Indian soldiers
-
మార్చి 15 కల్లా సైన్యాన్ని ఉపసంహరించుకోండి
మాలె: భారత్ తమ దేశంలోని సైన్యాన్ని మార్చి 15వ తేదీకల్లా ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు కోరారు. ప్రస్తుతం మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులున్నారు. ఈ పరిణామంపై కేంద్రం ఎటువంటి వ్యాఖ్యా చేయలేదు. గత నవంబర్ 17న మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ముయిజ్జుకు చైనా అనుకూల నేతగా పేరుంది. ప్రజాభీష్టం మేరకు భారత సేనలు తమ దేశం నుంచి వెళ్లిపోవాలని ఆయన అప్పట్లోనే ప్రకటించారు. భారత ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం, వారిని ప్రభుత్వం తొలగించడం తెలిసిందే. ఈ పరిణామం రెండు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసింది. -
దేశవ్యాప్తంగా అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. హిమాచల్ సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
జమ్మూలో భారత సైనిక పోస్టులపై పాక్ రేంజర్ల కాల్పులు
జమ్మూ/న్యూఢిల్లీ: పాకిస్తాన్ రేంజర్లు భారత జవాన్లను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గురువారం రాత్రి జమ్మూలోని అరి్నయా సెక్టార్లో అంతర్జాతీయ సరిహద్దు వద్ద భారత సైనిక పోస్టులపై కాల్పులు జరిపారని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. తాము తగిన రీతిలో ప్రతిస్పందిస్తున్నామని, పాకిస్తాన్ రేంజర్లకు ధీటుగా సమాధానం చెబుతున్నామని వెల్లడించారు. పాకిస్తాన్ భూభాగం నుంచి రాత్రి 8 గంటలకు కాల్పులు ప్రారంభమయ్యాయని, ఇంకా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 17న అరి్నయా సెక్టార్లో పాక్ రేంజర్ల కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాను ఒకరు గాయపడ్డారు. -
భారత సైనికులకు ఇటలీ ఘన నివాళి
మిలన్: రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఇటలీకి విశేష సేవలందించి ప్రాణత్యాగం చేసిన భారతీయ సైనికులకు ఆ దేశసైన్యం ఘన నివాళులర్పించింది. ఇందులో భాగంగా ఆనాటి యుద్ధంలో వీరమరణం పొందిన సైనికులకు స్మారక స్థూపాలను నిర్మించి ఆవిష్కరించింది ఇటలీ మాంటోన్. ఈ కార్యక్రమానికి ఇటలీ భారత అంబాసిడర్ డా. నీనా మల్హోత్రా తోపాటు రక్షణశాఖ ప్రతినిధులు, ఇటలీ దళాల ప్రతినిధులు అక్కడి ప్రజలు పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఇటలీకి వెన్నుదన్నుగా నిలిచిన భారత సైనికులు ఆనాడు ప్రాణత్యాగానికి కూడా వెనుకాడకుండా తమ విధులను నిర్వర్తించారు. సుమారు 50 వేల మంది ప్రాతినిధ్యం వహించిన 4,8,10వ డివిజన్ బెటాలియన్లతో కలిసి వీరంతా వీరోచితంగా పోరాడారు. ఆనాటి యుద్ధకాండలో 23,722 మంది భారత సైనికులు అసువులుబాశారు. వీరందరినీ ఇటలీ వ్యాప్తంగా కామన్ వెల్త్ యుద్ధ స్మశానవాటికల్లో సమాధి చేశారు. ఈ సందర్బంగా భారత సైన్యానికి చెందిన వి.సి. నాయక్ యశ్వంత్ గాడ్గేకు సన్ డయల్ స్మారక స్థూపాన్ని నిర్మించి ఇటలీ అత్యున్నత సైనిక పురస్కారం విక్టోరియా క్రాస్ బహూకరించారు. యశ్వంత్ గాడ్గే యుద్ధంలో ఎగువ టైబర్ లోయలో పోరాటం చేస్తూ వీరమరణం చెందారు. కార్యక్రమంలో మొత్తం 20 మందికి విక్టోరియా క్రాస్ పురస్కారాన్ని బహుకరించగా అందులో ఆరుగురు భారతీయ సైనికులే కావడం విశేషం. ఇది కూడా చదవండి: కిడ్నాపైన బాలిక సమయస్ఫూర్తి.. తెలివిగా సమాచారం అందించి.. -
చైనాను నమ్మలేం... అప్రమత్తతే రక్ష!
2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలలో మూలమలుపు లాంటిది. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన సరిహద్దు పోస్ట్‌లలో పెట్రోలింగ్‌కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది. ఇప్పుడు సరిహద్దులో ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లను ఏర్పాటు చేశారు. కానీ ఈ బఫర్ జోన్లు సరికొత్త వివాదానికి తెర తీశాయి. ఇలా బఫర్ జోన్లకు అంగీకరించడమంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో రెండు దేశాలూ సరిహద్దుల సమీపంలో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చుకోవటం ఆందోళనకరం. భారతదేశం, అమెరికా, చైనా అంతర్జాతీయ యవనికపై మూడు ముఖ్యమైన పాత్ర ధారులు. వీటి ఆసక్తులు పరస్పరం లోతుగా పొందుపర్చుకుని ఉన్నాయి. ఈ వాస్తవం క్రమానుగత వ్యవధిలో ఇతరులతో పోలిస్తే వారి ఎంపికలను తూకం వేసి చూసుకునేలా వారిని బలవంతం చేస్తోంది. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా ఎదుగుదలకు చెక్ పెట్టేందుకు అమెరికా ఆసక్తితో ఉంది. కాగా, భారతదేశం చైనాతో 4000 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును, దాంతోపాటు 61 ఏళ్ల సరిహద్దు వివాదాన్ని పంచుకుంటోంది. ఇక చైనా విషయానికి వస్తే 2049 నాటికి నంబర్ వన్ అగ్రరాజ్యం కావాలని కోరుకుంటోంది. అది జననేత మావో సేటుంగ్ నేతృత్వంలో చైనాలో కమ్యూనిస్టు విప్లవం విజయం పొందిన శతాబ్ది సంవత్సరం మరి. ఆసియాలో చైనాకు ప్రత్యక్ష పొరుగు దేశమైన భారతదేశం, చైనా ప్రాదేశిక ఆకాంక్షల గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూ ఉంది. ఇన్ని దశల చర్చలు జరిగినా నేటికీ భారత్–చైనా సరిహద్దు వివాదం పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదు. మూడేళ్ల క్రితం గాల్వాన్ ప్రాంతంలో చైనాతో భారత్‌కు తీవ్ర వైరం ఏర్పడింది. ఇటీవల 2023 జూన్‌లో గాల్వాన్ ప్రతిష్టంభన మూడవ వార్షికోత్సవం సందర్భంగా, చాలామంది పండితులు, మాజీ దౌత్యవేత్తలు... దురాశాపూరిత చైనా పట్ల ఎప్పటికీ అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వాన్ని హెచ్చరించారు. 1950ల నాటి నుండి భారత్ – చైనా సరిహద్దు వివాదం ప్రజర్విల్లుతోంది. ‘హిందీ–చినీ భాయ్ భాయ్’ అని భారత ప్రజలు నినదిస్తున్న వేళ, భారత భూభాగాల్లోకి చైనా సైనికులు కవాతు చేస్తున్నప్పుడు మనదేశం అకస్మాత్తుగా మేల్కొంది. భారత సైన్యం చవిచూసిన ఘోర పరాభవం ఇది. అప్పటి నుండి సరిహద్దు వివా దాన్ని పరిష్కరించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు, చర్చలు జరి గాయి. కానీ ఫలించలేదు. ఇక 2020 జూన్ దగ్గరకు వద్దాం. వాస్తవ నియంత్రణ రేఖ వద్ద ఉన్న గాల్వాన్ లోయలో చైనా సైన్యం చేతిలో 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా సేనలను తమ ట్రాక్‌లో నిలిపివేసి నప్పటికీ, వారు యథాతథ స్థితితో సంతోషంగా లేరనీ, తమకు అనుకూలమైన మార్పు కోసం ఆసక్తిగా ఉన్నారనీ చైనా వైపు నుండి సందేశం స్పష్టంగా కనబడుతోంది. 2020లో అవకాశాన్ని కోల్పోయి నప్పటికీ, వారు తమ ప్రణాళికను కచ్చితంగా వదులుకున్నారని దీని అర్థం కాదు. సరిహద్దు సమస్యను చైనా ఎప్పటికప్పుడు లేవనెత్తుతోంది. 2022 డిసెంబర్ లో, చైనా తవాంగ్‌లో ఒక ఫార్వర్డ్ పోస్ట్‌ను ప్రారంభించింది. కానీ ఈ ప్రయత్నాన్ని కూడా భారతీయ సైనికులు అడ్డుకున్నారు. 2020 జూన్ 15, 16 తేదీలలో జరిగిన గాల్వాన్ ఘర్షణ 21వ శతాబ్దంలో భారత్–చైనా సంబంధాలను మూలమలుపు తిప్పిన ఘటన. నిజానికి ఇరు దేశాల సైనికులు పరస్పరం ఘర్షణ పడడం ఇదే తొలిసారి. 1975 అక్టోబరులో చివరగా వాస్తవిక ఘర్షణ జరిగింది. ఆయుధాల వినియోగ నిషేధ ఒప్పందం ఒకటి భారత్, చైనాల మధ్య ఉంది. గాల్వాన్‌లో చైనా సైనికులు మేకులున్న కర్రలను ఉపయోగించారు. భారతీయులు ఫైబర్‌గ్లాస్ లాఠీలతో ప్రతిస్పందించారు. కొన్ని సందర్భాల్లో రాళ్లను కూడా ఉపయోగించారు. భారతీయుల కంటే చైనీయులు ఎక్కువ మంది సైనికులను కోల్పోయారని కొన్ని స్వతంత్ర నివేదికలు నొక్కి చెప్పాయి. ఈ ఘటనతో భారత్ చేదు పాఠం నేర్చుకుంది. ఈ సున్నితమైన పోస్ట్‌లలో పెట్రోలింగ్‌కు ఎక్కువ మంది సిబ్బందిని నియమించింది కూడా! ఇప్పుడు ఐదు పాయింట్ల వద్ద ఇరు సైనికుల ఉనికి లేదు. ఈ ప్రదేశాలలో సైనికరహిత బఫర్ జోన్లు ఏర్పాటయ్యాయి. కానీ ఈ బఫర్ జోన్లు కొత్త వివాదాస్పద అంశంగా మారాయి. వీటి ఏర్పాటుకు ఒప్పుకోవడం అంటే భారత్ తన భూభాగాన్ని కోల్పోవడమే తప్ప మరొకటి కాదని భారత వ్యూహాత్మక సంస్థ పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఇది చాలదన్నట్లు సైనికులనూ, సైనిక సామగ్రినీ సులభంగా తరలించడానికి చైనా తన వైపు రెండు వంతెనలను కలిగి ఉన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలను నిర్మించడంలో బిజీగా ఉంది. భారత దేశం కూడా రోడ్లు, వంతెనలు, సొరంగాలు, హెలిప్యాడ్లు వంటివి ఉన్న తన భూభాగం వైపున మౌలిక సదుపాయాలను మెరుగు పరుస్తోంది. ఏదేమైనప్పటికీ, ఇది ఈ ప్రాంతంలో శాంతికి శుభ సూచన కాదు. ఇంత ఘర్షణపూరిత వాతావరణం ఉన్నప్పటికీ, చైనా–భారత్‌ల మధ్య వాణిజ్యం వృద్ధి చెందుతోంది. భారతదేశం హిమాలయ పొరుగు దేశం నుండి ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. భారత – చైనా బంధం విషయంలో ఎల్లప్పుడూ నిరంతర పరిశీలన అవసర మని భారత నాయకులు గమనించాలి. చైనా తన వ్యూహాత్మక ప్రయోజనాలకు, దీర్ఘకాలిక ఆకాంక్షలకు సరిపోయే దానికంటే తక్కువగా దేనితోనూ సమాధానపడదని గుర్తుంచుకోవాలి. 21వ శతాబ్దంలో, అమెరికా కూడా చైనా ఎదుగుదల, దాని ఆకాంక్షల గురించి ఆందోళన చెందుతోంది. పైగా చైనాను సవాలు చేయడానికి భారతదేశాన్ని తన విలువైన భాగస్వామిగా చూస్తోంది. అందుకే ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీకి అమెరికా ఎర్ర తివాచీ పరిచింది. జపాన్ లాగా, ఇప్పుడు భారత దేశం... అమెరికా వ్యూహాత్మక చింతనలో ముఖ్యమైన స్థానాన్ని పొందింది. ఒబామా వైట్‌హౌస్‌లో ఉన్న రోజుల నుండి, యూఎస్ –ఇండియా సంబంధాల సంగతి ‘21వ శతాబ్దాన్ని నిర్వచించే సంబంధాల’లో ఒకటిగా అమెరికా మాట్లాడుతోంది. 