డిపాజిట్దారులకు ఊరట కల్పిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తెలుసుకుంది. రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ తాజాగా తీసుకొచ్చిన నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. ఈ నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ నోటీఫికేషన్ జారీచేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా ఈ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.