withdraws
-
హేమంత్ సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఉపసంహరణ
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరెన్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. జనవరిలో ఈడీ సొరెన్‌ను ఆరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సొరెన్ మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు పలు ప్రశ్నలను సంధించింది. రాంచీ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకున్న ఫిర్యాదులో వాస్తవాలను బయటపెట్టకపోవటంపై ప్రశ్నించింది. దీంతో తాము దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు సొరెన్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్ తెలిపారు. సుప్రీం కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసే అవకాశాలు ఉన్నందున బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరిచుకున్నారు. దీంతో మాజీ సీఎం సొరెన్ లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. జార్ఖండ్ మొత్తం 14 లోక్‌సభ సీట్లలో ఇప్పటి వరకు 7 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మరో 7 స్థానాకలు ఆరో విడత( మే 25), ఏడో విడత (జూన్ 1)న పోలింగ్ జరగనుంది. ఇక.. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం పాల్గొనడాడికి మధ్యంతర బెయిల్ కోరుతూ సొరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆయనపై దాఖలైన నగదు అక్రమ చలామణీ కేసులో దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా సొరెన్ చెడగొట్టేందుకు ప్రయత్నించొచ్చని సుప్రీంకోర్టుకు తెలిపింది -
ఎన్నికల భయం.. 10 రోజుల్లో రూ. 17,000 కోట్లు వెనక్కి..
సార్వత్రిక ఎన్నికలు, దాని ఫలితం చుట్టూ ఉన్న అనిశ్చితి, ఖరీదైన వాల్యుయేషన్లు, ప్రాఫిట్ బుకింగ్ కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు భారతీయ ఈక్విటీల నుంచి భారీగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. మే నెల మొదటి 10 రోజుల్లో రూ. 17,000 కోట్లను ఉపసంహరించుకున్నారు.మారిషస్‌తో భారత్ పన్ను ఒప్పందం సర్దుబాటు, యూఎస్ బాండ్ ఈల్డ్‌లలో నిరంతర పెరుగుదలపై ఆందోళనల కారణంగా ఏప్రిల్‌లో నమోదైన రూ. 8,700 కోట్ల నికర ఉపసంహరణ కంటే ఇది చాలా ఎక్కువ. అంతకు ముందు ఎఫ్‌పీఐలు మార్చిలో రూ.35,098 కోట్లు, ఫిబ్రవరిలో రూ.1,539 కోట్ల నికర పెట్టుబడులు పెట్టారు. సాధారణ ఎన్నికల తర్వాత నాలుగో త్రైమాసికంలో దేశ కార్పొరేట్ ఆర్థిక పనితీరు బలపడుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు స్పష్టంగా వెలువడేంత వరకు ఎఫ్‌పీఐలు జాగ్రత్త వైఖరి అవలంబించవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎఫ్‌పీఐల ఈ దూకుడు అమ్మకాల వెనుక అనేక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు, దాని ఫలితాల చుట్టూ ఉన్న అనిశ్చితి కారణంగా, ఎన్నికల ఫలితాలకు ముందే మార్కెట్లోకి ప్రవేశించడంలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉన్నారని మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ - రీసెర్చ్ మేనేజర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. -
ఆ అడుగుల్లో భాగమేనా? వెనక్కి తగ్గిన పల్లవి పటేల్ పార్టీ