2023 జూన్ మొదటి వారంలో, అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన 2016 నుండి అమెరికా ‘ప్రధాన రక్షణ భాగస్వామి’గా ఉంటున్న భారతదేశం గురించి మాట్లాడారు. ‘క్వాడ్’ సభ్యులందరిలో, చైనాతో భారీ భూ–సరిహద్దు కలిగి ఉన్న ఏకైక దేశం భారతదేశం మాత్రమే అని అమెరికా ప్రభుత్వ యంత్రాంగానికి బాగా తెలుసు. 2023 జూన్ మొదటి వారంలో దాని 20వ ఎడిషన్‌ను ముగించిన వార్షిక ‘షాంగ్రి–లా డైలాగ్ ’... ఆసియాలో మారుతున్న ఈ ధోరణులను గుర్తించింది. అయితే భారతదేశం ఈ ప్రాంతంలో యూఎస్ క్లయింట్ స్టేట్‌గా ఉండలేదు. లేదా దిగ్గజ చైనాపై ఒక స్థాయికి మించి భారత్ ఆగ్రహం ప్రదర్శించలేదు. దూకుడుకు, అతివాగుడుకు చోటు లేని ఉన్నత స్థాయి దౌత్య నైపుణ్యం దీనికి అవసరం. చైనాతో సంబంధాలు భారతదేశంలో అంతర్–పార్టీ స్పర్థ కోణాన్ని జోడించాయి. 1962 అక్టోబరులో చైనా భారతదేశంపై దాడి చేసినప్పుడు, బీజేపీని అసహ్యించుకునే పండిట్ నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలో ఉండేది. కాబట్టి నెహ్రూను ఢీకొట్టే ఒక్క అవకాశాన్ని కూడా కాషాయ పార్టీ వదులుకోదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటూండగా, బీజేపీ అధికారంలో ఉంది. ఈ 2023 జూన్ 20వ తేదీ సోమవారం, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి చైనాతో సరిహద్దు పరిస్థితిపై కాంగ్రెస్ శ్వేతపత్రాన్ని డిమాండ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. 2020 జూన్ 19 నాటి అఖిలపక్ష సమావేశంలో ‘ఎవరూ మన సరిహద్దులోకి ప్రవేశించలేదు లేదా ఏ సరిహద్దు ప్రాంతం కూడా ఇతరుల అధీనంలో లేదు’ అని మోదీ చేసిన వ్యాఖ్యలను తరచుగా ప్రస్తావించడం ద్వారా ప్రధానిని మరింత ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అవన్నీ పక్కన పెడితే, చైనాను నిరంతరం పరిశీలిస్తూండటం మనకు ఎంతో అవసరం. భారత్ అప్రమత్తంగా మెలుగుతూ ఉండాలి. అవినాష్ కోల్హే వ్యాసకర్త రిటైర్డ్ ప్రొఫెసర్, ముంబయ్ -
చైనా దూకుడుకు కారణాలెన్నో!
చైనాకు లదాఖ్ ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. టిబెట్ అటానమస్ రీజియన్‌ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్‌తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్‌లోని అక్సాయ్ చిన్ ఉంది. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయి. ఈ పరిస్థితుల్లో భారత్‌తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుంది. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. ఈ సంవత్సరం జనవరి 20–22 తేదీల్లో ఢిల్లీలో ‘కంచె లేని భూసరిహద్దుకు సంబంధించిన భద్రతా సమస్యలు’ అనే అంశంపై ఇంటలిజెన్స్ బ్యూరో నిర్వహించిన సమావేశంలో లదాఖ్‌లో చైనాతో ఉన్న సరిహద్దుకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చి, అవి మీడియాలో కూడా అనేక చర్చలకు దారితీశాయి. ప్రధాని, హోంమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్న ఈ సమావేశంలో ముందుకు వచ్చిన ఒక నివేదిక ప్రకారం– ఈ ప్రాంతంలో కారకోరం పాస్ నుండి చుమూర్ గ్రామం వరకు ప్రస్తుతం ఉన్న 65 పాట్రోలింగ్ పాయింట్స్‌లో 26 పాయింట్స్ అంటే పాయింట్ నంబర్ 5 నుండి 17, 24 నుండి 32, 37, 51, 52, 62 అనే పాయింట్స్ ఇండియా కోల్పోయిందనీ, చైనా పాటించే సలామి స్లైస్ వ్యూహంలో(చిన్న దాడులతో పెద్ద ఫలితం రాబట్టడం) ఇవి చిక్కుకున్నాయనీ వెల్లడయిన విషయాలు ఆందోళన కలిగించేవే! అయినప్పటికీ ఈ ప్రాంతంపై చైనాకు ఉన్న ఆర్థిక రాజకీయ వ్యూహాత్మక భద్రతా ప్రయోజనాల దృష్ట్యా ఇది ఊహించదగ్గదే. ఇండియా, చైనా మధ్య 2020 ఏప్రిల్ నుండి ఇప్పటివరకూ సుమారు 17 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ, వాటి ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా రాలేదు. రెండు దేశాల సైన్యాలు బాహాబాహీకి దిగుతున్న సంఘటనలు, నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, రహదారులు, మిలిటరీ స్టేషన్స్, జనావాసాలు... ఎన్ని రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ 2020 సంవత్సరానికి పూర్వం ఉన్న పరిస్థితులు పునరుద్ధరించడం కష్టమేనన్న భావన కలిగిస్తున్నాయి. దానికి తోడు జనవరి 20వ తేదీన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ లదాఖ్ ప్రాంతంలోని చైనా సైనికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన సమావేశంలో ఎల్లవేళలా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చాడు. చైనాకు ఈ ప్రాంతం ఎందుకంత ముఖ్యం అన్న ప్రశ్నకు సమాధానం వెతకగలిగితే ఈ సరిహద్దు సమస్యలకు సమాధానం దొరుకుతుంది. గత మూడు దశాబ్దాల్లో చైనా విదేశీ విధానంలో, దాని రూపకల్పనలో సైన్యం పోషించే పాత్రలో చాలా మార్పులు వచ్చాయి. తొంభయ్యో దశకంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించకుండా అతిగోప్యతను పాటించడం, ఇతర దేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోకపోవడం ముఖ్యమైన విధానంగా ఉంటే, కొత్త సహస్రాబ్దిలో చైనా సాధించిన ఆర్థిక విజయాలు ఈ విధానంలో సమూల మార్పులకు దోహద పడ్డాయి. అందులో భాగంగా తన ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడానికి సైన్యం కీలక పాత్ర పోషించవలసిన అవసరం ఉందని గుర్తించింది. దూకుడైన విధానాలు, బలమైన, టెక్నాలజీ సపోర్ట్‌తో కూడిన రక్షణ వ్యవస్థలను నిర్మించడంపై దృష్టి పెట్టింది. జిన్‌పింగ్ కాలంలో విదేశీ విధానాల రూపకల్పనలో సైన్యం పాత్ర మరింత పెరగటం గమనించవచ్చు. జిన్‌పింగ్ అధికారంలోకి వచ్చాక 2013లో చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్‌లో భాగంగా చైనా వాణిజ్యం పెంచే ఎగుమతులు దిగుమతులు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతరాయంగా కొనసాగించడానికి రక్షణ చర్యలు తీసుకొనవలసిన అవసరం ఏర్పడింది. 2016 నుండి తన పశ్చిమ సరిహద్దుల్లో ముఖ్యంగా సెంట్రల్ అసియా, అఫ్గానిస్తాన్‌లో పెరుగుతున్న తీవ్రవాదం ప్రభావం తన ఉగెర్, క్సిన్జియాంగ్ ప్రాంతాల్లో పడకుండా ఉండడానికి ఆ ప్రాంతాల్లో మిలిటరీ ఉనికిని పెంచడమే కాకుండా, తన వెస్ట్రన్ కమాండ్‌ను మొత్తంగా పునరుద్ధరించింది. ఈ చర్యలు అటు క్సిన్జియాంగ్ ప్రోవిన్సుతో పాటు, టిబెట్ ప్రావిన్స్ లలో సైన్యం కదలికలు పెరిగి ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతాల్లోని సరిహద్దులపై దృష్టి పెట్టేందుకు దోహదపడ్డాయి. గత రెండు దశాబ్దాల్లో చైనా విధానాల్లో వచ్చిన మరొక ముఖ్యమైన మార్పు, తాను నిర్దేశించుకున్న ‘మూల ప్రయోజనాలు’. తొంభయ్యో దశకం వరకు ఆర్థిక అభివృద్ధి, దేశ సమగ్రత ముఖ్య లక్ష్యాలయితే, అది కొత్త మిలీనియంలో విదేశాల్లో ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఆయా దేశాల్లో ఉన్న సహజ వనరులను ఉపయోగించుకునేందుకు, అందుకు అవసరమైతే మిలిటరీ తదితర శక్తుల ప్రదర్శన చేయడంగా రూపాంతరం చెందింది. అయితే ఢిల్లీలో జరిగిన సమీక్ష సమావేశంలో చైనాకు లదాఖ్ ప్రాంతంలో ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నట్టు పేర్కొన్నప్పటికీ, అవి ఏమిటన్నది వెల్లడించలేదు. ఈ ప్రాంత భౌగోళిక స్వరూపాన్ని పరిశీలిస్తే చైనాకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతమని గోచరిస్తుంది. చైనాకు ఈ ప్రాంతంతో మూడు రకాల ప్రయోజనాలున్నాయి. ఒకటి: చైనాలో ఉన్న టిబెట్ అటానమస్ రీజియన్‌ను క్సిన్జియాంగ్ అటానమస్ రీజియన్‌తో అనుసంధానించే ప్రాంతంలో లదాఖ్‌లోని అక్సాయ్ చిన్ ఉంది. ఈ ప్రాంతంలో చైనా నిర్మిస్తున్న నగరి డ్యామ్ ద్వారా సింధు నదీ జలాల ప్రవాహాన్ని నియంత్రించడమే కాకుండా, వాటిని తన రక్షణ దళాల అవసరాలకు మళ్ళించుకోవడానికీ, ఆప్రాంతానికి కావలసిన విద్యుత్ ఉత్పత్తి చేయడానికీ అక్సాయ్ చిన్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాలపై చైనాకు పూర్తి నియంత్రణ అవసరం. రెండు: క్సిన్జియాంగ్ ప్రావిన్స్‌ను టిబెట్ ప్రావిన్స్‌తో కలిపే ఎ219 హైవే, కషుగర్ నగరాన్ని సెంట్రల్ చైనా నుండి బీజింగ్‌తో కలిపే ఎ314 హైవే... ఈ రెండింటి భద్రతకు అక్సాయ్ చిన్, లదాఖ్ ప్రాంతాలు చైనాకు అతి ముఖ్యమైనవి. చైనా తన పశ్చిమ, ఉత్తర, నైరుతి దిక్కుల్లో ఉన్న సరిహద్దులకు సైన్యాన్ని తరలించడానికి ఉన్న మార్గాలు ఇవి మాత్రమే. ఈ ప్రాంతంలో ఇండియా నిర్మిస్తున్న మౌలిక సదుపాయాలు, ముఖ్యంగా రహదారులు, దౌలత్ ఓల్డ్ బేగ్ లాంటి వైమానిక స్థావరాలతో చైనా భద్రతకు, అందునా చైనా– పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌ను కషుగర్ సిటీతో కలిపే కారకోరం హైవేకు ప్రమాదం ఏర్పడుతుందని చైనా అంచనా. మూడు: ఈ ప్రాంతంలో 1913లో జరిగిన డి ఫిలిపె ఎక్స్‌పెడీషన్, ఆ తర్వాత సోవియెట్ యూనియన్ జరిపిన భౌగోళిక సర్వేలో అత్యంత విలువైన థోరియం, యురేనియం, బోరోక్స్, సల్ఫర్, నికెల్, పాదరసం, ఇనుము, బంగారం, బొగ్గు నిక్షేపాలు ఉన్నట్టు గుర్తించారు. 2019లో చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రచురించిన నివేదికలో చైనా ఉత్పత్తి చేసే 157 రకాల ఖనిజాల్లో దాదాపు 138 రకాల ఖనిజాలు ఈ ప్రాంతంలో దొరుకుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే వీటి వెలికితీత కార్యక్రమాలు, శుద్ధిచేసే ప్లాంట్ల నిర్మాణాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఖనిజ సంపదతో తన తూర్పు ప్రాంతానికి సమానంగా పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చనీ, ఉగెర్ ప్రాంతంలో నెలకొని ఉన్న పేదరికాన్ని, వేర్పాటువాదాన్ని ఎదుర్కొనవచ్చనీ చైనా వ్యూహం. ఈ పరిస్థితుల మధ్య భారత్‌తో ఉన్న సరిహద్దులపై చైనా ఇంకా దృష్టి పెడుతుందనీ, భవిష్యత్తులో మరింత దూకుడుగా ఉంటుందనీ అంచనా వేయవచ్చు. ఇంతకు ముందులా కాకుండా భారత్ కూడా లదాఖ్ నుండి అరుణాచల్ వరకు ఉన్న తన సరిహద్దుల వెంబడి అనేక మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు, సైనిక దళాలకు కావలసిన వసతులను వేగంగా అభివృద్ధి చేసుకుంటున్నది. చైనాకు ఉన్న ప్రయోజనాల దృష్ట్యా, అది వ్యవహరిస్తున్న తీరును బట్టి, భవిష్యత్తులో మరిన్ని ఘర్షణలు తలెత్తవచ్చని చెప్పవచ్చు. అతి నిర్ణయాత్మకమైన ధోరణిని అవలంబించే బలమైన ప్రభుత్వం మాత్రమే చైనా దూకుడును ఎదుర్కోగలదు. వ్యాసకర్త సహాయ ఆచార్యులు, సిక్కిం సెంట్రల్ యూనివర్సిటీ డాక్టర్ గద్దె ఓంప్రసాద్ -
