![Maldives asks India to withdraw troops by March - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/15/maldiv.jpg.webp?itok=x0GYorTx)
మాలె: భారత్ తమ దేశంలోని సైన్యాన్ని మార్చి 15వ తేదీకల్లా ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కోరారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులున్నారు. ఈ పరిణామంపై కేంద్రం ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు.
గత నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ముయిజ్జుకు చైనా అనుకూల నేతగా పేరుంది. ప్రజాభీష్టం మేరకు భారత సేనలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయన అప్పట్లోనే ప్రకటించారు. భారత ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిని ప్రభుత్వం తొలగించడం తెలిసిందే. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది.
Comments
Please login to add a commentAdd a comment