వచ్చే ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తానని గతంలో ప్రకటించిన అప్నా దళ్ (కెమెరవాడి) తన నిర్ణయాన్ని మార్చుకుంది. పార్టీ అభ్యర్థుల సవరించిన జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి రామ్ సనేహి పటేల్ ఒక ప్రకటనలో ప్రకటించారు. ‘ఇండియా’ కూటమికి చెందిన అప్నా దళ్ (కామెరవాడి) కౌశంబి, ఫుల్పూర్, మీర్జాపూర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. అయితే తరువాత పార్టీ నిర్ణయాన్ని మార్చుకుంది. ఈ స్థానాల నుండి తమ అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. ఆ పార్టీ గతంలో 2022 ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)తో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఇంతకుముందు వారి సహకారం ఉన్నప్పటికీ, 2024 ఎన్నికలకు అప్నా దళ్ (కెమెరవాడి)తో పొత్తు ఉండదని ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు. దీంతో అప్నా దళ్ (కెమెరవాడి) త్వరలో అభ్యర్థుల కొత్త జాబితాను విడుదల చేస్తుందని భావిస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం ఆ పార్టీ ముఖ్య నాయకురాలు పల్లవి పటేల్.. తమ పార్టీ ‘ఇండియా’ కూటమిలో ఉండాలా వద్దా అనేది కాంగ్రెస్ నిర్ణయించుకోవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేలో చేరే అవకాశంపై సంకేతాలు ఇచ్చారు. బీజేపీ నుంచి ఏదైనా ఆఫర్ వస్తే తమ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందని పల్లవి పటేల్ చెప్పారు. పార్టీ ప్రకటించిన స్థానాల విషయంలో నిర్ణయాన్ని మార్చుకోవడం ఇందులో భాగమేనా అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. -
బీజేపీకి షాక్.. పోటీ నుంచి తప్పుకున్న మరో ఎంపీ అభ్యర్థి
గాంధీనగర్: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలతో రాజకీయ పార్టీలు హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఓవైపు పార్లమెంట్ ఎన్నికల్లో సీటు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలు.. పార్టీ మారి, లేదా స్వతంత్రంగా బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కేంద్రంలోని అధికార బీజేపీకి చెందిన పలువురు ఎంపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇద్దరు లోక్ సభ అభ్యర్ధులు పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. వివరాలు.. గుజరాత్‌కు చెందిన బీజేపీకి చెందిన మహిళా ఎంపీ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు శనివారం వెల్లడించారు. బీజేపీకి చెందిన రంజన్‌బెన్ ధనంజయ్ భట్ వడోదర నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. దీంతో మూడోసారి కూడా వడోదర నుంచి ఆమెనే అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. చదవండి: కాంగ్రెస్‌కు షాక్!.. బీజేపీలో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలు అయితే వడోదర లోక్‌సభ స్థానం నుంచి భట్‌ను తిరిగి నామినేట్ చేయడంపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ బ్యానర్లు వెలిశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రంజన్‌బెన్ భట్ లోక్‌సభ ఎన్నికల పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.ఈ మేరకు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. రంజన్ భట్ తన అభ్యర్ధిత్వాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే మరో బీజేపీ ఎంపీ అభ్యర్ధి ఎన్నికల రేసు నుంచి వైదొలిగారు. సబర్కాంత బీజేపీ అభ్యర్థి భిఖాజీ ఠాగూర్ కూడా వ్యక్తిగత కారణాలతో ఎంపీగా పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ప్రకటించారు. అయితే అతని ఇంటి పేరు, కులంపై వివాదం చెలరేగడంతో ఆయన ఈ నిర్ణంయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా సబర్కాంత నుంచి రెండుసార్లు గెలుపొందిన దిప్సిన్ రాథోడ్‌ను కాదని భిఖాజీకి ఈసారి బీజేపీ టికెట్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన ఎంపీ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. -
మార్చి 15 కల్లా సైన్యాన్ని ఉపసంహరించుకోండి