మన సైనికులకు సెల్యూట్: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: జగడాల చైనాతో సరిహద్దు వెంట ఆ దేశ సైనికుల చొరబాటు యత్నాలను విజయవంతంగా అడ్డుకుంటూ భారత సైనికులు చూపించిన ధైర్యసాహసాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఘన కీర్తులందించారు. పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇండియా @ 100 : అమృతకాలం: సస్టెయినబుల్, ఇన్‌క్లూజివ్’’ అనే కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘ ప్రపంచం మరింత పురోగమించాలంటే భారత్ బలీయశక్తి(సూపర్ పవర్)గా ఎదగాలి. సూపర్‌పవర్‌గా ఎదగడమంటే ప్రపంచదేశాలపై ఏకఛత్రాధిపత్యం కాదు. వేరే దేశాల ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోబోదు. ప్రపంచ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాం. ప్రపంచం మా కుటుంబమే. అంతేగాని సూపర్ పవర్ అంటే సామ్రాజ్య విస్తరణ కాదు’ అని చైనాను పరోక్షంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సేలో చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నంచేసిన అంశాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘ గాల్వాన్, తవాంగ్లలో మన సైనికుల తెగువ, దేశభక్తి, ధైర్యసాహసాలను ఎంత గొప్పగా పొగిడినా తక్కువే అవుతుంది. ఇక సరిహద్దు వెంట చైనాతో యుద్దముప్పు పొంచి ఉన్నా, మోదీ సర్కార్ మొద్దు నిద్ర పోతోందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నిరాధార ఆరోపణలు. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకం, సాగు సంస్కరణలు ఇలా ప్రతీ ప్రభుత్వ విధాననిర్ణయాలను విపక్షాలు తప్పుబట్టే ధోరణి ఆరోగ్యవంత ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు’ అని రాజ్‌నాథ్ విమర్శించారు. ‘ 1980ల వరకు ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా, భారత్ ఒకే వేగంతో ముందుకెళ్లాయి. 1991లో భారత్‌లో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. కానీ చైనా దాదాపు అన్ని దేశాలను వెనక్కి నెట్టి లాంగ్ జంప్ చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. మళ్లీ 21వ శతాబ్దంలో జరగాల్సిన స్థాయిలో భారత్‌లో అభివృద్ధి వేగంగా జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కొలువుతీరాకే మళ్లీ అభివృద్ధి శకం ఆరంభమైంది. గతంలో ఆర్థికవ్యవస్థ పరంగా పెళుసు దేశాలుగా అపకీర్తి మూటగట్టుకున్న ‘టర్కీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాల’ జాబితాలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సరకు రవాణా గొలుసు అతుక్కునేలోపే ఉక్రెయిన్ యుద్ధం దానిని దారుణంగా దెబ్బకొట్టిందని అందుకే ద్రవ్యోల్బణ సమస్య దాపురించిందన్నారు. -
1857 సిపాయిల తిరుగుబాటు: వీరుల అస్థిపంజరాలు లభ్యం
బ్రిటిష్ పాలనలో 1857 సిపాయిల తిరుగుబాటుకు ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో భారతీయులకు తెలిసిందే. 1857 సిపాయిల తిరుగుబాటును భారత తొలి స్వాతంత్ర్య సంగ్రామంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. బ్రిటిష్ పాలనకు తిరుగుబాటు ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అయితే, తాజాగా సిపాయిల తిరుగుబాటులో మరణించిన 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలు పంజాబ్‌లోని బయటపడ్డాయి. అమృత్సర్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో సైనికుల అస్థిపంజరాలను కనుకొన్నట్లు పంజాబ్ యూనివర్సిటీలోని ఆంత్రోపాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జేఎస్ సెహ్రావత్ తెలిపారు. అజ్నాలాలో మతపరమైన కట్టడం కింద ఉన్న బావిలో జరిపిన తవ్వకాల్లో 282 మంది భారత సైనికుల అస్థిపంజరాలను గుర్తించినట్లు బుధవారం వెల్లడించారు. కాగా, సిపాయిల తిరుగుబాటులోనే సైనికులు మరణించినట్టుగా ఆ ప్రాంతంలో లభించిన నాణేలు, డీఎన్యే అధ్యయనం, ఆంత్రోపోలాజికల్ ఎలిమెంటల్ అనాలిసిస్, రేడియో-కార్బన్ డేటింగ్ వంటి వాటి పరిశీలనల ద్వారా తెలుస్తున్నదని ఆయన తెలిపారు. అయితే, బ్రిటిష్ కాలంలో భారత సైనికులు.. తూటాలను పంది మాంసం, గొడ్డు మాంసంతో తయారుచేశారన్న కారణంగా తిరుగుబాటు మొదలైంది. దీంతో బ్రిటిష్ అధికారులకు ఎదురుతిరిగిన భారత సైనికులను కిరాతకంగా చంపారు. అనంతరం వారి మృతదేహాలను ఓ బావిలో పడేశారు. Chandigarh| These skeletons belong to 282 Indian soldiers killed during India's 1st freedom struggle against the British in 1857. These were excavated from a well found underneath religious structure in Ajnala near Amritsar, Punjab: Dr JS Sehrawat Asst Prof Dept Anthropology PU pic.twitter.com/pfGdz4W5sC — ANI (@ANI) May 11, 2022 ఇది కూడా చదవండి: షాకింగ్ వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ బేడి... మండిపడుతున్న నెటిజన్లు -
రీల్ మీదకు రానున్న ‘రియల్ హీరో’ల బయోపిక్స్
కంటి నిండా నిదుర ఉండదు.. సేద తీరే తీరిక ఉండదు. కుటుంబంతో గడిపే సమయం ఉండదు... ఒక్కటే ఉంటుంది.. ‘దేశం మీద ప్రేమ’ ఉంటుంది. అందుకే నిదుర లేకుండా కాపలా కాస్తారు. చల్లగాలికీ సేద తీరరు. దేశమే కుటుంబం అనుకుంటారు. దేశం కోసం ప్రాణాలు వదులుతారు. అందుకే ‘సెల్యూట్ సైనికా’. దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టి, పోరాడిన వీర జవాన్లను ‘గణతంత్ర దినోత్సవం’ సందర్భంగా స్మరించుకుందాం. రీల్ మీదకు రానున్న ఈ ‘రియల్ హీరో’ల బయోపిక్స్ గురించి తెలుసుకుందాం. బయోపిక్స్‌కి ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. అందులోనూ దేశం కోసం పోరాడిన సైనికుల జీవిత చిత్రాలకు ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. చరిత్ర చెప్పే ఈ చిత్రాలు చలన చిత్ర చరిత్రలోనూ ఓ చరిత్రగా మిగిలిపోతాయి. దేశం కోసం పోరాడిన చరిత్రకారుల్లో ‘మేజర్ సందీప్ కృష్ణన్’ ఒకరు. 26/11 ముంబయ్ దాడుల్లో వీర మరణం పొందిన యంగ్ ఆర్మీ ఆఫీసర్ ‘సందీప్ ఉన్నికృష్ణన్’ జీవిత కథతో రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రను అడివి శేష్ చేశారు. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం వచ్చే నెల 11న విడుదల కావాల్సింది. అయితే కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. సందీప్ పోరాటం ఈ తరానికి తెలుసు. ఇక ముందు తరానికి చెందినవారిలో 1971 భారత్–పాక్ యుద్ధం గురించి తెలియనివారు ఉండరు. ఈ యుద్ధంలో పోరాడిన వీరుల నేపథ్యంలో మూడు నాలుగు చిత్రాలు నిర్మాణంలో ఉండటం విశేషం. భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన సాహసోపేత సైనికుడు ‘సామ్ మానెక్ షా’ (పూర్తి పేరు సామ్ హోర్ముస్జీ ఫ్రేంజీ జెమ్షెడ్జీ మానెక్ షా) ఒకరు. ఈ యుద్ధంలో ఆర్మీ చీఫ్‌గా భారత్‌కు పెద్ద విజయాన్ని సాధించిపెట్టిన ఘనత మానెక్ షాది. మొత్తం ఐదు యుద్ధాల్లో పాల్గొన్న వీరుడు మానెక్ షా. ఆయన జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సామ్ బహదూర్’. అలాగే 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన ఓ వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా. ఈ యుద్ధంలో తన తోబుట్టువులతో కలిసి తూర్పు వైపున పోరాడారు మెహతా. ఆయన జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. రాజా కృష్ణ మీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చౌఫిస్’ (2016) పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి బల్రామ్ సింగ్ మోహతాను కూడా చిత్రబృందం ఆహ్వానించింది. 1971 యుద్ధంలోనే పోరాడిన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. యుద్ధంలో వీరమరణం పొందారు ఖేతర్పాల్. పరమవీర చక్ర సాధించిన యువసైనికుడు ఆయన. ఈ సైన్యాధికారి పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీరామ్ రాఘవన్ దర్శకుడు. ఇక కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ కూడా యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమే. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్‌గా చేస్తున్నారు. దేశభక్తి సినిమా కాదు కానీ... ‘‘ఆర్ఆర్ఆర్’ దేశభక్తికి సంబంధించిన సినిమా కాదు. స్నేహం మీద ఆధారపడిన సినిమా. దేశభక్తి అంతర్లీనంగా కనిపిస్తూ, స్నేహం గురించి చెప్పిన కథే ఈ సినిమా’’ అని దర్శకుడు రాజమౌళి చెప్పిన విషయం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుంది? అనే కల్పిత కథతో ఈ సినిమా తీశారు. అయితే అంతర్లీనంగా దేశభక్తి కనిపించే సినిమా కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇందులో కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాపై అందరి దృష్టి ఉంది. కరోనా పరిస్థితుల కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ‘‘దేశవ్యాప్తంగా థియేటర్స్‌లో వంద శాతం సీటింగ్ ఆక్యుపెన్సీ ఉన్నట్లయితే మా సినిమాను ఈ ఏడాది మార్చి 18న విడుదల చేస్తాం. లేకపోతే ఈ ఏడాది ఏప్రిల్ 28న చిత్రం విడుదలవుతుంది’’ అని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. మొత్తం 14 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు వెండితెరకు వచ్చే అవకాశం ఉంది. ఈ తరహా చిత్రాలు ఎన్ని వస్తే అంత మంచిది. ఎందుకంటే సినిమా శక్తిమంతమైన మాధ్యమం కాబట్టి చరిత్ర సులువుగా యువతరానికి చేరుతుంది. -
