అరెస్టు చేసిన ముంబై పోలీసులు 2018, డిసెంబరులో 27మంది సహా, దాదాపు 63 సంస్థలు, 36 కంపెనీలపై చార్జ్షీట్లను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎన్ఎస్ఈఎల్ స్కాంలో ఆస్తుల ఎటాచ్
మనీలాండరింగ్ స్కాంలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ ఇండియా(ఎఫ్టీఐఎల్)కు ఈడీ భారీ షాకిచ్చింది. సంస్థకు చెందిన కోట్ల రూపాయల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ ఎటాచ్ చేసింది. ఆస్తులు, నగదురూపంలో రూ.1,253 కోట్లను ఎటాచ్ చేసింది. రూ. 5600 కోట్ల ఎన్ఎస్ఈఎల్ (నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్) స్కాం కేసులో ఈడీ ఈ చర్యలు తీసుకుంది. ఎన్ఎస్ఈఎల్ కుంభకోణంలో ఎందరో బ్రోకర్లు, ఇన్వెస్టర్లు వందల కోట్లకు ఎఫ్ టీఐఎల్ మోసం చేసిందనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో బోగస్ డీల్స్ ద్వారా జిగ్నేష్ రూ. 76 కోట్లు అక్రమంగా వెనకేశాడని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ కోర్టులో వాదించింది. కాగా నేషనల్ స్పాట్ ఎక్సేంజీలో జరిగిన రూ.5,600 కోట్ల కుంభకోణానికి సంబంధించి గతంలో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేసిన పోలీసులు ఇటీవల ఈ స్కాం సూత్రధారి, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ మాజీ ఛైర్మన్ జిగ్నేష్ షాను కూడా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.