మాలె: భారత్ తమ దేశంలోని సైన్యాన్ని మార్చి 15వ తేదీకల్లా ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కోరారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులున్నారు. ఈ పరిణామంపై కేంద్రం ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. గత నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ముయిజ్జుకు చైనా అనుకూల నేతగా పేరుంది. ప్రజాభీష్టం మేరకు భారత సేనలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయన అప్పట్లోనే ప్రకటించారు. భారత ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిని ప్రభుత్వం తొలగించడం తెలిసిందే. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. -
తెలంగాణలో రైతుబంధు కింద నగదు బదిలీకి అనుమతి రద్దు చేసిన ఎన్నికల సంఘం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
భారత్ నుంచి కెనడా దౌత్యవేత్తల ఉపసంహరణ
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య వివాదం నేపథ్యంలో భారత్ నుంచి 41 మంది దౌత్య వేత్తలను కెనడా ఉపసంహరించుకుందని కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ తెలిపారు. కెనడా ప్రతీకార చర్యలకు పాల్పడబోదని ఆమె వెల్లడించారు. కెనడా దౌత్యవేత్తలు భారత్‌ను వీడకపోతే శుక్రవారం ఏకపక్షంగా వారి అధికారిక హోదాను రద్దు చేస్తామని భారత్ బెదిరించిందని జోలీ చెప్పారు. ఈ చర్యతో భారత్ దౌత్య సంబంధాలపై కుదుర్చుకున్న వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. భద్రతపై ఆందోళనలు వెల్లువెత్తున్న నేపథ్యంలో భారత్ నుంచి దౌత్యవేత్తలను తరలించామని జోలి చెప్పారు. దౌత్యపరమైన విధానాలను నాశనం చేయాలనుకుంటే ప్రపంచంలో ఎక్కడా దౌత్యవ్యవస్థ ఉండబోదని తెలిపారు. అందుకే తాము ప్రతిచర్యకు పాల్పడటం లేదని తెలిపారు. 41 మంది దౌత్యవేత్తలు వారిపై ఆధారపడిన 42 మంది సభ్యులను భారత్ నుంచి తరలించామని తెలిపారు. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్య కేసులో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీంతో భారత్-కెనడా మధ్య వివాదం చెలరేగింది. ఈ వివాదంలో ఇరుదేశాలు దౌత్యపరమైన ఆంక్షలు కూడా విధించుకున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా కెనడా ఆరోపిస్తోందని భారత్ మండిపడింది. ఈ పరిణామాల అనంతరం భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాలని కేంద్రం కోరింది. అక్టోబర్ 10 నాటికి ఉపసంహరించుకోవాలని గడువును కూడా విధించింది. ఇదీ చదవండి: రష్యా, హమాస్ ఒకటే: బైడెన్ -
బీరేన్ సింగ్ ప్రభుత్వానికి షాక్.. మద్దతు ఉపసంహరించుకున్న కీలక పార్టీ..
ఇంఫాల్: మణిపూర్‌లో గత మూడు నెలలుగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో భాజపా నేతృత్వంలోని ప్రభుత్వం తన మిత్రున్ని కోల్పోయింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న కుకీ పీపుల్ అలయెన్స్ (కేపీఏ) ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ అనుసూయా ఉకేకి లేఖ రాసింది. కేపీఏ నిర్ణయంతో సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు ఉండదు. 'ఇన్ని రోజుల అల్లర్ల పరిణామల తర్వాత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంలో ఎలాంటి ఉపయోగం లేదు. సీఎం బీరేన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంటున్నాం. ఇది ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేనప్పటికీ నిర్ణయం తీసుకుంటున్నాం.' అని కేపీఏ చీఫ్ టోంగ్‌మాంగ్ హాకిప్ లేఖలో పేర్కొన్నారు. 60 మంది సభ్యుల అసెంబ్లీలో సైకుల్ నుంచి కిమ్నియో హౌకిప్ హాంగ్షింగ్, సింఘత్ నుంచి చిన్లుంతంగ్ ఇద్దరు కేపీఏ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతునిచ్చారు. బీజేపీకి 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరికి ఐదుగురు నాగ కూటమి సభ్యులు, ముగ్గురు స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. మణిపూర్‌లో అల్లర్లు గత మూడు నెలలుగా ఆందోళనలు చెలరేగాయి. కుకీ, మైతేయి తెగల మధ్య అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లు కొద్ది రోజుల క్రితం తగ్గినట్టే తగ్గి మళ్లీ రాజుకున్నాయి. అల్లర్లను తగ్గించడానికి కేంద్రం తాజాగా మరో 900 మంది బలగాలను కొత్తగా మోహరించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో దాదాపు 4000 మంది ఆర్మీ సిబ్బంది పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. కాగా.. మణిపూర్ అల్లర్లలో ఇప్పటికే దాదాపు 170 మంది మరణించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదీ చదవండి: సీఎంను కించపరుస్తూ పోస్టులు.. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ అరెస్టు.. -
మూడు రాజధానులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ శ్రీరాం తెలిపారు. మూడు రాజధానులపై అసెంబ్లీలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. చదవండి: AP 3 Capitals Bill: 'ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే.. శుభం కార్డుకు చాలా సమయం ఉంది' కాగా, 2019 సెప్టెంబర్ 13న రాజధానిపై అధ్యయనానికి జీఎన్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. 2019 డిసెంబర్ 20న పరిపాలన వికేంద్రీకరణకు జీఎన్‌రావు కమిటీ సిఫార్సు చేసింది. 2019 డిసెంబర్ 29న జీఎన్‌రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై అధ్యయనానికి ప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించింది. మూడు రాజధాలను ఏర్పాటు చేయాలని 2020 జనవరి 3న హైపవర్ కమిటీ తెలిపింది. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి అవకాశముందని హైపవర్ కమిటీ పేర్కొంది. 2020 జనవరి 20న హైపవర్ కమిటీ నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు రాజధానుల బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. 2020 జనవరి 22న శాసనమండలి ముందుకు మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెట్టగా, వికేంద్రీకరణ బిల్లును సెలక్ట్ కమిటీకి శాసనమండలి పంపించింది. 2020 జూన్ 16న మరోసారి అసెంబ్లీ ముందు వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టగా, 2020 జూన్ 17న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ రెండో సారి ఆమోదం తెలిపింది. 2020 జులై 18న మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం గవర్నర్‌కు పంపింది. 2020 జులై 31న పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. తదుపరి విచారణ సోమవారికి వాయిదా అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం పై దాఖలైన పిటిషన్ పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అభివృద్ధి వికేంద్రీకరణ రిపీల్ బిల్లును దాఖలు చేయడానికి అడ్వకేట్ జనరల్ సమయం కోరారు. రిపీల్ బిల్లుతోపాటు సంబంధిత వివరాలన్నీ శుక్రవారం దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. -
మహిళా జడ్జి పుష్పకు సుప్రీంకోర్టు షాక్
న్యూఢిల్లీ: అత్యాచార కేసుల్లో వరసగా వివాదాస్పద తీర్పులు ఇస్తున్న బొంబాయి హైకోర్టు నాగపూర్ బెంచ్ మహిళా న్యాయమూర్తి జస్టిస్ పుష్ప గణేడివాలాకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. బొంబాయి హైకోర్టు శాశ్వత జడ్జిగా ఆమెను నియమించాలని గతంలో సిఫారసు చేసిన సుప్రీం కొలిజీయం శనివారం దానిని వెనక్కి తీసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద జస్టిస్ పుష్ప ఇటీవల ఇచ్చిన తీర్పులు వివాదాస్పదమయ్యాయి. ఆ తీర్పుల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అందుకే శాశ్వత జడ్జిగా నియామకం సిఫారసుల్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్టుగా సుప్రీం వర్గాలు వెల్లడించాయి. పన్నెండేళ్ల బాలికపై లైంగిక దాడికి దిగితే శరీరంతో నేరుగా శరీరాన్ని (స్కిన్ టు స్కిన్) తాకకపోతే పోక్సో చట్టం కింద నేరం కాదంటూ కేసు నుంచి నిందితుడిని విముక్తుడిని చేశారు. మరో కేసులో