చైనా వక్రబుద్ధి: భారత జవాన్లకు గాయాలు
గ్యాంగ్‌టక్: సందు దొరికితే చాలు భారత భూభాగంలో చొచ్చుకొచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది చైనా. కన్ను మూసి తెరిచేలోగా దొరికిన కాడికి దోచుకునేందుకు గుంటనక్కలా కాచుకుని కూర్చుంటుంది. భారత సైన్యం ఎన్నిసార్లు హెచ్చరించినా డ్రాగన్ ఆర్మీ తన వక్రబుద్ధిని పోనిచ్చుకోలేదు. తాజాగా చైనా సైనికులు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అలర్ట్ అయిన భారత సైనికులు వారిని వెనక్కు వెళ్లగొట్టి డ్రాగన్ తోక ముడిచేలా చేశారు. గతవారం సిక్కింలోని నాకులా లోయలో సుమారు 20 మంది చైనా సైనికులు సరిహద్దు దాటి రహస్యంగా భారత్‌లోకి వచ్చేందుకు కుట్ర పన్నారు. వీరి ఎత్తుగడ అర్థమైన జవాన్లు వెంటనే వారిని వెళ్లిపొమ్మని హెచ్చరించారు. మాట చెవికెక్కించుకోని డ్రాగన్ ఆర్మీ ఆయుధాలు బయటకు తీసింది. (చదవండి: 63 సంవత్సరాల మహిళకు 43 ఏళ్ల జైలు శిక్ష..!) ఈ క్రమంలో భారత్-చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ జరగ్గా సైనికులు ఒకరినొకరు తోసుకుంటూ కొట్టుకున్నారు. ఈ దాడిలో నలుగురు భారత జవాన్లు గాయాలపాలయ్యారు. పైగా అక్కడి వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ తీవ్రంగా పోరాడిన సైనికులు వారిని విజయవంతంగా వెనక్కు వెళ్లగొట్టారు. జనవరి 20న జరిగిన ఈ ఘర్షణ లోకల్ కమాండర్ల చర్చలతో సద్దుమణిగిందని ఇండియన్ ఆర్మీ సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా భారత్- చైనా ఆర్మీ అధికారులు సమావేశమైన మరుసటి రోజే ఈ ఘర్షణ జరగడం గమనార్హం. గతేడాది జూన్ 15న కూడా లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా మధ్య ఘర్షణ తలెత్తగా.. 20 మంది భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. (చదవండి: బలగాల మోహరింపు.. ఒప్పందానికి చైనా తూట్లు) -
మన సైనికుల పరాక్రమం గర్వకారణం
న్యూఢిల్లీ: 1971లో దాయాది దేశం పాకిస్తాన్‌పై జరిగిన యుద్ధంలో భారత సైనికులు ప్రదర్శించిన ధైర్య సాహసాలు సర్వదా శ్లాఘనీయం, గర్వకారణమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన సైనిక దళాల పరాక్రమంతో భారత్‌కు నిర్ణయాత్మక విజయం దక్కిందని గుర్తుచేశారు. విజయ్ దివస్ సందర్భంగా ఆయన బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని వెలిగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని మోదీ వెల్లడించారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై భారత్ విజయానికి 49 ఏళ్లు నిండాయి. ఏడాది పాటు జరగనున్న 50వ వార్షికోత్సవాలను మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద స్వర్ణ విజయ్ జ్యోతిని స్వయంగా వెలిగించి, వేడుకలకు శ్రీకారం చుట్టారు. 4 విజయ జ్యోతులను(కాగడాలు) దేశంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లనున్నట్లు రక్షణ శాఖ తెలియజేసింది. 1971 యుద్ధంలో పరమ వీరచక్ర, మహా వీరచక్ర పురస్కారాలు పొందిన విజేతల సొంత గ్రామాలకు ఈ జ్యోతులు వెళ్తాయని తెలిపింది. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971 యుద్ధంలో పాకిస్తాన్లో భారత్ విజయానికి గుర్తుగా ప్రతిఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ విజయానికి 49 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈసారి ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా ఏడాదిపాటు స్వర్ణ విజయోత్సవాలు జరుగుతాయి. -
తప్పుడు ప్రచారం చేయడం తగదు
న్యూఢిల్లీ: గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికులకు సరైన చికిత్స అందించడం లేదన్న విమర్శలను భారత సైన్యం ఖండించింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. లేహ్‌లోని జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 3న పరామర్శించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అక్కడ సరైన వసతులు లేవని, సైనికులను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కొందరు వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. దీనిపై భారత సైన్యం శనివారం స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరింది. వీర సైనికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. లేహ్‌లోని జనరల్ హాస్పిటల్లో కొన్ని వార్డులను కరోనా ఐసోలేషన్ వార్డులుగా మార్చారని, అందుకే ఆడియో వీడియో ట్రైనింగ్ హాల్‌ను ప్రత్యేక వార్డుగా తీర్చిదిద్ది, సైనికులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ సకల సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది. -
చైనా మైండ్ గేమ్‌కు ఇదే నిదర్శనం
న్యూఢిల్లీ: జూన్ 15 రాత్రి గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం చైనా సైన్యం 10మంది భారతీయ సైనికులను అపహరించి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వీరిలో 4గురు అధికారులు ఉన్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఘర్షణలు జరిగిన తరువాత రోజు ఉదయమే భారత్ మన అధీనంలో ఉన్న డజనుకు పైగా చైనా సైనికులను వారికి అప్పగించింది. కానీ డ్రాగన్ మాత్రం మన సైనికులను తిరిగి పంపించడంలో ఆలస్యం చేస్తూనే ఉంది. గాల్వన్ వ్యాలీలో హింసాత్మక ఘర్షణల్లో గాయపడి ఎల్ఏసీకి అవతలి వైపు ఉన్న 50 మంది భారతీయ సైనికులను తిరిగి పంపించడానికి చైనాకు 24 గంటలు పట్టింది. (చైనా చెర నుంచి సైనికులు విడుదల..!) ఈ క్రమంలో వీరిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా... మరి కొందరు తీవ్రంగా గాయపడ్డట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే ఘర్షణలు జరిగిన మరుసటి రోజే చైనా, భారత సైనికులందరిని తిరిగి అప్పగించలేదని.. నలుగురు అధికారులతో సహా పది మంది భారత సైనికులను విడిచిపెట్టలేదని తర్వాత తెలిసింది. వారిని క్షేమంగా తీసుకురావడం కోసం తరువాత మూడు రోజుల పాటు భారత్-చైనా మధ్య తీవ్రమైన చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. మన సైనికులు వారి వద్ద ఉన్నారనే విషయాన్ని చైనా ఖండించలేదు. పైగా వారంతా సురక్షితంగా ఉన్నారని చైనా హామీ ఇచ్చింది. అయితే వారిని వెంటనే విడుదల చేయకుండా.. భారతీయుల సహానానికి పరీక్ష పెట్టింది. ఇది చైనా మైండ్ గేమ్‌కు నిదర్శనం అని భారత ఆర్మీ అధికారులు తెలిపారు. జూన్ 16, 17,18 తేదీలలో ఇరు దేశాల మధ్య పెద్ద ఎత్తున జనరల్-స్థాయి చర్చలు జరిగాయి. వీటిలో ప్రధానంగా భారతీయ సైనికుల విడుదల గురించి చర్చించారు. చివరకు జూన్ 18న చైనా.. 10 మంది భారత సైనికులను విడుదల చేసింది. అయితే ఈ 10 మందిని పీఎల్ఏ కస్టడీలోనే ఉంచారా లేదా అనే దాని గురించి రెండు దేశాలు స్పష్టత ఇవ్వలేదు. (వారు పోరాడటానికి జన్మించారు..) లడఖ్‌లోని గాల్వన్ వ్యాలీలోని పెట్రోల్ పాయింట్ 14(పీపీ14) వద్ద జూన్ 15 రాత్రి నెత్తుటి ఘర్షణ ప్రారంభమైంది. చైనా ఏర్పాటు చేసిన టెంట్‌పై భారత సైన్యం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దళాల మధ్య తీవ్రమైన ఘర్షణలు చెలరేగాయి. ఇనుప చువ్వలు కల రాడ్లు, రాళ్లతో చైనా సైనికులు మన దళాల మీద దాడి చేశాయి. 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన భారత దళాలు ఈ దాడిని తీవ్రంగా ప్రతిఘటించాయి. కాని దురదృష్టవశాత్తు కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బి సంతోష్ బాబు ఈ దాడిలో మరణించారు. ఈ ఘర్షణలో మొత్తం 20 మంది భారతీయ సైనికులు మరణించారు. చైనా వైపు అనేక మరణాలు సంభవించాయని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలుపుతున్నాయి. కానీ చైనా మాత్రం చనిపోయిన సైనికుల సమాచారాన్ని వెల్లడించలేదు. -
తెరపైకి మరో ఘర్షణ వీడియో
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించుకునే దిశగా భారత్, చైనాల మధ్య దౌత్య, మిలటరీ మార్గాల్లో చర్చలు కొనసాగుతున్న సమయంలోనే.. సరిహద్దుల్లో భారత, చైనా సైనికుల ఘర్షణకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. మంచు కొండల నేపథ్యంలో భారత సైనికులు చైనా జవాన్లను వెనక్కు నెడుతున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి. అయితే, ఆ వీడియో ఏ రోజు తీసిందనే వివరాలు అందులో లేవు. భారత సైనికుల బృందం చైనా ఆర్మీ అధికారులు, జవాన్లు ఉన్న మరో బృందంతో ఘర్షణ పడుతూ, వారిని వెనక్కు నెట్టివేస్తూ ఉన్న దృశ్యాలు అందులో ఉన్నాయి. అలాగే, వెనక్కు వెళ్లిపోవాలంటూ చైనా జవాన్లను భారత సైనికులు గట్టిగా చెబుతున్న మాటలు కూడా వినిపించాయి. ఆ తరువాత వారు బాహాబాహీకి దిగినట్లుగా కనిపించింది. భారత సైనికుల మాటను వినకుండా, చైనా జవాన్లు అక్కడే ఉండటం, పైగా, భారత సైనికులపై వారు దాడి చేయడం 5.30 నిమిషాలున్న ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో దృశ్యాల్లో డేట్, టైమ్ లేవు కానీ, సైనికులు మాస్క్‌లు ధరించి ఉండటం కనిపించింది. దాన్నిబట్టి ఆ వీడియో కరోనా ముప్పు ప్రారంభమైన తరువాత తీసిన వీడియోగానే భావించవచ్చు. అక్కడి భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే.. ఆ ఘటన సిక్కింలో జరిగి ఉండొచ్చని ఆర్మీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు. అక్కడ కూడా మే తొలి వారం నుంచి ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. మే 9న సిక్కింలోని నకూ లా ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ అయి ఉండవచ్చనుకుంటున్నారు. ये सही था सर पहले पटक के चीनियों को बलभर कचर दिए फिर बोले Don't fight... don't fight 😂 https://t.co/sDoSZVjqI3 — Abhinav Pandey (@AbhinavABP) June 22, 2020 -
చైనా చెర నుంచి సైనికులు విడుదల..!
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వన్ లోయ వద్ద ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో భారత్‌కు చెందిన సైనికులను చైనా అపహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన భారత సైనిక అధికారులు గడిచిన రెండు రోజులుగా చైనా ఆర్మీ అత్యున్నత స్థాయి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం చర్చల అనంతరం భారత్‌కు చెందిన పదిమంది సైనికులు, ఇద్దరు మేజర్ అధికారులను చైనా చెర నుంచి విడిపించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియా పలు కథనాలు ప్రచురించింది. వారంత క్షేమంగా ఉన్నారని తెలిపింది. అయితే భారత సైనిక వర్గాలు మాత్రం దీనికి భిన్నంగా ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా దాడిలో 20 మంది జవాన్లు మృతి చెందగా.. మొత్తం 76 మంది గాయపడ్డారని ప్రకటించింది. ఇక చైనా కస్టడీలో ఎవరూ లేదని స్పష్టం చేసింది. (ఒక్క జవాను మృతికి ఐదుగురిపై ప్రతీకారం) కాగా డ్రాగన్ తొలిసారి 1962 యుద్ధం సమయంలో భారత సైనికులను బంధీలను చేసింది. డజన్ల కొద్ది సిబ్బందిని రోజుల తరబడి తన చెరలో ఉంచుకుంది. అనంతరం భారత ప్రభుత్వ శాంతియుతమైన చర్చలతో వారికి విముక్తి కల్పించింది. మరోవైపు తాజాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మేజర్ జనరల్ స్థాయి అధికారులు సరిహద్దు సమస్యలను చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లు సైనిక వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. (76 మంది జవాన్లకు గాయాలు : భారత ఆర్మీ) -
సాయుధులుగానే ఉన్నారు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో గస్తీ విధుల్లో ఉన్న భారతీయ సైనికుల వెంట ఆయుధాలు కూడా ఉంటాయని, వారు తమ పోస్ట్‌ను వదిలి బయటకు వెళ్లే ప్రతీసారి ఆయుధాలను కూడా తీసుకునే వెళ్తారని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురువారం స్పష్టం చేశారు. ‘ఆయుధాలు ఇవ్వకుండా సైనికులను మృత్యుఒడికి పంపిస్తారా?’ అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నకు జైశంకర్ సమాధానమిచ్చారు. ‘1996లో, 2005లో భారత్, చైనాల మధ్య కుదిరిన రెండు ద్వైపాక్షిక ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం.. రెండు దేశాల సరిహద్దు గస్తీ బృందాలు ఆయుధాలను ఉపయోగించకూడదు’ అని జై శంకర్ వివరించారు. సోమవారం రాత్రి గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన ఘర్షణల సమయంలోనూ.. విధుల్లో ఉన్న భారతీయ సైనికులు సాయుధులుగానే ఉన్నారని తెలిపారు. ‘నిరాయుధులైన భారతీయ సైనికుల ప్రాణాలు తీసి చైనా పెద్ద నేరం చేసింది. ఆ సైనికులను నిరాయుధులుగా ప్రమాద ప్రాంతానికి ఎవరు, ఎందుకు పంపించారు? దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు?’ అని రాహుల్ గాంధీ ఒక వీడియో సందేశంలో ప్రశ్నించారు. భారతీయ సైనికుల త్యాగంపై రెండు రోజుల తరువాత రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పందించారని రాహుల్ విమర్శించారు. అది కూడా, తన నివాళి ట్వీట్లో చైనా పేరును ప్రస్తావించకుండా, భారత సైన్యాన్ని రాజ్‌నాథ్ అవమానించారని ఆరోపించారు. భారత సైనికులు చనిపోవడం చాలా బాధాకరం. విధుల్లో భాగంగా మన సైనికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి అమరులయ్యారు’ అని బుధవారం ఉదయం రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. -
మరో నలుగురు జవాన్ల పరిస్థితి విషమం
న్యూఢిల్లీ: లడక్‌లో భారత్- చైనా ఆర్మీ మధ్య తలెత్తిన ఘర్షణలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణలో కల్నల్ సహా 20 మంది భారత సైనికులు మరణించగా, పలువురు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. తాజాగా మరో నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సైనికుల మరణంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "దేశాన్ని కాపాడే క్రమంలో గాల్వన్ లోయలో ప్రాణ త్యాగం దేసిన భారత సైనికులకు సెల్యూట్ చేద్దాం. అమరవీరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి" అని పేర్కొన్నారు. (తండ్రి ఆశయాన్ని నెరవేర్చిన తనయుడు) లడఖ్‌లో జరిగిన దాడుల్లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సైనిక వీరుడు రాజేశ్ ఒరంగ్ అమరుడయ్యారు. ఈ విషయం తెలిసిన ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. అతని కుటుంబం బీర్భమ్లో నివసిస్తోంది. అతడు భారత ఆర్మీకి ఆరేళ్లుగా సేవలందిస్తున్నాడు. భారత్-చైనా సరిహద్దులోని లడక్ ప్రాంతంలో గాల్వన్ లోయలో 26 ఏళ్ల రాజేశ్ విధులు నిర్వహిస్తున్నాడు. గత యాభై ఏళ్లలో తొలిసారిగా సరిహద్దులో తీవ్రస్థాయి ఘర్షణలు చెలరేగగా, ఈ దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయాడు. కాగా అతని తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడని, కుటుంబానికి రాజేశే పెద్ద దిక్కని కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. (లడక్ కాల్పుల్లో పళని వీరమరణం) -
మహిళల ముసుగులో పాక్ ఏజెంట్లు
న్యూఢిల్లీ: ఆన్లైన్లో అపరిచితులతో స్నేహం విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సైన్యం హెచ్చరించింది. భారత జవాన్లే లక్ష్యంగా పాక్ గూఢచార సంస్థ పనిచేస్తోందని, ఆధ్యాత్మిక బోధకులు, విదేశీ మహిళలమంటూ స్నేహహస్తం అందించే వారి విషయంలో, ముఖ్యంగా సున్నితమైన సమాచారం పంచుకునే విషయంలో విచక్షణతో మెలగాలని సూచించింది. సున్నిత ప్రాంతాల్లో మెహరించిన సైనికులకు సంబంధించిన సమాచారం, ఉన్నతాధికారుల ఫోన్ నంబర్లు తెలుసుకునేందుకు తప్పుడు ప్రొఫైల్స్‌తో పాక్ ఏజెంట్లు భారత జవాన్లకు ఎరవేస్తున్నారని తెలిపింది. రెండు, మూడేళ్ల క్రితం నాటి ఇటువంటి 150 ప్రొఫైల్స్‌ను ఇప్పటివరకు గుర్తించామని గత నెలలోనే దేశవ్యాప్తంగా ఉన్న కమాండింగ్ సెంటర్లు, డైరెక్టరేట్ల ద్వారా హెచ్చరించినట్లు సైన్యం తెలిపింది. సైన్యానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాక్‌కు చెందిన మహిళా ఏజెంట్లకు సామాజిక మాధ్యమాల ద్వారా అందించారనే ఆరోపణలపై జోథ్‌పూర్‌లో ఒక జవానును తాజాగా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. పట్టుబడిన జవాను విచిత్ర బెహ్రా ఒడిశాకు చెందిన వారు. విచారణలో బెహ్రా వెల్లడించిన వివరాల ప్రకారం.. సదరు మహిళ మారు పేరుతో ఉన్న పాక్ ఏజెంటే అని నిర్ధారణకు వచ్చారు. -
అయ్యా మోదీ.. నీ ఎన్నికల సభ కాదిది!
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. అయితే వార్‌మెమోరియల్ ప్రారంభ సమావేశంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడంపై పలు పార్టీల నాయకులు, మేధావులు తప్పుబడుతున్నారు. కాంగ్రెస్ అయితే.. ‘మోదీ.. ఇది నీ ఎన్నికల సభ అనుకుంటున్నావా?’ అని ఘాటుగా ప్రశ్నిస్తోంది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్లను స్మరించుకునే సందర్భంలో మోదీ రాజకీయ ప్రసంగం చేయడం ఏంటని కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. జవాన్ల మరణాన్ని కూడా ఓట్లు, రాజకీయాల కోసం మోదీ వాడుకుంటున్నారని మండిపడ్డారు. అమరుల స్మారక సభను.. ఎన్నికల ప్రచార సభగా మార్చి వీర జవాన్ల త్యాగాలను అవమానించవద్దని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా ఘాటుగా వ్యాఖ్యానించారు. 70 ఏళ్లుగా ఏర్పాటు కానీ జాతీయ యుద్ధ స్మారక ఏర్పాటు క్రెడిట్ మోదీదేనని, కానీ ఆయన రాజకీయ ప్రసంగమే తీవ్రంగా నిరాశపర్చిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా తెలిపారు. ఆయన ప్రసంగంతో స్మారక సభ కాస్త బీజేపీ ఎన్నికల ప్రచార సభగా తలిపించిందన్నారు. ప్రముఖ జర్నలిస్ట్ సాగరికా ఘోష్ సైతం ప్రధాని నరేంద్ర మోదీని తప్పుబట్టారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల శౌర్యాన్ని దేశం గుర్తు చేసుకోవాల్సిన సందర్భంలో రాజకీయప్రత్యర్థులపై విమర్శలు చేయడం సరైన సమయం కాదని అభిప్రాయపడ్డారు. ఇక బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. చదవండి: యుద్ధ స్మారకం అంకితం -