బాధితురాలి చేతులు గట్టిగా పట్టుకొని, ప్యాంటు జిప్ తీయడం లైంగిక దాడికాదని కేసు కొట్టేశారు. మరో రెండు కేసుల్లో బాధితురాలు ప్రతిఘటిస్తే ఆమెను వివస్త్రని చేయడం సాధ్యం కాదని, బాధితురాలి సాక్ష్యాన్ని పరిగణించడం కుదరదంటూ వరసగా వివాదాస్పద తీర్పులు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఆధ్వర్యంలో సుప్రీం కొలీజియం జనవరి 20న సమావేశమై పుష్పను శాశ్వత న్యాయమూర్తిగా నియమించాలని సిఫారసు చేసింది. కేవలం నెలరోజుల వ్యవధిలో ఆమె తీర్పులు వివాదాస్పదం కావడంతో సుప్రీం కొలీజియం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. -
ఈపీఎఫ్‌ను భారీగా లాగేశారు..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో పెన్షన్ ఫండ్ నుంచి 75 శాతం వరకూ విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో గత పదిరోజుల్లో సబ్‌స్ర్కైబర్లు రూ 280 కోట్లు వెనక్కితీసుకున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) వెల్లడించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మేరకు 1.37 లక్షల మంది చందాదారులకు రూ 279.65 కోట్లు చెల్లించామని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఈపీఎఫ్ఓ వద్ద నమోదైన నాలుగు కోట్ల మంది ఉద్యోగులు మూడు నెలల కనీసం వేతనం, డీఏ లేదా ఈపీఎఫ్ మొత్తంలో 75 శాతం ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించని అడ్వాన్స్ కింద పొందవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చి 26న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి ప్రకటన నేపథ్యంలో అదే నెల 28న ఈపీఎఫ్ఓ దీనిపై నోటిఫికేషన్ జారీ చేసింది. సబ్స్క్రైబర్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొనడంతో క్లెయిమ్స్ సెటిల్మెంట్ కోసం ఈపీఎఫ్ఓ నూతన సాఫ్ట్‌వేర్‌తో ముందుకొచ్చింది. 1.37 లక్షల క్లెయిమ్స్ వచ్చాయని, వీటిని ప్రాసెస్ చేస్తున్నామని..పూర్తి కేవైసీ నిబంధనలకు అనుగుణంగా ఉన్న క్లెయిమ్స్‌ను 72 గంటల్లో పరిష్కరిస్తామని ఈపీఎఫ్ఓ ఓ ప్రకటనలో పేర్కొంది.మరోవైపు కరోనా కట్టడికి లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో అటల్ పెన్షన్ యోజన చందాదారులకు సైతం ఉద్యోగుల వాటాలో పాక్షిక ఉపసంహరణలకు అనుమతించాలని ప్రభుత్వం యోచిస్తోంది. చదవండి : ఈపీఎఫ్‌వోలో జనన ధ్రువీకరణకు ఆధార్ -
అమరావతి నిర్మాణంలో కనీస పురోగతి లేదు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో వెయ్యి పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు లేవని ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయూఐహెచ్) టీడీపీ సర్కారు అధికారంలో ఉండగానే తేల్చి చెప్పింది. ఆస్పత్రి ఏర్పాటు ప్రతిపాదనను తాము ఎందుకు విరమించుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ ఐయూఐహెచ్ ఎండీ అండ్ సీఈవో డాక్టర్ అజయ్ రంజన్‌గుప్తా 2019 మే 29వ తేదీన అప్పటి సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్‌కు సుదీర్ఘ లేఖ రాశారు. 2016 మార్చి 12 నుంచి 2019 జనవరి 19 వరకు సీఆర్డీఏ, ఐయూఐహెచ్ మధ్య జరిగిన 41 ఉత్తరప్రత్యుత్తరాలన్నింటినీ దీనికి జత చేశారు. హామీలు, రాయితీలపై నిర్లక్ష్యం.. అమరావతిలో ప్రతిష్టాత్మకమైన తమ సంస్థ ఏర్పాటుకు ముందుకొస్తే టీడీపీ ప్రభుత్వం తీవ్ర వేధింపులకు గురి చేసిందని లేఖలో స్పష్టం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నెలకొల్పేందుకు మూడేళ్లుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. అమరావతిని అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని చెప్పారని, కానీ క్షేత్రస్థాయిలో కనీస పురోగతి కూడా లేకపోవడంతో తమ వాటాదారులు, పెట్టుబడిదారులు ఈ ప్రాజెక్టు నుంచి వెనక్కి రావాలని ఒత్తిడి చేశారని అందులో పేర్కొన్నారు. అమరావతిలో సరైన