యుద్ధ స్మారకం అంకితం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించిన జాతీయ యుద్ధ స్మారకాన్ని ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించి జాతికి అంకితమిచ్చారు. బ్రిటిష్ కాలం నాటి యుద్ధాల్లో మరణించిన భారతీయ సైనికుల సంస్మరణార్థం నిర్మించిన ఇండియా గేట్ పక్కనే తాజా స్మారకాన్ని 40 ఎకరాల్లో ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం వివిధ యుద్ధాల్లోనూ, శాంతి పరిరక్షణ దళాల్లోనూ ఉంటూ మరణించిన 25,942 మంది అమర వీరుల పేర్లను ఈ స్మారకంపై సువర్ణాక్షరాలతో లిఖించారు. కాంగ్రెస్ పార్టీపై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాల హయాంలో సైన్యం, దేశ భద్రత నేరపూరిత నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. అందుకే స్మారక నిర్మాణం ఇంత ఆలస్యమైందన్నారు. స్మారక ఆవిష్కరణకు ముందు కొంతమంది మాజీ సైనికులతో మోదీ సమావేశమై అక్కడ ప్రసంగించారు. గత ప్రభుత్వంలో తొలి ప్రాధాన్యత వారి సొంత కుటుంబానికి ఉండేదనీ, తాము అధికారంలోకి తొలి ప్రాధాన్యత దేశానికి ఇచ్చామని మోదీ అన్నారు. రక్షణ ఆయుధాల సామర్థ్యాన్ని పెంచుకోవడం, బలగాలను బలోపేతం చేయడం తదితరాలకు సంబంధించిన కీలక నిర్ణయాలు గత ప్రభుత్వం హయాంలో పెండింగ్‌లో ఉండేవనీ, తాము వచ్చాక వాటికి ఆమోదం లభించిందని మోదీ వెల్లడించారు. మాజీ సైనికుల కోసం ప్రభుత్వం మూడు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పుతుందని చెప్పారు. నాలుగు ఏకకేంద్రక వృత్తాల్లో.. అమర చక్ర, వీరతా చక్ర, త్యాగ చక్ర, రక్షక చక్ర అనే నాలుగు ఏక కేంద్రక వృత్తాల ఆకారంలో, రూ. 176 కోట్ల నిధులతో స్మారకాన్ని ఏర్పాటు చేశారు. ఈ నాలుగు వృత్తాల కేంద్రంలో ఓ రాతి స్థూపం, అమరజ్యోతి ఉంటాయి. వీరతా చక్రలో భారత సైన్యం పోరాడిన యుద్ధాల నమూనా చిత్రాలను కాంస్య లోహంతో చేసి గోడలపై అమర్చారు. ఆర్మీ, వైమానిక దళం, నౌకాదళం యుద్ధాల్లో పోరాడినట్లుగా చూసే ఆరు కుడ్య చిత్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వాతంత్య్రానంతరం అమరులైన సైనికుల సంస్మరణ కోసం ఓ స్మారకాన్ని నిర్మించాలని దశాబ్దాలుగా ప్రతిపాదన ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడలేదు. చివరకు మోదీ ప్రభుత్వం 2015లో స్మారక నిర్మాణానికి పచ్చజెండా ఊపగా, పనులు మాత్రం గతేడాది ఫిబ్రవరిలోనే ప్రారంభమయ్యాయి. ఈ స్మారకంలో గ్రాఫిక్ ప్యానెళ్లు, రాతి కుడ్య చిత్రాలు కూడా ఉన్నాయి. స్మారకం అమరసైనికులకు అంజలి ఘటించే ప్రదేశంగా ఉంటుంది. రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ జాతీయ స్మారకాన్ని ఆవిష్కరించడం ఓ చరిత్రత్మాక ఘట్టమనీ, ఇప్పుడు భారతీయుల తీర్థయాత్రలకు మరో ప్రదేశం అందుబాటులోకి వచ్చిందన్నారు. స్మారకం విశేషాలు ► ఇండియా–చైనా(1962), ఇండియా–పాక్ (1947,1965,1971), కార్గిల్(1999) యుద్ధాల సమయంలో, శ్రీలంకలో శాంతి పరిరక్షక దళంలో ఉంటూ అమరులైన 25,942 మంది భారత సైనికుల జ్ఞాపకార్థం దీనిని నిర్మించారు. ► స్మారక స్థూపం పొడవు 15.5 మీటర్లు. కింది భాగంలో అమరజ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఈ రాతి స్థూపం చుట్టూ నాలుగు ఏక కేంద్రక వృత్తాకార వలయాలను నిర్మించారు. ► అన్నింటికన్నా బాహ్య వలయానికి రక్షక చక్ర అని పేరు పెట్టి ఆ వలయం మధ్యమధ్యల్లో 600 మొక్కలు నాటారు. ఈ మొక్కలే సైనికులుగా, దేశానికి కాపలా కాస్తున్న వారుగా దీనిని చిత్రీకరించారు. ► త్యాగ చక్ర వలయంలో 16 గోడలను నిర్మించారు. వీటిపైనే అమర సైనికుల పేర్లను గ్రానైట్ ఫలకాలపై బంగారు వర్ణంలో లిఖించారు. సైనికులకు నివాళి అర్పించే స్థలం ఇదే. ఈ గ్రానైట్ ఫలకాలను పురాతన కాలం నాటి భారతీయ యుద్ధ తంత్రం చక్రవ్యూహం ఆకారంలో అమర్చారు. ► స్మారకంలో భాగంగా ఏర్పాటు చేసిన పరమ్ యోధ స్థల్లో పరమ వీర చక్ర పురస్కారం పొందిన 21 మంది సైనికుల విగ్రహాలను నెలకొల్పారు. వీటిలో సజీవులైన సుబేదార్ మేజర్ బానాసింగ్, సుబేదార్ మేజర్ యోగేంద్ర సింగ్ యాదవ్, సుబేదార్ సంజయ్ కుమార్ల విగ్రహాలు ఉన్నాయి. -
పతకాలు నెగ్గిన వారందరూ సైనికులే
కదనరంగంలోనే కాదు దేశం కోసం క్రీడాంగణంలోనూ తమ సత్తా చాటుతామని భారత సైనికులు నిరూపించారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు మన క్రీడాకారులు స్వర్ణం, రెండు కాంస్యాలతో తమ పోరాటానికి చిరస్మరణీయ ముగింపు ఇచ్చారు. గురువారం నాలుగు ఈవెంట్స్‌లో ఫైనల్‌కు చేరినా ఒక్క పతకం కూడా గెలవలేకపోయిన బాధను మరచి... శుక్రవారం వీరోచిత ప్రదర్శనతో అందరి మన్ననలు పొందారు. సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన బృందం పురుషుల క్వాడ్రాపుల్ స్కల్స్‌లో పసిడి పతకం దక్కించుకుంది. రోహిత్ కుమార్, భగవాన్ సింగ్‌లతో కూడిన జోడీ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో కాంస్యం... దుష్యంత్ చౌహాన్ పురుషుల లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్‌లో కాంస్యం సాధించాడు. రోయింగ్తోపాటు టెన్నిస్, షూటింగ్‌లోనూ రాణించి పోటీల ఆరో రోజును భారత్ రెండు స్వర్ణాలు, రజతం, 4 కాంస్యాలతో ముగించింది. పాలెంబాంగ్: ఒకరోజు ముందు పతకాలు గెలవాల్సిన చోట తడబడ్డామనే బాధ ఒకవైపు వేటాడుతుండగా... దేశానికి పతకాలతో తిరిగి వెళ్లాలనే చివరి అవకాశం కళ్ల ముందు కదలాడుతుండగా... భారత రోయర్లు అద్భుతం చేశారు. తమ శక్తినంతా కూడదీసుకొని స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించి మూడు పతకాలతో స్వదేశానికి సగర్వంగా తిరిగి రానున్నారు. ఆసియా క్రీడల్లో భాగంగా రోయింగ్ క్రీడాంశం చివరి రోజు శుక్రవారం భారత్ మూడు పతకాలతో మెరిపించింది. ముందుగా లైట్ వెయిట్ సింగిల్ స్కల్స్ ఈవెంట్లో దుష్యంత్ చౌహాన్ కాంస్య పతకంతో ఖాతా తెరిచాడు. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని దుష్యంత్ 7 నిమిషాల 18.76 సెకన్లలో చేరి మూడో స్థానాన్ని పొందాడు. హ్యున్సు పార్క్ (కొరియా; 7ని:12.86 సెకన్లు) స్వర్ణం... చున్ చియు హిన్ (హాంకాంగ్; 7ని:14.16 సెకన్లు) రజతం గెలిచారు. 2014 ఇంచియోన్ క్రీడల్లోనూ ఇదే విభాగంలో దుష్యంత్‌కు కాంస్యం లభించింది. కాంస్యంతో ఖాతా తెరిచిన ఉత్సాహంతో క్వాడ్రాపుల్ స్కల్స్ ఫైనల్ రేసుకు సిద్ధమైన భారత బృందం అగ్రస్థానాన్ని దక్కించుకుంది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని సవర్ణ్ సింగ్, దత్తు బబన్ భోకనాల్, ఓంప్రకాశ్, సుఖ్మీత్ సింగ్‌లతో కూడిన బృందం 6 నిమిషాల 17.13 సెకన్లలో అందరికంటే ముందుగా చేరుకొని పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో సింగిల్ స్కల్స్‌లో కాంస్యం నెగ్గిన సవర్ణ్ ఆ తర్వాత గాయంతో దూరమయ్యాడు. గతేడాది పునరాగమనం చేసిన అతను ఈసారి స్వర్ణాన్ని మెడలో వేసుకున్నాడు. ‘నేను పునరాగమనం చేస్తానని...దేశం కోసం మళ్లీ పతకం గెలుస్తానని అస్సలు అనుకోలేదు. నా వెన్నునొప్పి చికిత్సకు భారత రోయింగ్ సమాఖ్య ఖర్చులు భరించింది. మళ్లీ బరిలో దిగేందుకు చీఫ్ కోచ్ ఇస్మాయిల్ బేగ్ కూడా ఎంతో ప్రోత్సహించారు’ అని సవర్ణ్ సింగ్ అన్నాడు. కాంస్యం, స్వర్ణం లభించాక లైట్ వెయిట్ డబుల్స్ స్కల్స్ ఫైనల్లో భగవాన్ సింగ్, రోహిత్ కుమార్‌లతో కూడిన జోడీ భారత్ ఖాతాలో మూడో పతకాన్ని జమచేసింది. రెండు కిలోమీటర్ల లక్ష్యాన్ని భగవాన్, రోహిత్ ద్వయం 7 నిమిషాల 04.61 సెకన్లలో ముగించి మూడో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల విభాగంలో మాత్రం భారత్‌కు నిరాశ ఎదురైంది. సంయుక్త డుంగ్‌డుంగ్, అన్ను, నవనీత్ కౌర్, యామిని సింగ్‌లతో కూడిన భారత బృందం ఉమెన్స్ ఫోర్ ఫైనల్లో చివరిదైన ఆరో స్థానంలో నిలిచింది. రోయింగ్ కోచ్‌పై వేటు? ఏషియాడ్ రోయింగ్‌లో పతకాల లక్ష్య సాధనలో విఫలమైనందుకు విదేశీ కోచ్ నికోలాయ్ జియోగాపై వేటుపడనున్నట్లు తెలుస్తోంది. భారత బృందం ప్రదర్శనపై రోయింగ్ సమాఖ్య ప్రధాన కార్యదర్శి గిరీష్ ఫడ్నిస్... త్వరలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం ఇందుకు బలాన్నిస్తోంది. ఈ సందర్భంగా రొమేనియాకు చెందిన జియోగా... శిక్షణపై ప్రశ్నించనున్నట్లు సమాచారం. అతడి పద్ధతుల కారణంగా భారత రోయర్లు అస్వస్థతకు గురవడంతో పతకాల సాధనలో వెనుకడినట్లు సమాఖ్య అధికారులు భావిస్తున్నారు. దీంతో జియోగాను సాగనంపడం ఖాయంగా కనిపిస్తోంది. ►ఆసియా క్రీడల చరిత్రలో రోయింగ్‌లో భారత్‌కు లభించిన స్వర్ణాల సంఖ్య. 2010లో బజరంగ్ లాల్ ఠక్కర్ సింగిల్ స్కల్స్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం సాధించాడు. ►ఢిల్లీ ఏషియాడ్ (1982)లో రోయింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు భారత రోయర్లు 2 స్వర్ణాలు, 5 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 23 పతకాలు సాధించారు. -
సైనిక చరిత్రతో నేతల సరాగాలు