రహదారులు, మురుగునీటి వ్యవస్థ లేదని, అలాంటి చోట ప్రతిష్టాత్మకమైన తమ సంస్థ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయడం సరికాదని తమ భాగస్వామ్య సంస్థలు, స్టేక్ హోల్టర్లు పదేపదే సూచించినట్లు వెల్లడించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుకు ప్రవేశమార్గం లేదని, దీనివల్ల తమకు కేటాయించిన ప్రాంతానికి చేరుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని చాలాసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. తమకు ఇచ్చిన హామీలు, రాయితీల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించారని తెలిపారు. తుది ఒప్పందం చేసుకునేందుకు తమ ప్రతినిధులు 2017 జనవరి వరకు సీఆర్డీఏ అధికారులతో ఏడుసార్లు సమావేశమైనా పురోగతి లేదన్నారు. ప్రతీసారి అగ్రిమెంట్లో మార్పులు చేశారని, రకరకాల సాకులతో ఇబ్బందులు పెట్టారని తెలిపారు. లీగల్‌గా సంక్రమించని భూమిని తమలాంటి ప్రైవేట్ కంపెనీకి కేటాయించకూడదన్నారు. నిజమైన యాజమాన్య, విక్రయ హక్కులు లేకుండా భూమి కేటాయించడం, ప్రారంభ సొమ్మును చెల్లించాలని కోరడం తీవ్రమైన లీగల్ చర్యలకు దారి తీస్తుందని అందులో పేర్కొన్నారు. వీటన్నింటి నేపథ్యంలో తాము అమరావతిలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఏర్పాటు ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నామని, తాము చెల్లించిన రూ.25 కోట్లను తిరిగి వెనక్కి ఇవ్వాలని అజయ్ రంజన్ గుప్తా లేఖలో పేర్కొన్నారు. దీని ద్వారా ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంస్థలతో చంద్రబాబు ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో, కమీషన్లు, వాటాల కోసం ఎంత ఇబ్బందులు పెట్టిందో స్పష్టమవుతోంది. -
‘కామన్వెల్త్’ పదవికి జస్టిస్ సిక్రి నో
న్యూఢిల్లీ: లండన్ కేంద్రంగా పనిచేస్తున్న కామన్వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్(సీశాట్) అధ్యక్షుడు/సభ్యుడిగా సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఏకే సిక్రి పేరును కేంద్రం ప్రతిపాదించింది. అయితే ఆ పదవి చేపట్టేందుకు ఆయన తిరస్కరించారు. ఇటీవల సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను తొలగించిన హైపవర్డ్ కమిటీలో జస్టిస్ సిక్రి కూడా సభ్యుడే అన్న సంగతి తెలిసిందే. వర్మపై వేటుకు సిక్రి మద్దతుపలకడం, ఆ తరువాత వచ్చిన విమర్శలతో ఆయన కలతచెందినట్లు తెలుస్తోంది. ఈ పదవిని వద్దనుకుంటున్నానని, తన పేరును ఇకపై పరిగణించొద్దని కోరుతూ ఆయన కేంద్రానికి లేఖ పంపారు. సీశాట్ పదవికి జస్టిస్ సిక్రి పేరును కేంద్రం గత నెలలోనే నామినేట్ చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ సీశాట్‌కు వర్తమానం పంపింది. మార్చి 6న రిటైర్ అయిన తరువాత ఆయన ఈ పదవి చేపట్టాల్సి ఉంది. తొలుత ఈ ఆఫర్‌కు అంగీకరించిన జస్టిస్ సిక్రి..సీబీఐ పరిణామాల నేపథ్యంలో మనసు మార్చుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ‘కామన్వెల్త్ పదవిని ఆఫర్ చేస్తూ ప్రభుత్వం గత నెలలోనే జస్టిస్ సిక్రిని సంప్రదించింది. దీనికి ఆయన అంగీకరించారు. ఎలాంటి జీతభత్యాలు లేని ఈ పదవిలో భాగంగా ఏడాదికి రెండు, మూడు విచారణలకు హాజరుకావాల్సి ఉంది’ అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ సిక్రిని సీశాట్ పదవికి నామినేట్ చేయడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ డిమాండ్ చేశారు. భయంతోనే ప్రధాని మోదీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఆరోపించారు. న్యాయ ప్రక్రియలో ఇతరులు వేలుపెడితే, అరాచకం రాజ్యమేలుతుందని ట్వీట్ చేశారు. కామన్వెల్త్ కూటమిలోని 53 దేశాల మధ్య తలెత్తే వివాదాల్ని పరిష్కరించే అత్యున్నత మధ్యవర్తి సంస్థే సీశాట్. 1965లో ఈ సంస్థ ప్రారంభమైంది. -
బ్యాంకుల సమ్మె; ముందే జీతాలు వేసినా..
న్యూఢిల్లీ : బ్యాంకు ఉద్యోగులు దేశవ్యాప్తంగా రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. పలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి చెందిన బ్యాంకు ఉద్యోగులు మే 30, 31 తేదీల్లో ఈ బంద్‌లో పాల్గొననున్నారు. ఈ రెండు రోజులు బ్యాంకింగ్ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నెల ముగింపు కావడంతో, ఉద్యోగుల వేతనాలు పడేది కూడా ఈ రోజుల్లోనే. మే 30, 31 తేదీల్లో బ్యాంకుల బంద్ కాబట్టి, కంపెనీలు లేదా ఆర్గనైజేషన్స్ తమ ఉద్యోగుల వేతనాలను ఈ రోజే(మంగళవారమే) క్రెడిట్ చేసే అవకాశముంది. ఉద్యోగుల వేతనాలు నేడే క్రెడిట్ అయినప్పటికీ, వాటిని ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వీలు లేకుండా..ఈ బంద్ దెబ్బకొట్టనుంది. ఈ బంద్‌లో ఏటీఎం గార్డులు కూడా పాలుపంచుకునే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏటీఎంలు మూతపడబోతున్నాయి. దీంతో వేతన విత్‌డ్రాయల్స్ కష్టతరంగా మారనుందని రిపోర్టులు పేర్కొన్నాయి. థర్డ్ పార్టీతో కలిసి బ్యాంకులు ఏటీఎంలను నింపినప్పటికీ, ఏటీఎంల సెక్యురిటీ మాత్రం ప్రశ్నార్థకమే. దీంతో నగదు విత్‌డ్రాయల్స్‌లో కాస్త ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు బంద్ నేపథ్యంలో కస్టమర్లు భారీ ఎత్తున్న నగదు విత్‌డ్రా చేసే అవకాశం ఉంది. దీంతో బుధ, గురువారాల్లో నగదు కొరత కూడా ఏర్పడుతుందని అపెక్స్ బ్యాంకు యూనియన్ ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటచలం ముందస్తు హెచ్చరికలు జారీచేశారు. అయితే ఈ రెండు రోజులు మాత్రం ఆన్లైన్ లావాదేవీలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలుస్తోంది. కేవలం 2 శాతం వేతన పెంపును మాత్రమే ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ఆఫర్ చేయడాన్ని నిరసిస్తూ.. బ్యాంకు యూనియన్లు ఈ బంద్ చేపడుతున్నాయి. ఇప్పటివరకు 12సార్లు పలు దఫాలుగా చర్చలు జరిపినా వేతన సవరణ ఒప్పందం అసంపూర్తిగానే మిగిలిపోయిందన్నారు. గత రెండు నుంచి మూడేళ్లుగా బ్యాంకు ఉద్యోగులు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం జన్‌ధన్, డిమానిటైజేషన్, ముద్రా, అటల్ పెన్షన్ యోజన వంటి వాటిని ఎంతో కృతనిశ్చయంతో అమలు చేస్తూ వస్తున్నారని, కానీ ప్రభుత్వం మాత్రం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని యూనిటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్ల కన్వినర్ దేవిదాస్ తుల్జపుర్కర్ అన్నారు. 2017 నవంబర్ నుంచి వేతనాల పున:సమీక్ష పెండింగ్‌లో ఉందని, వెంటనే వాటిని సమీక్షించాలని డిమాండ్ చేశారు. -
మాడ్రిడ్ ఓపెన్‌కు సెరెనా దూరం
అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ రేపటి (శనివారం) నుంచి జరిగే మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ టోర్నీ నుంచి వైదొలగింది. ‘తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న నేను మాడ్రిడ్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నాను’ అని సెరెనా తన వెబ్సైట్లో తెలిపింది. దీంతో ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్‌కు ముందు సన్నాహకంగా ఆమె రోమ్ ఓపెన్‌లో బరిలోకి దిగే అవకాశముంది. ఈ నెల 13 నుంచి 20 వరకు ఈ టోర్నీ జరుగుతుంది. -