సైనికాధికారులు ఎప్పుడూ మంచే చేస్తారు, రాజకీయనాయకులే వారికి అడ్డం వస్తారు అన్న తీరులో జాతీయ భావాలతో కూడిన చరిత్ర ఇన్ని దశాబ్దాలుగా నిర్మితమైంది. దీనిని ఆరెస్సెస్ మరింత అలంకరించి చెబుతుంది. మోదీ కూడా అందులోని వారే కదా! భారత సైనిక చరిత్ర గురించి ప్రధానమంత్రి సృష్టించిన గందరగోళం ఆయనకూ, ఆయన అనుచరులకూ సంబంధించినదే. వారు కనీసం వికీపీడియాలోకి వెళ్లి చూసినా భారత సైనిక దళాల ప్రధాన అధికారి పదవిని (అప్పుడు) కేఎం కరియప్ప (తిమ్మయ్య కాదు) జనవరి 15, 1949న చేపట్టారని తెలిసేది. అందుకే ఆ రోజును సైనిక దినోత్సవంగా జరుపుకుంటాం. ఆ పదవిని చేపట్టేనాటికి కరియప్ప వయసు యాభయ్ ఏళ్లు (1899లో పుట్టారు). అప్పుడు త్వరితంగా జరిగిన పరిణామాల కారణంగా, ఒక ఘటన మరొక ఘటన మిళితమైపోయి కనిపించడం వల్ల ఆనాటి చరిత్ర కొంచెం తికమక పెడుతుంది. మరింత స్పష్టత కోసం– 1947–48 ఇండోపాక్ యుద్ధ సమయంలో కూడా రెండు దేశాల సైనిక దళాలు బ్రిటిష్ కమాం డర్ల నాయకత్వంలోనే పనిచేశాయి. తరువాత రెండు దేశాల సైనిక నాయకత్వాలను స్థానిక సైనిక అధికారులకు అప్పగించి, రాజకీయ నాయకులతో నేరుగా సంప్రతించే పద్ధతి తెచ్చారు. కశ్మీర్లో జరుగుతున్న పోరు కోసం భారత్ కరియప్పను ఎంచుకుంది. లెఫ్టినెంట్ జనరల్ హోదాలో ఉన్న కరియప్పకు ఢిల్లీ, పంజాబ్ కమాండ్ నాయకత్వం అప్పగించారు. ఆ కమాండ్‌కే ఆయన వెస్ట్రన్ కమాండ్ అని పేరు మార్చారు. కరియప్ప, ఆయనే ఎంపిక చేసిన మేజర్ జనరల్ కేఎస్ తిమ్మయ్య ఇద్దరూ కూర్గ్ ప్రాంతం వారే. పైగా ఇద్దరి ఇంటి పేర్లు కే అనే అక్షరంతోనే మొదలవుతాయి. కే అంటే కోదండేరా. ఇద్దరూ అదే వర్గానికి చెందినవారు. తిమ్మయ్యను కశ్మీర్ (తరువాత 19) డివిజన్‌కు కరియప్ప పంపిం చారు. కూర్గీలు లేదా కొడవాలది ఒక చిన్న సామాజిక వర్గం. విజయవంతమైన వర్గం కూడా. అయితే 1950 నాటికి ఈ రెండు పేర్లు దేశానికి కొత్త. ఒకేలా ధ్వనిస్తాయి. ఆ ఇద్దరు కలసి పనిచేశారు. కశ్మీర్ పోరాటంలో వీరోచిత పాత్ర నిర్వహించి ప్రముఖలయ్యారు. తరువాత సైనిక దళాల ప్రధాన అధికారులు అయ్యారు కూడా. కరియప్ప వలె కాకుండా (ఈయన రక్షణమంత్రి సర్దార్ బల్దేవ్సింగ్ కలివిడిగా ఉంటూ, హాస్యోక్తులకు ప్రసిద్ధిగాంచినవారు) తిమ్మయ్య తన కాలపు రక్షణమంత్రి వీకే మేనన్‌తో విభేదిస్తూ ఉండేవారు. మేనన్ ఎరుపు మరీ ఎక్కువగా ఉన్న కమ్యూనిస్టు. అయితే ఆంగ్ల విధానంలో సైనిక శిక్షణ తీసుకున్న అధికారులకు కమ్యూనిస్టులంటే అసహ్యం. రక్షణమంత్రి నిరంతరం జోక్యం చేసుకోవడం పట్ల తిమ్మయ్య అసహనంగా ఉండేవారు. ఆ కాలం విశేషాలను అద్భుతంగా చిత్రించిన ఇందర్ మల్హోత్రా ఇచ్చిన ఉదంతం ఒకటి ఉంది. రక్షణమంత్రితో మరోసారి గొడవపడే సందర్భాన్ని తప్పించుకునేందుకు తిమ్మయ్య ఎత్తుగడ అది. రక్షణమంత్రితో సమావేశం తప్పించుకోవడానికి ఆయనకు ఏ కారణం చెప్పమంటారు అని తిమ్మయ్య సహాయకుడు అడిగాడట. దీనికి తిమ్మయ్య, ‘మేనన్జైటిస్ వ్యాధి సోకింద’ని చెప్పమన్నారట. చివరికి 1959లోనే తిమ్మయ్య పదవికి రాజీనామా చేశారు. నెహ్రూ నచ్చ చెప్పడంతో రాజీనామాను ఉపసంహరించుకుని, పదవీకాలం పూర్తయ్యే వరకు కొనసాగి 1961లో వైదొలిగారు. ఇదంతా, మరీ ముఖ్యంగా ఈ కూర్గ్ చమత్కారం సామాన్య ప్రజలను నిజంగానే తికమకపెడుతుంది. కానీ ప్రధానమంత్రి, ఆయన కార్యాలయం కూడా ఇలాంటి గందరగోళంలో ఎలా పడిపోయారు? దీనికి ఆమోదయోగ్యమైన ఒక వాదనను ప్రతిపాదించవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత, పాతికేళ్లు అన్నీ యుద్ధాలే. అందులో పాకిస్తాన్ (1947–48, 1965,1971), చైనా (1962) యుద్ధాలు పెద్దవి. హైదరాబాద్ (1947), గోవా (1960), చైనాతో మరోసారి 1967 నాథులా దగ్గర జరిగినవి చిన్నవి. 1971 నాటి యుద్ధం మినహా, మిగిలిన వాటిలో భారత్‌కు స్పష్టమైన విజయం దక్కలేదు. 1962లో మనది స్పష్టమైన ఓటమి. 1965 నాటి యుద్ధం ప్రతిష్టంభనతో ముగిసింది. 1947–48 నాటి యుద్ధం అసంపూర్ణం. ఆనాటి రాజకీయ నాయకత్వం సైన్యాన్ని నిరుత్సాహపరచకుండా ఉంటే వారు మరింత బాగా పోరాడి ఉండేవారని చెప్పడం రివాజుగా మారింది. ఇవన్నీ వలసపాలనానంతర దశాబ్దాలు. ప్రజాస్వామిక వ్యవస్థలు ఆకృతి దాలుస్తున్నాయి. తరువాత స్థానంలో మాత్రమే సైన్యం ఉంది. పౌర, రాజకీయ ఆధిక్యానికి ఒక సవాలుగా ఉండేది. ఒక చిన్న వాస్తవం: 1958లో పాకిస్తాన్ ఆధిపత్యం స్వీకరించిన జనరల్ (తరువాత ఫీల్డ్‌మార్షల్) ఆయుబ్ ఖాన్ సరిహద్దులలో కరియప్ప దగ్గరే కల్నల్‌గా పనిచేశారు. ఈ కారణాలతోనే ఈ మొత్తం కాలంలో రాజకీయ, సైనిక వ్యవస్థలకు సంబంధించి వ్యూహాత్మక సిద్ధాంతంతో కూడిన కథనం రూపుదిద్దుకుంది. అదే– సాయుధ దళాలు, వారి కమాండర్లు ఎలాంటి తప్పిదాలు చేయలేదు, అపజయాలకీ, ఎదురుదెబ్బలకీ రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. 1971లో ఇందిరాగాంధీ సాధించినట్టు, విజయం వస్తే అందులో అంతా భాగస్వాములే. అప్పటి నుంచి అదే ధోరణి. కార్గిల్, 1999 వైఫల్యం ప్రధానంగా సైనిక నాయకత్వానిదే గానీ, వాజ పేయి ప్రభుత్వానిది కాదు. అంత పెద్ద సరిహద్దు ప్రాంతంలో పాకిస్తానీలు అంత లోపలికి, ఎవరూ గుర్తించకుండా ఎలా చొచ్చుకు రాగలిగారు? మరోసారి చాలా అనుకూలమైన పురాణం పుట్టింది. ఈసారి ఆ లోపం పౌర నిఘా సంస్థల మీదకు పోయింది. కొద్దిమంది సైనికాధికారుల మీదకు మాత్రం కొంత బాధ్యతను మోపారు. మనమంతా ఆ యుద్ధంలో జరిగిన వీరకృత్యాలను మననం చేసుకున్నాం. అపజయాల విమర్శల నుంచి సైనికులను కాపాడాలనుకోవడమే ఇందుకు కారణం. సైనికాధికారులు ఎప్పుడూ మంచే చేస్తారు, రాజకీయనాయకులే వారికి అడ్డం వస్తారు అన్న తీరులో జాతీయ భావాలతో కూడిన చరిత్ర ఇన్ని దశాబ్దాలుగా నిర్మితమైంది. ఆ కథలు ఎలా ఉంటాయంటే– కరి యప్ప, తిమ్మప్ప, చౌధరి, మానెక్షాలకు స్వేచ్ఛ ఇచ్చి ఉంటే ఆక్రమిత కశ్మీర్ ఉండేది కాదు, చైనా గుణపాఠం నేర్చుకునేది, టిబెట్ విముక్తమయ్యేది, 1971లో పాక్ భూతం చచ్చేది, మరో రెండువారాల యుద్ధం తరువాత పశ్చిమ పాకిస్తాన్‌ను మన సైన్యం ఆక్రమించేది– ఇలా. ఇందుకు సరైన ఆధారాలేమీ ఉండవు. కానీ అధికార వ్యవస్థకు సైన్యాన్ని దూరంగా ఉంచడానికి ప్రజాస్వామ్యంలో మా ఆర్మీ బలోపేతమైనదన్న సెంటిమెంట్ అవసరమవుతుంది. దీనిని ఆరెస్సెస్ మరింత అలంకరించి చెబుతుంది. ఆనాడు కరియప్ప, తిమ్మయ్య, చౌధరి మరింత సమయం ఇవ్వాలని నాటి ప్రధానిని కోరారని, కానీ గాంధీ–నెహ్రూ వంశీకులు అంగీకరించలేదని ఆరెస్సెస్ నేతలు చెబుతూ ఉంటారు. ఆరెస్సెస్‌కు చెందిన ఎవరిని అడిగినా ఇదే వాదం వినిపిస్తారు. మోదీ కూడా అందులోని వారే కదా! శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ -
వాట్సాప్‌తో ఎటాక్
న్యూఢిల్లీ : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ విషయంలో చాలా జాగ్రత్త వహించాలని సైనికులకు భారత ఆర్మీ వార్నింగ్ ఇస్తోంది. వాట్సాప్‌ను వాడుతూ చైనీస్, భారత సిస్టమ్స్‌ను హ్యాక్ చేస్తున్నట్టు ఆదివారం దేశీయ ఆర్మీ ఓ వార్నింగ్ వీడియోను పోస్టు చేసింది. నిమిషం నిడివి గల ఈ వీడియోను సమాచార, ప్రసారాల శాఖ మంత్రి స్మృతీ ఇరానీ రీపోస్టు చేశారు. ‘మన డిజిటల్ ప్రపంచాన్ని కొల్లగొట్టడానికి చైనీస్ అన్ని రకాల ప్లాట్‌ఫామ్‌లను వాడుతున్నారు. మన సిస్టమ్‌లను హ్యాక్ చేయడానికి చైనీస్ వాడుతున్న కొత్త మాధ్యమం వాట్సాప్ గ్రూప్‌లు. +86 ప్రారంభమయ్యే చైనీస్ నెంబర్లు మీ గ్రూప్‌లోకి ప్రవేశించి, మీ డేటాను సంగ్రహించడం ప్రారంభించాయి’ అని తెలుపుతూ ఆర్మీ అధికారులు ఈ వీడియో ట్వీట్ చేశారు. సైనికులు తమ కాంటాక్ట్ నెంబర్లను పేర్లతో సేవ్ చేసుకోవాలని, అన్ని వాట్సాప్ గ్రూప్‌లను ఎప్పడికప్పుడు చెక్ చేసుకోవాలని, తెలియని నెంబర్లను పదేపదే క్రాస్‌చెక్ చేసుకోవాలని భారత ఆర్మీ సూచించింది. ఒకవేళ మీరు మొబైల్ నెంబర్ మారిస్తే, గ్రూప్ అడ్మిన్‌కు తెలియజేయాలని తెలిపింది. ఒకవేళ సిమ్ కార్డును మారిస్తే, దాన్ని పూర్తిగా నాశనం చేయాలని సూచించింది. ఆర్మీ అడిషినల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇంటర్ఫేస్ ఈ వీడియోను రూపొందించింది. ‘బీ అలర్ట్, బీ సేఫ్’ అనే ట్వీట్‌తో ఈ వీడియోను విడుదల చేసింది. గతేడాది చైనా సరిహద్దులో ఉన్న సైనికులను తమ స్మార్ట్ఫోన్లను ఫార్మాట్ చేసుకోవాలని ఆర్మీ ఆదేశించిన సంగతి తెలిసిందే. చైనీస్ హ్యాకర్ల నుంచి ప్రమాదం పొంచి ఉన్న 40కి పైగా యాప్‌లను అన్ఇన్స్టాల్ చేయమని కూడా ఆదేశాలు జారీచేసింది. చైనీస్ సంస్థలు అభివృద్ధి చేసిన ఆ యాప్స్ అనుమానితమైనవిగా ఆర్మీ పేర్కొంది. ఇరు దేశాల మధ్య డోక్లాం వివాదం ముగిసిన రెండు నెలల తర్వాత ఆర్మీ ఈ హెచ్చరికలు జారీచేయడం పలు ఆందోళనలకు దారితీస్తోంది. -
పాక్ కాల్పుల్లో భారత జవాన్ల మృతి
జమ్మూ కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లతో పాటు ఓ అధికారి మృతిచెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ జరిగిన ఘటనపై అప్రమత్తమై బలగాలు వెంటనే ప్రతిదాడి మెదలుపెట్టాయి. సరిహద్దులో ఉద్రిక్తత కొనసాగుతోంది. -
పాక్‌చెరలో ‘అదృశ్య’ బందీలు!!