నగదు డిపాజిట్లపై ఆర్బీఐ యూటర్న్
-
తాజా నిబంధనలను ఎత్తేసిన ఆర్బీఐ
ముంబై : డిపాజిట్‌దారులకు ఊరట కల్పిస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం తెలుసుకుంది. రూ.5,000 కంటే ఎక్కువ మొత్తాన్ని ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలంటూ తాజాగా తీసుకొచ్చిన నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. ఈ నిబంధనను ఉపసంహరించుకుంటున్నట్టు ఓ నోటీఫికేషన్ జారీచేసింది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతో తాజాగా ఈ ఆంక్షలు ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. రూ.5000 కంటే ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేస్తే తగిన ఆధారాలు చూపించాంటూ ఈ నెల 19న ఆర్బీఐ ఓ సర్క్యూలర్ జారీచేసిన సంగతి తెలిసిందే. రూ.5000 కంటే ఎక్కువగా డిపాజిట్ చేసే వారు ఇన్ని రోజులు ఎందుకు డిపాజిట్ చేయలేదో ఇప్పుడే ఎందుకు చేస్తున్నారో బ్యాంకులకు తెలపాల్సి ఉంటుంది. డిపాజిట్ దారులు చెప్పే సమాధానాలు బ్యాంకు సిబ్బందిని సంతృప్తి పరిస్తేనే డిపాజిట్ తీసుకుంటారు. ప్రస్తుతం ఈ నిబంధన ఎత్తివేతతో కేవైసీ అకౌంట్లలో డిసెంబర్ 30 వరకు ఎంత మొత్తంలోనైనా డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. నవంబర్ 8న పాత నోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఆ నోట్లను డిసెంబర్ 30 వరకు డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించింది. అయితే గడువు దగ్గర పడుతుండటంతో డిపాజిట్లపై పరిమితులను ఆర్బీఐ తీసుకొచ్చింది. కానీ బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లతో డిపాజిట్ చేయడానికి ప్రజలు ఇబ్బంది పడుతుంటే, ఆర్బీఐ ఈ కొత్త నిబంధనలు తీసుకురావడమేమిటని దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో తాజా నిబంధనపై ఆర్బీఐ వెనక్కి తగ్గింది. -
‘నో హెల్మెట్.. నో పెట్రోలు’పై వెనకడుగు
- ప్రజల్లో వ్యతిరేకతతో తగ్గిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: హెల్మెట్ ధరించనివారికి పెట్రోలు బంకుల్లోకి అనుమతించొద్దనే ఆలోచనపై కసరత్తు చేసిన ప్రభుత్వం ప్రస్తుతానికి దాన్ని పక్కనపెట్టింది. వాహనదారులకు అవగాహన కల్పించకుండా ఇలాంటి కఠిన నిబంధనలు విధించటం వల్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం అలాంటి వివాదాస్పద అంశాల జోలికి ఇప్పట్లో వెళ్లొద్దని నిర్ణయించింది. ఇటీవల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ సందర్భంగా మంత్రి మహేందర్‌రెడ్డి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తింది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు విమర్శలు గుప్పించాయి. వాహనదారుల్లో ముందుగా అవగాహన తెచ్చిన తర్వాత ఇలాంటి చర్యలకు దిగితే బాగుంటుందని, ముందే బెదరగొట్టేలా చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించాయి. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. స్వచ్ఛంద సంస్థలను భాగస్వాముల్ని చేసి ప్రజల్లో హెల్మెట్ ధారణపై అవగాహన తేవాలని నిర్ణయించింది.