నాలుగున్నర దశాబ్దాలుగా 54 మంది భారత సైనిక వీరులు ⇒ 1971 భారత్ పాక్‌యుద్ధంలో భారత సైనికులు అదృశ్యం ⇒ చనిపోయారని ప్రకటించి సంతాపం తెలిపిన కేంద్ర ప్రభుత్వం ⇒ వారు పాక్‌జైళ్లలో మగ్గుతున్నారంటూ ఎన్నో సాక్ష్యాధారాలు ⇒ టైమ్మేగజీన్సహా చాలా పత్రికల్లో తరచుగా కథనాలు ⇒ తమ కుటుంబాలకు సైతం లేఖలు రాసిన భారత ఖైదీలు ⇒ వారిని స్వయంగా చూసిన వారూ, కలిసిన వారూ ఉన్నారు ⇒ కొందరు భారత సైనికులు పాక్‌జైళ్లలోనే కన్నుమూసిన వైనం ⇒ అయినా వారి వివరాలు బయటపెట్టని పాక్దుర్మార్గ నైజం ⇒ భారత యుద్ధ ఖైదీలు ఎవరూ లేరంటూ బుకాయింపులు ⇒ వారి విడుదలను సీరియస్‌గా పట్టించుకోని భారత ప్రభుత్వాలు ⇒ తమ వారి జాడ కోసం 46 ఏళ్లుగా వారి బంధువుల ఆక్రోశం ⇒ తాజాగా జాధవ్‌కేసులో ఐసీజే తీర్పుతో చిగురించిన ఆశలు ⇒ హవల్దార్కోసం ఐసీజేలో కేసు వేయాలన్న పంజాబ్‌హైకోర్టు ⇒ ఇప్పటికైనా భారత యుద్ధ ఖైదీలకు చెర వీడేనా? (సాక్షి నాలెడ్జ్సెంటర్) భారతీయుడు కుల్భూషణ్జాధవ్కు పాకిస్తాన్విధించిన ఉరిశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్సవాల్చేసి తాత్కాలికంగానైనా నిలిపివేయించగలిగింది. జాధవ్‌ను భారత్‌నుంచి దౌత్యపరమైన సాయం అందించేందుకు వీలు కల్పించాలని పాక్‌ను ఐసీజే ఆదేశించింది. ఇది చిరకాల ప్రత్యర్థి పాక్‌పై అంతర్జాతీయ వేదిక మీద భారత్‌కు చాలా గొప్ప విజయంగా దేశమంతా కీర్తిస్తోంది. కానీ.. నాలుగున్నర దశాబ్దాలుగా పాక్‌చెరలో మగ్గుతున్నట్లు భారత సైనికుల విషయంలో కేంద్ర ప్రభుత్వాలు ఇదే పట్టుదలను చూపలేకపోతున్నాయి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. 54 మంది.. 1971 నాటి భారత్ పాక్‌యుద్ధంలో ‘అదృశ్యమ’య్యారు. వారంతా చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటించింది. కానీ వారందరూ లేదా వారిలో చాలా మంది పాక్‌జైళ్లలో ఖైదీలుగా మగ్గిపోతున్నారని.. ఆ జైళ్లలోనే కొందరు మరణించారని నాలుగున్నర దశాబ్దాలుగా ఎన్నో సాక్ష్యాధారాలు బయటపడుతూనే ఉన్నాయి. ఆ 54 మంది సైనికుల కుటుంబాలు తమ వారి ఆచూకీ కోసం ఆక్రోశిస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలకు అర్జీలు పెట్టుకుంటూనే ఉన్నారు. కానీ ఫలితం లేదు. భారత సైనికులెవరూ తమ వద్ద లేరని పాక్ఎప్పటికప్పుడు బుకాయిస్తూనే ఉంది. మన ప్రభుత్వాలు ఆ బుకాయింపునే ఆ కుటుంబాల వారికి వల్లెవేస్తోంది. నైరాశ్యంలో మునిగిపోయిన ఆ కుటుంబాలకు జాధవ్‌కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కారు చీకట్లో కాంతిరేఖగా కనిపిస్తోంది. 1971 యుద్ధంలో అదృశ్యమైన హవల్దార్‌ధరమ్‌పాల్‌సింగ్‌ను పాక్‌లో యుద్ధ ఖైదీగా జైలులో ఉన్నారని, ఆయనను విడిపించేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయన భార్య తాజాగా పంజాబ్ హరియాణా కోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. ధరమ్పాల్సింగ్విడుదల కోసం అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలనీ నిర్దేశించింది. మరోవైపు.. పాక్‌జైళ్లలో మగ్గిపోతున్న భారత యుద్ధ ఖైదీలందరి విడుదల అంశంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించాలని, ఈ వ్యవహారం మొత్తాన్ని ఐసీజేకి నివేదించి న్యాయం కోరాలని అదృశ్యమైన సైనికుల కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ 54 మంది భారత వీరుల ‘అదృశ్యం’ పూర్వాపరాలపై ఈ వారం ‘సాక్షి’ ఫోకస్... అది 1971 డిసెంబర్. పాకిస్తాన్ప్రభుత్వంపై తూర్పు పాకిస్తాన్తిరుగుబాటు చేసింది. స్వాతంత్య్రం కోసం పోరాడుతోంది. తూర్పు పాకిస్తాన్లో జరుగుతున్న మారణకాండను నివారించడానికి భారత్రంగంలోకి దిగింది. భారత సైన్యం పాక్బలగాలపై పోరాడి మెడలు వంచింది. తూర్పు పాకిస్తాన్స్వాతంత్రం పొంది బంగ్లాదేశ్‌గా అవతరించింది. అంతవరకూ బాగానే ఉంది. కానీ.. ఆ యుద్ధంలో పాక్‌తో పోరాడిన భారత సైనిక వీరుల్లో 54 మంది ‘అదృశ్యమ’య్యారు. వారిలో చాలా మంది యుద్ధంలో వీరమరణం పొంది అమరులయ్యారని భారత ప్రభుత్వం భావించింది. ఆ మేరకు సంతాపాలు ప్రకటించింది. కానీ.. ఆ 54 మందీ.. లేదా వారిలో చాలా మంది సజీవంగానే ఉన్నారని.. పాకిస్తాన్‌జైళ్లలో యుద్ధ ఖైదీలుగా మగ్గుతున్నారని.. అప్పటి నుంచీ వార్తలు వస్తూనే ఉన్నాయి. అందుకు సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి. పాక్మాత్రం 1971 యుద్ధానికి సంబంధించి తమ వద్ద యుద్ధ ఖైదీలు ఎవరూ లేరనే బుకాయిస్తోంది. ‘అదృశ్యమైన 54 మంది’ జాబితాను 1979లో అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సమరేంద్ర కుందు లోక్‌సభలో వెల్లడించారు. అదృశ్యమైన మేజర్అశోక్లేఖలు... 1971లో చాంబ్సెక్టార్లో డిసెంబర్5న పాక్బలగాలతో భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో మేజర్‌అశోక్‌సూరి అదృశ్యమయ్యారు. ఆ తర్వాత మేజర్‌అశోక్‌సూరి చనిపోయారని సైన్యం ప్రకటించింది. బుల్లెట్రంధ్రం ఉన్న ఒక హెల్మెట్‌ను.. ఢిల్లీలో నివసిస్తున్న ఆయన తండ్రి డాక్టర్ఆర్.ఎస్.సూరికి పంపించింది. కానీ ఆ హెల్మెట్మీద ఉన్న పేరు వేరే ఎవరిదో! సరిగ్గా మూడేళ్ల తర్వాత 1974 డిసెంబర్లో ఆ మేజర్తండ్రికి ఒక చీటీ అందింది. అందులో ‘నేను ఇక్కడ బాగానే ఉన్నాను’ అంటూ ఆయన కుమారుడు మేజర్‌అశోక్‌సూరి చేతిరాత ఉంది. దానికి అనుసంధానించి ఉన్న లేఖలో ‘సాహెబ్, వాలేకుం సలామ్! నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవలేను. ఈ చీటీని మాత్రం తేగలిగాను. మీ కుమారుడు సజీవంగా పాకిస్తాన్లో ఉన్నారు. నేను పాక్‌కు తిరిగి వెళ్తున్నాను ఇట్లు ఎం. అబ్దుల్‌హమీద్’ అనే సమాచారం ఉంది. మళ్లీ 1975 ఆగస్టులో ఆ తండ్రికి కరాచీ జైలు నుంచి మరో లేఖ అందింది. ‘ప్రియమైన నాన్నకు పాదాభివందనం. నేను ఇక్కడ బాగానే ఉన్నాను. మన గురించి భారత సైన్యం లేదా, ప్రభుత్వాన్ని సంప్రదించడానికి ప్రయత్నించు. మేం ఇక్కడ 20 మంది అధికారులం ఉన్నాం. ... మా విముక్తి కోసం పాక్ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం సంప్రదించగలదు’ అనే సందేశం వచ్చింది. ఆ చేతిరాత ‘యుద్ధంలో చనిపోయిన’ మేజర్అశోక్దే అని నాటి రక్షణశాఖ కార్యదర్శి నిర్ధారించుకున్నారు. ‘అదృశ్యుల’ బంధువుల విజ్ఞప్తులు... అప్పటి నుంచీ మేజర్అశోక్తండ్రి మరణించేవరకూ ప్రతి వారం విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు వెళ్లి తన కుమారుడిని విడిపించాలని కోరుతుండేవారు. అదృశ్యమైన సైనికులు పాక్‌లో బందీలుగా ఉన్నదే నిజమైతే.. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించవద్దని, అలా చేస్తే అక్కడ వారి ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చని ఉన్నతాధికారులు ఆయనకు సూచించారు. దీంతో ఆ విషయాన్ని మీడియాకు చెప్పలేదు. అయితే.. అదృశ్యమైన సైనికులకు సంబంధించిన కుటుంబాలు ‘అదృశ్యమైన సైనిక సిబ్బంది బంధువుల సంస్థ’గా ఏర్పడి తమ ప్రయత్నాలు కొనసాగించారు. మేజర్‌అశోక్‌సూరి తండ్రి తమ ప్రయత్నాలు ఎంతవరకూ వచ్చాయన్న విషయాన్ని మిగతా సైనికుల కుటుంబాలకు సమాచారం ఇచ్చేవారు. ఆయన తరచుగా ప్రధానమంత్రికి లేఖలు రాశేవారు. ప్రధాని నుంచి ఆయనకు సమాధానాలు కూడా వచ్చేవి. అదృశ్యమైన భారత సైనికుల సిబ్బంది వ్యవహారాన్ని తేల్చాలని, మానవతా దృక్పథంతో ఉత్కంఠకు తెరదించాలని ప్రాధేయపడుతూ పాక్‌విదేశాంగ మంత్రికి కూడా వివిధ మార్గాల్లో వినతిపత్రాలు సమర్పించారు. సంబంధిత వార్తలు ఈ 54 మంది ఏమయ్యారు? 1983లో ఖైదీల మార్పిడిపై హైడ్రామా